ఈ 10 అద్భుతమైన ఆరోగ్య లాభాలు బీరు వల్ల కలుగుతాయి అని మీకు తెలుసా ?

Written By: R Vishnu Vardhan Reddy
Subscribe to Boldsky

ఇప్పటికే ఎండాకాలం దాదాపు మొదలైపోయింది. ఈ వేడిలో చాలామంది ఒక చల్లటి బీరుని తాగాలని కోరుకుంటారు లేదా ఇప్పటికే ఈ పనిని కొంతమంది చేస్తూ ఉంటారు. బీరు మన శరీరాన్ని సంరక్షించడం లో ఉత్తమంగా పనిచేస్తుంది. ఎందుకంటే ఎండాకాలంలో, శరీరంలో ఉండే వేడిని తగ్గించడంలో ఇది ఎంతగానో సహాయపడుతుంది. చాలా మంది యుక్త వయస్సులో ఉన్న వారు బీరు ని ఎక్కువగా త్రాగుతుంటారు. అంతే కాకుండా అందరి దగ్గర ఇది విపరీతమైన ఆదరణ కూడా పొందింది. టీ మరియు నీరు తర్వాత అత్యంత ప్రజాధరణ పొందిన పానీయాల్లో బీరు స్థానం సంపాదించుకుంది.

ధాన్యపు గింజల ద్వారా బీరు ని తయారు చేయడం జరుగుతుంది. వీటిల్లో ఎన్నో పోషక విలువలు ఉంటాయి. సాధారణంగా ప్రజలు బీరుని త్రాగేటప్పుడు చిరు తిండ్లను తింటూ వుంటారు. బీరు లో అధిక మొత్తంలో ప్రోటీన్లు మరియు విటమిన్ బి లభిస్తుంది. ఇవి వైన్ లో కంటే కూడా బీరు లోనే అధికంగా ఉంటాయి మరియు వైన్ తో సరిసమానంగా యాంటీ ఆక్సిడెంట్లు బీరు లో లభ్యమవుతాయి.

బీర్ లో మెగ్నీషియం, సెలీనియం, పొటాషియం, ఫాస్పరస్ మరియు బియోటిన్ వంటి ఖనిజాలు అధికంగా లభ్యమవుతాయి. ఇవన్నీ జీర్ణ క్రియ ప్రక్రియలో ఎంతో కీలక పాత్ర పోషిస్తాయి మరియు ఎన్నో విధాలుగా ఆరోగ్యాన్ని కాపాడుతాయి.

గమనిక : తగిన మోతాదులో బీరు ను తీసుకోవడం వల్ల మీ యొక్క ఆరోగ్యం ఖచ్చితంగా మెరుగవుతుంది.

కాబట్టి బీరు త్రాగడం వల్ల కలిగే ఆరోగ్య లాభాల గురించి ఇప్పుడు మనం తెలుసుకుందాం.

1.క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది :

1.క్యాన్సర్ రాకుండా నిరోధిస్తుంది :

బీరు లో ఫ్లవనోయిడ్ సమ్మేళనాలు అధికంగా ఉంటాయి. ఇవి కాన్సర్ వ్యాధిని నిరోధించడంలో ముఖ్య పాత్ర పోషిస్తాయి. అంతేకాకుండా ప్రోస్టేట్ కాన్సర్ రాకుండా అరికడతాయి. వీటికితోడు బీరులో పాలిఫెనాల్స్ అధికంగా లభ్యమవుతాయి. ఇవి కూడా క్యాన్సర్ రాకుండా ప్రభావంతంగా పోరాడతాయి.

2. రక్తహీనత రాకుండా నిరోధిస్తుంది :

2. రక్తహీనత రాకుండా నిరోధిస్తుంది :

బీరు లో విటమిన్ బి12 మరియు ఫోలిక్ ఆమ్లం అధికంగా లభ్యమవుతాయి. ఈ విటమిన్ల లోపం వల్లనే రక్త హీనత ఏర్పడుతుంది. విటమిన్ బి12 ఇతర వ్యాధుల పై కూడా ప్రభావంతంగా పోరాడి, వృద్ధి సాధారణంగా ఉండేలా, ఏకాగ్రత మరియు జ్ఞాపక శక్తి బాగా ఉండేలా చేస్తుంది.

3. వయస్సు మీద పడకుండా నిరోధిస్తుంది :

3. వయస్సు మీద పడకుండా నిరోధిస్తుంది :

బీరు వయస్సు మీదపడకుండా ఆలస్యం చేస్తుంది అనే విషయం మీకు తెలుసా ? మీరు విన్నది నిజమే. బీరు సంభోగ శక్తిని పెంచుతుంది మరియు ఇందులో ఉండే విటమిన్ - ఈ ప్రభావంతంగా పనిచేస్తుంది మరియు శరీరంలో యాంటీ ఆక్సిడెంట్లుగా తన బాధ్యతను నిర్వహిస్తుంది. ఆరోగ్యవంతమైన చర్మం మరియు వయస్సు ప్రభావం శరీరం పై నెమ్మదించాలంటే విటమిన్ - ఈ ఎంతగానో ఉపయోగపడుతుంది.

4. మూత్ర పిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది :

4. మూత్ర పిండాల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది :

కొన్ని సందర్భాల్లో మూత్రపిండాల్లో చిన్న చిన్న రాళ్లు ఏర్పడుతుంటాయి. సాధారణంగా నిర్జలీకరణం వల్ల ఇలా జరుగుతూ ఉంటాయి. కాబట్టి మీరు తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, బీరు త్రాగటం వల్ల మూత్ర పిండాల వ్యాధులు తగ్గుముఖం పడతాయి. కానీ, మీరు గుర్తించుకోవాల్సిన అంశం ఏమిటంటే, బీరు ని తగిన మోతాదులో మాత్రమే స్వీకరించాలి.

5. మెదడు యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది :

5. మెదడు యొక్క ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది :

వయస్సు పెరిగే కొద్దీ మెదడు పనిచేసే విధానం నెమ్మదిగా తగ్గుముఖం పడుతుంది. మెదడు అనేది శరీరంలో చాలా ముఖ్యమైన భాగం. ఏకాగ్రత, జ్ఞాపక శక్తి మరియు ఎన్నో రకాల పనులను మెదడు చేస్తుంది. బీరు తీసుకోవడం వల్ల జ్ఞాపక శక్తి తగ్గడం అనే విషయం తగ్గుముఖం పడుతుంది మరియు అల్జిమర్స్ వ్యాధి బారిన పడకుండా బీరు కాపాడుతుంది.

6. ఆరోగ్యవంతమైన గుండె :

6. ఆరోగ్యవంతమైన గుండె :

మీరు గనుక క్రమం తప్పకుండా బీరు ని త్రాగినట్లైతే గుండె సంబంధిత వ్యాధులు వచ్చే ప్రమాదం 30 % తగ్గుతుంది. రక్తం గడ్డకట్టకుండా బీరు అడ్డుకుంటుంది. దీనివల్ల రక్త నాళాలు ఎప్పుడు శుభ్రంగా ఉంటాయి. మీరు గనుక బీరు ని నిర్దిష్టమైన మోతాదులో గనుక తీసుకున్నట్లైతే, మీ రక్త నాళాల్లో రక్తం గడ్డకట్టే అవకాశాలు తక్కువగా ఉంటాయి.

7. మధుమేహం ప్రభావం నుండి రక్షిస్తుంది.

7. మధుమేహం ప్రభావం నుండి రక్షిస్తుంది.

మీరు గనుక బీరు ని నిర్దిష్టమైన మోతాదులో గనుక తీసుకున్నట్లైతే, మధుమేహం వల్ల కలిగే ప్రభావాలను సాధ్యమైన మేర తగ్గిస్తుంది. తగిననంత బీరు తీసుకోవడం వల్ల టైపు 2 మధుమేహం పై అది ప్రభావంతంగా పనిచేసిందని అధ్యయనాలు చెబుతున్నాయి. అంతేకాకుండా ఇది రక్తంలో ఉన్న చక్కెర స్థాయిలను కూడా తగ్గిస్తుంది.

8. రక్తపోటుని తగ్గిస్తుంది :

8. రక్తపోటుని తగ్గిస్తుంది :

చాలా అధ్యయనాలు చెబుతున్న విషయం ఏమిటంటే, వారి యొక్క రక్త ప్రసరణ చాలా సాధారణంగా ఉంటుందట. దీనర్ధం అధిక రక్తపోటు రాకుండా బీరు మన శరీరాన్ని నియంత్రిస్తుంది. మీరు గనుక అధిక రక్తపోటుతో బాధపడుతున్నట్లైతే, రోజుకి ఒకటి నుండి రెండు గ్లాసుల బీరు త్రాగడం వల్ల మీ యొక్క రక్తపోటు అదుపులో ఉంటుంది.

9. గుండె పోటు రాకుండా అరికడుతుంది :

9. గుండె పోటు రాకుండా అరికడుతుంది :

రక్తం గడ్డ కట్టకుండా నిరోధించడంలో బీరు ఎంతగానో ఉపయోగపడుతుంది. అందుచేత తక్కువ మోతాదులో బీరుని త్రాగటం మంచిదే అని పరిశోధకులు చెబుతున్నారు. ఇలా చేయడం వల్ల గుండెలో మరియు శరీరంలోని వివిధ భాగాల్లో రక్తం గడ్డ కట్టడాన్ని బీరు దాదాపుగా నిరోదిస్తుందట.

10. ఎముకలను శక్తివంతంగా తయారుచేస్తుంది :

10. ఎముకలను శక్తివంతంగా తయారుచేస్తుంది :

బీరులో సిలికాన్ పదార్ధం అధికంగా లభ్యమవుతుంది. ఇది ఎముకలను దృఢంగా ఉంచడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది. కావున బీరుని నిర్దిష్టమైన మోతాదులో తీసుకోవడం మంచిదే అని చెబుతున్నారు. సిలికాన్, ఎముకల యొక్క కణాలను వృద్ధి చెందేలా చేయడంలో ఎంతగానో ఉపయోగపడుతుంది మరియు కణాలను ఆ విధంగా ప్రేరేపిస్తుంది మరియు ఈస్ట్రోజెనిక్ ప్రభావం వల్ల ఆరోగ్యవంతమైన ఎముకలు తయారవడం లో బీరు ఎంతగానో సహాయపడుతుంది.

English summary

10 Amazing Health Benefits Of Beer

Beer has high amounts of protein and vitamin B content than wine and the antioxidant content is equal to wine. Beer contains minerals like selenium, potassium, phosphorous, etc. The health benefits of beer include preventing cancer, anaemia, ageing, boosting the brain and kidney health, etc.
Story first published: Thursday, March 8, 2018, 10:18 [IST]