For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

అనారోగ్యం నుండి త్వరగా కోలుకోవడం ఎలా?

|

ఒంట్లో నలతగా ఉందంటే కొంచెం విశ్రాంతి దొరికినట్టే భావించవచ్చు. ఆ రోజు స్కూళ్ళకి, కాలేజీలకి లేదా ఆఫీసులకి వెళ్ళనవసరం ఉండదు. ఇంట్లో కూర్చుని రోజు మొత్తం టీవీ చూడవచ్చు.అలాగే, కొన్ని సార్లు బోర్ గా అనిపించే అవకాశాలు కూడా లేకపోలేదు.

మీరు అనారోగ్యం నుండి త్వరగా కోలుకోవడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి.

How to Cope with Being Sick

1. మీ గురించి మీరు జాగ్రత్త తీసుకోండి. ద్రవపదార్ధాలని ఎక్కువగా తీసుకోండి. అవసరమైన మందులని వాడండి. పడుకోండి. మీ చేతులని తరచూ శుభ్రపరచుకోండి లేకపోతే త్వరగా కోలుకునే అవకాశం ఉండదు.

2. ఎక్కువగా పుస్తకాలు చదవకండి. తలనొప్పిగా ఉన్నప్పుడు చదవడం వల్ల మీకు తలనొప్పి పెరిగే అవకాశం ఉంది.

3.మీ స్నేహితులని పిలిచి వారితో గడపండి. ఒంట్లో బాగా లేనప్పుడు స్నేహితులతో సమయాన్ని సరదాగా గడపడం వల్ల మనసు కూడా కొంచెం ప్రశాంతత పొందుతుంది.

4.మీరు కడుపు నొప్పితో బాధపడుతూ ఉంటే, ఆహారానికి సంబంధించిన జాగ్రత్తలు తీసుకోవాలి. వెచ్చటి వస్తువుని మీ పొట్టపైన పెడితే కొంచెం ఉపశమనం కలుగుతుంది.

5.కాసేపు టీవీ చూడండి లేదా కంప్యూటర్ వద్దకి వెళ్ళండి. కాని ఎక్కువ సేపు వీటితో గడపడం వల్ల మీ కళ్ళు అలసిపోయి కళ్ళల్లోంచి నీరు వచ్చి తలనొప్పి ఎక్కువయ్యే ప్రమాదం ఉంది.

6.ఒకవేళ మీరు నలతగా లేకుండా ఆరోగ్యంగానే ఉంటే, మీకు దొరికిన ఈ రోజుని ఆనందంగా మీకు నచ్చే విదంగా ఎంజాయ్ చెయ్యండి.

చిట్కాలు

నలతగా ఉండే రోజులో మీకు తలనొప్పి లేదా వికారం కలిగించే పనులు అస్సలు చెయ్యకండి. నారింజ రసం, సోడా వంటి కొన్ని డ్రింక్స్, ఎక్కువగా నడవడం, పచ్చివి లేదా ఎక్కువగా కారం కలిగిన ఆహార పదార్ధాలు మీకు ఒంట్లో బాగాలేనప్పుడు వికారం కలిగించవచ్చు.

ఆరోగ్యమే మహా భాగ్యమని గుర్తుంచుకొండి.

అనారోగ్యాన్ని నయం చేయడానికి ఎక్కువగా విశ్రాంతి అవసరం. కాబట్టి వీలయినంత సమయాన్నివిశ్రాంతిని తీసుకోవడానికి వినియోగించుకోండి.

English summary

How to Cope with Being Sick | అనారోగ్యం నుండి త్వరగా కోలుకోవడం ఎలా?


 Sick days seem like a pretty good deal. You get to sit home and watch TV all day, and you don't have to go to school. But sometimes we forget how boring it can be and how bad you feel.
Story first published: Friday, December 28, 2012, 13:03 [IST]
Desktop Bottom Promotion