For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రన్నర్స్ కోసం తక్షణ ఎనర్జీని అందించే ఎనర్జిటిక్ ఫుడ్స్

By Super
|

మన శరీరం వెల్డ్ ఆయిల్ మిషన్ వంటిది , అసవరసమైన ఆహారంను తీసుకన్నప్పుడు ఆయిల్ మిషన్ వంటి మన శరీరం డ్యామేజ్ అవ్వడం ప్రారంభమవుతుంది. అదే విధంగా మీరు రన్నర్ అయితే, సరైన ఆహారంను మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం మరింత అవసరం. రన్నర్స్ కు మజిల్స్ ఎప్పుడూ ఆరోగ్యంగా ఉండాలి లేదంటే మీ శరీరం మరియు కండరాలు అలసిపోయి సరైన ఎనర్జీ లేకుండా నీరసించి, బలహీన పడిపోతారు.

READ MORE: పరుగెత్తడం వల్ల 20 మేజర్ ఆరోగ్య ప్రయోజనాలు

మీరు తరచూ పరుగెడుతున్నా లేదా మీరు రన్నర్స్ అయితే, మీకు తక్షన శక్తిని అందించే కార్బోహైడ్రేట్ తీసుకోవడం చాలా ముఖం. అయితే తీసుకొనే కార్బోహైడ్రేట్స్ పరిమితంగా మరియు మంచి ఆహారాలను ఎంపిక చేసుకొని తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మేలు చేస్తాయి. కార్బోహైడ్రేట్లు ఎక్కువైతే శరీరానికి వేరే విధంగా ఆరోగ్య సమస్యలకు కారణం అవుతాయి. కాబట్టి, సరైన పౌష్టికాహారంను సమతుల్యం చేసుకొని తీసుకోవడం అన్ని రకాల బ్లడ్ గ్రూపులకు మంచిది. రన్నర్స్ కోసం కొన్ని హెల్తీ అండ్ ఎనర్జిటిక్ ఫుడ్స్ ను ఈ క్రింది లిస్ట్ లో తెలపడం జరిగినది.

తృణధాన్యాలు

తృణధాన్యాలు

రన్నర్స్ డైట్ లో బ్రౌన్ రైస్ తప్పనిసరి, బ్రౌన్ రైస్ లో పిండిపదార్థాలు మరియు ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. కాబట్టి తృణధాన్యాలతో తయారుచేసిన రొట్టెలు మరియు పాస్తావంటివి తీసుకోవాలి.

 అరటిపండ్లు

అరటిపండ్లు

రన్నర్ పరుగెత్తడానికి ముందు త్వరగా ఏదైనా అల్పాహారం తీసుకోవాలనుకొన్నప్పుడు లేదా త్వరగా శక్తినిచ్చే ఆహారం తీసుకోవాలని కోరుకున్నప్పుడు అరటిపండ్లు ఉత్తమం. ఎందుకంటే వీటిలో కార్బోహైడ్రేట్స్, పొటాసియం పుష్కలంగా ఉంటాయి మరియు పొట్టకు ఉపశమనం కలిగిస్తుంది.

బీన్స్ మరియు ధాన్యాలు

బీన్స్ మరియు ధాన్యాలు

బీన్స్ మరియు చిరుధాన్యాలలో ప్రోటీన్స్ మరియు ఫైబర్ మరియు ఫ్యాట్ తక్కువగా ఉంటుంది. చిరుధాన్యాలు బ్లడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ ను బ్యాలెన్స్ చేస్తుంది మరియు పొట్ట ఫుల్ గా ఉండేందుకు సహాయపడుతుంది.

చేపలు:

చేపలు:

రన్నర్ కోసం మరో హెల్తీ ఫుడ్ చేపలు. తక్కువ క్యాలరీలు, ఎక్కువ ప్రోటీన్స్ ఉంటాయి. అంతే కాదు వీటిని తయారుచేయడం చాలా సులభం మరియు రుచికరం మరియు ఆరోగ్యం. రన్నర్స్ కు ప్రోటీన్ ఫుడ్స్ అత్యంత అవసరం అయినవి కాబట్టి తప్పనిసరిగా వారానికొకసారి చేపలు తీసుకోవడం మంచిది . సాల్మన్ ఫిష్ లో విటమిన్స్, మరియు మినిరల్స్ అలాగే ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. ఇవి హార్ట్ డిసీజ్ మరియు హై బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తాయి.

 గుడ్లు

గుడ్లు

గుడ్లులో ప్రోటీన్స్ మరియు అమినో యాసిడ్స్ అధికంగా ఉంటాయి . ఇది రన్నర్స్ లో మజిల్ మరియు టిష్యు డ్యామేజ్ ను నివారిస్తాయి.

లోఫ్యాట్ పెరుగు

లోఫ్యాట్ పెరుగు

పెరుగులో క్యాల్షియం అధికంగా ఉంటుంది . ఇది రన్నర్స్ లో ఎముకల ఆరోగ్యానికి చాలా అవసరం. మరియు ప్రోటీనులు కండరాల అభివ్రుద్దికి మరియు వర్కౌట్ పునరుత్పత్తికి సహాయపడుతాయి . లోఫ్యాట్ పెరుగు తీసుకొన్న ఆహారాన్ని చాలా స్మూత్ గా జీర్ణపరుస్తుంది మరియు పొట్టను ప్రశాంతం చేస్తుంది.రన్నర్స్ ఉదయం అల్పాహారంలో తీసుకోవడం మంచిది.

 సెలరీ మరియు క్యారెట్:

సెలరీ మరియు క్యారెట్:

మీరు అలసట చెందుతున్నప్పుడు,సెలరీ మరియు క్యారెట్స్ తీసుకోవడం చాలా గ్రేట్. అందులో మీరు పీనట్ బట్టర్ మరియు షుగర్స్ చేర్చని ఆహారాలు తీసుకోవాలి.

స్వీట్ పొటాటో

స్వీట్ పొటాటో

యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండే పొటాటోలు తప్పనిసరిగా రన్నర్ ప్లేట్ లో ఉండాల్సిందే . స్వీట్ పొటాటోలో విటమిన్ ఎ (ఇది కంటి చూపును మెరుగుపరుస్తుంది మరియు వ్యాధినిరోధకతను పెంచుతుంది) బీటాకెరోటిని(ఇది చర్మాన్ని సన్ డ్యామేజ్ నుండి రక్షణ కల్పిస్తుంది) విటమిన్ సి, మ్యాంగనీస్ (హెల్తీ బ్లడ్ షుగర్ లెవల్స్ మరియు బోన్స్ ఆరోగ్యానికి మేలు చేస్తుంది), మరియు కాబట్టి ప్రతి యొక్క రన్నర్ కి హెల్తీ కార్బోహైడ్రేట్స్ చాలా అవసరం.

పీనట్ బట్టర్:

పీనట్ బట్టర్:

రుచికరంగా సంతృప్తికరంగా ఉండే పీనట్ బట్టర్ రన్నర్స్ కు చాలా అవసరం. ఇందులో ప్రోటీన్స్, కార్బోహైడ్రేట్స్ మరియు ఫైబర్ ఫుష్కలంగా ఉంటుంది. దీన్ని బ్రెడ్ తో పాటు తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. పొట్టను నిండుగా ఉన్న అనుభూతిని కలిగిస్తుంది

ఆరెంజ్ :

ఆరెంజ్ :

సిట్రస్ పండ్లలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది మన శరీరంలో వ్యాధినిరోధక శక్తిని పెంచుతుంది మరియు మనల్ని శక్తివంతంగా ఉంచుతుంది.

పాస్తా:

పాస్తా:

రన్నర్స్ తీసుకోవల్సిన ఆహారాల్లో ఒక బెస్ట్ ఫుడ్ పాస్తా. ఈ పాస్తా హై క్యాలరీలను కలిగి ఉండటం మాత్రమే కాదు, అధిక ఎనర్జీని కూడా అంధిస్తాయి. ఈ హైక్యాలరీ మరియు హై ఎనర్జీ రెండూ కూడా రన్నర్స్ కు చాలా అవసరం .

బెర్రీస్ :

బెర్రీస్ :

క్రాన్ బెర్రీస్, రెస్ బ్రెర్సీ, బ్లూ బెర్రీస్: ఇలా ముదురు రంగుల్లో ఉండే బెర్రీస్ అంటే అందరీకీ చాలా ఇష్టమే. బెర్రీస్ అనే ఈ పండ్లు పలు రంగుల్లో వస్తాయి. వీటిలో బ్లాక్‌బెర్రీ తప్పించి మిగిలినవన్నీ తినతగినవే. బ్లూ, రెడ్, స్ట్రాబెర్రీ, క్రేన్ బెర్రీస్ అనే ఈ పండ్లలో యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి. బెర్రీ పండ్లలో పీచు పదార్థం, వర్ణకాలు మెదడు కణాలను, రక్త నాళాలను ఫ్రీరాడికల్స్ ప్రభావం నుండి రక్షిస్తాయి. బెర్రీస్ లో ఫైబర్, తక్కువ పిండి పదార్థాలు అనేక విటమిన్స్ కలిగి ఉంటాయి. కాబట్టి వీటిని షుగర్ వ్యాది గ్రస్తులు తీసుకోవడం చాలా మంచిది.

 డార్క్ చాక్లెట్:

డార్క్ చాక్లెట్:

డార్క్ చాక్లెట్ లో ఐరన్ మరియు మెగ్నీషయం అద్భుతంగా నిల్వ ఉంది. ఎనర్జీ స్థాయిలను పెంచడానికి ఇది గొప్పగా సహాయపడుతుంది. కాబట్టి రన్నర్స్ తప్పని సరిగా తీసుకోవాలి.

బాదం:

బాదం:

బాదంలో ప్రోటీన్స్ మరియు ఫైబర్ మరియు విటమిన్ ఇ అధికంగా ఉంటుంది. బాదం హార్ట్ కు మరియు జీర్ణక్రియను మెరుగుపరిచే ఒక హెల్తీ ఫుడ్ . అందుకే రన్నర్స్ తప్పని సరిగా వారి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవాలి

 లెట్యుస్

లెట్యుస్

లెట్యూస్ ను మనం ‘సలాడ్ పట్టా' అనవచ్చు . ఎందుకంటే వీటిని ఎక్కువగా సలాడ్స్ లో ఉపయోగిస్తుంటారు .ఇంకా సాడ్విచ్ మరియు బర్గర్సో లో ఉపయోగిస్తుంటారు . ఈగ్రీన్ లీఫీ వింటర్ వెజిటేబుల్ తో అనేక స్కిన్ బెనిఫిట్స్ ఉన్నాయి . లెట్యుస్ లో విటమిన్ ఎ అధికంగా ఉంది, అందువల్ల , చర్మాన్ని మాయిశ్చరైజింగ్, తాజాగా ఉంచుతుంది. అలాగే ఇందులో పొటాషియం కంటెంట్ కూడా పుష్కలం. రన్నర్స్ కు చాలా అవసరం. .లెట్యూస్ ను క్రమంగా తీసుకోవడం వల్ల శరీరంలోని మలినాలన్నింటిని తొలగిస్తుంది. దాంతో మన శరీరం మరియు చర్మం ఆరోగ్యంగా మారుతుంది.

హైడ్రేషన్

హైడ్రేషన్

ఆరోగ్యకరమైన మీల్ ప్లాన్ తో పాటు, ఎప్పుడు శరీరాన్ని హైడ్రేట్ గా ఉంచుకోవాలి. రోజుకు సరిపడా నీరు త్రాగాలి . తాజా పండ్ల రసాలు, కొబ్బరి నీళ్ళు త్రాగడం వల్ల తక్షణ ఎనర్జీని పొందుతారు శరీరానికి తగిన మినరల్స్ అందుతాయి. ఇవి రన్నింగ్ లో కోల్పోయిన మినరల్స్ ను తిరిగి భర్తీ చేస్తుంది .

English summary

Top 16 Foods for Runners: Health Tips in Telugu

Your body is a well-oiled machine, but eat the wrong stuff long enough and the machine will start breaking down. As a runner, a proper diet is even more vital as your body and muscles need the right fuel to keep going, otherwise you’ll feel sluggish, tired, and demotivated.
Desktop Bottom Promotion