Latest Updates
-
సీజన్ మారుతోంది.. మీ పిల్లల్లో రోగనిరోధక శక్తి పెరగాలంటే భోజనంలో ఇవి తప్పనిసరి.! -
రెస్టారెంట్లో ఇలాంటి కర్రీ దొరికే ఛాన్సే లేదు.. నెక్స్ట్ లెవెల్ టేస్ట్ ఇచ్చే జోధ్‌పూర్ పనీర్ మసాలా.! -
రష్యా టూరిస్ట్ వీసా పొందడం ఇంత ఈజీనా.. మొదటిసారిగా ఫారిన్ వెళ్లేవారికి గుడ్ న్యూస్.! -
పుదీనాతో చీజ్ శాండ్విచ్.. ఒక్కసారి టేస్ట్ చేశారంటే ఇడ్లీ, దోశ కూడా పక్కన పెట్టేస్తారు.! -
చిత్త నక్షత్రంలోకి బుధ సంచారం.. ఈ పదిరోజుల్లో వీరికి ఒక పెద్ద సంస్థ నుంచి ఊహించని ఆఫర్.! -
కత్రినా కైఫ్ ఫిట్ నెస్ సీక్రెట్స్.. బాలీవుడ్ బ్యూటీ గురించి ఈ నిజాలు తెలుసా? -
Hariyali Chicken Recipe: నోరూరించే హరియాళీ చికెన్..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
మునక్కాడలోని గుజ్జు, చికెన్‌లోని ఘాటు.. ఇలాంటి ఎవర్ గ్రీన్ కాంబినేషన్ ట్రై చేశారా.? -
1980’s ఏఐ క్లాసిక్ ట్రెండ్ ఎఫెక్ట్.. 45 ఏళ్ల క్రితం చోరీ కేసులో ఊహించని ట్విస్ట్. ! -
చుండ్రుతో విసిగిపోయారా? పెరుగులో ఇవి కలిపి రాస్తే చాలు.. చుండ్రు రమ్మన్నా రాదు!
ఉసిరికాయతో ఎన్నో ప్రయోజనాలు..! పుష్కలంగా వైటమిన్ సి..గర్భిణులకు ఫాలిక్ యాసిడ్..!
ఆయుర్వేదంలో ఆమ్లాది ప్రముఖస్థానం. ఆమ్లాని ఉసిరికాయ అంటారు అన్న విషయం తెలిసిందే. ఉసిరికాయను ఇండియన్ గూస్ బెర్రీ అని కూడా అంటారు. ఈ ఉసిరికాయకు ఆయుర్వేద్ధంలో ఎన్నో రోగాలను నయం చేసే లక్షణం ఉన్నట్టు చరిత్ర చెబుతోంది.
ఉసిరికాయతో ఎన్నో ఉపయోగాలు
ఉసిరికాయలో విటమిన్ సీ అధికంగా ఉంటుంది. శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచే లక్షణం ఉసిరికాయలో వుంది. ఉసిరికాయ రోగ నిరోధక శక్తిని కూడా బాగా పెంచుతుంది. ఉసిరికాయ రక్తాన్ని శుద్ధి చేసి చర్మం కాంతివంతంగా అయ్యేలా చేస్తుంది. కంటి చూపు మందగించిన వారు ఉసిరికాయను తింటే కంటి చూపు మెరుగవుతుంది.
ఒక్క ఉసిరికాయ తింటే దాని నుంచి 20 క్యాలరీలు శరీరానికి అందుతాయి. ఉసిరిలో ఫ్లావోనాయిడ్లు, ఆంతోసియానిన్లు పుష్కలంగా ఉంటాయ్. కాన్సర్ ను నివారించే సామర్ధ్యం, జ్ఞాపక శక్తిని మెరుగుపరిచే సామర్ధ్యం కూడా కలిగి ఉంటుంది.
గొంతు బొంగురు పోయినప్పుడు తేనెలో ఉసిరికాయను కలుపుకొని తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. ఇన్ఫెక్షన్ లు వ్యాప్తి చెందకుండా చేస్తుంది.
ఉసిరికాయలో వుండే విటమిన్ సీ మానసిక వత్తిడిని తగ్గిస్తుంది. తల నొప్పి తగ్గించడమే కాకుండా కంటి నిండా నిద్ర పట్టేలా చేస్తుంది. ఉసిరికాయ నూనెతో తలకు మసాజ్ చేస్తే సుఖంగా నిద్రపోతారు

అస్తమా లాంటి ఏవైనా లక్షణాలు వున్నా తగ్గిస్తుంది. దగ్గు, టీబీ లాంటి రోగాలు కూడా ఉసిరికాయతో నయమవుతాయి.
ఉసిరిలో యాంటి ఆక్సిడెంట్లు, యాంటి బాక్టీరియా లక్షణాలు అధికంగా ఉంటాయి. ఇవే రోగాలాబారిన పడకుండా చేస్తుంది.
ఉసిరికాయ రసం రోజూ తాగడం వల్ల చర్మం ముడతలు పడకుండా ఉంటుంది. ఇందులో వుండే యాంటి ఆక్సిడెంట్లు చర్మం మరింత యవ్వనంగా కనిపించేలా చేస్తుంది.
చర్మం పై మచ్చలు రాకుండా, మొటిమలు రాకుండా చేస్తుంది. రక్తాన్ని శుద్ధి చేస్తుంది. దీంతో చర్మం పై యాక్నె సమస్యలు కూడా రాకుండా వుంటాయ్.
చర్మంలో కొల్లెజెన్ ఎక్కువగా వుంటే చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. వైటమిన్ సి స్థాయి పెరగడంతో కొల్లెజన్ కూడా పెరుగుతుంది. మీరు మరింత యవ్వనంగా కనిపిస్తారు.
చర్మంపై నల్ల మచ్చలు ఇక ఎంత మాత్రం వుండవు. శరీరాన్ని శుద్ధి చేసి చల్ల బరుస్తుంది. ఉసిరికాయను నేరుగా చర్మానికి అప్లై చేసుకుంటే మంచి ఫలితం వుంటుంది.
ఉసిరికాయ వుంటే హెయిర్ స్టెయిట్‌నర్ అవసరం లేదు. వెంట్రుకలు బలంగా మారుతాయ్. వెంట్రుకలు మెరుస్తాయి కూడా. కొరియన్లకు వున్నట్టుగా వెంట్రుకలు ఆరోగ్యంగా కనిపిస్తాయ్.
చుండ్రు రాకుండా కూడా చేస్తుంది. వెంట్రుకలు దెబ్బ తినా ఉసిరికాయ రిపేర్ చేస్తుంది. ఉసిరికాయలో పోషకాలు మెండుగా వుంటాయ్. ఉసిరిలో 80 శాతం నీరు వుంటుంది. దీనివల్ల ఉసిరి హెయిర్ కండీషనర్‌గా కూడా పనిచేస్తుంది.
గర్భిణులకు కూడ ఉసిరి చాల మేలు చేస్తుంది. ఇందులో ఫైబర్ కంటెంట్ అధికంగా వుంటుంది. ఫాలిక్ యాసిడ్, కాపర్, మ్యాంగనీస్, పొటాషియం, వైటమిన్ సి, బీ5, బీ6 పోషకాలు మెండుగా వుంటాయ్.
ఉసిరిలో వుండే వైటమిన్ బి, కడుపులో వుండే బిడ్డ యముకలు, నరాలు, కండరాలు దృఢంగా మారడానికి దొహదం చేస్తాయ్. ఇందులో వుండే యాంటీ ఆక్సిడెంట్లు రోగనిరోధక శక్తిని అమాంతం పెంచుతుంది.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
