For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ఫుడ్ అలెర్జీ అంటే ఏమి..? అలెర్జీ లక్షణాలు.. నివారణ..

|

ఫుడ్ అలెర్జీకి కారణం కనుక్కోకపోతే ఒక్కోసారి ప్రాణానికే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ఫుడ్ అలెర్జీ వల్ల శరీరం మీద దద్దుర్లు లాంటి చిన్న ఇబ్బందులే కాక శ్వాస సంబంధిత సమస్యల వంటి పెద్ద కష్టాలు కూడా వస్తాయి. పల్లీలు తినడం వల్ల కూడా కొందరికి అలర్జీ వస్తుంది. కొన్ని రకాల ఫుడ్ అలర్జీలు కుటుంబ వారసత్వంగా వస్తాయి. అందుకే వీటి గురించి కొంచెమైనా తెలుసుకుని ఉండటం మంచిది. తొంభై శాతం ఫుడ్ అలర్జీలు ఎనిమిది రకాల ఆహారపదార్థాల వల్ల వస్తాయి అవేమిటంటే.. పాలు, గుడ్డు (గుడ్డులోని తెల్ల సొన)పల్లీలు, వాల్ నట్స్, జీడిపప్పు, బాదం, చేపల్లో కొన్ని రకాల చేపలు.. షేల్ ఫిష్ అంటే పీతలు, రొయ్యలు, సాయ్, ఆహార ధాన్యాల్లో గోధుమలు, రెగ్యులర్ గా తీసుకునే ఆహారాల వల్ల కూడా ఒక్కోసారి అలర్జీలు వస్తాయి. ఫుడ్ అలర్జీల్లో ఒక ప్రాంతానికి మరో ప్రాంతానికి మధ్య తేడా ఉంటుంది.

ఫుడ్ అలర్జీ లక్షణాలు:
1. ఫుడ్ అలర్జీ వచ్చినప్పుడు దురద, ఎక్జిమా, చర్మం పగిలిపోవడం.
2. కనురెప్పలు, పెదవులు, ముఖం, నాలుక గొంతులో వాసు లేదా ఇతర శరీరభాగాల్లో వాపు ఎక్కువగా కనబడుతుంది.
3. శ్వాసలో ఇబ్బంది, పొట్టలోనొప్పి, డయేరియా, నీరసం, వాంతులు, తలబరువు, అపస్మారక స్థితి మత్తుగా ఉండటం మొదలైనవి.
ఆహారం వల్ల కలిగే అలర్జీలను ఎనాఫైలాక్సిస్ అంటారు. దీనిని సరైన సమయంలో గుర్తించకపోతే ప్రాణానికే హాని కలిగే ప్రమాదం ఉంది. అంటే శ్వాస నాళాలు కుచించుకుపోవడం, గొంతువాపు, రక్త పీడనంలో తగ్గుదల, పల్స్ రేటు బాగా పెరగడం వంటివి జరుగుతాయి.

రొయ్యలు-పీతలు

రొయ్యలు-పీతలు

రొయ్యల వల్ల అలర్జీ వుంటే.. పీతులు తిన్నా అలర్జీ వస్తుంది. ఇదే నియమం వెజిటేరియన్ రకాలకు కూడా వర్తిస్తుంది.

గోధుమల వల్ల అలర్జీ వుంటే..

గోధుమల వల్ల అలర్జీ వుంటే..

గోధుమలతో తయారు చేసిన వస్తువులు ప్యాక్ పైన గ్లుటేన్ అని రాసి వున్న వాటికి దూరంగా వుండాలి.

గుడ్డు

గుడ్డు

గుడ్డు వల్ల అలర్జీ వుంటే బేకరీ బిస్కట్లు, బ్రెడ్ లను, మయొనైజ్ తో డ్రసింగ్ చేసిన సలాడ్స్ లను, బేకింగ్ మిక్స్ లను వాడకపోవడమే మంచిది.

పాలు

పాలు

ఒక వేళ పాల వల్ల అలర్జీ వుంటే బ్రెడ్, కేకులు, వెన్న మీగడ ఉన్న ఉత్పత్తులన్నింటనీ వాడకపోవడం మంచిది.

పల్లీలు

పల్లీలు

పల్లీలు చాలా మందికి పడవు. వాటిని తిన్నా అరగంటకే ముఖంలో చిన్న చిన్న మొటిమలు ఏర్పడి. దురదకు కారణం అవుతాయి. లేదా జీర్ణం కావు.

జీడిపప్పు- బాదం

జీడిపప్పు- బాదం

సాధారణంగా జీడిపప్పు, బాదం అనే డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే కొందరికి అలర్జీని కలిగిస్తాయి. జీడిపప్పు అలర్జీ కానీ మిగతా కాయలు...

టోఫు

టోఫు

టోఫు సోయాతో తయారు చేస్తారు కాబట్టి ఇది పిల్లలకు చాలా ప్రమాదకరమైన అలెర్జీని కలిగిస్తుంది. అలాగే పెద్దలకు కూడా రియాక్ట్ ఇస్తుంది.

అలర్జీకి దూరంగా...
ఫుడ్ అలర్జీల విషయంలో జాగ్రత్త వహించాలంటే: మొదట మీకు అలర్జీని కలిగించే ఆహారం ఏదో కనుక్కోవాలి. దానికి సంబంధించిన ఆహార పదార్థాలన్నింటిని తినడం మానేయాలి. అంటే ఉదాహరణకి

1. రొయ్యలు-పీతలు: రొయ్యల వల్ల అలర్జీ వుంటే.. పీతులు తిన్నా అలర్జీ వస్తుంది. ఇదే నియమం వెజిటేరియన్ రకాలకు కూడా వర్తిస్తుంది. మార్కెట్ లో లభించే రెడీమేడ్ ఆహారపదార్థాలపై వున్న లేబిల్స్ను జాగ్రత్తగా చదవండి. వాటి మీద వున్న సాంకేతిక, శాస్త్రీయ పదాలను సరిగ్గా అర్ధం చేసుకోండి. మీకు పాల వల్ల అలర్జీ వుంటే, సోడియం కాసినేట్ అని రాసి వున్నవేవీ తీసుకోకూడదు.

2. గోధుమల వల్ల అలర్జీ వుంటే .. గోధుమలతో తయారు చేసిన వస్తువులు ప్యాక్ పైన గ్లుటేన్ అని రాసి వున్న వాటికి దూరంగా వుండాలి. గోధుమల వల్ల అలర్జీ వున్నప్పుడు మాల్టెడ్ బెవరేజ్ లను తీసుకోవద్దు. కోకో డ్రింక్, బీర్, విస్కీల వంటి వాటికి దూరంగా ఉండాలన్న మాట. హోటళ్ళలో సాస్ లు, కూరలు చిక్కగా వుండటానికి గోధుమ పిండి కలుపుతారు. అందువల్ల బయట తినేటప్పుడు ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలి.

3. గుడ్డు: గుడ్డు వల్ల అలర్జీ వుంటే బేకరీ బిస్కట్లు, బ్రెడ్ లను, మయొనైజ్ తో డ్రసింగ్ చేసిన సలాడ్స్ లను, బేకింగ్ మిక్స్ లను వాడకపోవడమే మంచిది. అంతే కాదు ఉడికించిన గుడ్డ కూడా ప్రమాదమే...

4. పాలు: ఒక వేళ పాల వల్ల అలర్జీ వుంటే బ్రెడ్, కేకులు, వెన్న మీగడ ఉన్న ఉత్పత్తులన్నింటనీ వాడకపోవడం మంచిది. అలాగే ఐస్ క్రీం, మిల్స్ చాకొలెట్, క్రీమ్ సాస్ లను పూర్తిగా మానివేస్తే మంచిది.

5. పల్లీలు: పల్లీలు చాలా మందికి పడవు. వాటిని తిన్నా అరగంటకే ముఖంలో చిన్న చిన్న మొటిమలు ఏర్పడి. దురదకు కారణం అవుతాయి. లేదా జీర్ణం కావు. జీర్ణం కాక విరేచనాలకు దారి తీస్తుంది. కాబట్టి పల్లీలకు సాధ్యమైనంత వరకూ దూరంగా ఉండాలి. వీటిల్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉండటం చేత ఆయిల్ మోతాదు కూడా ఎక్కువగా దాంతో ముఖంలో అతి త్వరగా మొటిమలు ఏర్పడవచ్చు.

6. జీడిపప్పు- బాదం: సాధారణంగా జీడిపప్పు, బాదం అనే డ్రై ఫ్రూట్స్ ఆరోగ్యానికి చాలా మంచిది. అయితే కొందరికి అలర్జీని కలిగిస్తాయి. జీడిపప్పు అలర్జీ కానీ మిగతా కాయలు లేదా వేరుసెనగ కాయలు కన్నా దీనిలో ఎలర్జేన్లు తక్కువగా ఉంటాయి. కాబట్టి జీడిపప్పు తో చేసినటువంటి పదార్థాలు తినకపోవడమే మంచిది.

7. టోఫు: టోఫు సోయాతో తయారు చేస్తారు కాబట్టి ఇది పిల్లలకు చాలా ప్రమాదకరమైన అలెర్జీని కలిగిస్తుంది. అలాగే పెద్దలకు కూడా రియాక్ట్ ఇస్తుంది.

బయట హోటల్స్ లో తినేటప్పుడు మెను ఎంపికలో చాలా జాగ్రత్తగా ఉండాలి. వీలుంటే ముందుగానే వెయిటర్లకు, చెఫ్ లేదా మేనేజర్లకు మీ ఫుడ్ అలర్జీ గురించి చెప్పండి. బయట ఆర్డర్ చేసేటప్పుడు సింపుల్ గా వుండే మెనునే ఎంపిక చేసుకోండి..

ఫుడ్ అలర్జీ, ఇంకా ఇతర రకాలైన అలర్జీలున్నవారు ముందుగానే తగిన జాగ్రత్తలు పాటించాలి. ఎనాఫైలాక్టిక్ రియాక్షన్ ఉంటే ఎపినెఫ్రైన్' ఇంజెక్షన్ వెంటనే వేసుకోవచ్చు. కుటుంబ సభ్యలకు, స్నేహితులకు దాన్ని ఎలా వాడాలో చెప్పాలి. మీకు అలర్జీ కలిగించే పదార్థాలు వేటి వేటిలో వున్నాయో ముందుగానే తెలుసుకోండి.

English summary

How To Avoid Food Allergy Reactions..! | ఫుడ్ అలెర్జీకి కారణం అయ్యే ఆహారాలు...

People who have food allergies make drastic changes in their diets. Apart from the inconvenience of avoiding foods that everyone else seems enjoys without problems, keeping away from a wholesome nourishing food, such as milk or wheat, can deprive you of key vitamins or minerals.
Story first published: Saturday, October 6, 2012, 9:36 [IST]
Desktop Bottom Promotion