For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

నోటి దుర్వాసన పోగొట్టే 12 సాధారణ గృహ నివారణ చిట్కాలను ఇక్కడ చూడండి

నోటి దుర్వాసన పోగొట్టే 12 సాధారణ గృహ నివారణ చిట్కాలను ఇక్కడ చూడండి

|

మనలో చాలా మంది నోటి దుర్వాసన సమస్యతో బాధపడుతుంటారు. నోటి దుర్వాసన వస్తుంటే మనం నలుగురితో కలవడానికి ఇబ్బంది పడడమే కాదు ఇతరులు కూడా మనతో మాట్లాడకుండా దూరంగా ఉంటారు. ఇటువంటి సమస్య చాలా మందిని వెంటాడుతుంది. నోటి దుర్వాసనకు అనేక కారణాలు ఉన్నాయి. సర్వసాధారణంగా మనం తీసుకునే అనారోగ్యకరమైన ఆహారం, వైద్య పరిస్థితితులు, జీర్ణశయాంతర వ్యాధులు, ధూమపానం మరియు మద్యపానం వల్ల నోరు పొడిబారడంతో నోటి దుర్వాసనకు ఇవన్నీ ప్రధాన కారణాలు.

12 Home Remedies For Bad Breath

బ్యాక్టీరియా దంతాలు మరియు నాలుక క్రింద పేరుకుపోతాయి. దీనివల్ల నోటి వాసన వస్తుంది. నోటి ఆరోగ్యాన్ని కాపాడుకుంటే దుర్వాసనను నివారించవచ్చు. నోటి వాసన రాకుండా ఉండటానికి ఇక్కడ కొన్నిహోం రెమెడీస్ ఉన్నాయి. ఇవి నోటి దుర్వాసనను తగ్గిస్తాయి.

1. జీలకర్ర

1. జీలకర్ర

నోరు వాసన రాకుండా జీలకర్ర ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. ఇది యాంటీబ్యాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉంది. ఇది బ్యాక్టీరియాతో పోరాడుతుది. భోజనం తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర తీసుకోవడం వల్ల వాసన తగ్గుతుంది. మీరు ఒక కప్పు జీలకర్ర టీ కూడా తాగవచ్చు.

2. మెంతులు

2. మెంతులు

నోటి వాసన నుండి ఉపశమనం పొందడంలో మెంతి గింజలు చాలా ప్రభావవంతంగా పనిచేస్తాయి. నోటి వాసన నుండి ఉపశమనం పొందడానికి మెంతి వాటర్ త్రాగాలి. వేడినీటిలో ఒక టేబుల్ స్పూన్ మెంతులు వేసి రాత్రంతా ఉంచండి తర్వాత మరుసటి రోజు ఉదయం ఈ నీరు త్రాగాలి. ఇలా రెగ్యులర్ గా తాగుతుంటే సమస్య పరిష్కరించబడుతుంది.

3. లవంగం

3. లవంగం

లవంగాలు నోటిని తాజాగా ఉంచుతుంది మరియు యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉండటం వల్ల నోటి వాసనలను తగ్గించడంలో ఇది ప్రభావవంతంగా పనిచేస్తుంది. రోజూ వంటలకు లవంగాలను వాడండి. అలాగే లవంగాల టీ తాగండి. ఇంకా లవంగాలను రోజులో అప్పుడప్పుడు ఒకటి రెండు లవంగాలు వేసుకుని నమలడం వల్ల నోటి దుర్వాసన తొలగించుకోవచ్చు.

4. నిమ్మరసం

4. నిమ్మరసం

నిమ్మరసంలోని ఆమ్ల గుణాలు నోట్లో బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధిస్తాయి. ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసాన్ని ఒక గ్లాసు నీటిలో వేసి బాగా మిక్స్ చేసి తాగాలి లేదా నోటిని పుక్కిలించినా మంచి ఫలితం ఉంటుంది.

5. ఆపిల్ సైడర్ వెనిగర్

5. ఆపిల్ సైడర్ వెనిగర్

ఆపిల్ సైడర్ వెనిగర్ నోటి పూతకి మంచి ప్రభావవంతమైన పరిష్కారం. ఇది నోట్లో వాసన కలిగించే బ్యాక్టీరియాతో పోరాడటానికి సహాయపడుతుంది. ఇది నోట్లోని pH సమతుల్యతను కాపాడుకోవడానికి సహాయపడుతుంది. నోటిపూత వచ్చినప్పుడు కొద్దిగా ఆపిల్ సైడర్ వెనిగర్ ను ఒక గ్లాసు నీటిలో వేసి మౌత్ వాష్ చేయడం వల్ల నోటి పూత తగ్గుతుంది అలాగే వాసన పోతుంది.

6. దాల్చినచెక్క

6. దాల్చినచెక్క

దాల్చినచెక్క నోటి దుర్వాసన తగ్గించడంలో గ్రేట్ గా సహాయపడుతుంది. ఎందుకంటే ఇందులో సిన్నమిక్ ఆల్డిహైడ్ ఉంటుంది. నోటిలోని బ్యాక్టీరియాను తగ్గించడానికి ఒక టేబుల్ స్పూన్ దాల్చిన చెక్కను లేదా దాల్చిన చెక్క పౌడర్ ను వేడినీటి వేసి ఈ నోటిని నోటి పరిశుభ్రతకు ఉపయోగించండి.ఈ నీటిని నోట్లో పోసుకుని నోరు పుక్కిలించడం ద్వారా నోటి దుర్వాసన తొలగిపోతుంది.

7. టీ ట్రీ ఆయిల్

7. టీ ట్రీ ఆయిల్

యాంటీఆక్సిడెంట్ లక్షణాలు టీ ట్రీ ఆయిల్‌లో పుష్కలంగా ఉన్నాయి. ఇది నోటిలో క్రిమిసంహారక మందుగా పనిచేస్తుంది. టీ ట్రీ ఆయిల్ కొన్ని చుక్కలను పిప్పరమింట్ ఆయిల్ మరియు నిమ్మ నూనెతో కలపాలి. ఈ మిశ్రమాన్ని మౌత్ వాష్ గా వాడండి.

8. చూయింగ్ గమ్

8. చూయింగ్ గమ్

షుగర్ లెస్ చూయింగ్ గమ్ నమలడం ద్వారా నోటి దుర్వాసన నివారించుకోవచ్చు. నోటిలో ప్రవహించే లాలాజలం వల్ల నోరు శుభ్రం అవుతుంది. పిప్పరమెంటు ఉన్న చూయింగ్ గమ్ వాడండి.

9. కొత్తిమీర

9. కొత్తిమీర

నోటి పూతకు మంచి హోం రెమెడీ. అలాగే నోటి దుర్వాసనను కూడా ఇది నివారిస్తుంది. ఇందులో క్లోరోఫిల్ యాంటీ బాక్టీరియల్ ఏజెంట్‌గా పనిచేస్తుంది మరియు నోటి వాసనను నివారించడానికి సహాయపడుతుంది. తాజా కొత్తిమీరను తీసుకుని నోట్లో వేసి నలమడం లేదా కొత్తి మీర రసం తాగడం మంచిది.

10. సాల్ట్ వాటర్

10. సాల్ట్ వాటర్

గోరువెచ్చని నీళ్ళలో కొద్దిగా ఉప్పు వేసి నోట్లో పోసుకుని పుక్కలించి నోరు శుభ్రపరుచుకోవాలి. ఇది నోటి pH సమతుల్యతను తటస్థీకరిస్తుంది మరియు శుభ్రపరుస్తుంది. ఇది యాంటీ బాక్టీరియల్ లక్షణాలను కలిగి ఉండటం వల్ల బాగా పనిచేస్తుంది. సాల్ట్ వాటర్ తో రోజూ ఉదయం గార్గిలింగ్ చేయాలి.

11. పసుపు

11. పసుపు

నోటి వాసనతో బాధపడేవారు ఒక గ్లాసు నీటిలో కొద్దిగా పసుపు వేసి పుక్కిలించడం ద్వారా నోటి దుర్వాసనను తొలగించుకోవచ్చు.

12. సోంపు

12. సోంపు

యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలున్న సోంపు నోటిలోని బ్యాక్టీరియాతో పోరాడుతాయి. నోటిలో కొద్దిగా సోంపు విత్తనాలు వేసుకుని బాగా నమలాలి. ఇది లాలాజలమును ఉత్పత్తి చేస్తుంది మరియు నోటి వాసనను తగ్గిస్తుంది.

English summary

12 Home Remedies For Bad Breath

How often do you come across a person whose mouth smells bad? Or do people refrain from talking to you because of your bad breath? This surely causes an embarrassment among many people. To let you know, bad breath is also known as halitosis and it can be due to a number of reasons such as eating odourous foods, medical conditions, gum disease, smoking and dry mouth. So, here's what you need to do to prevent bad breath. Have a look at the best home remedies for bad breath, here.
Story first published:Friday, October 4, 2019, 12:10 [IST]
Desktop Bottom Promotion