For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

  గుండెదడగా ఉందా..? అయితే ఇవి తినండి...

  By Sindhu
  |

  సాధారణంగా గుండె యొక్క స్పందనలను మనం గుర్తించలేము. గుండె దడను ఇంగ్లీష్ లో పాల్పిటేషన్స్ అని వ్యవహరిస్తారు. గుండె దడ అనగా తన గుండె తనలో వేగముగా కొట్టుకొంటున్నట్లు తోచుట. సాధారణంగా ఆందోళనగా ఉన్నప్పుడు, వ్యాయామం తరువాత కొందరిలో ఇది కొంతసేపు ఉంటుంది. గుండెదడ చాలాకాలంగా నిరంతరంగా కొనసాగేటట్లయితే దానివలన వచ్చే వ్యాధుల గురించి ఆలోచించాలి. వైద్యులను సంప్రదించి, మొదటి దశలోనే తగిన చికిత్స చేయించుకోవాలి.

  గుండెదడకు కారణాలు పరిశీలించండి.

  1. మానసిక ఒత్తిడి: మానసికంగా తీవ్ర ఒత్తిడికి గురైన సమయంలో గుండెదడ వస్తుంది.

  2. రక్తహీనత: దీనివలన శరీర కణజాలానికి ప్రాణవాయువు సరఫరా తగ్గి, దానిమూలంగా ఆయాసం, గుండెదడ వస్తాయి. ముఖ్యంగా అధిక శ్రమ చేసినప్పుడు వీటిలో గుండెనొప్పి కూడా వచ్చే అవకాశం వుంటుంది.

  3. విటమిన్ లోపాలు: విటమిన్ బి లోపం వల్ల వచ్చే బెరిబెరి అనే వ్యాధిలో కూడా గుండెదడ రావచ్చు.

  4. థైరాయిడ్ గ్రంధి వ్యాధులు: థైరాయిడ్ గ్రంధి ఎక్కువగా పనిచేసే హైపర్ థైరాయిడిజం లో అనూహ్యమైన రీతిలో బరువు తగ్గి, విరేచనాలు, ఆకలి ఎక్కువగా వేయడం, గుండెదడ కనిపిస్తాయి.

  5. మెనోపాజ్ సమస్యలు: కొందరు స్త్రీలలో బహిష్టులాగిపోయే దశలో హార్మోన్ ల విడుదలలో లోపం ఏర్పడడం వలన రక్తప్రసరణ గతి తప్పి గుండెదడ ఏర్పడుతుంది.

  6. మందుల దుష్ఫలితాలు: ఉబ్బసం కోసం వాడే కొన్ని మందులు గుండెదడను కలిగించే అవకాశం వుంది.

  7. గుండె జబ్బులు: గుండె కవాటాలు వ్యాధిగ్రస్తమవడం, గుండె కండరాలు బలహీనమవడం వంటి స్థితులలో గుండెదడ రావచ్చు

  ప్రతి రోజూ క్రమం తప్పకుండా కొంత సేపు నడుస్తుంటే.. గుండె ఆరోగ్యముగా పనిచేస్తుందని వైద్య నిపుణులు చెబుతుంటారు. కేవలం నడక మాత్రమే కాదు. ఆహరంలో చేసుకునే చిన్న చిన్న మార్పులు కూడా గుండెను ఆరోగ్యముగా ఉంచేందుకు తోడ్పడతాయి. ఆలాంటివే ఈ జాగ్రతలన్ని. వీటిల్లో కనీసం కొన్నింటినైనా ఆచరించగలిగితే మీకు మీరు మేలు సుకున్నవారవుతారు.

  నిమ్మరసం: గ్లాస్ గోరువెచ్చని నీటిలో మూడుచెంచాల తేనె, నిమ్మరసం వేసుకొని పరగడుపున తాగితే శరీరంలోని మలినాలన్నీ వెలుపలకి వచ్చేస్తాయని పెద్దవాళ్ళు చెబుతుంటారు. ఇలా చేయడం వల్ల గుండెకు లాభం చేకూరుతుంది. గుండె ఆరోగ్యముగా, పటిష్టంగా ఉంచడంలో తేనె దివ్యఅవుశుధంలగా పనిచేస్తుంది. కాబట్టి ఇకనుంచైనా తేనె కలిపిన నిమ్మరసాన్ని రోజు తప్పనిసరిగా తాగడం అలవాటు చేసుకోండి.

  హేర్బల్ టీ: వారంలో కనీసం రెండు, మూడు సార్లు అయిన హెర్బల్ "టీ" తాగాలి. ఎందుకంటె.. ఈ "టీ" లో కేఫినే ఉండదు కాబట్టి గుండెకు మేలు చేస్తుంది.

  ద్రాక్ష: గుండెదడను దూరం చేయడంలో ద్రాక్షకు తిరుగులేదు. వీటిలోని పాలీఫేనాల్స్ అందుకు కారణం. అలాగే.. నల్లద్రక్షను కార్డియో ప్రోTఎక్టర్స్ అంటాం. ఇవి బ్లడ్ గడ్డ కట్టకుండా కాపాడుతాయి. ద్రాక్ష లభించే కాలంలో ఎక్కువుగా తీసుకూవడం మర్చిపోకండి.

  యాలకులు: యాలకుల పొడి వేసిన "టీ" తాగుతున్న కూడా గుండెదడ తగ్గుతుంది.

  వెల్లుల్లి: గుండె చుట్టూ కొవ్వు చేరకుండా నివారించడంలో వెల్లుల్లి భాగా పనిచేస్తుంది. అందుకే రోజు అర టేబుల్ స్పూన్ వెల్లుల్లి పొడిని తప్పనిసరిగా తీసుకోవాలి. దీన్ని ఇష్టపడని వారు ఆహరం లో వెల్లుల్లి చేర్చుకుంటే సరిపోతుంది.

  ఆపిల్స్: యాపిల్ ను ఆహరంలో ఓ భాగంగా చేసుకోవాలి. ఈ పాండులో లబించే పోtaశియం, ఫాస్ఫరస్ చాల మేలు చేస్తుంది.

  ఉల్లిపాయ: అధిక కోవ్వూ తగ్గించడంలో ఉల్లిపాయలు మంచి మందులా పనిచేస్తయాని అంటారు నిపుణులు. అందుకే ఉల్లిపాయలు మీ రోజువారి ఆహారంలో ఉండేలా చూడాలి.

  ఆలివ్ ఆయిల్: మేనోచచురతేడ్ ప్యాట్ ఆధారిత ఆలివ్ నూనె.. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇది శరీరంలోని చెడు కూవ్వు ను సులువుగా తగ్గిస్తుంది. అందుకే సలాడ్ లో ఆలివ్ నూనె తప్పనిసరిగా వేయాలి.

  బొప్పాయి: గుండె ఆరోగ్యానికి మేలుచేసే మరో పండు బొప్పాయి. రోజు పరగడుపున చిన్న బొప్పాయి ముక్క తీసుకొని చూడండి ఎంతో మార్పూ కనిపిస్తింది.

  అరటి పండు: రోజులో ఏదో ఓ సమయంలో అరటిపండు తినడం అలవాటుచేసుకోవాలి. అరటిలోని కెరోతోనిన్ అనే పదార్దం మానసిక వ్యాకులతను దూరంచేస్తుంది. ఫలితం ... గుండె ఆరోగ్యానికి ఎలాంటి ఢోకా ఉండదు.

  మొలకెత్తిన విత్తనాలు: మొలకెత్తిన గింజలు, సొరకాయ కూడా గుండెకు బలాన్ని ఇస్తుంది. అధిక రక్త పోతూను తగ్గించాలంటే.. నిమ్మజాతి పండ్లును ప్రాదాన్యత ఇవ్వాలి. ఈ రకం పండ్లలో విటమిన్ "సి" అందుకు దోహదం చేస్తుంది.

  చేపలు: రెడ్ మీట్ తినకండి, బదులుగా చేపలు తినండి. వీటిలో ఒమేగా 3 వుంటుంది. ఇది సడన్ గా వచ్చే గుండెపోటును అరికడుతుంది. ఉప్పు తగ్గించండి.

  నీళ్ళు: బయటకు వెళ్ళునపుడు నీరు తాగటానికి ఒక బాటిల్ అందుబాటులో వుంచుకోండి. అది శరీరానికి హైడ్రేషన్ కలిగిస్తుంది.

  గోధుమ: గుండెకు అవసరమయ్యే ఫైబర్‌, విటమిన్స్‌, మినరల్స్‌ గోధుమలో పుష్కలంగా లభిస్తాయి. ఇది గుండెకు హాని కలిగించే ఫ్యాట్‌ని నివారిస్తుంది. ఫైబర్‌ కొవ్వుతో కలిసి దానిని బయటికి పంపేందుకు పనిచేస్తుంది. ఇంకా ఫైబర్‌ దొరికే పదార్థాలలో ఓట్స్‌, బార్లీ, రాగి, జొన్న వంటివి ముఖ్యమైనవి.

  ఆకు కూరలు: ఆకుపచ్చని రంగులో వుండే ఆకు కూరలు, కూరగాయలు పాలకూర, మెంతి కూర, వంటి వాటిలో విటమిన్‌ - బి కాంప్లెక్ష్‌, నియాసిన్‌ అధిక మోతా దులో వుంటాయ. ఇవి రక్తనాళాలు మూసుకుపోకుం డా వుండేందుకు సహాయపడతాయి. ఇంకా ఇవి బెర్రీస్‌, పుల్లటి రుచిగల పండ్లు వంటివాటిలోనూ ఎక్కువగా లభిస్తాయి.

  English summary

  15 Foods for Healthy Heartbeat | గుండెదడను తగ్గించే 15 ఆహారాలు...

  To maintain your heart functioning properly, you need to change your diet by eating clean. Eating clean mainly focuses on eating whole and fresh foods that will make you achieve good health, optimal fitness, and culinary satisfaction.
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more