For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జున్ను తింటే గుండె కు ఆరోగ్యమే?

By B N Sharma
|

Cheese1
కొల్లెస్టరాల్ తగ్గాలంటే జంతు సంబంధిత కొవ్వులు తినరాదని డాక్టర్లు, పోషకాహార నిపుణులు ఎపుడో తెలిపారు. కాని. డెన్మార్క్ దేశపు రీసెర్చర్లు జున్ను శరీరంలో చెడు కొల్లెస్టరాల్ కలిగించదని తమ అధ్యయనంలో వెల్లడించారు. అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ లో ప్రచురించిన స్టడీ మేరకు ప్రతిరోజూ ఒక సారి చొప్పున ఆరు వారాలపాటు జున్ను తిన్నప్పటికి దాని ప్రభావం అదే మాదిరి వెన్న తిన్న వారిలో ఏర్పడిన చెడు కొల్లెస్టరాల్ కంటే అతి తక్కువగా వుందని తెలిపింది.

ఈ అధ్యయనం కోపెన్ హేజెన్ యూనివర్శిటీలో ప్రొఫెసర్ జూలీ జెర్పెస్ట్ అతని సహచరులు నిర్వహించారు. వీరు సుమారు 50 మందిని సర్వే చేశారు. వీరికి వారు ప్రతిరోజూ తినే కొవ్వులో 13 శాతం జున్ను ఇచ్చారు.

సాధారణ భోజనంలో తినేదానికంటే అధిక కొవ్వు తిన్నప్పటికి, జున్ను తిన్న వీరిలో చెడు కొల్లెస్టరాల్ ఏ మాత్రం పెరగలేదని, అదే మొత్తంలో వెన్న తిన్న వారిలో సగటున 7 శాతం అధిక చెడు కొల్లెస్టరాల్ ఏర్పడిందని పరిశోధన తెలిపింది.

English summary

Cheese Better For Heart Health | జున్ను తింటే గుండె కు ఆరోగ్యమే?

The cheese eaters also did not have higher LDL during the experiment than when they ate a normal diet. "Cheese lowers cholesterol when compared with butter intake of equal fat content and does not increase cholesterol compared with a habitual diet," wrote Julie and her colleagues, from the University of Copenhagen.
Story first published:Wednesday, November 16, 2011, 17:44 [IST]
Desktop Bottom Promotion