For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ సెక్స్ సామర్థ్యంపై ఈ రెండింటి ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుందట... తస్మాత్ జాగ్రత్త...!

కాలుష్యం వల్ల మగవారు సెక్స్ లో త్వరగా అలసిపోతారని, ఊపిరితిత్తులకు తగినంత గాలి అందకపోవడం దీనికి కారణమని గుర్తించారు. ఈ ప్రయోగాలను చైనాలోని గాంగ్ జౌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్వహించారు.

|

ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పురుషులైనా.. స్త్రీలైనా సంపాదనకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. సంపాదన భ్రమలో పడి తమ సెక్స్ జీవితాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో పురుషులకు పురుషాంగం వంటి సమస్యలు ఎక్కువ అవుతున్నాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.

 effects on sex

దీన్ని ఇలాగే నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో మరిన్ని సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని హెచ్చరిస్తున్నారు. అంతేకాదు అంగంలో ఏర్పడే సమస్యలు గుండె నొప్పి వంటి వాటికి తొలి సంకేతం అని స్పష్టం చేస్తున్నారు. అయితే మహిళల్లో కూడా భావప్రాప్తి వంటి ఇబ్బందులు తలెత్తనున్నట్లు తెలిపారు.

 effects on sex

రక్త నాళాలూ నరాల వ్యవస్థ దెబ్బ తినడం వల్ల ఈ లైంగిక సమస్యలు ఎదురవుతాయని చెబుతున్నారు. దీనిపైనే సీరియస్ దృష్టి సారించిన శాస్త్రవేత్తలు అనేక ప్రయోగాలను చేసి కొన్ని కొత్త విషయాలను, సరికొత్త మందులను కనుగొనే ప్రయత్నం చేశారు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఈ స్టోరీలో తెలుసుకోండి...

పురుషాంగం స్తంభించడానికి..

పురుషాంగం స్తంభించడానికి..

ఈ ప్రపంచంలో రోడ్ల మీద నివసించే అబ్బాయిలలో ఎక్కువగా అంగ స్తంభన సమస్యలు వస్తున్నట్లు నిపుణులు గుర్తించారు. వాహనాల ఇంధన కాలుష్యానికి పురుషాంగం స్తంభించడానికి మధ్య ఉన్న సంబంధంపై వారు అధ్యయనం చేశారు.

వాటిపై ఎన్నో ప్రయోగాలు..

వాటిపై ఎన్నో ప్రయోగాలు..

ఈ సందర్భంగా ఎలుకలపై రకరకాల ప్రయోగాలు చేశారు. ఐదు నెలల కాలం పాటు వాటికి కాలుష్య వాయువులు పంపారు. తర్వాత వాటి సెక్స్ సామర్థ్యాన్ని పరీక్షించారు. వాటి అంగం తగినంతగా గట్టిపడకపోవడాన్ని గుర్తించారు.

రక్త ప్రసరణ జరగక..

రక్త ప్రసరణ జరగక..

వాయు కాలుష్యం, ఇతర కాలుష్యాల ప్రభావం వల్ల అంగంలోకి రక్త ప్రసరణ సరిగ్గా జరగకపోవడం వల్ల ఈ అంగ స్తంభన సమస్య తలెత్తినట్టు గుర్తించారు.

మరిన్ని ప్రయోగాలు..

మరిన్ని ప్రయోగాలు..

మన దేశంలో మెయిన్ రోడ్లలో మరియు హైవేలలో వాహనాల నుండి వచ్చే వాయు కాలుస్యం వల్ల, ఇతర కాలుష్ కారకాల వల్ల మగవారికి ఈ అంగ స్తంభన సమస్య ఎక్కువగా ప్రభావం చూపుతూ ఉండొచ్చని, అయితే దీనిపై మరిన్నిప్రయోగాలు చేయాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు.

త్వరగా అలసిపోవడం..

త్వరగా అలసిపోవడం..

కాలుష్యం వల్ల మగవారు సెక్స్ లో త్వరగా అలసిపోతారని, ఊపిరితిత్తులకు తగినంత గాలి అందకపోవడం దీనికి కారణమని గుర్తించారు. ఈ ప్రయోగాలను చైనాలోని గాంగ్ జౌ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు నిర్వహించారు. వీటి వివరాలను సెక్సువల్ మెడిసిన్ పత్రికలో ప్రచురించారు.

పొగతాగడం వల్ల..

పొగతాగడం వల్ల..

అలాగే పొగ తాగడం వల్ల అంగ స్తంభన సమస్యలు తలెత్తుతాయని గమనించారు. సాధారణంగా పొగ తాగడం వల్ల మనిషి ఊపిరితిత్తలు పాడైపోయి చనిపోతారని మనకు తెలుసు. ఈ విషయం చాలా మందికి తెలిసినా వీటిని అంత సులభంగా వదల్లేని వీరు దానిని సడెన్ గా వదులుకోలేకపోతున్నారు.

సెక్స్ సామర్థ్యం తగ్గిపోవడం..

సెక్స్ సామర్థ్యం తగ్గిపోవడం..

మన దేశంలో చాలా మంది అమ్మాయిలకు అబ్బాయిలు పొగ తాగడం అనేది నచ్చదు. ముఖ్యంగా స్మోకింగ్ చేసి బెడ్ రూములోకి వచ్చే వారిని అస్సలు ఇష్టపడరు. ఆ సమయంలో వారు ఆ కార్యానికి కూడా అంగీకరించరు. అయితే వారి ఇష్టాలు ఎలా ఉన్నా కూడా భవిష్యత్తులో మీ సెక్స్ సామర్థ్యాన్ని పూర్తిగా తగ్గిస్తుందని వైద్య నిపుణులు హెచ్చరిస్తున్నారు.

గుండె సంబంధిత సమస్యలు

గుండె సంబంధిత సమస్యలు

వైద్య నిపుణులు చెబుతున్న దాని ప్రకారం సిగరెట్ లో ఉండే నికోటిన్ రక్త ప్రవాహ వ్యవస్థను కూడా దెబ్బ తీస్తుంది. మనకు అంగ స్తంభన సరిగా జరగాలంటే రక్తం అంగం వైపు సరిగా జరగాలి. సిగరెట్ అనేది ఆ వేగానికి అడ్డుకట్ట వేస్తుంది. ఒక్కసారి అంగస్తంభన సమస్య మొదలైందంటే గుండె సంబంధిత సమస్యలు వస్తాయనడానికి సూచన.

భావప్రాప్తి సమస్యలు..

భావప్రాప్తి సమస్యలు..

మీరు సిగరెట్ తాగడం అనేది, మీ పార్ట్ నర్ కూడా పరోక్షంగా సిగరెట్ తాగినట్టే. దీని పర్యవసనాలను ఆమె కూడా అనుభవించాల్సిందే. దీంతో తన లైంగిక ఆరోగ్యం కూడా ప్రమాదంలో పడుతుంది. ముఖ్యంగా మహిళల్లో రక్త ప్రవాహం సరిగా లేకపోవడం వల్ల భావప్రాప్తి సమస్యలు తలెత్తుతాయి. యోనిలో కూడా లూబ్రికేషన్ తగ్గిపోతుంది.

రక్తప్రవాహం పెరిగిపోయి..

రక్తప్రవాహం పెరిగిపోయి..

అంగం సూక్ష్మమైన రక్తనాళాలతో నిండిన సున్నితమైన అవయవం. దీని మధ్యలో ఉండే రెంగు గొట్టాల వంటి సున్నిత స్పాంజి వంటి కండర నిర్మాణాలు (కార్పొరా కావర్నోజా) సంకోచిస్తూ ఉంటయి. సెక్స్ ఫీలింగ్స్ కలిగినప్పుడు అంగంలోని సున్నితమైన కండరాలు వదులుగా తయారవుతాయి. దీంతో వీటిలోకి రక్త ప్రవాహం పెరిగిపోయి అంగం స్తంభిస్తుంది.

వాటిదే కీలక పాత్ర..

వాటిదే కీలక పాత్ర..

దీంతో రక్తం లోపలే ఉండి.. స్తంభన అనేది నిలబడిపోతుంది. ఒకసారి సెక్స్ ఫీలింగ్ పూర్తయిన తర్వాత, స్ఖలనమైనా, ఆ ప్రేరేపణలు తగ్గిపోయి ఆ కవాటాలు తెరచుకుని రక్తం వెనక్కి వెళ్లిపోతుంది. స్తంభన తగ్గిపోయి సాధారణ స్థితికి వస్తుంది. అందుకే అంగ స్తంభనలో నాడులు, రక్తనాళాలదే కీలకపాత్ర కాబట్టి స్తంభన సమస్యలు మొదలైతే.. వెంటనే డాక్టర్ ను సంప్రదించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.

English summary

Smoking and pollution effects on sex

Here we talking about smoking and pollution effects on sex. Read on
Story first published:Thursday, January 16, 2020, 17:25 [IST]
Desktop Bottom Promotion