For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

World Deaf Day 2020 : సౌండ్ ఇంజినీర్ల చరిత్ర, లక్ష్యాల గురించి తెలుసా...

ప్రపంచ వినికిడిని మెరుగు పరిచే దినోత్సవం యొక్క చరిత్ర, ప్రాముఖ్యత గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

|

ప్రస్తుత ప్రపంచంలో సౌండ్ ఇంజినీర్లు (చెవిటి వారు) అందరితో పోటీ పడుతున్నారు. ఒకప్పుడు సమాజంలో చులకనగా, హేళనగా చూడబడిన వీరు.. ప్రస్తుత రోజుల్లో వినికిడి విజ్ణానం డెవలప్ కావడంతో సమాజంలో అందరితో సమానంగా గౌరవ, మర్యాదలు పొందుతున్నారు.

World Deaf Day : Date, Significance, History And Objectives in telugu

చాలా మంది సౌండ్ ఇంజనీర్లు హాయిగా చదువుకుంటున్నారు.. కొంతమంది ఉద్యోగాలను సైతం చేసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇలాంటి సౌండ్ ఇంజనీర్లందరికీ కలిపి ఓ సంఘం ఉండాలన్న ఉద్దేశ్యంతో ప్రతి సంవత్సరం సెప్టెంబర్ చివరి ఆదివారం రోజున ప్రపంచ వినికిడి మెరుగు పరిచే (World Deaf Day) దినోత్సవం జరుపుకోవాలని నిర్ణయించారు.

World Deaf Day : Date, Significance, History And Objectives in telugu

అయితే ఈ వేడుకలను ఎవరు ప్రారంభించారు? ఈ దినోత్సవం ఎప్పటి నుండి ప్రారంభమయ్యింది.. ఇంతకీ దీని లక్ష్యాలు నెరవేరాయా? ఈ దినోత్సవం యొక్క చరిత్ర మరియు ప్రాముఖ్యత ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం...

1951లో

1951లో

ప్రపంచ వ్యాప్తంగా వినికిడి సమస్యతో బాధపడుతుండే వారందరికీ ఒక సంఘం ఉండాలన్న ఉద్దేశ్యంతో 1951లో ఇటలీలోని రోమ్ లో World Deaf Dayకి రూపకల్పన చేశారు. ఇది అంతర్జాతీయ ప్రభుత్వేతర సెంట్రల్ ఆర్గనైజేషన్. ప్రపంచవ్యాప్తంగా ఈ సంస్థలో 130 దేశాలు సభ్యత్వం కలిగి ఉన్నాయి.

దీని సిద్ధాంతం..

దీని సిద్ధాంతం..

దేశం, జాతి, మతం, లింగ వివక్ష, ఇతర ప్రాధాన్యాలు, భేదాలు లేకుండా ప్రజలందరితో సమానంగా మానవ హక్కులు, గౌరవ మర్యాదలు ఒకేలా ఉండాలన్నది ఈ World Deaf Day సిద్ధాంతం. అందుకే దీనిని ప్రతి ఏటా సెప్టెంబర్ చివరి ఆదివారం నాడు జరుపుకోవాలని నిర్ణయించారు.

వినలేని వారికి..

వినలేని వారికి..

సౌంజ్ణల భాషను ఉపయోగించి వినికిడి లేనివారిపై, వారి కుటుంబం, మిత్రులపై ఫోకస్ చేస్తూ.. మానవ హక్కులపై ఏర్పాటు చేసిన ఐక్యరాజ్య సమితి సదస్సులకు W.F.D మద్దతు ఇచ్చింది. అలా ఇది ఐక్యరాజ్య సమితి వ్యవస్థలో కన్స్లేటివ్ స్థాయిని కలిగి ఉంది. దీంతో పాటు అనేక అనుబంధ సంస్థలతో బాంధవ్యాలను కలిగి ఉంది. ఇంటర్నేషనల్ డిజెబులిటి అలయెన్స్(IDA)లో WFDకి సభ్యత్వం ఉంది.

చెవిటి వారిని ప్రోత్సహించడం..

చెవిటి వారిని ప్రోత్సహించడం..

ఈ సమాజంలో ఎవరైతే వినికిడి సమస్యతో బాధపడుతుంటారో.. వారందరికీ ఉత్తమ విద్య, సమాచారం, ఇతర సేవల్ని అందించడం, వర్దమాన దేశాల్లో వినికిడి శక్తి లేని వారి మానవహక్కుల్ని మెరుగుపరచడం, ప్రస్తుతం ఎక్కడైతే ఈ ఆర్గనైజేషన్లు లేవో అక్కడ వాటిని నెలకొల్పడం దీని ప్రధాన ఉద్దేశ్యాలు.

చరిత్రను పరిశీలిస్తే..

చరిత్రను పరిశీలిస్తే..

1871 లో, గ్రాన్విల్లే రిచర్డ్ సేమౌర్ రెడ్‌మండ్ (యుఎస్‌ఎ) అనే వ్యక్తికి చిన్న వయస్సులోనే స్కార్లెట్ జ్వరం ఉన్నట్లు నిర్ధారణ అయింది, దీని ఫలితంగా వినికిడి లోపం ఏర్పడింది. అయినప్పటికీ, అతనికి అతని కుటుంబం మద్దతు ఇచ్చింది. అతను ఉన్నత విద్యను పూర్తి చేయడానికి ఒక ప్రత్యేక పాఠశాలకు వెళ్ళాడు. శాన్ ఫ్రాన్సిస్కోలోని కాలిఫోర్నియా స్కూల్ ఆఫ్ డిజైన్ నుండి డ్రాయింగ్, పెయింటింగ్ మరియు పాంటోమైమ్ నేర్చుకున్నాడు. అతను తన విజయానికి మధ్య తన వైకల్యాన్ని రానివ్వలేదు. ఈ గొప్ప వ్యక్తిని గుర్తు చేసుకుంటూ, చెవిటి వారిని ప్రోత్సహించడానికి, వారి ప్రతిభను గుర్తించడానికి మరియు వారి విశ్వాసం మరియు ఆత్మగౌరవాన్ని మెరుగుపరచడంలో సహాయపడటానికి ప్రపంచ చెవిటి దినోత్సవాన్ని ప్రపంచవ్యాప్తంగా జరుపుకుంటారు.

ప్రపంచ చెవిటి దినోత్సవం యొక్క లక్ష్యాలు

ప్రపంచ చెవిటి దినోత్సవం యొక్క లక్ష్యాలు

  • ప్రపంచవ్యాప్తంగా చెవిటి వారి సమస్యల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం
  • సంకేత భాష నేర్చుకోవడానికి చెవిటి వారికి శిక్షణ ఇవ్వడం మరియు ప్రజలతో వారి సామాజిక సంబంధాలను మెరుగుపర్చడానికి దాని ప్రయోజనాన్ని అర్థం చేసుకోవడం
  • అలాంటి వారికి సాధారణ వ్యక్తిలా జీవించడానికి ఎక్కువ అవకాశాలు కల్పించాలి.
  • విద్య మరియు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలకు సమాన ప్రాప్తి హక్కులను ప్రోత్సహించడం

English summary

World Deaf Day 2020: Date, Significance, History And Objectives in telugu

Here we talking about World Deaf Day 2020 : date, significance, history and objectives in telugu. Read on.
Desktop Bottom Promotion