Latest Updates
-
ఆర్సీబీ విజయం: ఒత్తిడిలో కూడా సక్సెస్ సాధించే అద్భుతమైన లైఫ్ లెసన్స్ ఇవే! -
నోరూరించే గోంగూర అన్నం..తెలుగువారి రుచుల్లో రారాజు! -
ఎండలో బండి పార్క్ చేస్తున్నారా? మీ మగతనానికి ముప్పే..పిల్లలు పుట్టరంట! -
గురు పుష్య యోగం: ఈ శనివారం ఈ సమయాల్లో పనులు మొదలుపెడితే తిరుగేలేదు! -
బెంగుళూరు ఫేమస్ బెన్నె మసాలా దోశ..ఇప్పుడు మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసెయ్యండి! -
ఎండల తీవ్రతతో వణికిపోతున్నారా? వడదెబ్బ తగలకుండా ఉండాలంటే ఈ డ్రింక్స్ ట్రై చేయండి! -
సీతా నవమి రోజున ఈ తప్పులు చేస్తున్నారా? పూజ ఫలితం దక్కాలంటే ఈ నియమాలు తప్పనిసరి! -
సింహ రాశిలోకి చంద్రుడి ప్రవేశం: ఈ రాశుల వారికి ఇక తిరుగులేదు, అదృష్టం మీ వెంటే! -
సింహం, ధనుస్సు, మేష రాశుల వారికి అదృష్ట యోగం.. శని దేవుని ఆశీస్సులు ఎవరికి? - శనివారం, 25 ఏప్రిల్ 2026 -
ఎండలు మండిపోతున్నాయి: గర్భిణీలు, PCOS ఉన్నవారు ఈ జాగ్రత్తలు తీసుకోకపోతే ప్రమాదమే!
గుమ్మడి కాయ తినడానికి 9 ప్రధాన కారణాలు
వంటికి ఎంతో మంచిది రకరకాల వంటలు, స్వీటూ, హాటూ రెండూ రుచికరమే, కొవ్వును కరిగించడంలో ఉపయుక్తం. గుమ్మడిలో అద్భుత ఔషధాలున్నారుు. గుమ్మడి కాయను భారత సంప్రదాయక వంటకాల్లో దీనికి మంచి స్థానమే ఉంది. ఇందులోని పదార్థాలు వివిధ రోగాలను నివారించే గుణం కలిగి ఉండడం విశేషం. మలబద్ధకం మెుదలుకుని మధుమేహం వరకూ చాలా విధాల ఉపయోగపడే గుమ్మడిలో నిజంగా గమ్మత్తైనదే. చైనాలో చెక్కర వ్యాధి వలన సంక్రమించే సమస్యల పరిష్కారానికి తయారు చేసే మందుల్లో గుమ్మడిని వాడుతున్నారు. ఇందులో చాలా ఎక్కువగా బీటాకెరోటిన్ ఉంటుంది. శరీరానికి తక్కువ క్యాలరీలు అందిస్తుంది. కళ్లకు, చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ సి కూడా సంవృద్ధిగా లభిస్తుంది.
గుమ్మడి మరియ గుమ్మడి గింజలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది మరియు ఇందులో పుష్కలమైనటువంటి న్యూట్రీషియన్స్ మరియు విటమిన్స్, మరియు మినిరల్స్ పుష్కలంగా ఉన్నాయి. ఇవి శరీర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి. గుమ్మడిలో విటమిన్ ఎ, సి, ఇ, కె లు మరియు యాంటీయాక్సిడెంట్స్, ఇంకా జింక్ మరియు పుష్కలమైనటువంటి మెగ్నీషియం ఉండి మొత్తం శరీర ఆరోగ్యనాకి మేలు చేస్తుంది.
గుమ్మడి గింజలు తింటే జీవితకాలం పెరుగుతుందట!:క్లిక్ చేయండి
ఇందులో చాల ఎక్కువగా "బీటా కెరోటిన్ ఉంటుంది, శరీరానికు తక్కుకా క్యాలరీలు అందిస్తుంది. కళ్ళకు ,చర్మానికి ఎంతో మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ సి కుడా సంవృద్దిగా లభిస్తుంది. గుమ్మడి కాయ రకరకాల వంటగా చేసుకొని తినవచ్చును , జ్యూస్ గా తయారుచేసుకొని తీసుకోవచ్చును , సూప్ లా వాడుకోవచ్చు.

డయాబెటీస్ రాకుండా ఉండేందుకు , వచ్చిన వారికి కుడా గుమ్మడి ఎంతో మంచిది. బి.పి.ని నియంత్రిస్తుంది. పీచు పదార్ధము ఎక్కువగా ఉన్నందున కొలెస్టరాల్ ను తగ్గిస్తుంది. గుమ్మడి విత్తనాలను ఎండబెట్టి పొడిచేసి నీళ్ళలో కలిపి తాగితే మూత్ర సంభంద వ్యాదులు తగ్గుతాయి .
ఆహారం ద్వారా శరీరంలోకి చేరే కొవ్వును పేగులు గ్రహించకుండా చేయడం ద్వారా కొవ్వు నిల్వలను గణనీయంగా తగ్గించవచ్చు. ఇలా దేహంలో కొవ్వు చేరకుండా కాపాడుకోవాలంటే గుమ్మడి గింజలు తినడం మంచిదని ఆయుర్వేదం చెబుతోంది. గుమ్మడి గింజల్లో ఉండే ఫైటోస్టెరాల్ నిల్వలు కొవ్వు నిల్వలను పోలి ఉంటాయి. ఈ కారణంగా గుమ్మడి గింజలను ఆహారంగా తీసుకున్న వారిలో అవి జీర్ణమైన తర్వాత పేగులు ఈ ఫైటోస్టెరాల్ నిల్వలను కూడా గ్రహిస్తాయి. దీనివల్ల శరీరంలోకి చేరాల్సిన కొవ్వు శాతం బాగా తగ్గుతుంది.
ఇలా గుమ్మడితో లాభాలతో పాటు విటమిన్-ఇ, ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు, మెగ్నీషియం, ఫోలేట్ లాంటి శరీరానికి మేలు చేసే పోషకాలు కూడా లభిస్తాయి. అందుకే కొవ్వు సమస్యతో బాధపడేవారు తమ ఆహారంలో గుమ్మడి గింజలు ఉండేలా చూచుకుంటే మంచిది.
వీటిలో మెగ్నీషియం మెండుగా వుంది. ఇంకా మినరల్స్ అత్యధికంగా పోగుపడ్డ గింజలు. అంతేకాదు వీటికి ఆహారంలో భాగస్వామ్యం కల్పిస్తే మన జీవితకాలం మరింత పెరుగుతుందట! గుమ్మడి ప్రొస్టేట్ గ్రంథుల వాపును తగ్గించడానికి వైద్య పరంగా గుమ్మడి కాయ సరిపోతుంది. గుమ్మడి విత్తనాలు తినడం వలన మలబద్ధకం నివారణ ఆవుతుంది. ఆహారం పూర్తిగా జీర్ణమై మలబద్ధక సమస్య తీరుతుంది.
తరచూ గుమ్మడిని తీసుకోవడం వలన గ్యాస్ట్రిక్ నుంచి ఉపశమనం లభిస్తుంది. అలాగే ఛాతీ నొప్పి, ఊపిరితిత్తుల క్యాన్సర్లు వచ్చే అవకాశాలు తగ్గుతాయని పరిశోధకులు చెబుతున్నారు.
గుమ్మడి తీసుకోవడం వలన చక్కెర వ్యాధిగ్రస్తులకు రకరకాల ఉపయోగాలున్నాయి. రక్తంలోని గ్లూకోజ్‌ను బాగా తగ్గిస్తుంది. పైగా గింజల నుంచి తీసే నూనె వాడడం వలన అధిక రక్తపోటు అదుపులో ఉంటుంది.
గుమ్మడి గింజల్లో ఉండే ఫైటోస్టెరాల్ నిల్వలు కొవ్వు నిల్వలను పోలి ఉంటాయి. ఈ కారణంగా గుమ్మడి గింజలను ఆహారంగా తీసుకున్న వారిలో అవి జీర్ణమైన తర్వాత పేగులు ఈ ఫైటోస్టెరాల్ నిల్వలను కూడా గ్రహిస్తాయి. దీంతో శరీరంలోకి చేరాల్సిన కొవ్వు శాతం బాగా తగ్గుతుంది. ఇలా గుమ్మడితో లాభాలతో పాటు విటమిన్-ఇ, ఒమెగా-3 కొవ్వు ఆమ్లాలు, మెగ్నీషియం, ఫోలేట్ లాంటి శరీరానికి మేలు చేసే పోషకాలు కూడా లభిస్తాయి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications