Latest Updates
-
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.! -
బయట కొనే పనిలేకుండా.. ఇంట్లోనే ఈజీగా మరమరాలు చేసుకోండిలా! -
ఉలవలతో చారు, గుగ్గిళ్లేనా.. ఇలా హెల్తీగా దోశ ట్రై చేశారంటే ఈజీగా బరువు తగ్గేస్తారు.! -
భాద్రపద పౌర్ణమి: కర్కాటకంతో పాటు ఈ 4 రాశుల వారికి స్పెషల్.. ఇంత మంచి టైం మళ్లీ రాదు.! -
కోడి కొబ్బరి కారం ఎప్పుడైనా తిన్నారా? జన్మజన్మలకి గుర్తుండిపోయే రుచి..ఎలా చేసుకోవాలంటే.. -
మీ పుట్టిన తేదీ ప్రకారం మీ స్నేహితులు, విరోధులు ఎవరో తెలుసా.. వీరితో కాస్త జాగ్రత్త.! -
76 ఏళ్ల వయస్సులో కూడా ఫిట్ నెస్ లో యువతతో పోటీ..మోదీ నుంచి నేర్చుకోవాల్సిన రోజువారీ పనులివే -
ప్రియుడిపై విరహంతో పెళ్లయిన రెండు వారాలకే యువతి నిర్వాకం.. మొగుడికి ముచ్చెమటలు.!
జీరాతో పొందే ఆరోగ్య ప్రయోజనాలెన్నో..
మనం వంటకాలలో జీలకర్రకు చాలా ప్రాధాన్యత ఇస్తాం. పోపు పెట్టడం నుంచి పలు రకాల వంటకాలకు, కూరలకు జీరా ఫ్లేవర్ తగిలితేనే అసలైన రుచి, సువాసన. జీలకర్ర పొడిని కూరల్లో వాడితే అమోఘమైన రుచివస్తుంది.
జీలకర్ర రుచిలోనే కాదు ఆరోగ్యానికి మేలు చేయడంలోనూ రారాజు. జీలకర్రలో కాల్షియం, ఫాస్ఫరస్, ఐరన్, సోడియం, పొటాషియం, విటమిన్ ఎ, సి లు ఎక్కువగా ఉన్నాయి. వీటిని నిత్యం ఆహారంలో చేర్చుకోవడం వల్ల ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు. ఎన్నో రకాల అనారోగ్య సమస్యల నుంచి బయటపడవచ్చు.

రక్తహీనత
రక్తంలో హీమోగ్లోబిన్ తయారవటానికి కావలసిన ముఖ్యమైన పోషకమైన ఐరన్ జీలకర్రలో పుష్కలంగా ఉంటుంది. శరీరంలో ఐరన్ లోపం వల్ల వచ్చే అనీమియా తగ్గించుకోవడానికి జీరా బాగా సహాయపడుతుంది. రక్తహీనత ఎక్కువగా పిల్లలు, ఆడవాళ్లలో కనిపిస్తుంది. కాబట్టి జీలకర్రను రెగ్యులర్ గా తీసుకోవడం మంచిది.

మొలలు
పైల్స్ ఉన్నవాళ్లకు జీలకర్ర చక్కటి పరిష్కారం. జీలకర్రలో ఎక్కువగా ఫైబర్, యాంటీ ఫంగల్, లాక్సైటీవ్స్, కార్మినేటివ్ గుణాలు ఉంటాయి. ఇది మొలల నుంచి ఉపశమనం కలిగించడానికి సహాయపడుతుంది.

జీర్ణక్రియ
జీలకర్ర కాలేయంలో పైత్యరసం తయారవటాన్ని ప్రోత్సహిస్తుంది. దీని వల్ల జీర్ణక్రియ పెరుగుతుంది. జీలకర్ర కడుపు నొప్పి, విరేచనాలు, మార్నింగ్ సిక్ నెస్ నుంచి కాపాడుతుంది.

నెలసరి
నెలసరి సమస్యలతో బాధపడేవాళ్లకు జీలకర్ర చక్కగా పనిచేస్తుంది. క్రమరహిత రుతుక్రమాలతో బాధపడేవాళ్లు రెగ్యులర్ గా వీటిని తీసుకోవడం వల్ల నెలసరి క్రమంగా రావడానికి సహాయపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉండటం వల్ల నెలసరి సమయంలో వచ్చే ఇబ్బందులను తగ్గిస్తుంది.

రోగ నిరోధక శక్తి
ఇమ్యూనిటీ పెంచడంలో జీలకర్ర బాగా సహకరిస్తుంది. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలో చేరిన మలినాలను తొలగించి, ప్రీ రాడికల్స్ నివారించి వ్యాధులను తట్టుకునేలా శరీర రోగ నిరోధక శక్తిని పెంచుతాయి.

వయసు తగ్గించడంలో
జీలకర్ర విటమిన్ E ని ఎక్కువగా కలిగి ఉండటం వల్ల, యాంటీ ఏజింగ్ గా పనిచేసి చర్మం పై ముడతలు రాకుండా చేస్తుంది. కాబట్టి జీలకర్రను క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల చర్మం కాంతివంతంగా మారుతుంది.

మధుమేహానికి
రోజువారీ డైట్ లో జీలకర్రను తీసుకోవడం వల్ల రక్తంలో షుగర్ లెవెల్స్ తగ్గిస్తుంది. దీనివల్ల మధుమేహం తగ్గడానికి సహాయపడతాయి.

క్యాన్సర్ నివారిణి
వంటల్లో జీరా పౌడర్ వాడటం వల్ల కొన్ని రకాల క్యాన్సర్ లను తగ్గింవచ్చని అధ్యయనాలు చెబుతున్నాయి. కాబట్టి రెగ్యులర్ డైట్ లో జీరాను చేర్చుకోవడం మంచిది.

ఆస్తమా
జీలకర్ర తైమోక్వినోన్ ని కలిగి ఉండటం వల్ల అస్తమాని అరికడతాయి.

జలుబు
జీలకర్ర యాంటీ-సెప్టిక్ కారకాలను కలిగి ఉండటం వల్ల జలుబు, ఫ్లూలను కలుగచేసే కారకాలకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఒక కప్పు కాచిన నీటిలో జీలకర్ర విత్తనాలు, అల్లం, తేనె, తులసి ఆకులు కలుపుకుని తాగడం వల్ల జలుబు నుంచి ఉపశమనం కలుగుతుంది.

బట్టతల నివారించడానికి
జీలకర్ర ఆరోగ్యానికే కాదు.. కేశ సంరక్షణకు కూడా ఉపయోగపడుతుంది. జీలకర్రని వాడటం వల్ల బట్టతలని నివారించడమే కాదు జుట్టు రాలటాన్ని తగ్గిస్తుంది. జీలకర్ర ఆయిల్, ఆలివ్ ఆయిల్ ని సమానంగా తీసుకుని తలకు పట్టించడం వల్ల జుట్టు పెరుగుతుంది.



Click it and Unblock the Notifications
