Latest Updates
-
అమ్మాయిలూ అలర్ట్.. నెలసరిలో తీవ్రంగా కడుపు నొప్పి, అలసట.. ఈ ఐదు తప్పులే కారణం.! -
సజ్జ రొట్టె చేయడం ఇంత ఈజీనా.. ఈ 3 టిప్స్‌తో చపాతీ కంటే సాఫ్ట్‌గా చేసేయొచ్చు.! -
చికెన్ లెగ్ పీస్‌లతో స్పైసీ కుష్కా.. ఇలా చేశారంటే లొట్టలేసుకుంటూ తినాల్సిందే.! -
ఆఫీస్ బ్యాగ్‌తో ఈ పొరపాట్లు.. మీ జేబును ఖాళీ చేస్తాయంటే నమ్ముతారా.? -
బిర్యానీ రుచిని తలదన్నే కొబ్బరి పాల మటన్ పులావ్.. సండే స్పెషల్ అదిరిపోవాల్సిందే.! -
మూత్రంలో మంటతో పాటు విపరీతమైన జ్వరం.. నిర్లక్ష్యం చేస్తే ఈ పార్ట్‌కి ముప్పు తప్పదు.! -
'పోషకాల నిధి' పొట్టు మినప్పప్పు ఆవిరి కుడుములు.. ఒక్కటి తిన్నా రోజంతా ఎనర్జీ.! -
విపరీత రాజయోగం: అక్టోబర్ 31 వరకు ఈ రాశుల వారిపై గురు కటాక్షంతో ఎనలేని కీర్తి, సంపద.! -
వీకెండ్ స్పెషల్: విలేజ్ స్టైల్ చేపల పకోడీ.. ఇలా చేశారంటే కరకరలాడుతూ భలే రుచిగా.! -
వర్షాకాలంలో ఫేషియల్ చేయించుకోవచ్చా.. బ్యూటీ పార్లర్‌కి వెళ్లే ముందు ఇది గుర్తుంచుకోండి.!
థైరాయిడ్ గ్రంధి ఆరోగ్యానికి తీసుకోవాల్సిన 4 పోషకాహారాలు
ప్రపంచంలో మిలియన్ల మంది థైరాయిడ్ సమస్యతో బాధపడుతున్నారన్నది విదితమే.థైరాయిడ్ గ్రంధి సరిగ్గా పనిచేయడం ఆవశ్యకం. ఈ గ్రంధి జీవక్రియలని నియంత్రించి హార్మోన్లని ఉత్పతి చేస్తుంది.మెడ యొక్క ముందు భాగంలో ఉండే థైరాయిడ్ గ్రంధులు రక్తంలోకి థైరాయిడ్ హార్మోను విడుదలలో సహాయపడుతాయి.మనిషి సంపూర్ణ ఆరోగ్యంతో ఉండాలంటే ఈ గ్రంధి పని తీరు చాలా కీలకం.
కానీ స్తభ్దమైన జీవన శైలి,పోషాకాహారం తీసుకోకపోవడం వంటి కారణాల వల్ల థైరాయిడ్ గ్రంధుల పనితీరు ప్రభావితం చేయబడి తీవ్ర అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి.

చాలా కేసుల్లో ఇది హైపో లేదా హైపర్ థైరాయిడ్ సమస్యగా ఉంటుంది.ఈ మధ్య ఈ గ్రంధి కి సంబంధించిన సమస్యలు బాగా ప్రబలుతున్నాయి.అందువల్లే మీ థైరాయిడ్ గ్రంధి పనితీరు మెరుగుపరచుకోవడానికి మీ అ అహారంలో చేర్చుకోవాల్సిన పదార్ధాలని ఈ ఆర్టికిల్ ద్వారా మీకు తెలియచేస్తున్నాము.
ఇవి పోషకాలు, విటమిన్లతో నిండి థైరాయిడ్ గ్రంధి పని తీరుని మెరుగుపరచి అనారోగ్యాలు దరి చేరకుండా కాపాడతాయి. ఇక ఆ పదార్ధాలేమిటో చూద్దామా మరి.

1.కొబ్బరి నూనె:
థైరాయిడ్ గ్రంధి పని తీరుకి కీలకనైన ఫ్యాటీ యాసిడ్లు ఈ నూనెలో పుష్కలం.ఈ నూనె ద్వారా రోగ నిరోధక శక్తి మరింత బలపడి జీవక్రియలు కూడా మెరుగవుతాయి.

2.గ్రుడ్లు:
సంపూర్ణ ఆరోగ్యానికి అవసరమయ్యే అనేక కీలక పోషకాలు గ్రుడ్డు ద్వారాందుతాయి.కానీ గ్రుడ్డు ద్వారా థైరాయిడ్ గ్రంధి పని తీరుని మెరుగుపరిచే విటమిన్ల్లు తదితర పోషకాలు కూడా అందుతాయని చాలా మందికి తెలీదు.

3.బీన్స్:
బీన్స్‌లో జింక్,ప్రోటీన్లు తదితర పోషకాలుంటాయి. వీటి వల్ల థైరాయీడ్ గ్రంధి పని తీరు సరిగ్గా ఉంటుంది.వీటిని మీ ఆహారంలో చేర్చుకుని మీ థైరాయిడ్ గ్రంధి పని తీరుని మెరుగుపరచుకోండి.

4.అన్ రిఫైన్‌డ్ సాల్ట్ లేదా శుద్ధి చేయని ఉప్పు:
మీరు రోజూ వాడే ఉప్పుకి బదులుగా శుద్ధి చేయని ఉప్పుని వాడటం మొదలుపెట్టండి, దీనిలో అనేక పోషకాలుంటాయు. అందులో మీ థైరాయీడ్ గ్రంధి పని తీరుని మెరుగుపరిచేది కూడా ఒకటి. ఇందులో ఉండే అయోడిన్ థైరాయిడ్ పని తీరుకి కీలకం.అంతే కాదు అడ్రినల్ గ్రంధి పని తీరుకి కూడా అయోడిన్ కీలకం.
సూచన: మీకు కనుక ఏదైనా అనారోగ్య సంస్య ఉంటే మీ ఆహారంలో మార్పులు చేసుకునే ముందు డాక్టరుని సంప్రదించండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications