For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

గుండె భేషుగ్గా ఉండాలంటే...వ్యాయామమే మందు!

By B N Sharma
|

Exercise is the best medicine for heart!
శారీరక వ్యాయామం వలన వెలువడే నైట్రిక్ ఆక్సైడ్ గుండెకు ఎటువంటి హాని జరగకుండా తోడ్పడుతుందని ఒక అధ్యయనంలో తేలింది. ఎమోరీ యూనివర్శిటీ స్కూల్ ఆప్ మెడిసిన్ పరిశోధకులు వ్యాయామం చేయటం వలన గుండె నాళాలలో నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తి అవటంతో పాటు నిల్వ అవుతుందని తద్వారా గుండెకు హాని జరుగకుండా ఉంటుందని తేల్చారు.

శరీరంలో ఉండే నైట్రిక్ ఆక్సైడ్ రక్త నాళాలను ఉత్తేజపరచటంతో పాటు రక్త సరఫరాను పెంచటంలో కూడా దోహదపడుతుంది. నైట్రిక్ ఆక్సైడ్ సల్ఫర్ ద్వారా ప్రొటీన్లలో కలుస్తుంది. ఆక్సిజన్ లేదా రక్త సరఫరా తక్కువ సమయంలో నైట్రిక్ ఆక్సైడ్ వాటి సరఫరాను మెరుగుపరుస్తుంది.

శరీరంలో నైట్రేట్, నైట్రోసోధియల్స్ ల రూపంలో ఉండే నైట్రిక్ ఆక్సైడ్ గుండె పోటు రాకుండా నివారిస్తుందని ఎమోరీ బృందం చేసిన అధ్యయనం ద్వారా బలపడింది. ఎమరీ యూనివర్శిటీకి చెందిన మెడిసిన్ ప్రొఫెసర్లు జాన్ కాల్వర్ట్, డేవిడ్ లీఫర్ లు ఈ అధ్యయనాన్ని నిర్వహించారు. ఈ పరిశోధనలన్నీ ఆన్ లైన్ జర్నల్ సర్కులేషన్ రీసెర్చ్ లో ప్రచురించబడ్డాయి.

English summary

Exercise is the best medicine for heart! | గుండె భేషుగ్గా ఉండాలంటే...వ్యాయామమే మందు!

The nitric acid which evolves by way of exercises protects heart from attacks. The nitric acid so produced in the blood capillaries gets stored there and clear the problem of attacks.
Story first published:Friday, August 12, 2011, 8:52 [IST]
Desktop Bottom Promotion