Latest Updates
-
శృంగారం తర్వాత దంపతులు చేసే తప్పులు.. ఆరోగ్యానికి ఎంత ప్రమాదమో తెలుసా? -
నవరాత్రి స్పెషల్..ఉపవాసాల కోసం కరకరలాడే సగ్గుబియ్యం పాపడ్.. ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా -
వాషింగ్ మెషీన్లో షర్ట్ కాలర్ మురికి పోవట్లేదా.. ఈ సింపుల్ చిట్కాలను ట్రై చేయండి.! -
ఖర్జూరం నువ్వుల లడ్డు..వారానికొకటి తిన్నా ఎముకలకు బలం,గుండె ఆరోగ్యం, స్కిన్ గ్లో..ఈజీగా చేసుకోండిలా.. -
ఉల్లిపాయలతో చికెన్ ఇగురు.. ఈ పద్ధతిలో చేశారంటే బోన్స్ కూడా వదలకుండా తినేస్తారు.! -
ఆయుర్వేద రహస్యం: పరగడుపున గోరువెచ్చని నీటిలో నెయ్యి కలుపుకుని తాగితే ఇన్ని లాభాలా? -
గుండె పోటు, కార్డియాక్ అరెస్ట్, ఫెయిల్యూర్ ఒకటేనా.. తేడాలు తెలియకుంటే రిస్క్‌లో పడినట్లే.! -
ప్రపంచంలో రాజధాని లేని ఏకైక దేశం ఏదో తెలుసా? -
ఈ సీక్రెట్ మసాలా ఒక్కటి వేస్తే చాలు.. అదిరిపోయే టేస్ట్‌తో మష్రూమ్ కర్రీ రెడీ.! -
కర్ణాటక ఫేమస్ మద్దూర్ వడ..మీ ఇంట్లోనే ఇలా ఈజీగా చేసుకోండి!
తాజా పండ్లను ఉదయం తినడం వల్ల పొందే గ్రేట్ హెల్త్ బెనిఫిట్స్
మన రెగ్యులర్ డైట్ లో పండ్లు తీసుకోవడం చాలా అవసరం. పండ్లు తినడానికి వయస్సుతో పనిలేదు. అన్ని రకాల పండ్లను అన్ని రకాల వయస్సు వారు తీసుకోవచ్చు. ఎందుకంటే పండ్లలో న్యూట్రీషియన్స్ మరియు ప్రోటీన్స్ వ్యాధి నిరోధకతను పెంచుతాయి. మరియు స్ట్రాంగ్ అండ్ ఫిట్ గా ఉంచుతాయి. మొత్తానికి పండ్లు మనకు ఎనర్జీ బూస్టర్స్ గా సహాయపడుతాయి. ముఖ్యంగా వీటిని ఉదయం తీసుకుంటే ఆ రోజంతా మిమ్మల్ని యాక్టివ్ గా ఉంచుతాయి.
READ MORE: కామోద్దీపన కలిగించే లవ్లీ ఫ్రూట్స్
ఆహార నిపుణుల అభిప్రాయం ప్రకారం తాజా పండ్లను ప్రతి రోజూ ఉదయం తీసుకుంటే అనేక ఆరోగ్య ప్రయోజనాలను పొందవచ్చు. మీరు బరువు తగ్గించుకోవాలని చూస్తుంటే, ఆహార నిపుణుల అభిప్రాయం ప్రకారం ప్రతి రోజూ కనీసం ఒక పండైనా రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి. ముఖ్యంగా ఉదయం తీసుకోవడం మంచిది.
READ MORE: స్వీట్ హార్ట్ ను భద్రంగా ఉంచే 10 టాప్ స్వీట్ ప్రూట్స్
అంతే కాదు ఉదయం పండ్లు తినడం వల్ల ఫ్యాట్ బర్న్ అవుతుంది. క్యాలరీలను తగ్గిస్తాయి. ఆరోగ్యంగా జీవించడానికి సహాయపడుతాయి. మరియు ప్రతి రోజూ ఉదయం పండ్లు తిసుకోవడానికి గల కారణాలు ఏంటో ఈ క్రింది స్లైడ్ ద్వారా తెలుసుకుందాం...

ఎనర్జీ బూస్టర్స్
ప్రతి రోజూ ఉదయం ఒక్క ఆపిల్ తినడం వల్ల ఎనర్జీని అందిస్తుంది. ఆపిల్, ఆరెంజ్, అరటిపండు, మరియు మెలోన్స్ ఇవన్నీ కూడా బ్రేక్ ఫాస్ట్ లో తీసుకోవడం ఒక గ్రేట్ చాయిస్. ఎందుకంటే వీటిలో చాల తక్కువ గ్లిసమిక్ ఇండెక్స్ ఉండటం వల్ల ఉదయం బ్రేక్ ఫాస్ట్ కు మంచిది. కార్బోహైడ్రేట్స్ అధికంగా ఉండటం వల్ల వీటిని ఉదయం తీసుకోవడం మంచిది.

జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి
పండ్లు క్లీనింగ్ ఫుడ్స్ గా చెప్పవచ్చు. ముఖ్యంగా ఉదయం వీటిని తినడం వల్ల శరీరంలోని టాక్సిన్స్ ను బయటకు నెట్టివేస్తాయి. అంతే కాద, జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. రోజంతా మరింత ఎనర్జీగా ఉండేందుకు సహాయపడుతాయి.

ఎంజైమ్స్ ఎక్కువగా ఉన్నాయి:
వీటిలో ఎంజైమ్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఆహారనిపుణులు ఉదయాన్నే పండ్లను తీసుకోవాలని సలహాలిస్తుంటారు. ఈ ఎంజైమ్స్ శరీరంలో వివిధ రకాల జీవక్రియలు పనిచేయడానికి సహాయపడుతాయి. మరియు తిన్న ఆహారం నేచురల్ గా జీర్ణం అవ్వడానికి సహాయపడుతాయి.

మంచి మూడ్ ను అందిస్తాయి:
రోజులో ఎక్కువ మోతాదులో ఆహారం తీసుకోవడం కంటే, వాటి స్థానంలో కొద్దిగా పండ్లు తీసుకుంటే శరీరానికి నేచురల్ గ్లూకోజ్ ను అందిస్తాయి. ఇవి మరింత యాక్టివ్ గా మరియు ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉండటానికి సహాయపడుతాయి. ఎందుకంటే వీటిలో నేచురల్ షుగర్స్ మరియు ఫైబర్ కలిగి ఉండటం వల్ల మెంటల్ ఎనర్జీకి బూస్ట్ వంటిది.

ఒత్తిడి తగ్గిస్తాయి:
విటమిన్ సి అధికంగా ఉండే పండ్లును ఉదయం తీసుకుంటే, ఒత్తిడి తగ్గించడానికి సహాయపడుతాయి. అంతే కాదు, విటమిన్ సి ఇన్ఫ్లమేషన్ తగ్గిస్తుంది. దాంతో ఫిజికల్ మరియు మెంటల్ స్ట్రెస్ తగ్గుతుంది.

హైడ్రేషన్:
ఉదయం పండ్లు తీసుకోవడం వల్ల శరీరం రోజంతా హైడ్రేషన్ లో ఉంటుంది . నేచురల్ గానే డీహైడ్రేషన్ సమస్యను నివారిస్తుంది.

. స్వీట్స్ తినాలనే కోరికను చంపేస్తాయి:
పండ్లలో నేచురల్ షుగర్స్ ఉండటం వల్ల ఇవి ఆర్టిఫిషియల్ షుగర్స్ తినాలనే కోరికను తగ్గిస్తాయి .

బరువు తగ్గిస్తాయి:
ప్రతి రోజూ ఉదయం పండ్లు తీసుకోవడం వల్ల ఒకటి కాదు, రెండు కాదు ఎక్కువ ప్రయోజనాలను పొందవచ్చు. త్వరగా బరువు తగ్గించడంలో కూడా ఇవి గ్రేట్ గా సహాయపడుతాయి. వీటిలో నేచురల్ షుగర్స్, తక్కువ క్యాలరీలు ఉండటం వల్ల ఎనర్జీలెవల్స్ ఎక్కువగా అంధిస్తాయి..



Click it and Unblock the Notifications
