డయాబెటిక్ రోగుల గుండె సమస్యలు!లక్షణాలు

By Staff
Subscribe to Boldsky
Heart diseases in diabetic patients!
షుగర్ వ్యాధి లేనివారికంటే కూడా వున్నవారికి గుండె జబ్బులు వచ్చే అవకాశం అధికంగా వుంటుంది. రక్తనాళాల అడ్డంకులు రక్తంలో అధికంగా గ్లూకోజ్ వుండటం గుండె కండరాన్ని నష్టపరుస్తాయి. గుండె కొట్టుకోవడం అపసవ్యంగా వుంటుంది. నరాలు సూచించే నొప్పులు అసలైన గుండె పోటును తెలియజెప్పలేవు. కనుక డయాబెటిక్ రోగులు ఒక్కోసారి నొప్పి తెలియని గుండెపోటుతోనే మరణిస్తారు.

డయాబెటిక్ రోగులలో గుండెపోటు లక్షణాలు ఎలా వుంటాయంటే... ఛాతీలో అసౌకర్యంగా వుండటం, చేయి, వెన్ను, దవడ, పొట్ట భాగాలలో నొప్పి రావడంగా వుంటాయి. ఒక్కొకపుడు శ్వాసతీసుకోవటంలో అసౌకర్యం ఏర్పడుతుంది. చెమట పట్టడం, వాంతులు, వికారంగా వుండటంగా వుంటుంది. అయితే మహిళలలో ఈ లక్షణాలు తక్కువగా వుంటాయి.

కనుక డయాబెటిక్ రోగులు సంవత్సరానికొకసారి గుండెసంబంధిత వ్యాధులు కలిగించే కొల్లెస్టరాల్, బ్లడ్ ప్రెజర్ వంటివి తప్పక పరీక్షింపజేసుకోవాలి. అందుకుతగిన వైద్యం పొందాలి. డయాబెటీస్, గుండె జబ్బు రెండూ కూడా ఒకే సమయంలో కలసిమెలసి రోగిని బాధిస్తాయి. వీటిని అరికట్టాలంటే, అవసరమైన వైద్య విధానాలతో పాటు, షుగర్ ను ఎప్పటికపుడు నియంత్రించుకోవాలి. లిపిడ్ నియంత్రణ, పొగతాగటం నిలిపివేయడం, రెగ్యులర్ వ్యాయామాలు, ఆరోగ్యకర ఆహారం వంటివి అత్యవసరం.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Heart diseases in diabetic patients! | డయాబెటిక్ రోగుల గుండె సమస్యలు!

    Prevention: One should get checked at least once a year for heart disease risk factors like cholesterol and blood pressure. Further testing may be required in those having high risk of heart diseases or symptoms. Diabetes and heart disease go hand in glove and prevention encompasses strict sugar control along with tight blood pressure and lipid control and cessation of smoking along with exercising regularly.
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more