మీకు గుండె సమస్య ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి?

By: DEEPTHI T A S
Subscribe to Boldsky

మీ కాలిబొటనవేలిని ముట్టుకోండి, మీకు గుండె సమస్య ఉందో లేదో తెలుస్తుంది

మీ గుండె సరిగా పనిచేస్తుందో లేదో తెలియటానికి, మీ కాలిబొటనివేలిని ముట్టుకొని సులభంగా తెలుసుకోవచ్చు. ఒకానొక జర్నల్ లో శరీరంలో ఒక ఎలిమెంట్ ను పరీక్షించి తెలుసుకోవచ్చని వివరించారు. అవే మీ కాలివేళ్ళు,దానితో మీ గుండెకి సమస్య ఉందో లేదో తెలుస్తుంది.

మీరెక్కడన్నా ప్రయాణం మధ్యలో ఉన్నా, మీకు గుండె సమస్య ఉందో లేదో ఇలా పరీక్షించుకోవచ్చు.

బ్రేక్ ఫాస్ట్ ని నిర్లక్ష్యం చేస్తే.. మీ గుండె రిస్క్ లో పడ్డట్టే..!

స్టెప్స్ చాలా సులువే. నేల మీద కూర్చుని కాళ్ళు చాపి కాలివేళ్ళు పైకి చూసేలా పెట్టండి. మీ చేతులతో కాలి వేళ్ల అంచులను తాకడానికి ప్రయత్నించండి. సులువుగా ముట్టుకోగలిగితే మీ గుండె ఆరోగ్యంగా, ఫ్లెక్సిబుల్ గా ఉన్నట్టు.

how to find out heart problem

దీనిపై జరిగిన పరిశోధన

పరిశోధన కోసం, 20 నుంచి 83 ఏళ్ళ వయస్సు మధ్య ఉన్న 500కి పైగా అభ్యర్థులను సెలెక్ట్ చేసారు. అభ్యర్థులు శరీర ఫ్లెక్సిబులిటీ పరీక్షకి వెళ్ళినపుడు వారి రక్తపోటు మరియు గుండె పనితీరును పరీక్షించారు.

how to find out heart problem

40ఏళ్ళకి పైన ఉన్న అభ్యర్థులలో పరిశోధకులు వారు తమ కాలివేళ్ళను ముట్టుకోలేరని తేలింది.

కాలి వేళ్ళను ముట్టుకోలేక, ఫ్లెక్సిబులిటీ పరీక్ష విఫలమయిన వారిలో రక్తనాళాలు గట్టిగా ఉంటాయని తేలింది. దీని అర్థం వారిలో గుండె సరిగా పనిచేయట్లేదని, భవిష్యత్తులో గుండెకి సంబంధించిన వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుంది.

how to find out heart problem

మీరు నిటారుగా కూర్చొని మీ కాలి వేళ్ళను ముట్టుకోగలిగితే, ఇంకా మీ గుండె మంచి స్థితిలోనే ఉన్నట్లు. ఒకవేళ ముట్టుకోలేకపోతే కార్డియాలజిస్టును సంప్రదించండి. ఇది గుండెజబ్బులకి సంకేతం కాకపోవచ్చు కానీ మీ గుండె ఫిట్ గా లేదని అర్థం కావచ్చు.

how to find out heart problem

30 ఏళ్ళలో వచ్చే హార్ట్ డిసీజ్ లకు కొన్ని హెచ్చరిక సంకేతాలు

ఈ పరిశోధనలో మరింత బయటపడిన విషయాలు ఏంటంటే కూర్చుని వంగగలిగి మీ కాలివేళ్ళను పట్టుకునే శక్తి, రాబోయే గుండెపోటు అవకాశాలతో లింక్ అయి ఉంటుంది. ఈ చిన్న పని చేయలేకపోవటం మీ రక్తనాళాల ఫ్లెక్సిబులిటీ తగ్గటం, అవి గట్టిగా,మందంగా తయారయ్యాయని సూచిస్తోంది. ఆరోగ్యకరమైన ధమనులు సాగేతత్వంతో, వంగగలిగి ఉంటాయి. దీనివల్ల రక్తపోటు సాధారణంగా ఉంటుంది.

how to find out heart problem

వయస్సు పరంగా రక్తనాళాలు మందం అవటం వలన అధిక రక్తపోటుకి దారితీయవచ్చు/

రక్తనాళాల ఫ్లెక్సిబిలిటీ, పెద్దయ్యే కొద్దీ శరీర ఫ్లెక్సిబిలిటీకి మధ్య సంబంధం ఏంటో అన్న ప్రశ్నకి ఇంకా సమాధానం లేదు. ఫలితాల ప్రకారం స్ట్రెచింగ్ వ్యాయామాలతో ఫ్లెక్సిబిలిటీ సామర్థ్యాన్ని పెంచుకోవచ్చు. ఇది వయస్సు పెరిగే నడివయస్సు వారిలో మరియు వృద్ధులలో రక్తనాళాల మందం అయే వేగాన్ని కొంచెం తగ్గించవచ్చని ఆ పరిశోధనా పత్రంలో ముగించారు.

English summary

Touch the end of your toe and you'll know if you have a heart problem or not

Did you know that touching the end of your toe will let you know if you have a heart problem or not. Read to know how to find out about heart problem.
Story first published: Saturday, November 18, 2017, 8:00 [IST]
Subscribe Newsletter