Latest Updates
-
చీర ఎత్తితే చీరేస్తారు: పంక్షన్లలోనే కాదు.. రైళ్లలోనూ హిజ్రాల బీభత్సం! -
ఉదయాన్నే ఒక కప్పు చాలు.. ఒంటి నొప్పులను తగ్గించి, పుష్టిగా బలాన్ని ఇచ్చే హెల్తీ బ్రేక్ఫాస్ట్.! -
బెంగాలీ స్పెషల్ రాధాభల్లవి పూరీ..ప్లేట్ లోనే స్వర్గం కనిపించేస్తది! -
మరో పది రోజుల్లో మంగళ గోచారం.. వీరికి దీనికి మించిన మంచి సమయం ఉండదు.! -
హైదరాబాద్ వాసులకు బంపరాఫర్.. ఇక బస్సు, మెట్రోకు ఒకే పాస్! -
రీసెర్చ్ ప్రకారం వారానికి ఎన్ని రోజులు కలిస్తే దాంపత్య జీవితం సంతోషంగా ఉంటుందో తెలుసా.? -
చిన్న నిర్లక్ష్యం పెద్ద నష్టం.. రేపటి నుంచి మూడు రోజుల పాటు ఈ రాశుల వారు జాగ్రత్త.! -
Viral Video: అరగంటలో 67 గులాబ్ జామ్స్..రూ.10 వేలు గెలుచుకున్న లేడీ కుంభకర్ణ! -
బొజ్జ గణపయ్యకు ప్రత్యేక నైవేద్యం.. 15 నిమిషాల్లో సింపుల్గా చేసుకునే పంచకజ్జాయ.! -
మన పూర్వీకుల 100 ఏళ్ల ఆయుష్షు రహస్యం..ఈ కమ్మని జొన్న జావే..ఇంట్లోనే ఈజీగా ఇలా చేసుకోండి
జీలకర్రలోని గొప్ప ఔషధగుణగణాలు --ఆరోగ్య ప్రయోజనాలు
జీలకర్రను మనం రోజువారీగా వాడుతూనే ఉంటాం. జీలకర్ర రెండు రూపాల్లో లభిస్తుంది. నల్లజీలకర్ర, మామూలు తెల్ల జీలకర్ర. నల్లజీలకర్రను షాజీర అంటారు. రెంటికీ ఔషధ గుణాలున్నాయి. వీటిని అనేక గృహ చికిత్సలకు వాడుతూ ఉంటారు . ఇది మనము వంట ఇంట్లో వాడుకునే పోపు(మసాలా) దినుసులలో ఒకటి . దీని శాస్త్రీయ నామము cuminuma cyminum. గింజలు గోధుమ రంగులో ఉన్న చిన్న గింజలు . గింజలనే వంటకాల లోనూ , ఔషధము గాను వాడుతారు . ఎంతో రుచిగా వుండే ఈ జీలకర్ర లేకుండా మనదేశంలో సాధారణంగా ఏ వంటకం వుండదు. వేడి వేసవిలో ఒక్క గ్లాసెడు మజ్జిగలో జీర వేసుకు తాగితే ఎంతో హాయినిస్తుంది. జీలకర్ర వేయిస్తే దాని రుచి మరింత పెరుగుతుంది ఎం సామాన్యమైన వంటకం అయినా సరే జీలకర్ర పడితేచాలు అసాధారణ వంటకం అయిపోతుంది.
ప్రపంచ సుగంధ ద్రవ్యాలలో జీలకర్రకు ప్రత్యేక స్ధానం వుంది. ప్రాచీన కాలము నుండీ ఇది వాడుకలో ఉంది . ప్రాచీన కాలంలోఈజిప్టు దేశంలో జీలకర్రను మమ్మీలను తయారు చేయటంలో ఒకపదార్ధంగా వాడేవారు. గ్రీకులు, రోమన్లు వాడుకులో ఉందిని అంటారు . హిందూ వివాహములో జీలకర్ర బెల్లము తలపై పెట్టుకోవడం ఒక ముఖ్యమైన ఘట్టము . యాలకులు: తీపి పదార్థాలకు మంచి రుచితో పాటూ సువాసన వచ్చేందుకు వీటిని ఎక్కువగా వాడుతుంటాం. కానీ ఇవి కెలొరీలను సులువుగా కరిగిస్తాయి. జీవక్రియల పనితీరు సరిగ్గా ఉండేలా చేస్తాయి. కొద్దిగా వాడినా సరే, కొవ్వు కరిగేలా చేసి, బరువు పెరగకుండా చూస్తాయి. కాబట్టి మీరు తీసుకునే కాఫీ, టీలల్లో ఈ పొడిని కొద్దిగా చల్లుకోవడం మరవకండి. మరి మన శరీర ఆరోగ్యానికి ఏవిధంగా లాభాలను చేకూర్చుతుందో చూద్దాం...

వ్యాధినిరోధకతను పెంచుతుంది:
జీలకర్రలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ వల్ల ఇది వ్యాధినిరోధకతను పెంచుతుంది.

రెగ్యులర్ పీరియడ్స్:
మహిళలలో వచ్చే అపసవ్య రుతుక్రమాలకు జీలకర్ర చాలా సమర్ధవంతంగా పనిచేస్తుంది. మొలలు బాధిస్తున్నాయా? అయితే జీలకర్ర తగుమాత్రంగా ప్రతిరోజూ తీసుకోండి. దీనిలో వుండే పీచు పదార్ధం ఎంతో మలబద్ధకాన్ని పోగొడుతుంది. నేటికి విరేచనం సాఫీగా జరగాలంటే మనదేశంలోని చాలా ప్రాంతాలలో జీలకర్రను ఉప్పుతో కలిపి తినటం చూస్తూనే వుంటాం.

నీళ్ళవిరోచనాలు తగ్గుటకు :
అరతులము జీలకర్ర ఇనుమూ గరిటె లో మాడబెట్టి అందులులో 5-6 తులముల నీరు పోసి ... చల్లారిన తరువాత ప్రతి 4 గంటలకొకసారి తీసుకుంటే నీళ్ళవిరోచాను తగ్గుతాయి .

డయాబెటిస్ :
జీలకర్రను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల డయాబెటిస్ కంట్రోల్లో ఉంటుంది. బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది.

ఆస్తమా:
జీలకర్ర ఒక ఇన్ఫ్లమేటరీ ఔషధ పదార్థం. ఆస్తమాతో బాధపడే వారిలో జీలకర్ర గ్రేట్ గా సహాయపడుతుంది.

ఐరన్ పుష్కలంగా ఉండి, రక్తహీనతను తగ్గిస్తుంది:
జీలకర్రలో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. మన శరీరంలో హీమో గ్లోబిన్ లెవల్స్ తగ్గించుకోవడానికి రెగ్యులర్ డైట్ లో జీకర్రను చేర్చుకోవచ్చు.

వృద్ధాప్యం :
జీలకర్ర వృద్ధాప్య ఛాయలు ఏర్పడకుండా నివారిస్తుంది. వయస్సు కనబడనియ్యకుండా, ముకంలో ముడుతలు ఏర్పడకుండా నివారిస్తుంది.

వికారం, వాంతులు తగ్గుటకు :
వేయించం జీలకర్ర తో సమముగా సైంధవలవణము కలిపి నూరి .. సీసాలో బద్రపరిచి రోజుకు కొంచము కొంచము గా రెండుపూటలా ఇచ్చిన వాంతులు తగ్గును.

ఎసిడిటి:
జీలకర్ర ఎసిడిటిని తగ్గిస్తుంది. జీర్ణక్రియ - జీర్ణక్రియ ప్రాధాన్యత అందరికీ తెలిసిందే. సాధారణంగా భోజనం తర్వాత మన దేశంలో చాలామంది జీలకర్రను ఎంతో కొంత మొత్తంలో నోటిలో వేసుకొని చప్పరించటం చూస్తూ వుంటాం. తిన్న పదార్ధాలకు జీర్నక్రియ బాగా జరగాలంటే, అజీర్ణం వంటివి ఏర్పడకుండా వుండాలంటే, ఈ జీలకర్ర తినటం ఎంతో మేలు చేస్తుంది. పొట్టనొప్పి, అజీర్ణం, డయోరియా, వాంతి వికారం, మార్నింగ్ సిక్ నెస్ వంటి అనారోగ్యాలకు జీలకర్రను బాగా వేయించి కొద్దిగా ఉప్పు కలిపి తినటం చేస్తారు.

రక్తంను శుభ్రపరుస్తుంది:
రెగ్యులర్ డైట్ లో జీలకర్రపొడి చేర్చుకోవడం వల్ల రక్తంను శుభ్రపరుస్తుంది.

క్యాన్సర్ నివారిణి:
జీలకర్రను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల కొన్ని రకాల క్యాన్సర్లను నివారించుకోవచ్చు .

కిడ్నీలకు రక్షణకల్పిస్తుంది-మూత్ర సంబంధ వ్యాధులకు :
జీలకర్రను దోరగా వేయించి అంతకు సమానంగా వేయించని జీలకర్రను కలిపి పొడి చేసుకోవాలి. దీనికి సమానంగా పంచదార వీలైతే ఆవునెయ్యిని కలుపుకొని కుంకుడు కాయంత మాత్రలు చేసుకొని 2 పూటలా 2 చొప్పున మాత్రలు వేసుకొవాలి. దీనివల్ల మూత్ర సంబంధ వ్యాధులు, మూత్రంలో వేడి, మంట పచ్చదనం తగ్గుతాయి. జీకలర్ర కిడ్నీ ఆరోగ్యానికి కూడా మేలు చేస్తుంది . జీలకర్రవల్ల ఇది ఒక ఉత్తమ ప్రయోజనం.

చుండ్రును నివారణకు:
యాంటీ డాండ్రఫ్ ట్రీట్మెంట్స్ లో జీలకర్రను విరివిగా ఉపయోగిస్తుంటారు.

శ్వాససంబంధిత సమస్యలకు:
జీలకర్ర యాంటీ ఫంగల్ లక్షణం కలిగినది. అందువల్ల జీలకర్రను రెగ్యులర్ డైట్ లో చేర్చడం వల్ల ఇది శ్వాససంబంధిత సమస్యలను నివారిస్తుంది.

జీర్ణక్రియ -
జీర్ణక్రియ ప్రాధాన్యత అందరకు తెలిసిందే. తిన్న పదార్ధాలకు జీర్నక్రియ బాగా జరగాలంటే, అజీర్ణం వంటివి ఏర్పడకుండా వుండాలంటే, ఈ జీలకర్ర తినటం ఎంతో మేలు చేస్తుంది. పొట్టనొప్పి, అజీర్ణం, డయోరియా, వాంతి వికారం, మార్నింగ్ సిక్ నెస్ వంటి అనారోగ్యాలకు జీలకర్రను బాగా వేయించి కొద్దిగా ఉప్పు కలిపి తినటం చేస్తారు.

జీవక్రియల మీద ప్రభావం చూపుతుంది:
ఆరోగ్యకరంగా జీవక్రియలు పనిచేయడానికి సహాయపడుతాయి. జీలకర్ర వల్ల ఇది ఒక ఆరోగ్యకరమైన ప్రయోజనం.

స్కిన్ రాషెష్- ఎలర్జీకి తగ్గుటకూ :
శరీరంలో ఏర్పడే తామర, తెల్లమచ్చలు, బొల్లి వంటివి ఆరోగ్యాన్నే కాకుండా అందాన్ని కూడా దెబ్బతీస్తాయి. అందుకనే ఇటువంటి చర్మ వ్యాధులను త్వరిత గతిన గమనించి, వాటి బారి నుండి బయటపడడం చాలా అవసరం. ఇందుకుగాను సులభమైన పెరటి వైద్యం జీలకర్ర - చాలా ఉపయోగకరంగా ఉంటుంది. ఎలర్జీకి జీలకర్ర గొప్ప ఔషధం.



Click it and Unblock the Notifications
