For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆరోగ్యమైన గుండెకు.. ఆరోగ్యకరమైన ఆహారం...!

గుండె ఆరోగ్యానికి 10 గుడ్ ఫుడ్స్

|

ఆధునిక జీవనశైలిలో అధిక బరువు, మధుమేహం, రక్తపోటు సహజ రుగ్మతలుగా మారిపోయాయి. వృద్ధాప్యంలో రావాల్సిన వ్యాధులు చిన్నవయస్సులోనే ఆవహిస్తున్నాయి. జీవనశైలి, ఆహార నియమాలు, మానసిక ఒత్తిళ్లే ఈ సమస్యలకు ప్రధాన కారణాలు. రుగ్మత ఏదైనప్పటికి దాని ప్రభావం గుండెపై పడుతుంది. రక్తపోటు పెంచి, గుండెపోటుకు దారితీస్తుంది. ఈ నేపథ్యంలో గుండెను పదిలపర్చుకోడానికి సప్త సూత్రాలు పాటిస్తే సరిపోతుందంటున్నారు డాక్టర్లు, సైకాలజిస్టులు, న్యూట్రిషనిష్టులు.

బరువు తగ్గాలి: అధిక బరువు, స్థూలకాయం గుండెకు ప్రథమ శతృవు అంటారు విజ్ఞులు. వ్యక్తి ఎత్తుకు తగ్గ బరువు ఉంటే ఆరోగ్యంగా ఉన్నట్టు లెక్క. బరువు పెరిగేకొద్దీ రక్తపోటు పెరుగుతుంది. బరువు అధికమైతే మధుమేహం, కీళ్ళనొప్పులు దగ్గరవుతాయి. కాబట్టి ప్రతి వ్యక్తి బరువును నియంత్రించుకోవడానికి ప్రయత్నించాలి. ఆహార నియమాలు పాటిస్తూ బరువును తగ్గించుకోవాలి.

గుండె ఆరోగ్యానికి 10 గుడ్ ఫుడ్స్..!

విటమిన్స్‌, మినరల్స్‌, ఐరన్‌ ఆపిల్‌లో పుష్కలం గా వున్నాయి. ఇంకా ఇందులో పాస్పరస్‌, పొటాషియం, కాల్షియం, విటమి న్‌ ఏ, బి, సి కూడా ఇందులో అధిక మోతాదులో వుంటాయి. ఇవి గుండెకు రక్తాన్ని తీసుకువెళ్ళే నరాలకు ఎంతో మంచి చేస్తాయిí అని న్యూట్రీషనిస్ట్‌ స్నేహా త్రివేది చెబుతున్నారు. ఇందులో గ్లైసెమిక్‌ చాలా తక్కువ మోతాదులో వుంటుంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా ఎంతో మంచిది అని చెబుతున్నారు.

గుండె ఆరోగ్యానికి 10 గుడ్ ఫుడ్స్..!

శరీరానికి కావాల్సిన అనేక రకాల ఖనిజ లవణాలను ,విటమిన్లను ప్రోటీన్లను, అందిస్తూ... నిత్యం తమని ఏదో ఓరకంగా తీసుకునే వ్యక్తుల జీవనశైలినే మార్చేసే సత్తా ఆకుకూరలకు ఉంది. ఆకు కూరల్లో కొవ్వు తక్కువగా ఉండటమే కాకుండాతినే ఆహారాన్ని రుచి కరంగా చేసేదిగా ప్రత్యేక లక్షణాన్ని ఆకుకూరలు కలిగి ఉంటాయి.ఆకుపచ్చని రంగులో వుండే ఆకు కూరలు, కూరగాయలు పాలకూర, మెంతి కూర, వంటి వాటిలో విటమిన్‌ - బి కాంప్లెక్ష్‌, నియాసిన్‌ అధిక మోతా దులో వుంటాయ. ఇవి రక్తనాళాలు మూసుకుపోకుం డా వుండేందుకు సహాయపడతాయి. ఇంకా ఇవి బెర్రీస్‌, పుల్లటి రుచిగల పండ్లు వంటివాటిలోనూ ఎక్కువగా లభిస్తాయి.

గుండె ఆరోగ్యానికి 10 గుడ్ ఫుడ్స్..!

గింజ దాన్యాలలో సోయా చాల ప్రత్యేకమైనది. మిగిలిన ఆహారపదర్దాల తో పోలిస్తే సోయా సమాహారమైన పోషకాలు కలిగి ఉంటుంది. కొన్ని రకాల జబ్బులను దరిచరనివ్వదు. త్వరగా జీర్ణము అవుతుంది. అందుకే దీన్ని అన్ని వయసుల వారు తీసుకోవచ్చ్ను. శరీరానికి అవసరమైన అమినోయసిడ్లు, లైసీన్ ల తోపాటు పరొక్షముగా ఇసోఫ్లేవిన్స్(Isoflavins) ని కలిగిఉంటుంది. సోయద్వారా లబించే మాంసకృత్తులు-పాలు, మాంసము, కోడిగుడ్లతో సరిసమానము.

గుండె ఆరోగ్యానికి 10 గుడ్ ఫుడ్స్..!

ఎర్రగా చూస్తానే ఆకర్షించే టమోటోలలో ఒక సీక్రెట్ దాగిఉంది. ఇందులో చాలా శక్తివంతమైనటువంటి యాంటి ఆక్సిడెంట్ కాంపౌడ్ లైకోపెనే కలిగి ఉండి. దీని ద్వారానే ఆ టమోటోలకు అంతటి ఆకర్షనీయమైన కలర్ ను కలిగి ఉంటుంది. చాలా తక్కువ ఖరీదులో అరుదుగా దొరికేటటువంటి టమోటోలు లోఫాట్ ఆహారం. కాబట్టి అతి త్వరగా బరువును తగ్గించే ఆహార పదార్థాలల్లో తప్పనిసరిగా టమోటోలను చేర్చండి. శరీరానికి కావలసిన శక్తిని పొందండి.

గుండె ఆరోగ్యానికి 10 గుడ్ ఫుడ్స్..!

ఆలివ్‌ ఆయిల్‌లో వుండే మోనో-శాటురేటెడ్స్‌ వల్ల శరీరంలో చెడు కొవ్వు తగ్గేందుకు వుపయోగపడతాయి. ఇందులో యాంటీ యాక్సిడెంట్లు కూడా అధిక మోతాదులో వున్నాయి. ఇవి గుండె కవాటాలు సక్రమంగా పనిచేసేందుకు వుపయోగపడతాయి. గుండె సంబంధిత సమస్యలను కూడా ఇవి నివారిస్తాయి.

గుండె ఆరోగ్యానికి 10 గుడ్ ఫుడ్స్..!

ఈ మద్య కాలంలో గుండెజబ్బుల నివారణకు, కొలెస్ట్రాల్ ని అదుపులో ఉంచడానికి ఓట్స్ ని వాడుతున్న వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. నిజంగా ఓట్స్ కి కొలెస్ట్రాల్ నియంత్రించే శక్తి ఉందా అంటే ఉందనే చెప్పాలి. వీటిల్లో ఉండే ప్రత్యేక పీచు పదార్థం బెటాగ్లూకాన్. ఇది పైత్య రస ఆమ్లాలతో కలిసి శరీరంలోని కొలెస్ట్రాల్ ని నియంత్రణలో ఉంచుతుంది. ఇదే రకం పీచు పదార్థం బార్లీలో కూడా ఉంటుంది.

గుండె ఆరోగ్యానికి 10 గుడ్ ఫుడ్స్..!

ఇందులో క్యాల్షియమ్ పాళ్లు ఎక్కువ. విటమిన్ ఇ కూడా ఎక్కువే. అందుకే బాదాం గుండెకు మేలు చేస్తుంది. మన ఆహారనాళాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. జీర్ణాశయానికి మంచి పెరుగు ఎంత మేలు చేస్తుందో, బాదాం చేసే మేలూ అంతకు తక్కువేమీ కాదు. శరీరంలో ఎక్కడైనా మంట, వాపులతో ఇన్ ప్లమేషన్ ఉంటే బాదాం తినడం మంచిది అప్పుడు అందులోని ఒమెగా 3 ఆల్ఫా లినోలిక్ యాసిడ్ ఆ ఇన్ ఫ్లమేషన్ ను తగ్గిస్తుంది. కరోనరీ గుండెజబ్బులను నివారిస్తుంది.

గుండె ఆరోగ్యానికి 10 గుడ్ ఫుడ్స్..!

రెడ్ వైన్ గుండెకు మేలు చేస్తాయని అనేక పరిశోధనలు నిరూపించాయి. రెడ్ వైన్ లో 70శాతం పైగా కోకో కేట్ ఛిన్స్ అనే పదార్థం శరీరానికి అవసరమైన మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. కనుక రెడ్ వైన్ గుండెకు చాలా మంచి పానీయం. మితంగా తీసుకోవచ్చు.

గుండె ఆరోగ్యానికి 10 గుడ్ ఫుడ్స్..!

తృణధాన్యాలల్లో విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. బి కాంప్లెక్స్ అధికం. కాలేయ పనితీరు సామార్థాన్ని ప్రోత్సహించేందుకు బాగా సహాయపడుతుంది. బ్రౌన్ రైస్ మల్టీ గ్రెన్ పిండి మరియు సోయా పిండి ఆరోగ్యానికి చాలా మంచిది అందువలన వాటిని వాడటం వల్ల కాలేయ సమస్యలను దూరంగా ఉంచవచ్చు.

గుండె ఆరోగ్యానికి 10 గుడ్ ఫుడ్స్..!

ఘాటయిన వాసన ఇచ్చే వెల్లుల్లి గుండెకు నేస్తం, క్యాన్సర్ కు ప్రబల శత్రువు. దీన్ని నేరుగా వేయించకూడదు. వెల్లుల్లిని ఒలిచి పది నిముషాలు అలా ఉంచితే క్యాన్సర్ నిరోధించే ఎంజైమ్ ఎలెనాస్ బాగా మెరుగువుతుంది. సల్ఫర్ పరిమాణము ఎక్కువ ఉన్నందున ఘాటైన వాసన వస్తుంది.. రోజుకు రెండు మూడు వెల్లుల్లి రెబ్బలను తిన్నట్లయితే కొలెస్టిరాల్ ను తగ్గిస్తుంది, కాలేయము ఆరోగ్యానికి, కీళ్ళనొప్పులు తగ్గడానికి పనికివస్తుంది.

ఆహార నియమాలు ఆరోగ్యానికి గీటురాళ్లు. మాంసం, చికెన్ అతిగా తినడంకంటే శాఖాహారం తీసుకోవడం మేలు. పండ్లు కూరగాయలు, ముడి ధాన్యాలు, చేపలు, గుడ్లు, చిరుధాన్యాలు ఆహారంలో తీసుకోవడం మంచిది. ఫాస్ట్ఫుడ్స్, నిలువ పచ్చళ్ళు, స్వీట్లు, కొవ్వును పెంచే ఇతర ఆహార పదార్థాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. సులభంగా జీర్ణమయ్యే సమతుల ఆహారం తీసుకోవడం సర్వత్రా శుభసూచికం. కాబట్టి అలాంటి ఆహారాలు మీ గుండెకు మేలు చేసేవి కొన్ని మీకోసం...

English summary

10 Foods good for your heart...! | గుండె ఆరోగ్యానికి 10 గుడ్ ఫుడ్స్..!

Cardiovascular diseases are becoming an increasing health concern these days due to various reasons like unhealthy eating habits, work and personal life related-stress, sedentary lifestyle and lack of exercises. Heart problems also get coupled with high cholesterol levels and blood pressure too.
Desktop Bottom Promotion