For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

వ్యాయామాలు గుండెకు ఎలా ప్రయోజనం కలిగిస్తాయి?

By B N Sharma
|

Benefits of Exercises for A Heart!
ప్రతిరోజూ బాగా దమ్ముపట్టే, శ్వాస సంబంధిత వ్యాయామాలు అంటే అరబిక్ వ్యాయామాలు మొదలైనవి చేస్తే మీ గుండె, ఊపిరితిత్తులు శరీరానికి అవసరమైన ఇంధనాన్ని సరఫరా చేస్తాయి. అరబిక్ వ్యాయామాలు చేసే సమయంలో మీ శరీరం అధిక ఆక్సిజన్ లోపలికి తీసుకోవడం వేగంగా, గాఢంగా లోపలి కార్బన్ డై ఆక్సైడ్ బయటకు పంపటం, గుండె రక్తాన్ని మరింత బలంగా పంప్ చేయడం జరుగుతుంది. వ్యాయామం చేస్తే మీ రక్త నాళాలకు చిన్నగా వున్న డయామీటర్ పెద్దదవుతుంది.

ప్రతిరోజూ క్రమంగా చేసే వ్యాయామాలు కొత్త రక్తనాళాలను పుట్టిస్తాయి. కండరాల సామర్ధ్యాన్ని పెంచి ఆక్సిజన్ అధికంగా సరఫరా అయ్యేలాగు, చెడు పదార్ధాలు తొలిగించేలా చేస్తాయి. అరబిక్ వ్యాయామాలకు అలవాటు పడే శరీరం ఒక యంత్రం వలె క్రమేణా శక్తిని పుంజుకుంటుంది. అరబిక్ వ్యాయామాలు దీర్ఘకాలం ఆరోగ్య వంతంగా జీవించేందుకు తోడ్పడతాయి. అరబిక్ వ్యాయామాలను వారానికి కనీసం 4 లేదా 5 రోజుల పాటు చేయాలి. ప్రతి సారి కనీసం 20 నుండి 40 నిమిషాలపాటు చేయాలి.

వ్యాయామాలు చేయాలంటే 40 సంవత్సరముల పైబడిన వారు ముందుగా తమ గుండె, వెన్నెముక మొదలైన శరీర ప్రధాన భాగాలు పరీక్షలు చేయించుకొని డాక్టర్ సలహాపై మొదలుపెట్టాలి. చేసే వ్యాయామం రెగ్యులర్ గా వుండాలి. వారానికి ఒక రోజు తప్పక విశ్రాంతినివ్వాలి. వ్యాయామం చేసే సమయంలో అధిక వేడి లేదా అధిక చల్లదనం వుండరాదు. వ్యాయామం చేసేటపుడు శరీరంలో వచ్చే మార్పులు సన్నిహితంగా గమనిస్తూ ఏ మాత్రం ఆరోగ్యంలో వ్యత్యాసమున్నప్పటికి వైద్యులను సంప్రదించాలి.

వ్యాయామాలు పైరీతిలో చేసుకుంటూ గుండె పోటులను నివారించుకోవచ్చు. కనుక నేడే మీ వ్యాయామ ప్రణాళిక సిద్ధం చేసి వైద్యులను సంప్రదించి మీ శరీరానికి అలసటలేని రీతిలో తగిన వ్యాయామాలు చేసి గుండెను కాపాడుకోండి. ప్రతిరోజూ చేసే వ్యాయామంతోపాటు, గుండెకు ఆరోగ్యాన్నిచ్చే ఆహారాలు కూడా తినాలి. అందుకుగాను పోషకాహార నిపుణులను సంప్రదించండి. ప్రత్యేకించి మీరు తీసుకునే ఆహారాలు రక్తంలో చెడు కొల్లెస్టరాల్ ను మంచి కొల్లెస్టరాల్ గా మార్చేవిగాను లేదా మంచి కొల్లెస్టరాల్ ను తయారు చేసేవిగాను వుండాలి. అపుడే గుండెకు పూర్తి ఆరోగ్యం చేకూరుతుంది.

English summary

Benefits of Exercises for A Heart! | వ్యాయామాలు గుండెకు ఎలా ప్రయోజనం కలిగిస్తాయి?

Aerobic fitness ability of your heart and lungs to supply fuel during physical activity. During aerobics your body takes in more oxygen, breathes faster and deeper, heart pumps blood more forcefully. Exercise also increases diameter of small blood vessels. Over time, more capillaries will develop in the muscle increasing efficiency of oxygen delivery and waste removal.
Story first published:Monday, April 9, 2012, 12:17 [IST]
Desktop Bottom Promotion