For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

జాయింట్స్ ఆరోగ్యంగా ఉండాలంటే: హెల్తీ ఫుడ్స్ తినాల్సిందే

|

మన ప్రతి కదలికకూ కీలే.. కీలకం ! జాయింట్లు మృదువుగా, సజావుగా, సున్నితంగా కదులుతుంటేనే... మన జీవితం హాయిగా, సుఖంగా, సౌకర్యవంతంగా సాగుతుంటుంది. అది వేళ్ల జాయింట్లు కావచ్చు, మణికట్టు జాయింట్లు కావచ్చు.. భుజం జాయింట్లు కావచ్చు.. మోకాలి కీళ్లు కావచ్చు.. చివరికి పాదాల, వేళ్ల జాయింట్లు కావచ్చు.. దేనికైనా.. ఏ కదలికకైనా ఈ కీళ్లే కీలకం.

మరి మన శరీరంలో ఈ కీళ్లు ఉగ్రరూపం దాల్చి సమస్యలను సృష్టించటం మొదలుపెడితే..? కాలు కదపాలంటే కష్టం. చేయి మెదపాలంటే కష్టం. సంకెళ్లు వేసినట్టు.. జీవితం అడుగడుగునా సమస్యలా తయారవుతుంది. అందుకే జాయింట్లకు అంతటి ప్రాధాన్యం! ఒక్కసారి జాయింట్స్ డ్యామేజ్ అయితే, వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి. లేదంటే దీర్ఘకాలంలో చాలా తీవ్రంగా ప్రభావం చూపడంతో పాటు, చికిత్స చేయించుకోవడానికి కూడా కష్టంగా మారుతుంది.

READ MORE: మోకాళ్ళకీళ్ళ నొప్పులను నయం చేసే బెస్ట్ హోం రెమడీస్

జాయింట్ (కీళ్ళ)ను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే ఏం చేయాలి? అందుకు కొన్ని సింపుల్ వ్యాయామాలతో పాటు జీవనశైలిలో మార్పులో చేసుకోవడం ఆరోగ్యకరం. జాయింట్స్ సమస్యలు రాక ముందే ముందు జాగ్రత్తలు తీసుకుంటే ఎలాంటి సమస్య ఉండదు. మరి అంతటి ప్యాధాన్యత ఉన్న కీళ్ళకు తగిన చికిత్స తీసుకోవడంతో మంచి ఆహారాన్ని తీసువడం కూడా ముఖ్యం. ఇవి మన శరీరంలో మొత్తంలో కీళ్ళకు డ్యామేజ్ కాకుండా రక్షణ కల్పిస్తాయి. అంతే కాదు కీళ్ళలో ద్రవాలను రీస్టోర్ చేస్తాయి. దాంతో జాయింట్ చురుకుగా పనిచేస్తాయి. మనం తీసుకొనే ఆహారం మీద కీళ్ళ యొక్క ఆరోగ్య ప్రభావం ఆధారపడి ఉంటుంది. కీళ్ళ నొప్పులు రాకుండా ఉంచే ఆ ఆహారాలేంటో చూద్దాం...

సాల్మన్ ఫిష్

సాల్మన్ ఫిష్

సాల్మన్ ఫిష్ మరియు వెజిటేబుల్స్ మన శరీర నిర్మాణంలో ప్రొటీన్స్‌ ప్రముఖ పాత్రను పోషిస్తాయి. విరివిగా లభించే సాల్మన్‌ ఫిష్‌ ప్రొటీన్‌ తో సమృద్ధి. వారంలో మూడు సార్లు సాల్మన్‌ను ఆరగించండి. సాల్మన్ ఫిష్ లో ఉండేటటువంటి ప్రోటీనులు, పోషకాల గుండె ఆరోగ్యానికి ఒక మంచి పౌష్టికాహారం.సాల్మన్ ఫిల్ లో ఓమెగా 3 ఫ్యాటీ యాసిడ్స్ కలిగి ఉండి శరీరంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది, జీవక్రియను బాగా మెరుగపరచడమే కాకుండా శరీరంలోని రక్త ప్రసరణను బాగా పెంచుతుంది.

బాదం:

బాదం:

కీళ్ళవాపులు దీర్ఘకాలం నుండి ఉన్నట్లైతే ముందు ముందు ఇది జాయింట్స్ డ్యామేజ్ అవ్వడానికి కారణం అవుతుంది. శరీరంలో ఉన్న ఫ్రీరాడికల్స్ జాయింట్ పెయిన్స్ కు కారణం అవుతాయి . అలా జరగకుండా బాదంలు రక్షణ కల్పిస్తాయి . జాయింట్స్ డ్యామేజ్ అవ్వకుండా బాదంలో ఉండే విటమిన్ ఇ మరియు యాంటీఆక్సిడెంట్స్ జాయింట్ ఇన్ఫ్లమేషన్ మరియు పెయిన్ తగ్గిస్తుంది.

బొప్పాయి:

బొప్పాయి:

హెల్తీ జాయింట్స్ పొందడానికి బొప్పాయి గ్రేట్ గా సహాయపడుతుంది. ఎందుకంటే బొప్పాయిలో విటమిన్ సి మరియు పెపైన్ అనే అంశము ఉండటం వల్ల జాయింట్ ఇన్ఫ్లమేషన్ జరగకుండా సహాయపడుతుంది. విటమిన్ సి లోపం వున్న వారిలో జాయింట్ ఇన్ఫ్లమేషన్ మరియు జాయింట్ డ్యామేజ్ ఎక్కువగా ఉంటుంది . అంతే కాదు బొప్పాయిలో యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉండుట వల్ల ఇది జాయింట్ ఇన్ఫ్లమేషన్ మరియు డ్యామేజ్ ను తగ్గిస్తుంది.

 ఆపిల్స్:

ఆపిల్స్:

ఆపిల్స్ లో క్యురిసిటిన్ మరియు యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉండటం వల్ల జాయింట్ పెయిన్ మరియు జాయింట్ డ్యామేజ్ ను దూరం చేస్తుంది. ఆర్థరైటిస్ ను నివారించడంలో ఇది ఒక బెస్ట్ ఫుడ్ . జాయింట్స్ లో కొల్లాజెన్ ఉత్పత్తికి ఆపిల్స్ గ్రేట్ గా సహాయపడుతాయి.

కాలే:

కాలే:

ఎముకలు పెలుసు బారినప్పుడు కీళ్ళనొప్పులు మరియు వాపులు ప్రారంభం అవుతాయి. కాబట్టి, అలాంటి వారు కాలేను తీసుకోవడం ద్వారా ఇందులో ుండే క్యాల్షియం ఎముకల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. ఎముకలు స్ట్రాంగ్ గా ఉండే చూసి డ్యామేజ్ అవ్వకుండా సహాయపడుతుంది. మరియు వీటిలో కాపర్ అధికంగా ఉండటం వల్ల కొల్లాజన్ మరియు లింగ్మెంట్ పెరుగుదలకు సహాయపడుతుంది.

అంతే కాదు ఇందులో ఉండే మెగ్నీషియం జాయంట్ గ్రోత్ మరియు డ్యామేజ్ జాయింట్స్ ను రిపేర్ చేస్తుంది.

 బ్రొకోలి:

బ్రొకోలి:

జాయింట్ పెయిన్ కు శరీరంలోని ఫ్రీరాడికల్స్ కారణం అవుతాయి. ఈ ఫ్రీరాడికల్ వల్ల జాయింట్ పెయిన్ ను నివారించే శక్తి బ్రొకోలీలో ఉంది . ఎందుకంటే బ్రొకోలీలో క్యాల్షియం అధికంగా ఉండే హెల్తీ బోన్స్ కు మరియు జాయింట్స్ కు సహాయపడుతుంది.

బ్లాక్ బీన్స్ :

బ్లాక్ బీన్స్ :

బ్లాక్ బీన్స్ లో మెగ్నీషియం మరియు ఇతర పదార్థాలు ఉండటం వల్ల ఎముకల ఆరోగ్యానికి మరియు కీళ్ళు ఆరోగ్యానికి సహాయపడుతుంది. అలాగే ఆంథోసైనిన్ అనే అంశం కీళ్ళ నొప్పులకు చాలా ముఖ్యమైనది. ఇది శరీరంలోని ఫ్రీరాడికల్స్ ను తొలగిస్తుంది. దాంతో జాయింట్ పెయిన్, డ్యామేజ్ ఇన్ఫ్లమేషన్ ను అరికట్టవచ్చు.

ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్:

ఆలివ్ ఆయిల్: ఇతర నూనెలకన్నా ఖరీదు ఎక్కువే అయినా ఆలివ్ నూనె లో ఎన్నో ఆరోగ్యకరమైన ప్రయోజనాలు ఉన్నాయి. దీనిలో మోనో అన్క్ష్ సాచ్యురేటెడ్ కొవ్వు ఆమ్లాలు అత్యధికము. వెజిటేబుల్ ఆయిల్ ను ఉపయోగించకన్నా ఆలివ్ ఆయిల్ ను ఉపయోగిస్తే ఆరోగ్యానికి అందానికి కూడా మంచిది. ఇందులో లోక్యాలరీస్ తక్కువ ఫ్యాట్ కలిగి ఉంటుంది. అందువల్లే కొలెస్ట్రాల్ ఆరోగ్యకరంగా ఉండేదుకు ఉపయోగపడుతుంది. కీళ్ళను గట్టిపరుస్తుంది. ఆలివ్ ఆయిల్ జాయింట్ పేయిన్స్ ను తగ్గించడమే కాకుండా బరువును కూడా తగ్గిస్తుంది.

అల్లం:

అల్లం:

పురాతన కాలం నుండి ఔషధంగా ఉపయోగిస్తున్న వంటింటి వస్తువు అల్ం. ఇది జాయింట్ పెయిన్ మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. అల్లంలో ఉండే జింజరోల్ జాయింట్ పెయిన్ మరియు ఇన్ఫ్లమేషన్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. ప్రతి రోజూ అల్లం టీ తయారు చేసుకొని త్రాగడం కొంత వరకూ ఉపశమనం కలుగుతుంది.

గ్రీన్ టీ:

గ్రీన్ టీ:

ఇది జాయింట్స్ డ్యామేజ్ కు కారణమచయ్యే కార్టిలైజ్ ను నివారిస్తుంది మరియు ఇది ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది . గ్రీన్ టీ రెగ్యులర్ తీసుకోవడం వల్ల ఇందులో ఉండే యాంటీఆక్సిడెంట్స్ ప్రీరాడికల్స్ ను తొలగించి జాయింట్ పెయిన్ మరియు జాయింట్ ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో సహాయపడుతుంది.

ఆరెంజ్ జ్యూస్:

ఆరెంజ్ జ్యూస్:

ఆరెంజ్ జ్యూస్ లో విటమిన్ సి అధికంగా ఉంటుంది. సి విటమిన్ కీళ్ళ నొప్పులను పోగుట్టుటలో చాలా బాగా పనిచేస్తుంది. ఆరంజ్ లో ఫైబర్ శాతం ఎక్కువ కాబట్టి జ్యూస్ లా కాకుండా తొనలతో తినడమే మంచిది.ఆరంజ్ లో ఫైబర్ శాతం ఎక్కువ కాబట్టి జ్యూస్ లా కాకుండా తొనలతో తినడమే మంచిది. ప్రతి రోజూ 200 ఎం.ఎల్ ఆరెంజ్ జ్యూస్ తాగడం ద్వారా 60ఎంజీ విటమిన్ సి లభిస్తుందని పరిశోధనలో తేలింది.

బెర్రీస్:

బెర్రీస్:

ఈ పళ్లలోని పీచు పదార్ధాలు, వర్ణకాలు, రక్త కణాలపైన, మెదడుపైనా ప్రీరాడికల్స్‌ ప్రభావం చూపి చురుకుగా పనిచేసేట్లు చేస్తుంది. పైగా బెర్రీలె క్రమం తప్పకుండా తినటం వల్ల చర్మంలో నిగారింపు జరిగి, మీలో యవ్వనత్వాన్ని పెంచి, వయసు తక్కువ ఉండేలా చూస్తుంది. బ్లూ బెర్రీస్‌, బ్లాక్‌ బెర్రీస్‌ మనకు లభించే ఫలాల్లో ఇదోక రకమైన ఫలం ఇందులో అధిక శాతం శక్తివంతమైన ఆంటిఆక్సైడ్స్‌ లభిస్తాయి. ఇందులో శరీరానికి అవసరమయ్యే విటమిన్‌ సి లభిస్తుంది. శరీరంలో రక్త వృద్ధిని పెంచుతుంది. ఖనిజలవణాలు, బెర్రీస్‌ వల్ల శరీరంలో సోడియం శాతాన్ని తగ్గించి శరీరాన్ని కాపాడుతుంది. అంతేగాక వయసు దాచి ఉంచేలా శరీరాన్ని తేజోవంతంగా చేస్తుంది. శరీరంలో తేమ శాతాన్ని పెంచి ముఖవర్చస్సును కలిగిస్తాయి.

క్యారెట్స్

క్యారెట్స్

మోకాళ్ళలో నొప్పులను నివారించడానికి క్యారెట్స్ చైనీస్ ట్రెడిషనల్ మెడిసిన్. క్యారెట్ లో లిగ్నెంట్స్ మరియు కీళ్ళనొప్పల నుండి ఉపశమనం కలిగిస్తుంది. జాయింట్ పెయిన్స్ నివారించడానికి ఉడికించిన లేదా పచ్చి క్యారెట్స్ ను తీసుకోవచ్చు. ఇది ఒక బెస్ట్ హోం రెమడీ . ఇది మోకాళ్ళ నొప్పులను నివారిస్తుంది . ఈ యాంటీసెప్టిక్ , యాంటీఇన్ల్ఫమేటరి పసుపు పాలు ఎముకల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

వెల్లుల్లి

వెల్లుల్లి

జాయింట్ పెయిన్ నివారించడంలో ఇది ఒక గ్రేట్ నేచురల్ రెమెడీ . మీరు జాయింట్ పెయిన్ తో బాధపడుతున్నట్లైతే, వెల్లుల్లి బాగా సహాయపడుతుంది. వెల్లుల్లో సెలీనియం మరియు సల్ఫర్ మరియు ఇతర న్యూట్రీషియన్స్ కూడా ఉంటాయి. కాబట్టి, ప్రతి రోజూ ఉదయం వెల్లల్లి రెబ్బలు ఒకటి రెండు తీసుకోవాలి. ఈ హోం రెమెడీని కొన్ని రోజుల పాటు అనుసరిస్తుండాలి.

 పసుపు మిక్స్ చేసిన పాలు

పసుపు మిక్స్ చేసిన పాలు

ఇది ఒక బెస్ట్ హోం రెమడీ . ఇది మోకాళ్ళ నొప్పులను నివారిస్తుంది . ఈ యాంటీసెప్టిక్ , యాంటీఇన్ల్ఫమేటరి పసుపు పాలు ఎముకల ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది.

English summary

Top Foods For Healthy Joints in Telugu

Top Foods For Healthy Joints in Telugu. How to keep joints healthy? You must go for simple exercises and lifestyle change to keep your joints healthy. Apart from this there are some best foods to eat for healthy joints. These foods will prevent joint damage all over your body.
Story first published: Monday, June 8, 2015, 18:19 [IST]
Desktop Bottom Promotion