For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నైట్ షిప్టులతో ఆరోగ్యానికి హానికరం.. గుండెపోటు, క్యాన్సర్ భారీన పడే ప్రమాదం

|

Night Shifts Raise risk Heart attack and stroks by more than 40%
సాధారణంగా పట్టణ, నగర నాగరీకతతో ఉద్యోగరీత్యా రాత్రిపూట షిప్టుల్లో పనిచేసేవారికి గుండెపోటు వచ్చే అవకాశం 40 శాతం మేర మెండుగా ఉంటుందని తాజా పరిశోధనల్లో వెల్లడయింది. దీనికి కారణం రాత్రిపూట పనిచేసేవారి ఆహారపు అలవాట్లు ఆరోగ్యకరమైనవిగా ఉండకపోవడంతోపాటు సరియైన సమయానికి నిద్ర పోలేకపోవడం కారణాలుగా వారు చెపుతున్నారు.

లండన్‌కు చెందిన స్ట్రోక్ ప్రివెన్షన్ అండ్ అథెరోస్క్లెరోసిస్ రీసెర్చ్ సెంటర్(స్పార్క్) రాత్రివేళల్లో పనిచేసేవారిపై అధ్యయనం జరిపారు. ఈ అధ్యయనంలో షిఫ్టు పద్ధతిపై పనిచేసేవారిలో 25 శాతం మేర సమస్య వెలుగుచూడగా రాత్రివేళల్లో మాత్రమే పనిచేసేవారికి 41 శాతం మేర సమస్య ఉన్నట్లు తేలింది.

ఈ అధ్యయనం వివరాలను బ్రిటిషన్ మెడికల్ జర్నల్ వెబ్‌సైట్‌లో అధ్యయనకారులు ఉటంకించారు. రాత్రిపూట పనిచేసేవారు ఎక్కువగా జంక్ ఫుడ్ ను తీసుకోవడమే కాకుండా సరిగా నిద్రపోలేరనీ, ఇంకా వ్యాయామం కూడా చేయకుండా ఉదయం పూట నిద్ర లాగించేస్తుండటం వల్ల గుండె సంబంధిత సమస్యలు పీడించే అవకాశం ఉందని వెల్లడించారు.

రాత్రిపూట పనిచేసే 20, 11, 935 మందిపై 34 రకాల పరీక్షలు చేసిన అనంతరం ఈ విషయం తేటతెల్లమయిందన్నారు. ముఖ్యంగా ఇష్టానుసారంగా షిప్టులను మారుస్తూ.. అంటే ఒకరోజు ఉదయం అయితే మరుసటి రోజు రాత్రి, ఆ తర్వాత మళ్లీ ఉదయం వంటి రొటేషన్ షిఫ్టు పద్ధతులు కూడా ఆరోగ్యాన్ని గుల్ల చేస్తాయని అధ్యయనకారులు హెచ్చరిస్తున్నారు. క్యాన్సర్ వ్యాధికి కూడా ఈ షిఫ్టు పనులు దోహదకారిగా నిలిచే అవకాశం ఉందని చెపుతున్నారు.

English summary

Night Shifts Raise risk Heart attack and stroks by more than 40% | నైట్ షిప్టులతో ఆరోగ్యానికి హానికరం..

Shift work can dramatically increase the risk of heart attacks and strokes, warn researchers.
 A study of two million people found shift workers are almost 25 per cent more likely to suffer.
Story first published:Wednesday, August 1, 2012, 9:12 [IST]
Desktop Bottom Promotion