అంజూరలో అద్భుత ఆరోగ్య ప్రయోజనాలు..!

అంజూర ఒక సెన్షేషనల్ ఫ్రూట్. దీన్ని ఇండియాలో ఎక్కువగా తింటుంటారు. అంజూరను ఇంగ్లీష్ లో ఫిగ్ అని పిలుస్తారు. తెలుగులో అత్తిపండ్లు అని పిలుస్తారు.
అత్తి పండు అడుగు భాగం వెడల్పుగా,చదునుగా, పై భాగం సన్నగా గంట ఆకారంలో ఉంటాయి. పండు పండినప్పుడు పై భాగం "గ్రీవము" వంటి ఏర్పాటుతో వంగి ఉంటుంది. అంజీర్ పండ్లు గోధుమ,ఊదా, పసుపు లేదా నలుపు,ఆకుపచ్చ వంటి రంగులతోను మరియు పరిమాణంలో విభిన్నంగా ఉంటాయి. చర్మం కొద్దిగా ముడతలు పడినట్లు మరియు తోలు వలె ఉంటుంది. వాటిని ఎక్కువగా నిల్వ కోసం ఎండిన దశలోనే ఉంచుతారు. ఎందుకంటే తాజా పండ్లు తొందరగా పాడవటానికి ఆస్కారం ఉన్నది. ప్రకృతి సహజంగా అత్తి పండ్లలో ఆరోగ్యానికి కావలసిన పోషకాలు,యాంటీ ఆక్సిడెంట్లు విటమిన్లు మరియు ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి. ఎండిన అత్తి పండ్లలో ఖనిజాలు మరియు విటమిన్లుకు ఖజాన వవంటింది. అందుకే దీన్ని ఎక్కువగా మిల్క్ షేక్స్ మరియు లస్సీలలో ఎక్కువగా ఉపయోగిస్తుంటారు.

అనేక ప్రాంతాల్లో ఇప్పటికీ దీన్ని ఔషధ ఫలంగా వాడతారు. ఇందులో రోగనిరోధకశక్తిని పెంచే గుణాలు ఎన్నో ఉన్నాయి. ఏ వ్యాధితో బాధపడుతున్న వాళ్లయినా అత్తి పండును డ్రైఫ్రూట్ గానీ, ఫ్రెష్ ఫ్రూట్ గానీ తీసుకుంటే త్వరగా కోలుకుంటారు. శరీరానికి అవసరమైన శక్తిని వేగంగా అందిస్తుంది. అయితే వీటిని ఎక్సెస్ గా తింటే మాత్రం మోషన్స్, దంతక్షయానికి గురిచేస్తుంది. అంజూరను మితంగా తీసుకుంటే మాత్రం అద్భుతమైన ప్రయోజనాలు అధికంగా ఉన్నాయి.

అంజూరలో క్లోరిన్, పొటాషియం, సోడియం, మ్యాంగనీస్, ఫాస్పరస్, ఐరన్, క్యాల్షియం, విటమిన్ బి12, విటమిన్ బి1 మరియు విటమిన్ ఎ' లు ఎక్కువగా ఉన్నాయి. మరి ఇటువంటి అద్భుతమైన పండులో ఉన్న అద్భుతమైన ప్రయోజనాల గురించి తెలుసుకుందాం...

జీర్ణక్రియ:

జీర్ణక్రియ:

అత్తి పండ్లలో ఉండే ఫైబర్ పదార్దాలు క్యాన్సర్ ను తగ్గిస్తాయని నమ్మకం. ఆ విధంగా అనేక రకాల కాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. ముఖ్యంగా పెద్దప్రేగు కాన్సర్ నివారించడంలో అత్తి పండ్లు బాగా సహాయపడతాయి. ఇర్రెటెబల్ బౌల్ సిండ్రోమ్ నివారిస్తుంది.

హైబ్లడ్ ప్రెజర్:

హైబ్లడ్ ప్రెజర్:

శరీరంలో పొటాషియం మరియు సోడియం లెవల్స్ ను హెల్తీగా మెయింటైన్ చేయడానికి గ్రేట్ గా సహాయపడుతుంది. దాంతో హైబ్లడ్ ప్రెజర్ రిస్క్ ను తగ్గించుకోవచ్చు.

క్యాన్సర్:

క్యాన్సర్:

అత్తి పండ్లలో ఉండే ఫైబర్ కంటెంట్ రొమ్ము క్యాన్సర్ కు వ్యతిరేకంగా పోరాడుతుంది. క్యాన్సర్ కు కారణమయ్యే టాక్సిన్స్ ను శరీరం నుండి బయటకు నెట్టేస్తుంది.

అనీమియా:

అనీమియా:

అంజూర పండ్లు రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల, శరీరానికి ఐరన్ సప్లై అవుతుంది. దాంతో బాడీలో హీమోగ్లోబిన్ లెవల్స్ పెరుగుతాయి. రక్తహీనత సమస్య ఉండదు.

బరువు తగ్గిస్తుంది :

బరువు తగ్గిస్తుంది :

అంజూరలో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. కాబట్టి, బరువు తగ్గించుకోవడంలో సమర్థవంతమైన ఆహారంగా తీసుకోవచ్చు. అంజూర తినడం వల్ల పొట్ట నిండిని అనుభూతి కలిగిస్తుంది. ఓవర్ వెయిట్ పెరగకుండా నివారిస్తుంది.

గుండె సంబంధిత వ్యాధులు:

గుండె సంబంధిత వ్యాధులు:

అత్తి పండ్లలో ఫినాల్ మరియు ఒమేగా -6 కొవ్వు ఆమ్లాలు సమృద్ధిగా ఉంటాయి. అంజూరలో ఉండే పెక్టిన్ టాక్సిన్స్ ను బాడీ నుండి బయటకు పంపిస్తుంది . ఇంకా శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ ను హెల్తీగా మెయింటైన్ చేస్తుంది.

లైంగిక సమస్యలను నివారిస్తుంది:

లైంగిక సమస్యలను నివారిస్తుంది:

అంజూరలో మెగ్నీషియం, జింక్ మరియు మెగ్నీషియం వంటి అనేక న్యూట్రీషియన్ విలువలు, క్యాల్షియం సెక్స్ సామర్థ్యంను మరియు ఫెర్టిలిటి పెంచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

బోన్ హెల్త్ :

బోన్ హెల్త్ :

అంజూరలో ఉండే క్యాల్షియం కంటెంట్ బోన్ హెల్త్ కు సహాయపడుతుంది. ఎముకలను బలోపేతం చేస్తుంది.

Story first published: Tuesday, September 6, 2016, 10:30 [IST]
Desktop Bottom Promotion