For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఆవు నెయ్యితో అమోఘమైన ఆరోగ్య ప్రయోజనాలు

By Swathi
|

హిందువులకు గోమాత ఎంతో పవిత్రమైనది. ఆవును పూజించడం ఆనవాయితి. అలాగే గోవు నుంచి లభించే ప్రతి ఒక్కటి అపురూపమే. గోమూత్రం నుంచి గోవు పాల వరకు అన్నింటిని ఉపయోగిస్తారు. అందుకే పూర్వం ఎక్కువగా ఆవు పాలు, పెరుగు, నెయ్యినే ఎక్కువగా ఉపయోగించేవాళ్లు.

ఆరోగ్యానికే కాదు...అందానికి కూడా నెయ్యి దివ్వ ఔషధమే...

ఆవు నెయ్యి అంటేనే రుచికరం. ఇది చాలా రుచిగానేకాదు, అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంటుంది. ఆవు నెయ్యి అన్నింటి కంటే చాలా ఆరోగ్యకరమైనది. ఇందులో అనేక పోషకాలు, యాంటీ ఆక్సిడెంట్స్, యాంటీ వైరల్ ఏజెంట్స్, యాంటీ ఫంగల్ గుణాలు, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు, ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఎక్కువగా ఉంటాయి.

Health Benefits Of Cow Ghee

పిల్లల ఎదుగుదలకు విలువలైన పౌష్టికాహారం..నెయ్యి..!

అయితే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయని ఆవు నెయ్యిని ఎక్కువ పరిమాణంలో తీసుకోకూడదు. తక్కువ పరిమాణంలో తీసుకుంటేనే మంచిది. లేదంటే బరువు పెరగడానికి కారణమవుతుంది. అలాగే.. దీనికి అడిక్ట్ అయితే.. ఆవు నెయ్యి ద్వారా పొందే ప్రయోజనాలను కూడా కోల్పోవాల్సి వస్తుంది. కాబట్టి క్వాంటిటీ విషయంలో చాలా జాగ్రత్త వహించాలి. ఇప్పుడు ఆవు నెయ్యి ద్వారా పొందే అమోఘమైన ప్రయోజనాలు చూద్దాం..

జీర్ణక్రియ

జీర్ణక్రియ

ఆవు నెయ్యి తీసుకోవడం వల్ల జీర్ణక్రియ పెరుగుతుంది. గేదె నెయ్యికి బదులు ఆవు నెయ్యిని రెగ్యులర్ గా తీసుకుంటూ ఉంటే.. డైజెషన్ ప్రాబ్లమ్స్ దూరమవుతాయి. అయితే తక్కువ పరిమాణంలో తీసుకోవడం మర్చిపోకండి.

విటమిన్స్

విటమిన్స్

ఆవు నెయ్యిలో అనేక విటమినులు పుష్కలంగా ఉంటాయి. విటమిన్ ఎ, డి, ఇ మరియు కె వంటి విటమిన్స్ లభిస్తాయి. కాబట్టి భోజనంలో కొంత నెయ్యిని జోడిస్తే.. రోజుకు అవసరమయ్యే విటమిన్లు శరీరానికి అందుతాయి.

క్యాన్సర్

క్యాన్సర్

ఆవు నెయ్యిలో క్యాన్సర్ తో పోరాడే శక్తి ఉందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. శరీరంలో క్యాన్సర్ సెల్స్ వృద్ధిని ఆవునెయ్యి అరికడుతుందట.

ఇమ్యూనిటీ

ఇమ్యూనిటీ

ఆవునెయ్యిని రెగ్యులర్ గా తక్కువ మోతాదులో ఉపయోగించడం వల్ల వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది. ఒక టీ స్పూన్ నెయ్యిని రోటీపై రాసుకుని తీసుకుంటే ఆకలిని అదుపులో ఉంచడమే కాకుండా.. ఇమ్యునిటీని పెంచుతుంది.

Most Read : విటమిన్ డీ లోపిస్తే అవన్నీ వీక్ అయిపోతాయి.. ఇలా చేస్తే సరి

గుండె ఆరోగ్యానికి

గుండె ఆరోగ్యానికి

నెయ్యిలో యాంటీ ఆక్సిడెంట్స్, లినోలిక్ యాసిడ్స్ గుండె ఆరోగ్యంగా ఉండడానికి సహాయపడతాయి.

స్పెర్మ్ కౌంట్

స్పెర్మ్ కౌంట్

ఆవు నెయ్యి తీసుకోవడం వల్ల మగవాళ్లలో స్పెర్మ్ కౌంట్ పెరగడమే కాకుండా.. లైంగిక సామర్థ్యాన్ని పెంచుతుందని అధ్యయనాలు వెల్లడిస్తున్నాయి.

చర్మానికి

చర్మానికి

ఆవు నెయ్యిని రెగ్యులర్ డైట్ లో చేర్చుకుంటే.. చర్మ సౌందర్యం పెరుగుతుంది. అలాగే కంటి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది. అయితే తక్కువ పరిమాణంలోనే తీసుకోవాలి.

కొలెస్ట్రాల్

కొలెస్ట్రాల్

నెయ్యిలోని మరో ఆశ్చర్యకరమైన హెల్త్ బెనిఫిట్ శరీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తుంది. శరీరంలోని జీవక్రియలు సక్రమంగా పనిచేయడానికి సహాయపడే లిపిడ్స్ ను కంట్రిబ్యూట్ చేస్తుంది. దీంతో కొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గుతాయి.

మలబద్ధకం

మలబద్ధకం

రాత్రి పడుకునే ముందు ఒక గ్లాసు పాలల్లో కొంచెం ఆవు నెయ్యి మిక్స్ చేసుకుని తీసుకోవడం వల్ల జీర్ణక్రియ సజావుగా సాగుతుంది. అలాగే మలబద్ధకంతో బాధపడేవాళ్లకు ఇది చక్కటి పరిష్కారం.

తెలివి

తెలివి

మన పూర్వీకులు ఆవు నెయ్యినే ఉపయోగించేవాళ్లు. అయితే ఆవు నెయ్యి తీసుకోవడం వల్ల మెమరీ పవర్, తెలివి తేటలు పెరుగుతాయని వాళ్లు నమ్మేవాళ్లు.

థైరాయిడ్

థైరాయిడ్

థైరాయిడ్ సమస్య ఉన్నవాళ్లు రెగ్యులర్ గా ఆవునెయ్యి తీసుకుంటూ ఉంటే.. ఉపశమనం ఉంటుంది.

స్త్రీలకు

స్త్రీలకు

కొంతమంది అమ్మాయిలకు బ్రెస్ట్ సైజ్ సన్నగా ఉంటుంది. అలాంటి వాళ్లు ఆవు పాలు, ఆవు పెరుగు తీసుకుంటూ ఉంటే.. బ్రెస్ట్ సైజ్ పెరుగుతుందని స్టడీస్ చెబుతున్నాయి.

Most Read : ప్రసవం తర్వాత ఆడవారు స్లిమ్ గా మారాలంటే ఈ చిట్కాలు పాటిస్తే సరి, లావు కావడానికి కారణం అదే

భారత దేశపు దేశీ నెయ్యిలోని పోషక విలువలు :

భారత దేశపు దేశీ నెయ్యిలోని పోషక విలువలు :

100 గ్రాముల నెయ్యి 926 కిలో కాలరీల శక్తిని కలిగి

ఉంటుంది.

అంతేకాకుండా.,

• పూర్తిగా 100 గ్రాముల నెయ్యి లిపిడ్ (కొవ్వు) గా

ఉంటుంది.

• 1429 IU విటమిన్ A

• 64.290 గ్రాముల సంతృప్త కొవ్వులు

• 214 మిల్లీ గ్రాముల కొలెస్ట్రాల్ కలిగి ఉంటుంది.

నెయ్యిలో దాగున్న ఆరోగ్య ప్రయోజనాల జాబితా :

శక్తిని అందిస్తుంది

శక్తిని అందిస్తుంది

దేశీ నెయ్య ఒక మంచి శక్తి వనరుగా, మరియు మీడియం మరియు షార్ట్ చైన్ కొవ్వు ఆమ్లాలను కలిగి ఉంటుంది. ఈ కొవ్వు ఆమ్లాలు అత్యంత తేలికగా సమ్మిళితం కాబడి, కాలేయంలో విలీనం చేయబడి, జీవక్రియలలో శక్తిగా ఉపయోగపడుతుంది. వ్యాయామ శాలకు వెళ్ళే ముందు, ఒక టేబుల్ స్పూను నెయ్యిని తీసుకోవడం ద్వారా, మీ జిమ్ సెషన్లో ఎక్కడా శక్తి క్షీణతకు గురవడం జరగదని చెప్పడమైనది.

గుండెకు మంచిది

గుండెకు మంచిది

పరిమిత మోతాదులో నెయ్యిని తీసుకోవడం మూలంగా మీ గుండెలో ఆరోగ్యకరమైన HDL కొలెస్ట్రాల్ పెరుగుతుంది మరియు ధమనులలో కొవ్వు నిక్షేపాలు చేరడం కూడా తక్కువగా ఉంటుందని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. గుండెవ్యాదులను తగ్గించడంలో కీలకంగా ఉపయోగపడే, APOA అనే HDL ప్రోటీన్ నెయ్యిలో ఉంటుందని ఒక అధ్యయనంలో తేలింది కూడా.

Most Read : ఛాతీ, తొడలు, పొట్టపై ఏర్పడే చారలు, ప్రెగ్నెన్సీ స్ట్రెచ్ మార్క్స్ తొలగించుకునేందుకు చిట్కాలు

బరువు తగ్గడంలో సహాయం చేస్తుంది

బరువు తగ్గడంలో సహాయం చేస్తుంది

బరువు కోల్పోవడంలో నెయ్యి సహాయపడుతుంది అంటే మీకు వింతగా అనిపించవచ్చు. కానీ ఇక్కడ ఒక వాస్తవం ఉంది. కొవ్వులలో తక్కువగా ఉన్నందువలన, వెన్న కంటే నెయ్యిని తీసుకోవడమే మంచిదని ఆరోగ్యనిపుణులు సూచిస్తుంటారు. అవును, నెయ్యిలో కొవ్వు పెరగడాన్ని తగ్గిస్తూ, బరువు తగ్గడాన్ని వేగవంతం చేసే ఒక ఆరోగ్యకరమైన లినోలెయిక్ యాసిడ్ (CLA) ఉనికి కారణంగా, నెయ్యి కొలెస్ట్రాల్ స్థాయిలను తగ్గించి, క్రమంగా లిపిడ్లను పెంచడం ద్వారా జీవక్రియలను ప్రోత్సహించగలుగుతుందని కొన్ని అధ్యయనాలు తేల్చాయి. మీరు ఒత్తిడిలో ఉన్నప్పుడు, కాలేయం అదనపు కొలెస్ట్రాల్ను ఉత్పత్తి చేస్తుంది. కానీ, నెయ్యి మీ శరీరానికి ఒత్తిడిని తగ్గిస్తుంది.

జీర్ణక్రియలో సహాయపడుతుంది

జీర్ణక్రియలో సహాయపడుతుంది

నెయ్యిలో బ్యూట్రిక్ యాసిడ్ అనే ఒక షార్ట్ చైన్ కొవ్వు ఆమ్లం ఉంటుంది, అది సరైన జీర్ణ ఆరోగ్యాన్ని నిర్వహించడానికి బాధ్యత వహిస్తుంది. ఇది మంటను తగ్గించడం, పెద్దప్రేగులోని కణాలకు శక్తిని అందించడం, గట్ అవరోధ ఫంక్షన్లకు మద్దతునివ్వడం ద్వారా పనిచేస్తుంది, మరియు ఇది కడుపులోని ఆమ్ల స్రావాలను స్టిమ్యులేట్ చేసి, క్రమంగా సరైన జీర్ణక్రియకు తోడ్పాటుని అందిస్తుంది. అంతేకాకుండా ఈ ఆమ్లం మలబద్ధక సమస్యల నుండి కూడా ఉపశమనాన్ని ఇవ్వగలదు.

ఎముకల బలానికి

ఎముకల బలానికి

మీ భోజనంలో తరచుగా అప్పుడప్పుడు వేసుకునే నెయ్యి కూడా మీ శరీరానికి విటమిన్ కె అవసరాలను తీర్చగలవు. మీ ఎముకలు మరియు పళ్ళను ఆరోగ్యంగా మరియు బలంగా ఉంచడంలో విటమిన్ K ఎంతగానో సహాయపడుతుంది. ఎముకలలోని కాల్షియంను నిర్వహించడానికి అవసరమైన ప్రోటీన్ నిల్వల (ఆస్టియోకాల్సిన్) పరిమాణం పెరగడంలో కీలకపాత్రను పోషిస్తుంది.

రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది

రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది

ఈ ప్రపంచంలోని ఎటువంటి వ్యక్తులైనా జలుబు, ముక్కుదిబ్బడ, తలనొప్పి మరియు అరుచి వంటి సమస్యలను ఎదుర్కొనడానికి సిద్దంగా ఉండరు. ఆయుర్వేదం ప్రకారం, నెయ్యి వాడకం, ముక్కుకు ఉపశమనం కలిగించగలదని చెప్పడం జరిగింది. నెయ్యిలోని బ్యూటిరిక్ ఆమ్లం ఉనికి మిమ్ములను అంతర్గతంగా వెచ్చగా ఉంచడంలో సహాయపడుతుంది. తద్వారా టి-సెల్ ఉత్పత్తిని ప్రేరేపించడం మరియు జెర్మ్స్ వ్యతిరేక పోరాటానికి ఎంతగానో సహాయపడుతుంది.

కంటి ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది

కంటి ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది

నెయ్యి లేదా కాచిన వెన్న విటమిన్ ఎ వంటి మంచి అనామ్లజనకాలను అధిక మొత్తాలలో కలిగి ఉంటుంది. ఇది కంటి ఆరోగ్యాన్ని కాపాడడంలో ముఖ్యపాత్రను పోషిస్తుంది. ఈ యాంటీఆక్సిడెంట్ మాక్యులర్ కణాలపై దాడి చేసే స్వేచ్ఛారాశులను( ఫ్రీ రాడికల్స్) తొలగించడానికి మరియు తటస్థీకరించడానికి సహాయపడుతుంది. అంతేకాకుండా కంటిలోని మచ్చల పెరుగుదలను, మరియు క్యాటరాక్టుల అభివృద్ధిని నిరోధిస్తుంది.

Most Read : స్నానానికి ముందు ఆలివ్ ఆయిల్‌ తో మసాజ్ చేసుకుంటే ఎన్ని ప్రయోజనాలో తెలుసా

దీర్ఘకాలిక వ్యాధులను నిరోధిస్తుంది

దీర్ఘకాలిక వ్యాధులను నిరోధిస్తుంది

శరీరంలోని స్వేచ్ఛారాశులను తొలగించడంలో సహాయపడే విటమిన్ ఎ నిక్షేపాలను పెద్ద మొత్తాలలో కలిగి ఉన్న కారణాన, నెయ్యి దీర్ఘకాలిక వ్యాధులతో కూడా పోరాడగలదని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. నెయ్యిలోని సంయోజిత లినోలెయిక్ ఆమ్లం, బ్యూట్రిక్ యాసిడ్తో కలిసినప్పుడు తయారయ్యే యాంటీ ఆక్సిడెంట్, శరీరంలోని ఆక్సీకరణల ఒత్తిడిని తగ్గించటానికి సహాయపడే శక్తివంతమైన యాంటీ కాన్సర్ ఏజెంట్ వలె పనిచేస్తుంది. అంతేకాకుండా ఈ రెండు ఆమ్లాలు వివిధ దీర్ఘకాలిక వ్యాధులను నివారించడంలో కూడా సహాయపడతాయని చెప్పబడుతుంది.

శోధ (ఇన్ఫ్లమేషన్ లేదా మంట)ను తగ్గించడంలో

శోధ (ఇన్ఫ్లమేషన్ లేదా మంట)ను తగ్గించడంలో

కొన్నిసందర్భాలలో, ఇన్ఫ్లమేషన్ అనేది కొన్ని ఆరోగ్య పరిస్థితులకు లక్షణంగా ఉంటుంది. కానీ సుదీర్ఘ కాలం కొనసాగితే, దీర్ఘకాలిక వ్యాధుల అభివృద్ధికి సైతం దారితీయగలదు. ఒక అధ్యయనం ప్రకారం, నెయ్యిని తరచుగా తీసుకోవడం మూలంగా ఇన్ఫ్లమేషన్ సమస్యను నిరోధిస్తుందని తేలింది. ఆర్థరైటిస్, అల్జీమర్స్, డయాబెటిస్, ఇన్ఫ్లమేటరీ ప్రేగు వ్యాధి, మొదలైన శోథ సంబంధిత సమస్యలకు విరుగుడుగా నెయ్యి పనిచేస్తుంది.

స్మోకింగ్ పాయింట్ కూడా ఎక్కువే

స్మోకింగ్ పాయింట్ కూడా ఎక్కువే

స్మోకింగ్ పాయింట్ అన్నా బాయిలింగ్ పాయింట్ అన్నా ఒకటే. నూనె మండి, ఆవిరిగా మారే సమయాన్ని స్మోకింగ్ పాయింట్ వలె వ్యవహరించడం జరుగుతుంది. మామూలుగా, నూనెల స్మోకింగ్ పాయింట్ దాటనిచ్చి వేడిచేసినప్పుడు, వీటిలోని ముఖ్యమైన ఫైటోన్యూట్రియంట్స్ విచ్ఛిన్నం కాబడి, శరీరంలో అధిక ఆక్సీకరణ స్థాయిలకు దారితీసి, హానికరమైన ఫ్రీ రాడికల్స్ పెరగడానికి దారితీస్తుంది. అయితే, ఇది నెయ్యి విషయంలో జరగదు ఎందుకంటే నెయ్యి, 485 డిగ్రీల ఫారెన్హీట్ దగ్గరగా స్మోకింగ్ పాయింట్ను కలిగి ఉంటుంది. క్రమంగా నెయ్యిని బేకింగ్, సౌటింగ్ మరియు వేపుడు సంబంధిత ఆహారాలకు సైతం ఉపయోగించవచ్చు.

చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది

చర్మ ఆరోగ్యాన్ని ప్రోత్సహిస్తుంది

అనాదిగా, నెయ్యిని వివిధ సౌందర్య సంరక్షణా పద్దతులలో విస్తృతంగా ఉపయోగించడం జరుగుతూ ఉంది. నెయ్యి మీ చర్మ ఆరోగ్యానికి అద్భుతాలను చేయవచ్చు. దీనిలోని కొవ్వు ఆమ్లాలకు కృతజ్ఞతలు చెప్పుకోవాల్సిందే, ఇవి పోషకాహార ఏజెంట్ వలె పనిచేస్తాయి. దీనిలోని కొవ్వు ఆమ్లాలు చర్మంలో తేమ స్థాయిలను పెంచి, హైడ్రేట్ చేయడంలో సహాయపడుతుంది. దేశీ నెయ్యి వినియోగం, మృదువైన మరియు ఆరోగ్యకరమైన చర్మ సాధనకు ఉత్తమంగా దోహదపడుతుంది. అంతేకాకుండా అకాల వృద్దాప్యఛాయలు తలెత్తకుండా అడ్డుకుంటుంది.

జుట్టు సమస్యలను పరిష్కరిస్తుంది

జుట్టు సమస్యలను పరిష్కరిస్తుంది

నెయ్యి మీ జుట్టు సంరక్షణకు సహాయం చేసే పదార్ధాలలో ఉత్తమమైన ఎంపికగా ఉంటుంది. దీనిలోని ఎసెన్షియల్ కొవ్వు ఆమ్లాలు, విటమిన్ ఎ స్కాల్ప్ మీద ప్రభావాన్ని చూపి, చుండ్రు, దురద మరియు పొడి జుట్టును నివారించడంలో సహాయం చేస్తుంది. అంతేకాకుండా జుట్టుకు సహజ సిద్దమైన మాయిశ్చరైజర్ వలె పనిచేస్తుంది. అలాగే, నెయ్యితో మీ జుట్టును 15 నుండి 20 నిముషాల పాటు మసాజ్ చేయడం ద్వారా రక్త ప్రసరణ పెరిగి, జుట్టు ఒత్తుగా మారడంలో సహాయపడగలదు.

చిన్న పిల్లలకు ఎంతో మంచిది

చిన్న పిల్లలకు ఎంతో మంచిది

చిన్నపిల్లలకు నెయ్యి మంచిదా ? ఈ ప్రశ్న, అనేకమంది తల్లులు తరచుగా ఎదుర్కొనే సమస్యగా ఉంటుంది. దీనికి సంబంధించి అనేక అపోహలు, నమ్మకాలు కూడా మనుగడలో ఉన్నాయి. కానీ వాస్తవానికి, పరిమిత మోతాదులో పిల్లలకు నెయ్యిని అందించడం ద్వారా వారి పోషణలో కీలకపాత్రను పోషిస్తుందని అనేక అధ్యయనాలు తేల్చాయి. ఏదైనా పరిమితంగా తీసుకుంటే అమృతమే, కాదని మీరినప్పుడే అది ప్రతికూల ప్రభావాలను చూపుతాయి. కొన్ని సందర్భాలలో పిల్లలు తల్లి పాల మీద ఆధారపడడం జరగదు. దీనికి అనేక కారణాలు ఉన్నాయి. ముఖ్యంగా, తల్లి పిల్లల ఆరోగ్య పరిస్థితి.

క్రమంగా వారు బరువును కోల్పోవడం జరుగుతుంటుంది. ఇటువంటి పిల్లలకు ఆహారంలో తరచుగా నెయ్యిని అందించడం ద్వారా, అది వారి ఆరోగ్యకర బరువు పెరుగుదలలో తోడ్పాటును అందిస్తుందని కొన్ని అధ్యయనాలు చూపాయి. ఒకవేళ రోజువారీ ఆహారంలో నెయ్యిని చేర్చాలని భావిస్తే, ఒక టీస్పూన్ నెయ్యిని మించకుండా పిల్లలకు అందించేలా చూసుకోండి. ఈ విషయంలో మీ అనుమానాల నివృత్తి కోసం మీ వైద్యుని సంప్రదించడం మంచిది. అంతేకాకుండా, నెయ్యితో మర్దన చేయడం ద్వారా, పిల్లల చర్మం మృదువుగా, ఆరోగ్యవంతంగా తయారవుతుంది, మరియు వారి ఎముకలు కూడా బలంగా తయారవుతాయి.

ఒకరోజులో ఎంతవరకు నెయ్యిని తీసుకోవచ్చు ?

ఒకరోజులో ఎంతవరకు నెయ్యిని తీసుకోవచ్చు ?

ఉత్తమ ప్రయోజనాలను పొందేందుకు రోజులో 1 టేబుల్ స్పూన్ నెయ్యిని తీసుకోవడం మంచిదిగా సూచించబడుతుంది. కానీ, మీ ఆరోగ్య స్థాయిలను దృష్టిలో ఉంచుకుని, వైద్యుని సిఫార్సు మేరకు నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమమని గుర్తుంచుకోండి. నెయ్యి పూర్తి స్థాయిలోని కొవ్వు పదార్ధం, కావున దీనిని పెద్ద మొత్తాలలో తీసుకోకూడదని గుర్తుంచుకోండి. ఒక పద్దతి ప్రకారం తక్కువ స్థాయిలోనే నెయ్యిని తీసుకోవడం ఉత్తమం.

నెయ్యిని తీసుకోవడానికి ఆరోగ్యకరమైన మార్గాలు ఏమిటి ?

• బేకింగ్ కోసం కొబ్బరి నూనె లేదా ఆలివ్ నూనె బదులుగా నెయ్యిని ఉపయోగించండి.

వేయించే ఏ ఇతర వంటలలోనైనా నూనెకు బదులుగా నెయ్యిని ఉపయోగించండి.

• అన్నం ఉడికించడంలో కొందరు బట్టర్ వినియోగిస్తుంటారు. ఇందులో బట్టర్ (వెన్న) కు బదులుగా నెయ్యిని వినియోగించడం మంచిది.

• ఏది ఏమైనా బట్టర్ మరియు నెయ్యి వినియోగం మాత్రం అదుపులోనే ఉండాలని గుర్తుంచుకోండి. సాధారణ వినియోగం గుండెకు మేలు చేస్తే, అతి వినియోగం గుండెకు హాని చేస్తుందని గుర్తుంచుకోండి. క్రమంగా ఇదివరకే మీరు గుండె, మూత్రపిండ, కాలేయ మరియు రక్తపోటు సంబంధిత సమస్యలతో బాధపడుతున్నట్లయితే, వీలైనంత వరకు నెయ్యిని తగ్గించడమే ఉత్తమమని గుర్తుంచుకోండి.

• పసి పిల్లల విషయంలో కూడా, ప్రతి రోజూ కాకపోయినా పెద్దలు అప్పుడప్పుడు నెయ్యిని కలిపిన పొడి అన్నాన్ని తినిపించడం చూస్తూ ఉంటాం. ఈ పద్దతి పిల్లలలో ఆరోగ్యకరమైన ప్రోటీన్ నిల్వల పెరుగుదలకు, ఎముక బలానికి తోడ్పాటుని అందిస్తుందని చెప్తుంటారు.

ఈ వ్యాసం మీకు నచ్చినట్లయితే మీ ప్రియమైన వారితో పంచుకోండి. ఇటువంటి అనేక ఆసక్తికర ఆరోగ్య, జీవనశైలి, ఆహార, లైంగిక, వ్యాయామ, ఆద్యాత్మిక, జ్యోతిష్య, హస్త సాముద్రిక, తదితర సంబంధిత విషయాల కోసం బోల్డ్స్కై పేజీని తరచూ సందర్శించండి. ఈ వ్యాసంపై మీ అభిప్రాయాలను, వ్యాఖ్యలను క్రింద వ్యాఖ్యల విభాగంలో తెలియజేయండి.

English summary

Health Benefits Of Cow Ghee

Health Benefits Of Cow Ghee
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more