Latest Updates
-
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్‌లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్‌కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి! -
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది! -
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.?
లివర్, కిడ్నీ సమస్యలకు అమేజింగ్ ఫ్రూట్ : గోజిబెర్రీస్..!
మనలో చాలా మందికి గోజిబెర్రీస్ అంటే ఏమిటో తెలియదు. కానీ గోజిబెర్రీస్ లోని హెల్త్ బెనిఫిట్స్ తెలుసుకున్న తర్వాత వీటిని మీరు నిర్లక్ష్యం చేయరు. ఈ పండ్లు చూడటానికి రెడ్ కలర్లో ఉంటాయి . ముఖ్యంగా ఈ ఫ్రూట్స్ హిమాలయా ప్రదేశాల్లో ఎక్కువగా కనుగొన్నారు. అయితే వీటని ఎగుమితి చేసి ఇతర రాష్ట్రాల్లో కూడా అమ్ముతున్నారు. డ్రైడ్ గోజిబెర్రీస్ కూడా అందుబాటులో ఉన్నాయి. గోజిబెర్రీస్ లో మెడిసినల్ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి
కొన్ని ప్రదేశాల్లో , కిడ్నీ, లివర్ మరియు కంటి సమస్యల నివారణకు గోజిబెర్రీస్ ను విరివిగా ఉపయోగిస్తున్నారు. ఈ గోజిబెర్రీ ఫ్రూట్స్ ఫ్రెష్ గా మరియు డ్రైడ్ ఫ్రూట్స్ రూపంలో మనకు అందుబాటులో ఉన్నాయి. ఇతర బెర్రీ ఫ్రూట్స్ తో పోల్చితే ఈ గోజిబెర్రీ ఫ్రూట్స్ లో విటమిన్స్ మరియు యాంటీఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉన్నాయి. అందుచేతనే ఇవి ఆరోగ్యానికి చాలా మంచిది . వీటిని రోజుకు కనీసం రెండు తినమని సలహాలిస్తుంటారు. ఈ గోజిబెర్రీ మొక్కలను ఇంటివద్దే పెంచుకోవచ్చు. కంటైనర్లో గార్డనింగ్ పద్దతిలో కూడా పెంచుకోవచ్చు.
గోజిబెర్రీస్ లోని ఆరోగ్య ప్రయోజనాలు ఈ క్రింది విధంగా ...

అసౌకర్యం అనిపించదు:
గోజిబెర్రీస్ తినడం వల్ల శరీర ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది ఆరోగ్యానికి హాని కలిగించదు. ఇవి శరీరాన్ని అన్ని సమయాల్లో రిలాక్స్ చేస్తుంది.

కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది:
శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ ను కంట్రోల్ చేయడంలో ఈ ఫ్రూట్స్ గ్రేట్ గా సహాయపడుతాయి. గోజిబెర్రీ ఫ్రూట్ వల్ల ఇది ఒక గ్రేట్ హెల్త్ బెనిఫిట్..

బ్లడ్ ప్రెజర్ తగ్గిస్తుంది:
గోజిబెర్రీ ఫ్రూట్స్ ను రెగ్యులర్ గా తినడం వల్ల బ్లడ్ ప్రెజర్ తగ్గుతుందని చాలా మంది విశ్వసిస్తారు. కాబట్టి, హైబిపితో బాధపడే వారు డాక్టర్స్ ను సంప్రదించి తీసుకోవాలి.

బ్లడ్ షుగర్ లెవల్స్ :
గోజిబెర్రీ ఫ్రూట్ లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంటాయి. బ్లడ్ షుగర్ లెవల్స్ కంట్రోల్ చేయడంలోఇది గ్రేట్ గా సహాయపడుతుంది. . డయాబెటిస్ తో బాధపడే వారు షుగర్ క్రష్ కు భయపడాల్సిన అవసరం లేదు.

న్యూట్రీషియన్స్:
గోజిబెర్రీ ఫ్రూట్ లో విటమిన్ సి మరియు ఇతర ఫైబర్ కంటెంట్ అధికంగా ఉంటుంది. చాలా తక్కువ క్యాలరీలను కలిగి ఉంటుంది. విటమిన్ ఎ కంటెంట్ మరియు మినిరల్స్ శరీర ఆరోగ్యానికి చాలా మేలు చేస్తాయి . ప్రోటీన్ తో నిండి ఉంటుంది.

ఆర్థరైటిస్ నివారిస్తుంది:
ఆర్థరైటిస్ నివారించడంలో గోజిబెర్రీ బెస్ట్ ఫ్రూట్ , అయితే దీనికి ఎలాంటి మెడికల్ నిర్ధారణలు లేవు, కొన్ని కేసుల్లో ఆర్థరైటిస్ పెయిన్ మరియు సమస్యలను నివారించడంలో గోజిబెర్రీ గ్రేట్ గా సహాయపడిందని అంటున్నారు. గోజిబెర్రీలో ఉండే పవర్ ఫుల్ యాంటీ ఆక్సిడెంట్ నొప్పి మరియు ఇన్ఫ్లమేషన్ తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది.

బరువు తగ్గిస్తుంది:
కొద్దిగా తీసుకుంటే చాలు, ఎనర్జీ లెవల్స్ పెరుగుతాయి. డైట్ లో హెల్తీ స్నాక్స్ తీసుకోవాలనుకుంటే గోజిబెర్రీస్ బెస్ట్ ఆప్షన్. గోజిబెర్రీస్ లో ఉండే రుచి మరియు ఫైబర్ కంటెంట్ పొట్ట నిండుగా , ఎక్కువ సమయం ఆకలి కాకుండా చేస్తుంది.

హెల్తీ లివర్:
లివర్ ఫంక్షన్స్ సరిగా ఉండాలంటే హెల్తీ ఫ్రూట్స్ అండ్ వెజిటేబుల్స్ తీసుకోవడం చాలా అవసరం. వీటితో పాటు గోజిబెర్రీస్ తీసుకోవడం కూడా ముఖ్యం.

కంటి చూపును మెరుగుపరుస్తుంది:
ఇందులో ఉండే విటమిన్ ఎ కంటి చూపు మెరుగుపరచడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఇది ఒక బెస్ట్ ఫ్రూట్స్ . ఎక్కువ ప్రయోజనాలను అందిస్తుంది.

ఆందోళను మరియు స్ట్రెస్ తగ్గిస్తుంది:
గోజిబెర్రీస్ లో ఉండే కాంపౌండక్స్ విశ్రాంతిని కలిగిస్తుంది. ఆందోళన తగ్గిస్తుంది. ఒత్తిడి తగ్గిస్తుంది.



Click it and Unblock the Notifications