Latest Updates
-
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం! -
వాతావరణ మార్పులతో షుగర్ లెవెల్స్‌లో హెచ్చుతగ్గులు.. కారణాలేంటి.. ఎలా కంట్రోల్ చేయాలి.? నిపుణుల సలహాలు.! -
శరీరానికి హైడ్రేషన్ అందించే గోండ్ కటీరా డ్రింక్..ఈజీగా ఇంట్లోనే చేసుకోండిలా.. -
కూరలు లేకపోయినా ఈ ఒక్క మిర్చి ఫ్రై ఉంటే చాలు.. కంచం మొత్తం ఖాళీ చేసేస్తారు.! -
సాంబార్ అమృతంలా కుదరాలంటే.. ఇంట్లోనే ఈ స్పెషల్ సాంబార్ పొడి చేసుకోండి! -
కస్టమర్లకు అలర్ట్.. ఈ నెలలో వరుసగా ఐదు రోజులు బ్యాంకులు బంద్.! -
ఈ రాశుల వారికి రెండో పెళ్లి యోగం..మీది ఉందేమో చూసుకోండి!
బెండీ ఇష్టం లేదా?..ఒక్క సారి మెడిసినల్ వాల్యూస్ తెలుసుకోండి...!
ఓక్రా దీనికి మరో పేరు లేడీస్ ఫింగర్. ఇండియాలో దీన్ని ‘బెండి లేదా బెండకాయ' అని పిలుస్తుంటారు . బెండకాయ అత్యధిక న్యూట్రీషియన్స్ ఉన్నటువంటి, హెల్తీ వెజిటేరియన్ ఫుడ్.
బెండకాయలో ఫొల్లెట్, విటమిన్ సి, మరియు కె , ఇంకా ఫైబర్ పుష్కలంగా ఉంటుంది . ఇవి డైజెస్టివ్ సిస్టమ్ ను మరింత సులభం చేస్తుంది. ముఖ్యంగా ప్రెగ్నెంట్ మహిళలకు ఆరోగ్యకరమైనది. గర్భిణీ స్త్రీలు వీటిని తినాలనుకుంటా ఒక సారి డాక్టర్ సలహా తీసుకోండి.
బెండకాయలను ఉడికించి, గ్రేవీ, కర్రీ, ఫ్రై రూపంలో తీసుకోవచ్చు. ఇంకా పచ్చిగా కూడా తినవచ్చు. ముఖ్యంగా ఇది లోక్యాలరీ వెజిటేబుల్ ఫ్యాట్ ఉండదు. అందుకే రెగ్యులర్ డైట్ లో వీటికి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. కొంత మంది లాక్సేటివ్ ఉన్న ఆహారాలుగా భావిస్తుంటారు. కాబట్టి బెండకాయ డయాబెటిస్, కోలన్ క్యాన్సర్, శ్వాససంబంధిత సమస్యలను నివారిస్తుంది. చర్మ సమస్యలను నయం చేస్తుంది. జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది . కంటి చూపును మెరుగుపరుస్తుంది మరియు మలబద్దకాన్ని అరికడుతుంది.

1. వ్యాధినిరోధకత పెంచుతుంది:
బెండకాయలో విటమిన్ సి మరియు యాంటీఆక్సిడెంట్స్ అధికంగా ఉంటాయి. మ్యాంగనీస్, మెగ్నీషియం, ఐరన్ మరియు క్యాల్షియం మరియు మినిరల్స్ అధికంగా ఉంటాయి. కాబట్టి బెండకాయను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఈ పోషకాలన్నీ మన శరీరానికి అందుతాయి.

2. కొలెస్ట్రాల్:
బెండకాయలో ఉండే పెక్టిన్ అనే సోలబుల్ ఫైబర్ బ్యాడ్ కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది . కాబట్టి, తప్పని సరిగా మీ రెగ్యులర్ మీల్స్ లో బెండీని చేర్చుకోవడం మంచిది.

3. ప్రోటీన్:
ప్రోటీనులు అత్యధిక స్థాయిలో లేకపోయినా, మన శరీరానికి అవసరం అయ్యేంత ప్రోటీనులు బెండకాయ నుండి పొందవచ్చు. బెండకాయ వల్ల ఇది ఒక న్యూట్రీషినల్ బెనిఫిట్ .

4. కోలన్ క్యాన్సర్:
బెండకాయలో ఉండే ఫైబర్ కంటెంట్ వల్ల ప్రేగులను శుభ్రపరుస్తాయి. కోలన్ క్యాన్సర్ రిస్క్ నుండి రక్షింపబడుతాయి..

5. ఆస్త్మా:
ఆస్త్మాతో బాధపడేవారుకి బెండకాయలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ మరియు యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు బాగా సహాయపడుతాయి. శ్వాససంబంధిత సమస్యల నుండి ఉపశమనం కలిగిస్తాయి.

6. చర్మ సంరక్షణకు:
బెండకాయలో ఉండే విటమిన్ సి మరియు ఫైబర్ కంటెంట్ బాడీ మరియు స్కిన్ డిటాక్సిఫికేషన్ కు సహాయపడుతాయి. చర్మంలో నయం చేసే గుణాలు అధికంగా కనిపిస్తాయి . మొటిమలు మరియు మచ్చలను నివారిస్తాయి.

7. మలబద్దకాన్ని నివారిస్తుంది:
బెండీలో ఉండే ఫైబర్ మలబద్దక లక్షణాలను నివారిస్తుంది . బెండకాయలను రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల ప్రేగులకు ఉపశమనం కలిగిస్తుంది.

8. అలసట తగ్గిస్తుంది :
అలట మరియు వీక్ నెస్ నుండి త్వరగా ఉపశమనం కలిగేలా చేస్తుంది. బెండకాయలో ఉండే పోషకాంశాలు అందుకు గ్రేట్ గా సహాయపడుతాయి.

9. డయాబెటిస్:
డయాబెటిస్ వారికి బెండకాయ మంచిది?డయాబెటిస్ రోగుల్లో బ్లడ్ షుగర్ లెవల్స్ ను క్రమబద్దం చేయడానికి గ్రేట్ గా సహాయపడుతుంది. కాబట్టి డయాబెటిక్ పేషంట్స్ వారి రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవచ్చు.

10. బోన్ హెల్త్:
బెండకాయలో ఉండే విటమిన్ కె ఉండటం వల్ల బోన్ హెల్త్ కు బాగా సహాయపడుతుంది ఇది ఓస్టిరియోఫోసిస్ ను నివారిస్తుంది.

11. జెనిటిల్ సమస్యలను నివారిస్తుంది:
గనేరియా మరియు సిప్లిస్ వంటి సమస్యలను నివారించడంలో బెండకాయ ఔషధంలా పనిచేస్తుంది.



Click it and Unblock the Notifications
