Latest Updates
-
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి! -
‘పరగడుపున వెల్లుల్లి’ ట్రెండ్.. అన్ని రోగాలకు ఇదే పరిష్కారమా.? -
అక్టోబర్ 11 నుంచి శరన్నవరాత్రులు..ఏనుగుపై భూలోకానికి దుర్గమ్మ.. ఆ 3 రాశుల వాళ్లకి ఇక అంతా డబ్బే డబ్బు!
కరోనా వైరస్ విజృంభించకుండా ప్రపంచ ఆరోగ్య సంస్థ విదేశీ ప్రయాణికులకు ఇస్తున్న విలువైన సలహాలివే...
కరోనా వైరస్ అంటే జంతువులలో కనిపించే వైరస్ సమూహం. ఇది ఒక అంటు వ్యాధి. ఈ వైరస్ జంతువుల నుండి మనుషులకు అతి వేగంగా వ్యాపిస్తాయి.
చైనా దేశంలో కరోనా వైరస్ మహమ్మారి కలకలం రోజురోజుకు విజృంభిస్తోంది. ఈ వైరస్ తో ఇప్పటికే 170 మందికి పైగా మరణించగా, ఏడు వేలకు పైగా కేసులు నమోదు అయినట్లు చైనా అధికారులు ధ్రువీకరించారు. అయితే ఈ వైరస్ ఎక్కువగా అంతర్జాతీయ ప్రయాణికుల ద్వారా వ్యాప్తి చెందుతున్నట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ గుర్తించింది.

ఇప్పటికే ఈ వైరస్ సుమారు 16 దేశాలకు వ్యాపించినట్లు స్పష్టం చేసింది. మన దేశంలోనూ తాజాగా కేరళలో ఓ కేసు నమోదు అయినట్లు వైద్యాధికారులు, మంత్రులు ధ్రువీకరించారు. మన తెలుగు రాష్ట్రాల్లోనూ హైదరబాద్, గన్నవరం, రాజమండ్రి, వైజాగ్ ఎయిర్ పోర్టుల్లో.. ముఖ్యంగా చైనా నుండి వచ్చే వారిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నారు.

ఈ వైరస్ బారిన పడిన వారి రక్త నమూనాలను సేకరిస్తున్నారు. ఇటీవలే హైదరాబాద్ లోనూ ఐదుగురి నమూనాలు సేకరించగా అందులో ఐదుగురి ఫలితాలు నెగిటివ్ గా వచ్చినట్లు, మరొకరి నివేదిక రావాల్సి ఉందని వైద్యాధికారులు తెలిపారు. అయితే అంతర్జాతీయ ప్రయాణికుల కోసం ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యుహెచ్ఓ) కూడా ఈ వ్యాధి మరింతగా వ్యాపించకుండా కొన్ని సలహాలతో మీ ముందుకు వచ్చింది.
తస్మాత్ జాగ్రత్త! కేరళ నుండి కమ్ముకొస్తున్న కరోనా వైరస్.. దాని నుండి ఎలా తప్పించుకోవాలంటే...

కరోనా వైరస్ అంటు వ్యాధి..
కరోనా వైరస్ అంటే జంతువులలో కనిపించే వైరస్ సమూహం. ఇది ఒక అంటు వ్యాధి. ఈ వైరస్ జంతువుల నుండి మనుషులకు అతి వేగంగా వ్యాపిస్తాయి. అలాగే మానవుల నుండి ఇతరులకు కూడా వ్యాపిస్తాయి.

రోగ నిరోధక శక్తి బలహీనంగా ఉంటే..
ఇవి మనుషులలో జలుబు, జ్వరం, తలనొప్పి, దగ్గు మరియు గొంతు నొప్పి వంటి లక్షణాలను కలుగజేస్తాయి. న్యూమోనియా లేదా శ్వాసకోశ రుగ్మత వంటి దీర్ఘకాలిక సమస్యలను కలుగజేస్తుంది. బలహీనమైన రోగ నిరోధకశక్తి ఉన్న వారు ఈ కరోనా వైరస్ బారిన పడే ప్రమాదం ఎక్కువగా ఉంది.

తుమ్ములు, దగ్గుల ద్వారా..
ఇది ఎక్కువగా తుమ్ములు లేదా దగ్గు ద్వారా ఎక్కువగా వ్యాప్తి చెందుతుంది. ఇలాంటి సమయంలో ప్రజలు చాాలా జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యంగా నోరు మరియు ముక్కు కవరయ్యే విధంగా మాస్కులను ధరించాలి. ఈ వైరస్ వ్యాప్తి చెందకుండా జాగ్రత్త పడాలి.

విమానాశ్రయాలలో స్క్రీనింగ్..
ఒక దేశం నుండి ఇంకో దేశానికి ప్రయాణించే వారు విమానాశ్రయాలలో స్క్రీనింగ్ ను ప్రోత్సహించాలి. అక్కడ ఈ కరోనా వైరస్ ను ముందుగానే గుర్తించే లక్ష్యంతో పని చేయాలి. ఒకవేళ ప్రయాణికులు ఈ వైరస్ బారిన పడి ఉంటే ముందుగానే చికిత్స చేయొచ్చు.

తీవ్రమైన శ్వాసకోశ లక్షణాలుంటే..
విదేశాల నుండి వచ్చే ప్రయాణికులను తరచుగా తనిఖీ చేయడం వల్ల ఈ వైరస్ ఇతర దేశాలకు వ్యాప్తి చెందకుండా చేయవచ్చు. ఎవరికైతే ఎక్కువగా జ్వరం ఉంటుందో.. తీవ్రమైన శ్వాసకోశ లక్షణాలతో ఉన్న ప్రయాణికుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.

ఒంటరిగా ఉంచాలి..
ఎవరికైతే ఈ కరోనా వైరస్ సంకేతాలు కనబడతాయో లేదా ఎవరికైతే ఈ వైరస్ సోకిందని నిర్ధారిస్తారో అలాంటి వ్యక్తులను ఒంటరిగా ఉంచాలి. వీరితో ప్రత్యక్ష సంబంధాలు పెట్టుకోకూడదు. వీరిని ప్రత్యేక గదిలో ఉంచి చికిత్సను అందించాలి.

విమానాశ్రయాల్లోనే స్క్రీనింగ్ పరీక్షలు..
విమానాశ్రయాలలోనే స్క్రీనింగ్ పరీక్షలు నిర్వహించి, ఎవరికైతే ఈ వైరస్ సోకిందనే అనుమానాలు కలుగుతాయో.. వారిని చెక్ చేసేందుకు ప్రత్యేక గదులు ఏర్పాటు చేశారు. ఇలా ఏర్పాటు స్క్రీనింగ్స్ వల్ల చాలా మందికి ఈ వైరస్ ఉన్నట్లు కనుగొన్నారు. కనుగొంటూ ఉన్నారు.

ఎయిర్ లైన్ల ఆపరేటర్లతో సహకరించాలి..
తీవ్రమైన శ్వాసకోశ లక్షణాలతో ఉన్న ప్రయాణికులు అందరూ ఎయిర్ లైన్స్ ఆపరేటర్లతో చికిత్సకు సంబంధించి సహకరించాలి. ఈ వ్యాధి వ్యాప్తి చెందకుండా క్యాబిన్ సిబ్బంది బాధ్యత వహించాలి.

వ్యాధి సోకిన వ్యక్తులు..
ఈ కరోనా వైరస్ సోకిన వ్యక్తులు బహిరంగ ప్రదేశాలలో ఉమ్మివేయడం వంటివి చేయకూడదు. దీని వల్ల కూడా కొన్ని క్రిములు గాలిలో కలిసి ఈ వైరస్ ఆ ప్రాంతంలో ఉన్న వారందరికీ సోకే ప్రమాదం ఉంది. ఇక రోడ్లపై తిరిగేవారంతా తప్పనిసరిగా మాస్కులు ధరించాలి.



Click it and Unblock the Notifications
