Latest Updates
-
ఫ్యాట్ తగ్గించి కండరాల బలాన్ని పెంచే పూర్వీకుల నాటి గంజి చారు.. పది నిమిషాల్లో అమృతం రెడీ.! -
బ్రహ్మ దేవుడికి కేవలం ఒక్క గుడి మాత్రమే ఎందుకుంది? బ్రహ్మను ఎవరూ పూజించరెందుకు? -
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది? -
నిద్రలో గుండెపోటు రాకుండా ఉండాలంటే డిన్నర్లో ఏం తినాలో తెలుసా.?
స్ప్రింగ్ ఆనియన్స్ లోని అమేజింగ్ హెల్త్ బెనిఫిట్స్
ఉల్లికాడలు చాలా ప్రసిద్ది చెందిన కూరగాయ, ఇవి తెలుపు, పసుపు, ఎరుపుల వంటి వివిధ రకాలలో వస్తున్నాయి.ఉల్లికాడల ఖరీదు తక్కువే. ఉల్లిపాయల్ని కొనలేక, తినలేక బాధపడుతున్నాం అనుకునే వాళ్లకి తక్కువ ఘాటుతో, మంచి రుచితో ఉండే ఉల్లికాడలు సరైన ప్రత్యామ్నాయం. పోషకాల పరంగా చూసినా ఇవెంతో ఉపయోగపడతాయి.
ఈ లేత ఉల్లిగడ్డలు గొప్ప రుచిని, పోషకాలను కూడా పుష్కలంగా కలిగి ఉంటాయి. చాలాకాలంగా ఉల్లికాడలు చైనీస్ సాంప్రదాయ మందులలో వాడడం జరిగింది. ఉల్లిపాయ వలె ఉల్లికాడలలో కూడా సల్ఫర్ ఎక్కువగా ఉంటుంది. ఎక్కువమోతాదులో ఉన్న సల్ఫర్ అనేక ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఈ లేత ఉల్లిగడ్డలలో కాలరీలు తక్కువగా ఉంటాయి. స్కలియన్ లో ఒకరకమైన ఈ ఉల్లికాడలను ఆకుపచ్చని ఉల్లిపాయలు అనికూడా అంటారు.
ఉల్లికాడలలో విటమిన్ C, విటమిన్ B2, థయామిన్ లు సమృద్ధిగా ఉంటాయి. అది విటమిన్ A, విటమిన్ K ని కూడా కలిగి ఉంటుంది. అంతేకాకుండా, ఇవి కాపర్, ఫాస్పరస్, మెగ్నీషియం, పొటాషియం, క్రోమియం, మాంగనీసు, ఫైబర్ కు మంచి మూలం. ఉల్లికాడలు క్వేర్సేటిన్ వంటి ఫ్లవోనాయిడ్స్ కి గట్టి ఆధారం.

హార్ట్ కు చాలా మేలు చేస్తుంది:
స్ప్రింగ్ ఆనియన్స్ లో ఉండే యాంటీఆక్సిడెంట్స్. డిఎన్ఎ డ్యామేజ్ ను నివారిస్తుంది . ఫ్రీరాడికల్స్ ను నివారిస్తుంది . బ్లడ్ ప్రెజర్ లెవల్స్ తగ్గిస్తుంది . విటమిన్ సి బ్లడ్ ప్రెజర్ లెవల్స్ తగ్గిచడం ల్ల హార్ట్ డిసీజ్ తగ్గించుకోవచ్చు.

శ్వాససంబంధిత సమస్యలను నివారిస్తుంది:
కోల్డ్ మరియు కఫ్ నివారించడంలో ఇది గ్రేట్ గా సహాయపడుతుంది . ఇది కోల్డ్ మరియు ఫ్లూను తగ్గిస్తుంది .

షుగర్ లెవల్స్ కంట్రోల్ చేస్తుంది:
ఉల్లికాడలలో ఉన్న క్రోమియం కంటెంట్ మధుమేహ ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తుంది. ఇది బ్లడ్ షుగర్ స్థాయిలను నియంత్రిస్తుంది, గ్లూకోస్ శక్తిని పెంచుతుంది. అల్లిల్ ప్రోపిల్ డిసల్ఫయిడ్ తగ్గిన బ్లడ్ షుగర్ స్థాయిలలో చాలా సహాయకారిగా కూడా ఉంటుంది.

బోన్ హెల్త్ :
ఉల్లికాడలలో క్వర్సేటిన్ బాధనివారక, యాంటి హిస్టమైన్ ప్రయోజనాలను అందిస్తుంది. ఇది కీళ్ళనొప్పులు, ఉబ్బస చికిత్సకు మంచి కూరగాయ.

కళ్ళు:
ఉల్లికాడలు కళ్ళ జబ్బులకు, కాళ్ళ సమస్యలకు మంచివి.

క్యాన్సర్ రిస్క్ తగ్గిస్తుంది:
సల్ఫర్ అధికంగా ఉండే ఆహారాలు ఎక్కువగా తీసుకోవడం వల్ల కోలన్ క్యాన్సర్ ను తగ్గించుకోవచ్చు . ఉల్లికాడల్లో ఉండే ఫ్లెవనాయిడ్ క్యాన్సర్ రిస్క్ ను తగ్గిస్తాయి.

ఇన్ఫెక్షన్స్ ను తగ్గిస్తుంది:
ఇందులో ఉండే యాంటీ ఫంగల్ లక్షణాలు ఫంగల్ గ్రోత్ ను ఇన్ఫెక్షన్స్ ను తగ్గిస్తుంది . ఇన్ఫ్లమేషన్ వల్ల బాడీలో టిష్యులు డ్యామేజ్ అవ్వకుండా కాపాడుతుంది.



Click it and Unblock the Notifications
