Latest Updates
-
కొంతమంది ప్రతిసారీ రాంగ్ పర్సన్ కే ఎందుకు ఎట్రాక్ట్ అవుతుంటారో తెలుసా? -
పైన మీగడ, లోపల కమ్మటి రుచి.. ఇంట్లోనే పక్కా ధాబా స్టైల్ మలై లస్సీ..ఎలా చేసుకోవాలంటే -
అచ్చం బేకరీ రుచితో కొబ్బరి బర్ఫీ.. తక్కువ సమయం, అదిరిపోయే టేస్ట్! -
కరివేపాకుతో ఈ 5 ఆహారాలు కలిపి తింటే.. మీ ఎముకలు ఉక్కులా మారుతాయి! -
వేడివేడి అన్నం, కాస్త నెయ్యి, గోంగూర కారం..ఆహా ఏమి రుచి! -
ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తున్నారా? ముందు మహిళలు సరిదిద్దుకోవాల్సిన అతిపెద్ద సమస్య ఇదే! -
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్!
సార్డీన్ చేపలు చెప్పే సప్రైజింగ్ హెల్త్ బెన్ఫిట్స్
మీరు మాంసాహార ప్రియులా ? సీ ఫుడ్ అంటే బాగా ఇష్టపడతారా ? అయితే సార్డీన్ చేపలు తీసుకోండి. సార్డిన్ చేపలు ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలు చేకూరుస్తాయి. కాబట్టి రెగ్యులర్ గా కాకపోయినా.. అప్పుడప్పుడైనా.. సార్డిన్ చేపలు తింటూ ఉండండి. ఇవి శరీరానికి కావాల్సిన శక్తిని, పోషకాలను అందిస్తాయి.
READ MORE: చేప నూనె యొక్క 12 ఆరోగ్య ప్రయోజనాలు
సార్డీన్ చేపలు చేప్పుకోదగ్గ టేస్టీ ఫుడ్ కాకపోయినా.. ఆరోగ్యానికి మాత్రం చాలా మేలు చేకూరుస్తాయి. ఒత్తిడి, అలసట, ఆందోళన, అనారోగ్య సమస్యలకు దూరంగా ఉండటానికి సార్డిన్ చేపలు తీసుకోవడం చాలా అవసరమంటున్నారు నిపుణులు. సార్డీన్ చేపల్లో దాగున్న 20 సర్ ప్రైజింగ్ బెన్ఫిట్స్ ఏంటో చూద్దామా...

పోషకాలు
ప్రొటీన్ రిచ్ ఆహారాల్లో సార్డీన్ చేపలు ఒకటి. ప్లేట్ లో నాలుగో వంతు సార్డిన్ చేపల్లో 23 గ్రాముల ప్రొటీన్స్ ఉంటాయి.

మంట, నొప్పి
సార్డీన్ చేపల్లో ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. వీటి వల్ల నొప్పి, మంటతో వచ్చే అనారోగ్య సమస్యలను అరికడతాయి. ఇన్ల్ఫమేటరీ డిసీజ్ ల నుంచి త్వరగా ఉపశమనం కలగాలంటే.. సార్టీన్ చేపలు తీసుకుంటూ ఉండాలి.

విటమిన్స్, మినరల్స్
సార్డీన్ చేపల్లో విటమిన్ బీ12, విటమిన్ డి, క్యాల్షియం, సొలీనియం వంటివి ఎక్కువ మోతాదులో ఉంటాయి. బీ12 శరీరానికి చాలా అవసరమైన విటమిన్ కాబట్టి సార్డీన్ చేపలను తీసుకోవడం మంచిది.

ఎముకల ఆరోగ్యానికి
సార్డీన్స్ లో క్యాల్షియం సమృద్ధిగా లభిస్తుంది. ఇది ఎముకల ఆరోగ్యానికి సహాయపడుతుంది. శరీరంలో 99 శాతం ఉన్న ఎముకలు, పళ్లలో క్యాల్షియం నిలువ ఉంటుంది. కాబట్టి సార్డీన్ చేపలను తరచుగా ఆహారంలో చేర్చుకోవాలి.

ఆందోళన, డిప్రెషన్
సార్డీన్ చేపల్లో ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి డిప్రెషన్ తగ్గించడానికి బాగా తోడ్పడతాయి. ఆందోళన, డిప్రెషన్ నుంచి బయటపడటానికి సార్డీన్ చేపలు చక్కటి పరిష్కారం.

షుగర్ నియంత్రణకు
రక్తంలో షుగర్ లెవెల్స్ నియంత్రించడానికి సార్డీన్ చేపల్లో ఉండే ప్రొటీన్స్ తోడ్పడతాయి.

ఆకలి తగ్గించడానికి
ఆకలి తగ్గగించడానికి సార్డీన్ చేపలు ఉపయోగపడతాయి. అనవసరంగా.. స్నాక్స్, చిరుతిండ్లు తినేవాళ్లకు సార్డీన్ చేపలు మంచి పరిష్కారం. ఇందులో ఉండే ప్రొటీన్స్ బరువు తగ్గడానికి సహకరిస్తాయి.

తక్కువ టాక్సిన్స్
సార్డీన్ చేపల్లో టాక్సిన్స్, మెటల్స్ ఎక్కువగా ఉండవు. ట్యూనా, స్వార్డ్ ఫిష్ లలో మాదిరి కలుషితాలు చాలా తక్కువగా ఉంటాయి.

బ్లడ్ క్లాట్స్ తొలగించడానికి
ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ సార్డీన్ చేపల్లో పుష్కలంగా ఉండటం వల్ల.. కొలెస్ట్రాల్, బీపీని కంట్రోల్ ఉంచుతుంది.

క్యాన్సర్ నివారిణి
విటమిన్ డీ, క్యాల్షియం ఎక్కువగా తీసుకోవడం వల్ల క్యాన్సర్ రాకుండా నివారిస్తాయని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి ఇవన్నీ ఉన్న సార్డిన్ చేపలు తీసుకోవడం ఉపయోగకరం.

యాంటీ ఆక్సిడెంట్స్
సార్డీన్స్ లో సెలీనియం ఉంటుంది. ఇది యాంటీ ఆక్సిడెంట్స్ గా పనిచేస్తుంది. అవయవాల్లో డ్యామేజ్ కాకుండా ప్రొటెక్ట్ చేస్తాయి.

రోగనిరోధక వ్యవస్థ ఆరోగ్యానికి
ఇమ్యూన్ సిస్టమ్ ఆరోగ్యంగా ఉండటానికి సార్డిన్ చేపలు సహకరిస్తాయి. ఇమ్యూన్ సెల్స్ ని ఇంప్రూవ్ చేసి.. రోగనిరోధక శక్తిని పెంచడానికి సార్డీన్స్ తోడ్పడతాయి.

చర్మానికి
చర్మ సంరక్షణకు సార్డీన్ చేపలు ఉపయోగపడతాయి. చర్మంపై వచ్చే దురదలు వంటి సమస్యలు రాకుండా.. ఆరోగ్యవంతమైన చర్మానికి సార్డీన్ చేపలు అవసరం.

ఇన్సులిన్ రెసిస్టెన్స్
సార్డీన్ చేపలు తీసుకోవడం వల్ల ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గిస్తుందని.. అధ్యయనాలు చెబుతున్నాయి.

హృద్రోగ సమస్యలు
ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఎక్కువగా ఉండటం వల్ల గుండె సంబంధిత సమస్యల నుంచి కాపాడటంలో మేజర్ రోల్ ప్లే చేస్తాయి. అంతేకాదు.. చెడు కొలెస్ట్రాల్ ని బయటకు పంపడానికి సహాయ పడుతుంది.

వయసు రిత్యా వచ్చే మచ్చలు
వయసు రిత్యా వచ్చే మచ్చల సమస్యలు అరికట్టడానికి సార్డీన్ చేపలు సహకరిస్తాయి. వయసుపైబడిన వారిలో కంటి చూపు సమస్యను తగ్గించడానికి ఇవి ఉపయోగపడతాయని అధ్యయనాలు చెబుతున్నాయి.

సమర్థవంతమైన ఆహారం
సార్డీన్ చేపల్లో క్యాలరీలు తక్కువగా ఉంటాయి... పోషకాలు ఎక్కువగా ఉంటాయి. వీటిని రకరకాల రుచుల్లో తయారు చేసుకుని తినగలిగే ఆహారం. కాబట్టి ఈ సమర్థవంతమైన ఆహారం తరచుగా తీసుకోవాల్సిందే.

మెదడు పనితీరు
ఫిష్ ఆయిల్, హెల్తీ ఫ్యాట్ మెదడు ఆహారంగా చెప్పవచ్చు. మెదడులో 60శాతం ఫ్యాటే ఉంటుంది కాబట్టి సార్డీన్ చేపలు తీసుకోవడం వల్ల ఆరోగ్యకరమైన కొవ్వు అందుతుంది. దీనివల్ల మెదడు పనితీరు సజావుగా సాగుతుంది.

కాపర్
సార్డీన్స్ చేపల్లో కాపర్ చాలా ఉంటుంది. కణాల్లో కార్పొహైడ్రేట్స్ ద్వారా శక్తిని ఉత్పత్తి చేయడానికి కాపర్ ఉపయోగపడుతుంది. కాపర్ శరీరానికి అందాలంటే సార్డీన్ చేపలు తప్పనిసరి. ఇంకేం,.. ఇన్ని ఆరోగ్య ప్రయోజనాలున్న సార్డీన్ చేపలకు ఇకపై నో చెప్పరు కదూ.. హ్యాపీగా లాగించేసి.. హెల్తీగా జీవించండి.



Click it and Unblock the Notifications











