రోజులో ఒక్క పూట భోజనం చేయకపోయినా..మీకే నష్టం..

Posted By: Mallikarjuna
Subscribe to Boldsky

పని ఒత్తిడిలో భోజనం చేయడం మానేస్తున్నారా? లేదా బరువు తగ్గడం కోసమని బ్రేక్ ఫాస్ట్, లేదా లంచ్, లేదా డిన్నర్ చేయడం మానేస్తున్నారా? అవును అన్నట్లైతే ఖచ్చితంగా ఈ ఆర్టికల్ మీకోసమే. మీల్స్ ను స్కిప్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ చాలా ఉన్నాయి. వీటిని మీరు అవాయిడ్ చేయాలి. భోజనం చేయకపోవడం వల్ల శరీరానికి మీరు ఊహించని నష్టం జరుగుతుంది.

ఒక రోజులో 3-4 భోజనం చేయడం వల్ల శరీరానికి అవసరమయ్యే న్యూట్రీషియన్స్ అందుతాయి. ఇవి ఆరోగ్యంగా ఉండటానికి సహాయపడుతాయి. ఇంకా జంక్ ఫుడ్స్ జోలికి పోకుండా చేస్తాయి. అయితే భోజనం చేయకపోవడం వల్ల దీనికి వ్యతిరేఖంగా పనిచేస్తాయి. అంతే కాదు మజిల్ టిష్యులను విచ్ఛిన్నం చేస్తాయి. ఖచ్చితంగా బరువు పెరగడానికి , ఇతర సమస్యలకు దారితీస్తుంది.

భోజనం మధ్యలో నీరు త్రాగటం ఆరోగ్యకరమేనా..?

పరిశోధనల ప్రకారం రోజులో ఒక్క పూట బోజనం చేయకపోయినా శరీరంలోని ఎనర్జీ మొత్తం క్రమంగా తగ్గిపోతుంది. ఎలాంటి శరీరక శ్రమ లేదా వ్యాయామం లేకపోవడం వల్ల శరీరంలో తక్కువ క్యాలరీలు బర్న్ అవుతాయి .

side-effects of skipping meals

అంతే కాదు, ముఖ్యంగా ఉదయం బ్రేక్ ఫాస్ట్ తీసుకోకపోవడం వల్ల బ్రెయిన్ కు గ్లూకోజ్ లెవల్స్ సప్లై తగ్గుతుది. దాంతో ఏకాగ్రత తగ్గుతుంది. లో మెమరీ, దేని మీద మనస్సు పెట్టలేరు. అందువల్లే వర్కింగ్ ప్రొఫిషినల్స్, స్టూడెంట్స్ భోజనం చేయకుండా ఉండరు. భోజనం దాటవేయటం వల్ల వారు సరిగా పనిచేయలేరు . మరియు వారి చేసే పనిమీద ఏకాగ్రత పెట్టలేరు.

ఎక్కడికి వెళ్ళినా, పనిచేసే ప్రదేశంలో అయినా, చదువుకునే లైబ్రరీ అయినా, ఎక్కడికెళ్లినా వెంటనే హెల్తీ స్నాక్స్ పట్టుకెళ్లడం మంచిది. హైప్రోటీన్, ఫైబర్ స్నాక్స్ ఆకలి తగ్గిస్తాయి.

ఒక పూట భోజనం మానేయడం వల్ల శరీరంలో ఎలాంటి మార్పులు జరుగుతాయో తెలుసుకుందాం...

కేవలం ఏడు రోజుల్లో 3కేజీలు తగ్గడానికి ఎఫెక్టివ్ డైట్ ప్లాన్..!!

1) డయాబెటిక్ రిస్క్

1) డయాబెటిక్ రిస్క్

మీల్స్ తీసుకోవడం స్కిప్ చేయడం వల్ల లివర్ కణాలు ఇన్సులిన్ మీద ప్రభావం చూపుతుంది. షుగర్ ను విచ్ఛిన్నం చేసే హార్మోన్స్ మీద ప్రభావం చూపుతుంది . అంటే కాలేయం గ్లూకోజ్ ను ఉత్పత్తి చేయకుండా రక్తానికి సంకేతాలను పంపుతుంది. దాంతో రక్తంలో ఎక్సెస్ గ్లూకోజ్ పెరగడం వల్ల టైప్ 2 డయాబెటిస్ కు కారణమవుతుంది.

2) ఫ్రీక్వెంట్ గా మనస్సు మారుతుంది

2) ఫ్రీక్వెంట్ గా మనస్సు మారుతుంది

ఆహారం తీసుకోకపోవడం వల్ల శరీరానికి ఎప్పుడైతే సరైన పోషకాలు అందవో, అప్పుడు భావోద్రేకాలు పెరుగుతాయి. దాంతో శరీరంలో బ్లడ్ షుగర్ లెవల్స్ లో అసమతుల్యతల వల్ల మనస్సు స్థిమితంగా ఉండదు. చీకాకు, మూడీగా ఉండటం వంటి లక్షణాలు కనబడుతాయి. ఫ్రీక్వెంట్ మూడ్ స్విగ్స్ బ్రెయిన్ పనితీరును పాడుచేస్తుంది.

3) జీవక్రియలు సరిగా జరగవు

3) జీవక్రియలు సరిగా జరగవు

ఎప్పుడైతే భోజనం దాటవేస్తారో, అప్పుడు శరీరంలో మెటబాలిక్ రేటు తగ్గుతుంది . శరీరంలో ఎక్స్ ట్రా క్యాలరీలను బర్న్ చేయకుండా, వాటిని అదనంగా శరీరంలో నిల్వచేస్తుంది. . దాంతో లో మెటబాలిజం రేటు వల్ల బరువు పెరుగుతారు. కాబట్టి, ప్రతి రోజూ ఉదయం తప్పనిసరిగా బ్రేక్ ఫాస్ట్ చేయడం మంచిది

4) ఒత్తిడి

4) ఒత్తిడి

భోజనం చేయకపోవడం వల్ల, శరీరంలో శక్తికి సంబంధించిన అడ్రినలిన్ మరియు ఇతర హార్మోన్స్ ఉత్పత్తి కావు. అందువల్ల, ఈ అదనపు ఒత్తిడి కారణంగా, హార్ట్ డిసీజ్, హైబ్లడ్ ప్రెజర్, డయాబెటిస్, డిప్రెషన్, స్ట్రెస్, మరియు ఆందోళనలు పెరుగుతాయి.

5) చెడు శ్వాస

5) చెడు శ్వాస

సమయానికి భోజనం చేయకపోవడం వల్ల నోట్లో లాలాజలం ఉత్పత్తి కాదు, నోరు డ్రైగా మారడం వల్ల బ్యాక్టీరియా పెరుగుతుంది. దాంతో బ్యాడ్ బ్రీత్ పెరుగుతుంది. నోటి దుర్వాసన రాకూడదునుకుంటే భోజనం చేయడం మానకండి.

6) తలనొప్పి మరియు అలసట

6) తలనొప్పి మరియు అలసట

భోజనం చేయడం మానేయడం వల్ల బ్లడ్ షుగర్ లెవల్స్ ను తగ్గిస్తుంది దాంతో ధమనులకు వ్యతిరేఖంగా హార్మోన్స్ ను ఉత్పత్తి చేసి బ్లడ్ ప్రెజర్ ను పెంచుతుంది. ఫలితంగా, తలనొప్పి, అలసట, వికారం పెరుగుతుంది. భోజనం దాటవేయడం వల్ల శరీరానికి తగిన శక్తి లభించదు మరియు స్పృహ కోల్పోవడం జరుగుతుంది

7) బ్లడ్ ప్రెజర్ ఎక్కువతక్కువలేదా అసమతుల్యంగా ఉంటుంది

7) బ్లడ్ ప్రెజర్ ఎక్కువతక్కువలేదా అసమతుల్యంగా ఉంటుంది

మీల్స్ స్కిప్ చేయడం వల్ల గ్లోకోజ్ లెవల్స్ తక్కువగా విడుదలయ్యే హార్మోన్స్ ప్రోత్సహిస్తుంది. ఇది క్రమంగా బ్లడ్ ప్రెజర్ లెవల్స్ ను తగ్గిస్తుంది. భవిష్యత్ లో రక్తం సరఫరా చేసే ధమనుల మీద ప్రభావం చూపుతుంది.

For Quick Alerts
ALLOW NOTIFICATIONS
For Daily Alerts

    English summary

    Why Skipping Meals Is Bad For Health

    Skipping meals can cause several health issues. Know about the problems here on Boldsky.
    We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more