For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఈ చిన్న మార్పులతో గుండె పోటు వచ్చే అవకాశం ఉండదు

ఈ చిన్న మార్పులతో గుండె పోటు వచ్చే అవకాశం ఉండదు

|

ఈ రోజు ప్రపంచ హృదయ దినోత్సవం. ఇది మన శరీరంలోని మిగిలిన భాగాల కంటే కొద్దిగా భిన్నంగా ఉంటుంది. ఎందుకంటే ఇతర శారీరక అవయవాలు మన శారీరక ఆరోగ్యానికి చాలా అవసరం అయితే, గుండె మన మానసిక ఆరోగ్యానికి కూడా చాలా అవసరం. ప్రతి సంవత్సరం గుండె జబ్బులు పెరుగుతున్నాయి. అందులోనూ అభివృద్ధి చెందిన దేశాలలో ఈ సమస్య చాలా సాధారణం. గుండెకు సంబంధించిన సమస్యలు ఎక్కువ కావడానికి మన జీవన విధానం ముఖ్యమైన కారణమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు.

దీని గురించి జాగ్రత్తలు తీసుకోవడం వల్ల గుండెపోటు మరియు ఇతర హృదయ సంబంధ వ్యాధులను నివారించవచ్చు. ఈ విషయంలో ప్రజలకు అవగాహన కల్పించడానికి, తగిన జాగ్రత్తలు తీసుకోవడానికి ఈ ప్రపంచ హృదయ దినోత్సవం జరుపుకుంటారు. మీరు మీ జీవనశైలిలో కొద్దిగా మార్పులు చేసుకుంటే, మీ చిన్న గుండెను జీవిత కాలం ఆరోగ్యంగా కాపాడుకోవచ్చు. అందుకు మీరు ఏమి చేయాలి అన్న విషయం ఇక్కడ ఉంది చూడండి.

ఒత్తిడిని తగ్గించుకోండి

ఒత్తిడిని తగ్గించుకోండి

గుండెపోటుకు ప్రధాన కారణం మానసిక ఒత్తిడి. ఒక వ్యక్తి అధిక మానసిక ఒత్తిడికి గురైనప్పుడు, ఆ వ్యక్తికి గుండెపోటు వస్తుందని మీరు గమనించి ఉండవచ్చు. కాబట్టి అతిగా ఆందోళన చెందకుండా సంతోషమైనా లేదా విచారకరమైన మానసిక స్థితి కానీ ఎక్కువ ఉద్వేగానికి లోనవ్వకుండా తగిన జాగ్రత్తలు తీసుకోండి. అందుకు యోగా సహాయపడుతుంది.

డయాబెటిస్

డయాబెటిస్

మీకు డయాబెటిస్ ఉంటే, దానిని ఆహారం మరియు వ్యాయామం ద్వారా నియంత్రించాలి. ఆరోగ్యకరమైన వ్యక్తులకు కూడా మీకు డయాబెటిస్ రాకుండా జీవనశైలిలో మార్పు తీసుకోండి.

శరీర బరువు

శరీర బరువు

శరీర బరువు పెరిగేకొద్దీ, రక్తపోటు పెరిగి క్రమంగా గుండెపోటుకు కారణమవుతుంది. శరీరం బరువును నియంత్రించడం అన్ని రకాల ఆరోగ్యానికి చాలా అవసరం.

వైద్యపరీక్షలు

వైద్యపరీక్షలు

క్రమం తప్పకుండా వైద్యుడిని కలిసి వైద్య పరీక్షలు చేయించుకోవాలి, ఆరోగ్య పరంగా మీ శరీర పరిస్థితి ఎలా ఉందో తెలుసుకోండి.

బద్దకంగా ఉండకండి

బద్దకంగా ఉండకండి

కదలక, మెదలక బద్దకంగా ఉండకండి. మీరు క్రమం తప్పకుండా నడుస్తుంటే శరీరంలో సరైన రక్త ప్రసరణ జరగి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

డైట్

డైట్

కొవ్వు అధికంగా ఉన్న ఆహారాన్ని తినవద్దు (మితంగా తినండి). గుండె ఆరోగ్యాన్ని పెంచడానికి కొన్ని ఆహారాలు చాలా సహాయపడతాయి. ఆ ఆహారాల గురించి తెలుసుకోవడానికి తదుపరి స్లైడ్ చూడండి:

చాక్లెట్

చాక్లెట్

మీకు చాక్లెట్స్ అంటే ఇష్టమా? ఇకపై చాక్లెట్ తినడానికి వెనుకాడవలసిన అవసరం లేదు. డార్క్ చాక్లెట్ తినడం వల్ల మీ ఆరోగ్యం మెరుగుపడుతుంది. ఇది గుండె జబ్బుల ప్రమాదాన్ని 37% తగ్గిస్తుంది.

 వైన్

వైన్

వైన్ ద్రాక్ష నుండి తయారవుతుంది మరియు ఇందులో ఉండే కొలెస్ట్రాల్ ఒత్తిడిని తగ్గిస్తుంది. శరీరంలో అధిక కొవ్వు మరియు చెడు కొలెస్ట్రాల్ రక్త ప్రసరణను నిరోధించడం వల్ల గుండెపోటుకు కారణమవుతుంది. శరీరంలో రక్త ప్రసరణను సులభతరం చేయడానికి వైన్ సహాయపడుతుంది.

డ్రై నట్స్

డ్రై నట్స్

మీ గుండె వెచ్చగా ఉండటానికి డ్రై ఫ్రూట్స్ తినాలి. అవును డ్రై నట్స్ గుండెపోటు వంటి తీవ్రమైన సమస్య నుండి మిమ్మల్ని బలితీసుకోకుండా నిరోధిస్తాయి.

English summary

Special Story On World Heart Day

Today is World Heart Day. So its a time to focus on how the whole world is in threat of cardiovascular diseases. But if we work on reducing the risk factors of heart diseases at individual level, we can easily tackle this global health problem.
Desktop Bottom Promotion