For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆరోగ్యవంతమైన గుండెకు చిట్కాలు....

By B N Sharma
|

Heart Health Tips To Keep BP Under Control
వయసు పైబడుతున్న కొద్ది మీ ఆరోగ్యాన్ని చిన్నపాటి జాగ్రత్తలతో కాపాడుకోవాలి. మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే, దిగువ జాగ్రత్తలు పాటించండి. శరీర అవయవాల్లో నిరంతరం పని చేసే గుండె ఆరోగ్యంపై శ్రధ్ద చూపటం అత్యవసరంగా చెపుతారు. గుండె ఆరోగ్యాన్ని అన్ని విధాలా ఎప్పటికపుడు కాపాడుకుంటూనే వుండాలి.

1. ప్రధానంగా మీ రక్తపోటు ఎంత వుందో ఎప్పటికపుడు చెక్ చేయించుకుంటూ వుండండి. వాటితోపాటు కొలెస్టరాల్, ట్రిగ్లీసెరైడ్ స్ధాయిలు కూడా చెక్ చేయించాలి. గుండెను ఏ కోణంలో సరి చేసుకుంటూ రావాలో తెలుస్తుంది.

2. గుండె ఆరోగ్యం బాగుండాలంటే, వ్యాయామాలు ఎంతో మంచిది. గుండె ఆరోగ్యానికి ఒక్క అర్ధగంట సమయం కేటాయిస్తే ఎన్నో ప్రమాదాలు, ఇతర అనారోగ్యాలు నివారించుకోవచ్చు. కనీసం ఒక అరగంట వేగంగా నడిస్తే త్వరగా వచ్చే మరణాన్ని ఆపవచ్చంటారు.

3. హాయిగా నవ్వేస్తూ వుంటే...ఎక్కువ కాలం జీవించవచ్చంటారు. ఇది నిజమే. 15 నిమిషాలు నవ్వగలిగితే సుమారు 30 నిమిషాలపాటు అరబిక్ వ్యాయామాలు చేసినంత అంటారు ప్రొఫెసర్ హోలీ ఆండర్సన్.

4. రాత్రివేళ ఒక గాఢమైన నిద్ర చాలా మంచిది. సగటు మనిషి 7 నుండి 8 గంటలు నిద్రిస్తాడు. రక్తపోటును నియంత్రించాలంటే, ప్రధానంగా నిద్ర చాలా అవసరం. రోజంతా మంచి మూడ్ తో గడపాలంటే కూడా రాత్రి వేళ హాయిగా నిద్రించటం అవసరం అంటారు ఆరోగ్య నిపుణులు.

ఈ మార్గాలు ఆచరిస్తే, అవి మీ గుండె ఆరోగ్యాన్ని కాపాడుతూంటాయి.

English summary

Heart Health Tips To Keep BP Under Control | ఆరోగ్యవంతమైన గుండెకు చిట్కాలు....

A good night's sleep is very important. An average individual needs about 7 to 8 hours of sleep at night. Important for good health as it is also vital for regulating blood pressure and also helps one to be in the right mood throughout the day.
Story first published:Saturday, September 17, 2011, 16:21 [IST]
Desktop Bottom Promotion