For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వరల్డ్ సెప్సిస్ డే 2019 : సెప్సిస్ వ్యాధి వస్తే మరణం ఖాయామా..?

|

మనలో చాలా ఏదైనా దెబ్బ తగిలి గాయం అయితే ఎవరైనా పెద్దలు లేదా ఆ వ్యాధి గురించి తెలిసిన వారు ఇలా అంటుంటారు. సెప్టిక్ అవుతుంది జాగ్రత్త. అయితే మనలో చాలా మందికి సెప్టిక్ ఏమిటో తెలియదు. అసలు సెప్టిక్ అంటే ఇన్ఫెక్షన్ అత్యంత తీవ్రస్థాయికి వెళ్లి రక్తం విషపూరితమవడం. ఇది మన ప్రాణాలకు ప్రమాదకరం కావచ్చు.

World Sepsis Day

ఇలాంటి పరిస్థితినే సెప్సిస్ అంటారు. ప్రతి సంవత్సరం సెప్టెంబర్ 13వ తేదీన వరల్డ్ సెప్సిస్ డే జరుపుకుంటారు. ఈ సందర్భంగా సెప్సిస్ అంటే ఏమిటో.. దాని గురించి ఎన్నెన్ని నష్టాలున్నాయో.. ఏమేమీ జాగ్రత్తలు తీసుకోవాలో ఈ ఆర్టికల్ ను పూర్తిగా చూసి తెలుసుకోండి.

1) సెప్సిస్ అంటే ఏమిటి?

1) సెప్సిస్ అంటే ఏమిటి?

అసలు సెప్సిన్ అనే పదం ఎక్కడి నుండి వచ్చిందో తెలుసా. దీని మొదటి మూలం ఈజిప్టులో 3500 సంవత్సరాల క్రితం కనిపించింది. అనేక శతాబ్దాల తర్వాత సెప్సిస్ అనే పదం ద్వారా మంట మరియు అవయవం పనిచేయకపోవడం యొక్క సంకేతాలు సూచించబడ్డాయి. ఈ సెప్సిస్ అనే వ్యాధి ఇప్పుడు ఒక పెద్ద ఆరోగ్య సమస్యగా మారింది. ఇది గుండె జబ్బుల కంటే ఎక్కువగా కనిపిస్తుంది. క్యాన్సర్ మరణాల కంటే సెప్సిస్ వల్ల జరిగే మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈ వ్యాధి ఎక్కువగా అభివృద్ధి చెందిన దేశాల్లోనే కనిపిస్తోంది. దీని ఇన్ఫెక్షన్ వల్ల రక్తం విషపూరితంగా మారుతుంది. దీని వల్ల మన శరీరంలోని రక్తనాళాల్లో రంధ్రాలు ఏర్పడటం, అసహజమైన రీతిలో రక్తం గడ్డ కట్టడం వల్ల శరీరంలో చాలా అవయవాలు దెబ్బతింటాయి. ఇది మల్టిపుల్ ఆర్గాన్ ఫెయిల్యూర్ కు దారితీస్తుంది. ఇది ఏకంగా మరణానికి కారణమవుతుంది. ఈ ఇన్ఫెక్షన్ సోకిన తర్వాత ఎంత త్వరగా అది శరీరమంతా వ్యాపిస్తుందనేది ఒక్కొక్కరిలో ఒక్కో విధంగా ఉంటుంది.

2) సెప్సిస్ లక్షణాలివే..

2) సెప్సిస్ లక్షణాలివే..

ఆకలి లేకపోవడం

జ్వరం

చలి

వణుకు

దాహంగా ఉండటం

ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందిగా ఉండటం

గుండె వేగం పెరగడం

రక్తపోటు పడిపోవడం

మూత్రం పరిమాణం తగ్గడం

అనారోగ్యంతో బాధపడుతున్న వారు కోలుకోవడంలో ఏదో ఒక ఆటంకం ఏర్పడుతున్నట్లు అనిపించినా లేదా బలహీనత వంటి లక్షణాలు కనిపిస్తే సెప్సిస్ కావొచ్చని అనుమానించవచ్చు.

3) సెప్సిస్ సంకేతాలివే..

3) సెప్సిస్ సంకేతాలివే..

తీవ్రమైన శ్వాసకోశ వైఫల్యం

తీవ్రమైన మూత్రపిండ వైఫల్యం

హైపోటెన్షన్ తో లేదా జ్వరం ఉన్న రోగులు

ఎలివేటెడ్ కార్టియాక్ అవుట్ పుట్

4) సెప్సిస్ ఎవరికైనా రావచ్చు..

4) సెప్సిస్ ఎవరికైనా రావచ్చు..

సెప్సిస్ వ్యాధి ఎవరికైరా వచ్చే అవకాశం ఉంది. ఎక్కువగా పుట్టిన శిశువులు, చిన్నారులు మరియు సీనియర్ సిటిజన్లకు ఎక్కువగా వచ్చే ప్రమాదం ఉంది. చెడు రోగ నిరోధక శక్తి ఉన్న వ్యక్తులు సెప్టిక్ షాక్ ను అభివృద్ధి చేసే అవకాశం ఉ:ది. వీరితో పాటు గర్భిణీ స్త్రీలు మరియు డయాబెటిస్ లేదా సిరోసిస్ లేదా హెచ్ ఐవితో బాధపడుతున్న వ్యక్తులకు రావచ్చు.

5) న్యుమోనియా..

5) న్యుమోనియా..

పెద్దలు మరియు సీనియర్ సిటిజన్లలో సెప్సిస్ కు కారణమయ్యే అంటువ్యాధుల యొక్క సాధారణ రకాలు న్యుమోనియా లేదా జెనిటూరినరీ ఇన్ఫెక్షన్. దీని వల్ల మూడింట ఒక వంతు మంది సెప్సిస్ తో మరణిస్తారు. సీనియర్ సిటిజన్లు న్యుమోనియాతో బాధపడుతుంటే, ఆక్సీజన్ రక్తాన్ని చేరుకోవడంలో ఇబ్బంది పడుతుంది. అంతేకాక, మీ రక్తంలో తక్కువ ఆక్సీజన్ అంటే మీ శరీర కణాలు సరిగా పనిచేయకపోవచ్చు. సంక్రమణకు ప్రతిస్పందనగా రోగ నిరోధక వ్యవస్థ యొక్క తాపజనక ప్రతి స్పందన క్రమబద్ధీకరించినప్పుడు సెప్సిస్ వ్యాపిస్తుంది. ఇది చివరికి న్యుమోనియా లేదా మెనింజైటిస్కుకు దారి తీస్తుంది.

6) యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (యుటిఐ)

6) యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్ (యుటిఐ)

యుటిఐ అనేది మూత్ర మార్గంలోని ఇన్ఫెక్షన్. ఇది మూత్రపిండాల నుండి, యూరిటర్స్, యూరినరీ మూత్రాశయం ద్వారా, తర్వాత యురేత్రా ద్వారా బయటకు వెళ్తుంది. మీకు యుటిఐ ఉన్నపుడు మీ శరీరం సంక్రమణతో పోరాడటానికి చాలా కష్టపడుతుంది. సంక్రమణ ఉండే అది సాధారణంగా సెప్సిస్ విషయంలో క్యాస్కేడ్ అవుతుంది.

7) సెప్సిస్ వల్ల వచ్చే ప్రభావాలివే..

7) సెప్సిస్ వల్ల వచ్చే ప్రభావాలివే..

సెప్సిస్ ముఖ్యమైన అవయవాలకు రక్తప్రవాహాన్ని పెంచుతుంది. మెదడు, గుండె మరియు మూత్రపిండాలు బలహీనపడతాయి. సెప్సిస్ కు కొన్ని అవయవాలతో పాటు కాళ్లు, చేతులు, వేల్లు మరియు కాలి వేళ్లలో కూడా రక్తం గడ్డ కట్టే అవకాశం ఉంది. అయితే తేలికపాటి సెప్సిస్ నుండి సులభంగానో కోలుకోవచ్చు. మరోవైపు సెప్టిక్ షాక్ సగటు మరణాల సంఖ్య 50 శాతంగా ఉంది. రోగ నిరోధక శక్తి బలహీనపడినప్పుడు, డయాబెటిస్, కిడ్నీ లేదా కాలేయ వ్యాధి లేదా క్యాన్సర్ వంటి దీర్ఘకాలిక అనారోగ్యంతో ఉన్నవారికి సెప్సిస్ సమస్యలు వస్తాయి. సెప్టిక్ షాక్ ఉన్నవారికి శరీరమంతా చిన్న రక్తం గడ్డ కడుతుంది. రక్తం గడ్డకట్టడం కొన్ని శరీరంలోని ఇతర భాగాలకు రక్తం మరియు ఆక్సీజన్ ప్రవాహాన్ని నిరోధించగలవు.

8) సెప్సిస్ నిర్ధారణ ఇలా..

8) సెప్సిస్ నిర్ధారణ ఇలా..

ఒక సెప్సిస్ వ్యాధి నిర్ధారణ అయిదంటే ఏ మాత్రం ఆలస్యం చేయకుండా చికిత్స చేయాలి. రోగ నిర్ధారణ కోసం సాంప్రదాయ పద్ధతులు పాటించాలి. ఇది క్లినికల్ ఫైండింగ్, ఎపిడెమియోలాజికల్ హిస్టరీ మరియు ముందస్తు పరిస్థితులపై ఆధారపడి ఉంటుంది. రక్తంలో లేదా ఇతర శరీర ద్రవాలలో బ్యాక్టీరియా వల్ల ఉందో తెలుసుకోవడానికి, అధిక లేదా తక్కువ తెల్ల రక్త కణాల సంఖ్య, తక్కువ రక్తపోటు లేదా కాలేయ పనితీరును తనిఖీ చేయడానికి వైద్యులు సాధారణంగా పరీక్షలు నిర్వహిస్తారు. ఎక్స్ రే, సిటి స్కాన్, లేదా మాగ్నెటిక్ రెసొనెన్స్ ఇమేజింగ్ లేదా అల్ట్రాసౌండ్ ద్వారా పరీక్షిస్తారు. మీకు సెప్సిస్ ఉంటే, సంక్రమణను ఆపడానికి మరియు రక్తపోటు(బిపి)ను నియంత్రించడానికి మిమ్మల్ని ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో ఉంచుతారు.

9) సెప్సిస్ నివారణ ఇలా..

9) సెప్సిస్ నివారణ ఇలా..

మనలో ప్రాథమికంగా సోకే ఇన్ఫెక్షన్లను నివారించడం ద్వారా సెప్సిస్ ను నివారించడం సాధ్యపడుతుంది. ఇవి సోకకుండా ఉండాలంటే ఆరోగ్యవంతమైన జీవనశైలి కలిగి ఉండటం అవసరం. మీరు పని నుండి తిరిగొచ్చిన తర్వాత రోజువారీ స్నానం మరియు బట్టలు మార్చడం వంటి ప్రాథమిక పరిశుభ్రదతను పాటించాలి. పెంపుడు జంతువులు ఉన్నవారు చేతులు తరచుగా కడుక్కోవాలి. ఒకవేళ ఏదైనా ఇన్ఫెక్షన్ సోకినపుడు వెంటనే చికిత్స తీసుకోవడం ద్వారా సెప్సిస్ గా మారకుండా జాగ్రత్త పడొచ్చు. డాక్టర్లు సూచించిన మేరకు మాత్రమే యాంటీ బయోటిక్ మందులు వాడాలి. అవసరం లేకుండా యాంటీ బయోటిక్స్ వాడకూడదు. అలా వాడితే ఇన్ఫెక్షన్లు సోకినపుడు అవి పనిచేయకుండా ఉండే ప్రమాదం ఉంటుంది.

10) సెప్సిస్ కు చికిత్స ఇలా..

10) సెప్సిస్ కు చికిత్స ఇలా..

సెప్సిస్ ఉన్నవారిని వైద్యులు నిశితంగా పరిశీలిస్తారు. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లో చికిత్స పొందుతారు. సెప్సిస్ చికిత్సకు సూచించిన మందులు చాలా ఉన్నాయి. ఇందులో బ్రాడ్-స్పెక్ట్రం యాంటి బయోటిక్స్ ఉన్నాయి. మీకు రక్తనాళాలను నిరోధించే మరియు రక్తపోటు (బిపి)ని పెంచే వాసోప్రెసర్ మందులు ఇవ్వబడతాయి. మూత్రపిండాలు ప్రభావితమైతే మీరు డయాలసిస్ చేయించుకోవాలి. ఇతర చికిత్సలలో కార్టికోస్టెరాయిడ్స్ మరియు యాంత్రిక వెంటిలేషన్ ఉన్నాయి. ఇది సెప్సిస్ సోకిన వారికి ఊపిరి పీల్చుకోవడానికి సహాయపడుతుంది.

English summary

World Sepsis Day 2019: Sepsis: Causes, Symptoms, Effects, Diagnosis And Treatment

Pneumonia or genitourinary infections are the most common types of infections that cause sepsis in adults and senior citizens. One third of people die of sepsis due to this. If senior citizens suffer from pneumonia, oxygen can cause trouble reaching the bloodstream. Also, less oxygen in your blood means your body cells are not functioning properly. Sepsis spreads when the immune system's inflammatory response is regulated in response to infection.
Story first published: Friday, September 13, 2019, 12:03 [IST]
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more