Latest Updates
-
కాలిగోళ్లు నల్లగా, పసుపు రంగులో ఎందుకు మారతాయో తెలుసా?..క్యాన్సర్ సంకేతం కూడా కావచ్చు! -
డైట్ పట్టింపులనూ పక్కనపెట్టేస్తారు.. రాత్రి మిగిలిపోయిన అన్నంతో హెల్తీ గ్రీన్ ఎగ్ రైస్.! -
పుట్టిన తేదీ ప్రకారం పర్సులో వీటిని పెట్టుకుంటే.. లక్ష్మీదేవి మిమ్మల్ని విడిచే ప్రసక్తే లేదు.! -
మిగిలిపోయిన అన్నంతో అద్దిరిపోయే ఆనియన్ రైస్..చిటికెలో చేసుకోండిలా.. -
ఇంట్లో కూరగాయలు లేవా? ఈ టమాటా సాంబార్ ట్రై చేయండి..ఇడ్లీ, దోశ, అన్నంలోకి కేక! -
షుగర్ పేషెంట్లు అన్నం తినొచ్చా?..డాక్టర్ చెప్పిన సీక్రెట్ ఇదే! -
మీ ఫోన్ పదే పదే వేడెక్కుతోందా?..ఈ చిన్న తప్పులు అస్సలు చేయకండి! -
Homemade honey recipe : కేవలం 10 నిమిషాల్లో ఇంట్లోనే స్వచ్ఛమైన తేనె తయారు చేసుకోండిలా! -
జున్ను పాలు లేకుండానే.. అప్పటికప్పుడు ఒరిజినల్ ఫ్యూర్ జున్ను చేసుకోండిలా.. -
Parivartini ekadashi 2026: అరుదైన రాజయోగంతో వృషభ,కర్కాటక,కన్య,మకర,ధనుస్సు రాశులకు మహా అదృష్టం!
పని సరే....వినోదాలు, విహారాల మాటేమిటి?

మనలో చాలామంది తెల్లవారి లేస్తే, దుస్తులు వేసుకోవడం, పనులకు ప్రయాణమవటం, పనిచేసుకోవడం, మరల ఇంటికి వచ్చి ఇంటిపనులు చూసుకోవడం మొదలైన వాటిలో ఎంతో ఒత్తిడికి గురవుతారు. ఆఫీస్ కు లేదా ఇతర కార్యకలాపాలకు చేసే ప్రయాణం ఎంతో ఒత్తిడి కలిగి వుంటుంది. ఆఫీసులో చేసే పని కూడా ఒత్తిడి కలిగి వున్నదే. ఒత్తిడి తగ్గించుకోటానికి కొన్ని చిట్కాలు పాటించకపోతే అది మీ ఆరోగ్యంపై చెడు ప్రభావాన్ని చూపుతుంది.
పనికి వెళ్ళడమనేది సరి అయినదే. కాని అపుడపుడూ మీకు ఆనందం కలిగించే ప్రయాణాలు కూడా చేయాలి. కనీసం ఆరునెలలకొకసారి సెలవు పడేసి వినోద యాత్రలుకు వెళితే ఎంతో హాయిగావుంటుంది. సెలవు పెట్టటానికి కుదరకపోతే కనీసం వారాంతపు సెలవులలోనైనా సరే మీకు దగ్గరలోని నచ్చిన విహార స్ధలానికి వెళ్ళి ఆనందించండి.
ఉద్యోగస్తులైతే, ఆపీసు పనిమీద టూర్లు వెడుతుంటే, మార్పుకై కుటుంబ సభ్యులను కూడా తీసుకు వెళ్ళి కొంత ఆనందించండి. అయితే వెళ్ళిన తర్వాత వారితో కలసి ఆనందించటంకూడా చేయాలి. అవసరమనుకుంటే మీ ట్రిప్ ను వ్యక్తిగతంగా ఒకటి లేదా రెండు రోజులు పొడిగించండి.
చాలామంది రిలాక్సేషన్ అంటూ లిక్కర్లు తాగటానికి అలవాటు పడతారు. అది సరికాదు. ఆరోగ్యానికి రిలాక్సేషన్ కావలసిందే. కాని లిక్కర్ లు తీసుకోవడం వలన మీకు మత్తు కలిగిస్తుంది తప్ప మైండ్ రిలాక్స్ కాలేదు. రోజంతా పనితో గడిపిన తర్వాత హాయిగా రిలాక్సవుతూ ఒక గ్రీన్ చాయ్ తాగండి లేదా మీకు నచ్చిన చక్కటి మ్యూజిక్ వినండి. మీ డైట్ ఛార్ట్ లో లేనప్పటికి మీకు ఇష్టమైన ఆహారాన్ని ఇష్టమైన ప్రదేశాలలో తీసుకొని ఆనందించటానికి సందేహించకండి.
అందరితో సరదాగా గడపండి అయితే ఆ సరదా మిమ్మల్ని మరోమారు భారం చేసేలా చూసుకోండి. అందరితో మంచి సంబంధాలు సరైనదే కాని బంధువులైనా, స్నేహితులైనా వారి వారి పరిధులలో వుండేట్లు దూరం పెట్టండి.
రిలాక్సేషన్ కు యోగా ఆచరించడం ఉత్తమం. జిమ్ కి వెళ్ళాలంటూ ప్లాన్లు వేసి మానేయటం కన్నా ఇంటిలోనే సమయం చూసుకొని యోగా లేదా మీకు నచ్చిన ధ్యానం వంటివి చేసి ఒత్తిడినుండి దూరం అవటం మంచిది. ఇవ్వబడిన ఈ చిట్కాలు చిన్నవైనప్పటికి, పాటిస్తే మంచి ఫలితాలు కనపడి ఒత్తిడి దూరం కాగలదు. మీకుగల ఆరోగ్యం నేరుగా మీ పనిపై కూడా ప్రభావిస్తుందని తెలుసుకోండి.
Disclaimer: ఈ ఆర్టికల్ లో అందించిన సమాచారం సాధారణ సమాచారం,విద్యా ప్రయోజనాల కోసం మాత్రమే. ఇది వృత్తిపరమైన వైద్య సలహా, రోగ నిర్ధారణ లేదా ట్రీట్మెంట్ కు ప్రత్యామ్నాయంగా ఉద్దేశించబడలేదు. వైద్య పరిస్థితికి సంబంధించి మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే మీ డాక్టర్ లేదా సంబంధిత నిపుణుల సలహా తీసుకోండి.



Click it and Unblock the Notifications
