Latest Updates
-
చాణక్య నీతి.. మహిళల్లో ఈ నాలుగు లక్షణాలు ఉంటే వారే ఇంటికి సూపర్ ఉమెన్.! -
తలనొప్పి సమయంలో టీ లేదా కాఫీ ఏది బెస్ట్.. అసలు నిజం ఇదే.! -
ఇంట్లోనే స్వీట్ షాప్ స్టైల్ కరకరలాడే పల్లీ పకోడీ.. ఈజీగా ఇలా చేసేయండి.! -
వర్షాకాలం ఇన్ఫెక్షన్స్.. చేతులు, పాదాలపై చర్మం పొట్టులా రాలిపోతే ఏం చేయాలంటే.! -
బెంగాలీ స్టైల్ క్రిస్పీ వంకాయ ఫ్రై..వేడి అన్నంలో కలుపుకుని తింటుంటే స్వర్గమే! -
జలుబు, దగ్గుకి చెక్ పెట్టే చికెన్ మిరియాల రసం.. కారం లేకుండానే సూపర్ స్పైసీగా.! -
బుధ గోచారంతో శని ప్రభావం.. ఈ రాశుల వారికి ఈ పది రోజులూ కష్టాలు తప్పవు.! -
బీరకాయ గారెలు..సూపర్ టేస్ట్ తో పాటు హెల్తీ కూడా..చేయడం చాలా ఈజీ! -
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.!
కిడ్నీ స్టోన్స్ -క్యాన్సర్ లక్షణాలను నివారించే పొటాటో జ్యూస్
బంగాళదుంప అందరికి సుపరిచితమైన హెల్తీ అండ్ కామన్ వెజిటేబుల్. ఇది ఆకలిని కంట్రోల్ చేస్తుంది మరియు రుచికరమైనది కూడా . ఎందుకంటే, బంగాళదుంపలో కార్బోహైడ్రేట్స్, పొటాషియం(అమైనో ఆసిడ్స్)మరియు ఇతర విటమిన్స్ మరియు మినిరల్స్ పుష్కలంగా ఉన్నాయి. బంగాళ దుంపలో విటమిన్ సి, ఎ మరియు బి, ఫోలిక్ యాసిడ్, ఐరన్, క్యాల్షియం, పొటాషియం మరియు ఫాస్పరస్ లు అధికంగా ఉన్నాయి.
బంగాళదంప జ్యూస్ ఆరోగ్యానికి ప్రయోజనకరమా?పరిశోధనలు అవుననే తెలుపుతున్నాయి. ఎందుకంటే బంగాళదుంప రసంలో అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి .
బంగాళదుంపలను ఉడికించి మరియు ఫ్రై చేసి తీసుకోవడం మాత్రమే కాదు, దీన్ని జ్యూస్ రూపంలో తీసుకొన్నా అనేక ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా వివిధ రకాల గ్యాస్ట్రిక్ సమస్యలు, ఎసిడిటి మరియు అల్సర్ వంటి అనేక సమస్యలను నివారిస్తుంది.
బంగాళదుంప జ్యూస్ లో న్యూట్రీషియన్స్ పుష్కలంగా ఉన్నాయి. వండినప్పుడు ఈ న్యూట్రీషియన్స్ ను కోల్పోవడం జరుగుతుంది . కాబట్టి, ఈ సారి పొటాటాను హెల్తీగా తీసుకోవాలంటే జ్యూస్ రూపంలో తీసుకోండి. జ్యూస్ తీసుకొనే ముందు అందులోని మేలైన ఆరోగ్యప్రయోజనాల గురించి తెలుసుకోండి.

1. హెపటైటిస్ ను నివారిస్తుంది:
ఇది ఒక వైరల్ ఇన్ఫెక్షన్ మరియు కాలేయాన్ని టార్గెట్ చేస్తుంది. బంగాళదుంప జ్యూస్ లో యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల ఇది కాలేయాన్ని మరియు గాల్ బ్లాడర్ ను శుభ్రం చేయడానికి సహాయపడుతుంది. చాలా దేశాల్లో హైపటైటిస్ నివారణకు బంగాళదుంప జ్యూస్ ను నేచురల్ ట్రీట్మెంట్ గా ఉపయోగిస్తున్నారు.

2. క్యాన్సర్ ట్రీట్మెంట్ :
ఫ్రెష్ గా ఉండే పచ్చిబంగాళదుంప జ్యూస్ లో క్యాన్సర్ ను మరియు క్యాన్సర్ సెల్స్ తో పోరాడే లక్షణాలు పుష్కలంగా ఉన్నట్లు కనుగొన్నారు. ఇది శరీరంలోని ఆర్గాన్స్ డ్యామేజ్ ను మరియు క్యాన్సర్ సెల్స్ కారణం అయ్యే ఫ్రీరాడికల్స్ ను నివారిస్తుంది.

3. జాయింట్ పెయిన్ మరియు ఇన్ఫ్లమేషన్:
బంగాళదుంప జ్యూస్ లో జాయింట్ పెయిన్ మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గించడానికి సహాయపడే యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది బ్యాక్ పెయిన్ మరియు ఆర్థరైటిస్ ను నివారించడానికి గ్రేట్ గా సహాయపడుతాయి. బంగాళదుంప జ్యూస్ ను ఉదయం కాలీ పొట్టతో తీసుకోవాలి . పచ్చిబంగళాదుంప జ్యూస్ వల్ల ఇది ఒక ఉత్తమ ప్రయోజనం.

4.కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది:
పొటాటో జ్యూస్ కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గించడం మరియు తద్వారా గుండె సంబంధిత సమస్యలు మరియు హార్ట్ అటాక్ వంటి సమస్యలను నివారిస్తుంది. ఫ్రెష్ బంగాలదుంపల జ్యూస్ ను రెగ్యులర్ గా తీసుకొని కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గించుకోవాలి.

5. బరువు తగ్గించడానికి సహాయపడుతుంది :
డైలీ బంగాళదుంప జ్యూస్ తీసుకోవడం ద్వారా బాడీ ఫ్యాట్ తగ్గించడానికి సహాయపడుతుంది. దీన్ని మార్నింగ్ బ్రేక్ ఫాస్ట్ లో ఒక గంటకు ముందుగానే తీసుకోవాలి మరియు నిద్రించే ముందు తీసుకోవాలి. బరువు తగ్గించుకొనే క్రమంలో ఈ జ్యూస్ లో కొద్దిగా తేనె మిక్స్ చేసి తీసుకోవాలి.

6. అల్సర్ కు ఉత్తమ చికిత్స వంటింది:
అల్సర్ మరియు ప్రేగు సంబంధిత సమస్యలను నివారించడంలో బంగాళదుంప రసం చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తుంది. ఇది గ్యాస్ట్రిక్ యాసిడ్ ను నివారిస్తుంది.

7. మలబద్దకం నివారిస్తుంది:
రాత్రి నింద్రించే ముందు ఫ్రెష్ పొటాటో జ్యూస్ తీసుకోవడం ద్వారా ఉదయం బౌల్ మూమెంట్ స్మూత్ చేస్తుంది . ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ మలబద్దకం నివారించడానికి మరియు జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడుతుంది.

8. మంచి బ్యాక్టీరియాను పెంచుతుంది :
బంగాళ దుంప జ్యూస్ ప్రోబయోటిక్స్ (మంచి బ్యాక్టీరియా)ను పెంచుతుంది. దాంతో విటమిన్స్ మరియు మినిరల్స్ ఎక్కువగా గ్రహించుకొని, వివిధ రకాల బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ నివారించడానికి సహాయపడుతుంది.

9. బ్లడ్ ప్రెజర్ ను కంట్రోల్ చేస్తుంది:
బంగాళదుంపజ్యూస్ లో ఉండే పొటాషియం హార్ట్ కు మరియు రక్తకణాలకు చాలా మేలు చేస్తుంది . ఇది నార్మల్ బ్లడ్ ప్రెజర్ నుండి రక్షణ కల్పించి హార్ట్ అటాక్ ను నివారిస్తుంది.

10. కిడ్నీ వ్యాధులను నివారిస్తుంది:
కిడ్నీ వ్యాధులను నివారించడంలో బంగాళదుంప జ్యూస్ ను ఎక్కువగా వినియోగిస్తుంటారు. ఇది క్యాల్షియం స్టోన్స్ ను నివారించడానికి గ్రేట్ గా సహాయపడుతుంది. ఇంకా డయాబెటిస్ మరియు యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ నివారించడానికి కూడా సహాయపడుతుంది.



Click it and Unblock the Notifications