అలసటను తగ్గించి, ఎనర్జీని అందించే న్యూట్రీషియన్ ఫుడ్స్

అలసటకు అనేక కారణాలుంటాయి. మనలో చాలామంది వారంలో వచ్చే అలసటను అశ్రద్ధ చేస్తారు. ఆ అలసటనంతా వారాంతానికి తీసుకు వెళతారు. ఈ రకమైన తీరు అలసటను పూర్తిగా దూరం చేయలేదు. వారం మధ్యలో మీరు శరీరం అలసట భావించటం మొదలుపెడతారు. కనుక ఈ అలసటను ఎప్పటికపుడు దూరం చేసుకోవాలంటే ఎలా? ఇక్కడ తెలుపబడిన అలసట పోయే మార్గాలు మరియు అలసటకు కారణాలను పరిశీలించబడ్డాయి. కనుక అలసట సమస్య మూల కారణాలు కూడా పరిశీలించబడుతున్నాయి. ఈ పద్ధతులు, మీరు సాధారణంగా అలసిపోయే శరీరం కలవారు అయితే తప్ప, మీకు బాగానే పనిచేస్తాయి.

అలసటకు ముఖ్యకారణాలు, ఫిజికల్ మరియు మెంటల్ యాక్టివిటి. కండరాల సలుపు, మోటివేషన్ లేకుండుట, ఏకాగ్రతలోపించడం, కళ్ళు తిరగడం, తలనొప్పి, చికాకు, ఆకలి లేకుండట, మూడీగా ఉంటం మరియు ఎనర్జీలేకపోవడం . అలసట అనేది ఫిజికల్ గా మరియు మెంటల్ గా లేదా ఎమోషనల్ గా వచ్చే అలసటను కొన్ని ఎసెన్షియల్ న్యూట్రీషియన్ ఫుడ్స్ తో పోగొట్టుకోవచ్చు. ఈ ఫుడ్స్ మీ శరీరానికి అవసరం అయ్యే అన్ని రకాల న్యూట్రీషియన్స్ ను అందిస్తుంది . ప్రోటీన్స్, ఫ్యాట్స్, కాంప్లెక్షన్ కార్బోహైడ్రేట్స్, అదేవిధంగా విటమిన్స్, మరియు మినిరల్స్ అన్నీ శరీరంలో ముఖ్య పాత్రను పోషించి అలసట యొక్క లక్షణాలను నివారిస్తాయి.

పనిలో ఉన్నప్పుడు అలసటకు గురైప్పుడు ఈ క్రింది లిస్ట్ లోని ఆహారాలు తీసుకోవడం ద్వారా అలసటను నివారించుకోవచ్చు ...

అరటి పండ్లు:

అరటి పండ్లు:

అరటి పండ్లలో అధిక శాతంలో పొటాషియం మరియు బి విటమిన్స్ కలిగి ఉండటం వల్ల అరటిపండ్లు జీర్ణవ్యవస్థను నిదానం చేస్తుంది మరియు బ్లడ్ షుగర్ లెవల్స్ ను స్థిరంగా ఉంచుతుంది.అలసిన శరీరానికి గ్లూకోజ్ ను కార్బోహైడ్రేట్లను ఎంతో తేలికగాను వేగవంతంగాను ఈ పండు అందిస్తుంది. రక్తంలోని హేమోగ్లోబిన్ కవసరమైన ఐరన్ అందిస్తుంది. ఎంతో శక్తి కలిగి భావిస్తారు.

గుమ్మడి:

గుమ్మడి:

గుమ్మడి గింజల్లో ప్రోటీన్స్ పుష్కలంగా ఉండి కండర నిర్మాణం, కండర శక్తికి బాగా సహాయపడుతాయి. విటమిన్స్ మరియు హెల్తీ ఫ్యాట్, మెగ్నీషియం వంటివి ఎనర్జీని పెంపొందిస్థాయి.

ఓట్స్:

ఓట్స్:

ఓట్స్ ఫర్ఫెక్ట్ ఫుడ్ ఇది అలసటను తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇందులో క్వాలిటీ కార్బోహైడ్రేట్స్ గ్రేట్ గా ఉన్నాయి. ఇవి బ్రెయిన్ మరియు మజిల్స్ కు అవసరం అయ్యే కార్బోహైడ్రేట్ స్ ను అందిస్తుంది. దాంతో రోజంతా ఎనర్జిటిక్ గా ఉండటానికి సహాయపడుతుంది. ఎందుకంటే ఇందులో ప్రోటీన్, మెగ్నీషియం, ఫాస్పరస్, మరియు విటమిన్ బి 1పుష్లకంగా ఉన్నాయి . ఇవి ఎనర్జీ లెవల్స్ ను పెంచుతాయి .

పెరుగు:

పెరుగు:

పెరుగు ఎనర్జీ బూస్టింగ్ స్నాక్ గా చెబుతారు. ఇందులో ఉండే ప్రోబయోటిక్స్ జీర్ణిక్రియకు అద్భుతంగా సహాయపడుతాయి. ఇవి నిస్సత్తువు కలిగి వ్యాధినిరోధక క్రియతో పోరాడి ఎనర్జీ లెవల్స్ ను పెంచుతుంది.

 పుచ్చకాయ:

పుచ్చకాయ:

పచ్చకాయ తినడం వల్ల మన శరీరానికి హైడ్రేషన్ మాత్రమే కలిగించడం కాదు. పుచ్చకాయలో ఉండే అధిక శాతం నీరు, తగినంత హైడ్రేషన్ తో పాటు ఎనర్జీని అంధించే బి విటమిన్స్, పొటాషియం మరియు ఫ్రక్టోస్ పుష్కలంగా ఉంటుంది.

 వాల్ నట్స్:

వాల్ నట్స్:

మన శరీరంలోని కణజాలాలకు అవసరం అయ్యే శక్తిని అంధించడానికి నట్స్ లో అనేక ఎంజైములు ఉన్నాయి. కాబట్టి, రోజులో కాస్త అలసట అనిపించినప్పుడు ఈ నట్స్ ను స్నాక్స్ గా తీసుకోవడం చాలా ఉపయోగకరం. తక్షణ శక్తిని అంధిస్తాయి. అలసటను దూరం చేస్తాయి. మనస్సును ఉత్తేజపరుస్తాయి.

 బీన్స్:

బీన్స్:

బీన్స్ ను ఒక మిరాకిల్ ఫుడ్ అని చెప్పవచ్చు. ఎందుకంటే వీటిలో అనేక హెల్త్ బెనిఫిట్స్ దాగి ఉన్నాయి . ఇది అలసటను నివారించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది . వీటిలో ఫైబర్ అధికంగా ఉంటుంది . కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్ మరియు ప్రోటీన్స్ అధికంగా ఉంటాయి మరియు ఇందులో మినిరల్స్ కూడా అధికంగా ఉంటాయి.

క్యాప్సికమ్:

క్యాప్సికమ్:

ఎర్ర మిరియాలలోని ఐరన్ మీ శరీరంలోని ప్రక్రియను తేలిక చేయడమే కాదు, ఇది సహజ శక్తిని పెంపొందించడానికి పనిచేస్తుంది, ఆక్సిజెన్ తీసుకుని, మీ శరీరంలో వేడి ఉత్పత్తిని ప్రోత్సహిస్తుంది. ఎర్ర మిరియాలలో మీకు సిఫార్సుచేయబడిన రోజువారీ విటమిన్ C దాదాపు 300 శాతం కలిగి ఉంటాయి.

. ఆకుకూరలు:

. ఆకుకూరలు:

ఆకుకూరలు కాలె, పాలకూర, మెంతి కూర వంటి వాటిలో విటమిన్స్ మరియు మినిరల్స్ పుష్కలంగా ఉంటాయి . మహిళల ఎనర్జీకి చాలా అవసరం అయ్యే విటమిన్ ఎ మరియు విటమిన్ సి లు పుష్కలంగా ఉంటాయి. ఇంకా మహిళల్లో డిప్రెషన్ ను దూరం చేసే ఫ్లొల్లెట్ అనే కంటెంట్ కూడా పుష్కలంగా ఉంటుంది.

పాలు:

పాలు:

పాలులో న్యూట్రీషియన్స్ అధికంగా ఉంటాయి. అందుకే శరీరం ఫిట్ గా ఉంటుంది. మరియు క్యాల్షియం, ప్రోటీన్స్ మరియు కార్బోహైడ్రేఅధికంగా ఉంటుంది. కార్బోహైడ్రేట్స్ శరీరానికి అవసరం అయ్యే ఎనర్జీ లెవల్స్ ను పెంచుతుంది.

గ్రీన్ టీ:

గ్రీన్ టీ:

నరాలను జివ్వును ఉత్తేజపరచాలంటే గ్రీన్ టీ ఎంతో మంచిది. సాధారణ కాఫీ, టీల కంటే గ్రీన్ టీలో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా వుంటాయి. లోపలి భాగాలను శుభ్రపరచి అధికమైన శక్తినివ్వటంలో గ్రీన్ టీ ని మించిన పానీయం లేదు.

మష్రుమ్:

మష్రుమ్:

మష్రుమ్స్ లో విటమిన్ బి రిబోఫ్లివిన్, పాంథోతెనిక్ యాసిడ్, మరియు నియాసిన్ , థైయమిన్, విటమిన్ బి6 అండ్ ఫొల్లెట్ కు మంచి సోర్స్ . ఇవన్నీ ఎనర్జీ లెవల్స్ పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతాయి.

. స్వీట్ పొటాటో:

. స్వీట్ పొటాటో:

స్వీట్ పొటాటోలో హైఫైబర్ కార్బోహైడ్రేట్స్ ఉన్నాయి . ఇంకా పొటాషియం కూడా ఉన్నాయి . పొటాషియం ఎలక్ట్రోలైట్స్ ను బ్యాలెన్స్ చేస్తాయి . శరీరంలో చెమట రూపంలో కోల్పోయిన ఎలక్ట్రోలైట్స్ ను తిరిగి నింపడంలో ఇవి గ్రేట్ గా సహాయపడుతుంది. దాంతో ఎనర్జీ లెవల్స్ అమాంతం పెరుగతాయి.

 గుడ్లు:

గుడ్లు:

గుడ్లు: గుడ్లలో ప్రోటీనులు అధికంగా ఉంటాయి. ముఖ్యంగా వెజిటేరియన్స్ కు అవసరం అయ్యే ప్రోటీను ఇందులో పుష్కలం. మాంసాహారంలో ఉండే ప్రోటీనులు, బి విటమిన్స్ మరియు ఐరన్ కంటే గుడ్లలో అధికంగా ఉంటుంది. మహిళలు గుడ్డును బ్రేక్ ఫాస్ట్ గా తీసుకోవడం వల్ల ఆ రోజంతా వారికి కావల్సిన ఎనర్జీని పొందగలరు. అలసటను దూరం చేసి, ఎనర్జీని అందిస్తాయి.

డార్క్ చాక్లెట్ :

డార్క్ చాక్లెట్ :

డార్క్ చాక్లెట్ లో ఐరన్ మరియు మెగ్నీషయం అద్భుతంగా నిల్వ ఉంది. ఎనర్జీ స్థాయిలను పెంచడానికి ఇది గొప్పగా సహాయపడుతుంది.

Story first published: Tuesday, December 29, 2015, 11:52 [IST]
Desktop Bottom Promotion