Latest Updates
-
ఐరన్, విటమిన్లు పుష్కలంగా ఉండే మెంతి పరాఠా..పిల్లల ఎదుగుదలకు సాయపడే అద్భుత బ్రేక్ ఫాస్ట్ -
చలికాలంలో శరీరాన్ని వెచ్చగా ఉంచే ఆవాల చట్నీ..ఇడ్లీ, దోశల్లోకి సూపర్.. ఆరోగ్యానికి ఎంతో మేలు -
మల్లెపువ్వు లాంటి తెల్లని పూరీలు.. బియ్యంపిండితో ఇలా చేశారంటే ఇక మైదా జోలికే వెళ్లరు.! -
రాహు నక్షత్రంలోకి శుక్ర గోచారం: అక్టోబర్ 24 వరకు అదృష్టవంతులంటే వీరే.! -
నాలుగేళ్లుగా ప్రియుడితోనే, తర్వాత ప్రెగ్నెన్సీ.. వాట్సప్ చాటింగ్లో భార్య ప్రేమాయణం గుట్టురట్టు.! -
ఆరోగ్య సిరి ఉసిరితో ‘స్వీట్ జామ్’.. బ్రెడ్, శాండ్విచ్లోకి పిల్లలు వదలకుండా తినేస్తారు.! -
ఎంతో ఇష్టంగా మటన్ తెచ్చుకుంటున్నారా.. ఈ పార్ట్స్ తిన్నారో ఇక అంతే సంగతులు.! -
అన్నం, రోటీల్లోకి బెస్ట్ ఎవర్ సైడ్ డిష్.. రాజస్థానీ ఫేమస్ పంచరత్న దాల్.! -
రోగులను పరామర్శించడానికి బ్రెడ్ మాత్రమే ఎందుకు తీసుకెళ్తారో తెలుసా.. చిన్న లాజిక్ ఇదే.! -
ఒక్క రూపాయి కట్నం వద్దు.. కానీ పెళ్లిలో ఈ రూల్స్ ఫాలో కావాల్సిందే: వరుడి నయా కండిషన్స్ వైరల్.!
ఒత్తిడి నుండి ఉపశమనం పొందడానికి 6 గొప్ప అలవాట్లు ..!
ఒత్తిడి అనేది నేటి మన పరిగెత్తే జీవన శైలికి కారణమయ్యే అనివార్యమైన అంశం. మీ మనసుని కొన్ని విషయాలను దూరంగా ఉంచితే, మిమ్మల్ని మీరు ఒత్తిడి లేకుండా చేసుకోవచ్చు- అది మీకు ఇష్టం లేకపోయినప్పటికీ, కొన్ని సమయాలలో అది మీ బాధలను తగ్గించవచ్చు కూడా. రోజువారీ ఒత్తిడుల నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి క్రింద 6 అలవాట్లు ఇవ్వబడ్డాయి.

తోటపని: తోటపని గురించి మంచి విషయం ఏమిటంటే అది మిమ్మల్ని ప్రకృతికి దగ్గర చేస్తుంది. ప్రతిరోజూ మీరు అనుభవించే ఒత్తిడి ప్రకృతితో తగ్గుతుంది, మీరు బైటికి వెళ్ళినపుడు, చెట్లు, నీటి చెట్లు, పూల అందాలను పొగడడం, చెట్లపై పెరిగిన పండ్ల తో మీ మనసు సహజంగా విశ్రాంతి పొందుతుంది.

చదవడం: పుస్తకాల పఠనం ప్రామాణిక ఒత్తిడిన దూరంచేస్తుంది. మీరు మీకు ఇష్టమైన మంచి పుస్తకాలను సేకరించినట్లయితే, మీరు ఎంత కోల్పోయారో ఆశ్చర్యపోతారు, చుట్టూ ఉన్న ప్రపంచాన్ని కూడా మర్చిపోతారు. మంచి పుస్తకాలు చదవండి, జ్ఞానంతో, తాజా శక్తితో మిమ్మల్ని మీరు తెలుసుకోండి.

యోగా: యోగా ద్వారా శరీరంలోని కండరాలు సాగి, సడలింపు చెంది తద్వారా ఒత్తిడి నుండి ఉపసమానాన్ని కలుగచేస్తాయి. మీరు తప్పనిసరిగా యోగాని చేసినట్లయితే మీ శరీరం సడలింపు పొంది, మీ మనసుని విశ్రాంతిగా, ప్రశాంతమైన స్థితిలో ఉంచుతుంది. ప్రతిదీ తేలికగా, ఉల్లాసవంతంగా కనిపిస్తుంది.

వంటచేయడం: మీకు వంటచేయడం తెలుసా, అధిక ఒత్తిడి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి ఇది ఒక అద్భుతమైన మార్గం. వంటచేయడం అనేది మీరు తయారుచేసే ఆహారంపై మీరు మనసు లగ్నం చేసేటట్లు, దానిని రుచిగా ఎలా చేయాలో శ్రద్ధపెట్టడం చేస్తుంది. అయితే ఇది మీ ఊహలను, మీ సృజనాత్మకతను అమలుచేయడానికి వీలుకల్పిస్తుంది.

సంగీతం వినడం: మీరు అధిక ఒత్తిడిలో ఉన్నపుడు, అందమైన ప్రశాంతమైన సంగీతాన్ని పెట్టడం మీరు మొట్టమొదట చేయవలసిన పని. సంగీతం మీ మనసు శీర్షాలకు, స్థిరమైన ఆందోళనలకు ఉపశమనాన్ని ఇస్తుంది. ఇది మొట్టమొదట మీ మనసుకు ఆందోళన కలిగించే విషయాల నుండి దూరంగా ఉంచి, తక్షణ ఒత్తిడి నుండి ఉపశమనాన్ని కలిగిస్తుంది.

రాయడం: మీ ఒత్తిడిని దూరం చేయడానికి మరోమార్గం రాయడం. మీరు మీ వ్యక్తిగత డైరీ లేదా చిన్న కధలు రాసినట్లైతే, మీ మనసులోని ఆలోచనలను కాగితంపై పెడితే (లేదా కంప్యూటర్ లో) నిస్సందేహంగా ఇది మీ ఒత్తిడిని తగ్గిస్తుంది. ఇది మీ జీవిత సమస్యలను పరిష్కరించుకోవడానికి, మీ ఊహలను అమలు చేయడానికి సృజనాత్మకతను అందిస్తుంది.
తేలిగ్గా, ప్రభావవంతంగా మీ రోజువారీ వత్తిడి నుండి మిమ్మల్ని మీరు రక్షించుకోవడానికి మీకు సరిపోయే ఉత్తమమైన అలవాటును ఎంచుకోండి.



Click it and Unblock the Notifications
