For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

పెప్పర్ మింట్ టీ లో గొప్ప ఆరోగ్యప్రయోజనాలు

|

పెప్పర్ మింట్ టీ(పుదీనా టీ )యొక్క ప్రయోజనాల గురించి మీకు తెలుసా? పెప్పర్ మింట్ టీ రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల మన శరీరంలో ఏర్పడే కొన్ని రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవడానికి గ్రేట్ గా సహాయపడుతుంది. రీసెంట్ గా జరిపిన కొన్ని పరిశోధనల్లో పుదీనా టీ రెగ్యులర్ గా తీసుకుంటే, జీర్ణక్రియ మెరుగుపడుతుందని, తలనొప్పి, వికారం మరియు డయోరియా వంటి సమస్యలను నివారించబడుతాయని నిర్ధారించారు. అందువల్లే పురాతన కాలం నుండి ఇది వాడుకలో ఉన్నది.

ఇంకా కొన్ని ప్రదేశాల్లో జ్వరం మరియు ఇన్ఫ్లమేషన్ తో బాధపడే వారికి మింట్ టీ ఇవ్వమని సలహాలిస్తుంటారు . పుదీనాలో చాలా త్వరగా నయం చేసే గుణం కలిగి ఉండటం వల్ల మింట్ టీని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల రిఫ్రెషింగ్ టేస్ట్ కలిగి ఉంటుంది. ఇది బ్యాడ్ బ్రీత్ ను నివారిస్తుంది. ఈ ప్రయోజనాలను మాత్రమే కాదు, శరీరంలో జీవక్రియలు చురుకుగా పనిచేయాడానికి సహాయపడుతుంది మరియు విశ్రాంతి కలిగిస్తుంది. పుదీనాలో పొటాషియం, విటమిన్ బి మరియు క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. అందువల్లే పుదీనాలో వివిధ రకాల ప్రయోజనాలను కలిగి ఉంటుంది. మరి ఆ ప్రయోజనాలేంటో ఈ క్రింది స్లైడ్ ద్వారా వివరంగా తెలుసుకుందాం...

1. పొట్టనొప్పి నివారిస్తుంది:

1. పొట్టనొప్పి నివారిస్తుంది:

పొట్టనొప్పి నివారించడంలో పుదీనా గ్రేట్ గా సహాయపడుతుంది. జీవర్ణ సంబంధిత సమస్యలను అరికడుతుంది . పొట్టనొప్పి ఉన్నప్పుడు ఉదయం పరగడపున పుదీనా టీని త్రాగాలి. కొద్దిసేపటి తర్వాత గమనించినట్లైతే, నొప్పి తగ్గుముఖం పట్టడం మీరు గమనిస్తారు. అంతకీ నొప్పి తగ్గకపోతే, వెంటనే డాక్టర్ ను సంప్రదించాలి. పెప్పర్ మింట్ టీ వల్ల ఇది ఒక గ్రేట్ హెల్త్ బెనిఫిట్.

2. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:

2. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది:

రెగ్యులర్ డైట్ లో పొదీనా తీసుకోవడం వల్ల ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి వేగవంతం చేస్తుంది. రెండు స్పూనుల పుదీనా ఆకు రసంలో కొద్దిగా తేనె కలిపి ప్రతిరోజూ మూడుసార్లు తీసుకుంటే కడుపునొప్పి, పొట్ట ఉబ్బరం తగ్గుతాయి. రెగ్యులర్ డైట్ లో పొదీనా తీసుకోవడం వల్ల ఇది జీర్ణక్రియను మెరుగుపరిచి వేగవంతం చేస్తుంది. రెండు స్పూనుల పుదీనా ఆకు రసంలో కొద్దిగా తేనె కలిపి ప్రతిరోజూ మూడుసార్లు తీసుకుంటే కడుపునొప్పి, పొట్ట ఉబ్బరం తగ్గుతాయి. మీరు కొన్ని రకాల జీర్ణ సమస్యలతో బాధపడుతున్నట్లైతే , అందుకు పుదీనాను ఒక ఉత్తమ హోం రెమెడీగా ఉపయోగించుకోవచ్చు.

3. వికారం :

3. వికారం :

వికారంగా ఉన్నప్పుడు కొన్ని పుదీనా ఆకులను వాసన చూస్తే వికారంను నివారించవచ్చు. ఇంట్లో పుదీనా ఆయిల్ ఉంటే, దీన్ని వికారానికి ఒక హోం రెమెడీగా ఉపయోగించుకోవచ్చు.

4. ఆయిల్ స్కిన్:

4. ఆయిల్ స్కిన్:

పుదీనాలో కొన్ని బ్యూటీ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి . మీ చర్మం ఆయిలీగా ఉన్నట్లైతే, మీరు మింట్ టీని ప్రయత్నించండి. పుదీనా ఆయిల్ ను తొలగిస్తుంది. చర్మంను కాంతివంతంగా మార్చుతుంది.

5. డయోరియా:

5. డయోరియా:

జీర్ణ క్రియను మెరుగుపరచడంలో, మరియు డయోరియా వంటి సమస్యలను నివారించడంలో ఇది ఒక గ్రేట్ హోం రెమెడీ. డయోరియా లక్షణాలు మీలో కనిపించినట్లైతే మింట్ టీ త్రాగి సమస్యను నివారించుకోండి.

6. ఒత్తిడి తగ్గిస్తుంది:

6. ఒత్తిడి తగ్గిస్తుంది:

ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరిని పట్టి పీడిస్తున్న సమస్యల్లో ఒత్తిడి ఒకటి. ఒత్తిడిని జయించాలంటే, పుదీనా ఒక నేచురల్ మజిల్ రిలాక్సర్ . కాబట్టి, కండరాలను విశ్రాంతి పరచడంలో ఇది ఒక నేచురల్ హోం రెమెడీ. ఒక కప్పు పుదీనా టీ తీసుకోవడం వల్ల ప్రశాంతంగా నిద్రపోవచ్చు.

7. బౌల్ మూమెంట్:

7. బౌల్ మూమెంట్:

అపక్రమ బౌల్ మూమెంట్ తో బాధపడుతున్నట్లైతే, ఈ నేచురల్ రెమెడీని తీసుకోవడం ఉత్తమం. మింట్ టీ బౌల్ సమస్యలను నివారించడంలో ఒక ఉత్తమ హోం రెమెడీగా సహాయపడుతుంది.

8. బరువు తగ్గించడానికి:

8. బరువు తగ్గించడానికి:

బరువు తగ్గించుకోవడంలో పుదీనా చాలా ముఖ్య పాత్రను తగ్గిస్తుంది. ఇది డైజస్టివ్ సిస్టమ్ ను క్రమబద్దం చేస్తుంది. మీ శరీరం ఎక్కువ న్యూట్రీషియన్స్ ను గ్రహించడానికి సహాయపడుతుంది . ఎప్పుడైతే మీ శరీరంలో చాలా ఎఫెక్టివ్ గా కొవ్వు కరగడం ప్రారంభం అవుతుందో అప్పుడు సులభంగా బరువు తగ్గించుకోవచ్చు.

9. సైనస్:

9. సైనస్:

పుదీనా మీ కాలేయంను శుభ్రం చేయడానికి సహాయపడుతుంది .పుదీనాలో మెంతాల్ అధికంగా ఉంటుంది. మెంతాల్ డీకంజెస్టాంట్ గొంతులో గరగర వంటి ఇబ్బందులకు లోనయినప్ఫుడు కప్ఫు పుదీనా చాయ్ తాగండి. నిమిషాల్లో సాంత్వన పొందొచ్చు. నాసల్ పాసేజ్ ఫ్రీ అవుతుంది. దాంతో సైనస్ సమస్య ఉండదు.

10. స్కిన్ ఇరిటేషన్:

10. స్కిన్ ఇరిటేషన్:

స్కిన్ ఇరిటేషన్ తో బాధపడే వారు పుదీనా టీ తీసుకోవడానికి ట్రై చేయండి. తక్షణ ఉపశమనం కలిగిస్తుంది . అంతే కాదు, ఈ టీ కొన్ని రకాల స్కిన్ అలర్జీలకు, కాలిన గాయాలకు, స్కిన్ రాషెస్ మరియు ఇన్ ఫ్లమేషన్ తగ్గించడానికి కూడా గ్రేట్ గా సహాయపడుతుంది.

English summary

10 Health Benefits Of Peppermint Tea

Are you aware of the benefits of peppermint tea? Well, drinking mint tea on a regular basis protects your system against some health problems. Recent studies suggest that mint tea can improve digestion and cure headaches, nausea and diarrhea. This is the reason why mint has been consumed by our ancestors too.
Desktop Bottom Promotion