Latest Updates
-
ఫోన్లో రీల్స్ చూస్తూ బిడ్డకు పాలిస్తున్నారా.. అది ఎంత పెద్ద డేంజర్ తెలుసా.! -
ఫస్ట్ లవ్.. మీ క్రష్ మీకు పడిపోవాలంటే ఈ ‘NALA’ ట్రిక్ పాటిస్తే చాలు.! -
వాస్తు శాస్త్రం ప్రకారం ఇంట్లో ఎన్ని అద్దాలు అమర్చాలి, ఏ దిశలో ఉంచాలో తెలుసా.! -
రసం, సాంబార్‌లోకి పర్ఫెక్ట్ సైడ్ డిష్.. మిరియాల ఘాటుతో స్సైసీగా కాలీఫ్లవర్ ఫ్రై -
ఒంగోలు ఫేమస్ పంతులు గారి పులిబొంగరం దోశ..మీ ఇంట్లోనే ఈజీగా చేసుకోండిలా.. -
పాతకాలం నాటి ఉలవచారు..ఫైవ్ స్టార్ హోటల్ లో కూడా ఇది దొరకదు..ఈజీగా ఎలా చేసుకోవాలంటే.. -
ఇలాంటి టేస్ట్ ఎప్పుడూ చేసి ఉండరు.. రొటీన్‌కి భిన్నంగా ఘాటుగా తోటకూర వంకాయ పచ్చడి! -
25 రోజులు ఉడికించిన సొరకాయ తింటే..శరీరంలో ఏం జరుగుతుందో తెలుసా? -
జస్ట్ 10 నిమిషాల్లో ఫైవ్ స్టార్ హోటల్ స్టైల్ మష్రూమ్ ఆనియన్ పకోడీ.. ఈ చిన్న ట్రిక్ పాటిస్తే అదిరిపోతుంది! -
లైక్, కామెంట్, షేర్, ట్రోలింగ్.. యువతపై తీవ్ర ప్రభావం.. దీని నుంచి ఎలా బయటపడాలి.?
ఆరోగ్యంతో పాటు బరువును కూడా తగ్గించే వింటర్ డ్రింక్స్
శీతాకాలంలో ఉష్ణోగ్రతలు తగ్గి వాతావరణం అంత చల్లగా అయిపోవడంవల్ల మన శరీరంలో వచ్చే మార్పువల్ల ప్రధానంగా
దగ్గు, జలుబు, జ్వరం, ఉబ్బసం, గొంతు, చర్మసంబంధిత వ్యాధులతో బాధపడుతుంటారు. ఇలాంటి వ్యాధులు రాకుండా ముందు జాగ్రత్తగా శీతాకాలం వచ్చిందంటే చాలు మనం కోల్డ్ డ్రింక్స్ ను తాగటం మానేస్తాం. మరి ఈ కాలంలో చలిని తట్టుకోవడానికి, చలితో పోరాడటాకి వేడి వేడి టీ, కాఫీ మరియు వెచ్చగా ఉండే ఇతర రకాల బెవరేజెస్, సూపులను ఎక్కువగా ఇష్టపడుతారు. సూప్స్ ను అలా ఉంచితే వాటి స్థానంలో వేడి వేడి టీ చాలా వరకూ ఉపయోగకరంగా పనిచేస్తుంది. టీ లలో చాలా రకాలున్నాయి. వాటిని తయారు చేసుకొని తాగి ఈ వింటర్ సీజన్ లో హ్యాపీగా ఉండొచ్చు.
శరీరంలోని డీహైడ్రేషన్ నివారించడానికి మరియు శరీరంలో ఉన్న విషాలను బయటకు పంపడానికి కొన్ని సులభమైన హెల్తీ వింటర్ డ్రింక్స్ మీ కోసం...

రమ్ ఆపిల్ సైడర్: శీతాకాంలో శరీరాన్ని వెచ్చబరుచుకోవడానికి ఇదొక అనువైనటువంటి మద్యపానీయం. రమ్ ను తీసుకోవడం వల్ల శరీరానికి వెచ్చదనం అందించడంతో పాటు శక్తిని కూడా ఇస్తుంది. శీతాకాలంలో జలుబు ఎక్కువగా బాధిస్తుంటే కను ఒక గ్లాస్ రమ్ తీసుకోవచ్చు. ఆరోగ్యం కోసం గ్లాస్ రమ్ లో ఆపిల్ సైడర్ ను మిక్స్ చేసుకోవాలి. ఒక వేళ ఆల్కహాల్ తీసుకోవడం ఇష్టలేకపోతే ఒక గ్లాస్ మసాలా టీలో కొన్ని చుక్కల ఆపిల్ సైడర్ వెనిగర్ ను మిక్స్ చేసుకొని హ్యాపీగా తాగవచ్చు.

హెర్బల్ టీ: చలి.. చలిగా ఉండే ఈ శీతాకాలంలో మరో అద్భుతమైనటువంటి హెల్తీ డ్రింక్. సహజంగా ప్రకతిలో లభించేటటువంటి హేర్బల్ తో తయారు చేసే టీ వల్ల జలుబు, దగ్గు మరియు శీతాకాలంలో వచ్చే ఇతర ఆరోగ్యసమస్యలను సులభంగా నయం చేస్తుంది. అంతే కాదు. హెర్బల్ టీ వల్ల బరువు కూడా సులభంగా తగ్గవచ్చు. శీతాకాలంలో మరింత బరువు పెరిగే అవకాశం ఉంటుంది. కాబట్టి హేర్బల్ టీని రెగ్యులర్ గా తీసుకోవడం చాలా మంచిది.

హాట్ చాక్లెట్: హాట్ డార్క్ చాక్లెట్ మీ శరీరానికి వెచ్చదనాన్ని ఇస్తాయి. శరీరంలో రక్తప్రవాహాన్ని పెంచుతుంది. దాంతో గుండె ఆరోగ్యంగా ఉంటుంది. హాట్ చాక్లెట్ డ్రింక్ ను హెల్తీ మరియు లోక్యాలరీ వింటర్ డ్రింక్ గా తీసుకోవచ్చు. బాగా కాచి మీగడ తీసిన పాలకు లోఫ్యాట్ డార్క్ చాక్లెట్ ను కలిపి బాగా మిక్స్ చేయాలి. క్యాలరీస్ అధికంగా ఉన్నటువంటి ఆహారాల్లో నోరూరించే వాటిలో హాట్ చాక్లెట్ కూడా ఒకటి. అయితే శీతాకాలంలో బరువు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి.

హాట్ విస్కీ టుడ్డీ డ్రింక్: ఇది ఒక ప్రత్యేకమైన టుడ్డీ డ్రింక్. దీన్ని తీసుకోవడం వల్ల శీతాకాలంలో తరచూ వచ్చే జలుబు నుండి బయటపడవచ్చు. శీతాకాలంలో చాలా మంది జలుబు, గొంతు నొప్పితో బాధపడుతుంటారు. ఈ సీజన్ లో వచ్చే కామన్ హెల్త్ ప్రాబ్లెమ్స్ ను ఈ హాట్ విస్కీ టుడ్డీ డ్రింక్ తో పోగొట్టవచ్చు. శీతాకాలంలో తీసుకొనే ఈ పానీయాన్ని విస్కీ, వేడినీళ్ళు, నిమ్మరసం, తేనె మరియు లవంగాలతో తయారు చేస్తారు.

ఐరిష్ కాఫీ: ఫ్రెష్ కాఫీ మరియు ఐరిష్ విస్కీతో తయారు చేసేటటువంటి ఈ ఫేమస్ కాక్ టైల్ వింటర్ డ్రింక్ అనే చెప్పొచ్చు. కోల్డ్ కంట్రీస్ లో ఈ డ్రింక్ చాలా ఫేమస్ కూడా. విస్కీ మరియు కాఫీ మిశ్రమం వల్ల గొంతు గరగరను మరియు జలుబును తగ్గిస్తుంది. అంతే కాదు శరీరానికి కావల్సిన వెచ్చదానాన్ని కలిగిస్తుంది.

మసాలా ఛాయ్: ఇది ఇండియన్ ఫేమస్ హాట్ బెవరేజ్. ఈ డ్రింక్ శీతాకాలంలో మరియు వర్షాకాలంలో చాలా ఫేమస్. ఈ ఛాయ్ ను ఇండియన్ స్పైసీస్(యాలకులు, చెక్క, తులసి ఆకులు మొ..) తో తయారు చేస్తారు. ఈ స్పైసీ ఛాయ్ జలుబు దగ్గును పోగొట్టడమే కాకుండా శరీరానికి శక్తినిస్తాయి. బరువును తగ్గించడానికి ఉపయోగపడుతాయి. ఈ హెల్తీ వింటర్ డ్రింక్స్ ను మీరే స్వయంగా తయారు చేసుకొని తాగవచ్చు. మరి మీకు ఇష్టమైన డ్రింక్ ఏదో చూడండి...



Click it and Unblock the Notifications