Latest Updates
-
ఒక్కసారి చేస్తే ఏడాది పాటు నిల్వ ఉండే బంగాళదుంప పాపడాలు..ఇంట్లోనే చేసుకోండిలా.. -
ఫ్యాట్ తగ్గించి కండరాల బలాన్ని పెంచే పూర్వీకుల నాటి గంజి చారు.. పది నిమిషాల్లో అమృతం రెడీ.! -
బ్రహ్మ దేవుడికి కేవలం ఒక్క గుడి మాత్రమే ఎందుకుంది? బ్రహ్మను ఎవరూ పూజించరెందుకు? -
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
మీ బడ్జెట్ ను సేవ్ చేసే 7 అద్భుతమైన హెల్త్ టిప్స్
ఆరోగ్యమే మహా భాగ్యం అన్న నానుడి వంద శాతం నిజం. మనకెన్ని ఉన్నా, ఆరోగ్యం సరిగ్గా లేకుంటే అవన్నీ వృధా.
కొంతమంది ఆహారం ద్వారానే ఆరోగ్యం గా ఉండవచ్చు అంటారు. కాని, ఆహరం తో పాటు మరికొన్ని ముఖ్య విషయాలను అర్ధం చేసుకోవాలి. ఆరోగ్యం గురించి శ్రద్ద తీసుకునే వారు కొన్ని సార్లు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకున్నా కూడా ఏదో ఒక విధం గా అనారోగ్యానికి గురి అవుతారు. దానికి తోడు డబ్బులూ ఖర్చు అవుతాయి.
ఆరోగ్యం గురించి అలాగే డబ్బుల గురించి బాధ పడకుండా ఈ క్రింద చెప్పబడిన ఏడు విధానాలను పాటిస్తే చాలా తక్కువ ఖర్చుతో అరోగ్యాన్ని సొంతం చేసుకోవచ్చు. మీ డబ్బులని అలాగే ఆరోగ్యాన్ని రక్షించుకునే విధానాలుగా కూడా ఇవి పని చేస్తాయి.

7 సూపర్ సేవర్ బడ్జెట్ హెల్త్ టిప్స్
వంటింటి చిట్కా - నడుము నొప్పి తగ్గించేందుకు ప్రతి ఉదయం ఈ విధంగా చెయ్యాలి. నిటారుగా నించుని మీ పొట్ట కండరాలను వీలైనంత లోపలి లాక్కుని ఆ తరువాత మెల్ల మెల్లగా కొంచెం వదులు చేసి ఒక నాడాని మీ నడుము చుట్టూ కట్టుకోవాలి. రోజంతా అలాగే ఉండాలి. మీ కండరాలు ఉత్తేజంగా ఉండడానికి ఈ విధానం ఏంతో ఉపయోగపడుతుంది. నడుము నొప్పి తగ్గిపోవడానికి కూడా తోడ్పడుతుంది.

7 సూపర్ సేవర్ బడ్జెట్ హెల్త్ టిప్స్
రెండు గుడ్లతో అల్పాహారం - అధ్యయనాల ప్రకారం అల్పాహారం లో రెండు గుడ్లను తీసుకున్నట్లయితే రోజులో తీసుకోనబడే కేలరీల శాతం 18 శాతం వరకు పడిపోతుంది. ఎందుకంటే ఇవి ఎక్కువ సేపు కడుపు నిండిన భావన కలిగిస్తాయి. అందువల్ల ఎక్కువ ఆహారం తీసుకోవాలని అనిపించదు. ఉడికించిన, పోచ్ చేసిన మరియు స్క్రామ్బెల్డ్ గుడ్లని ఒక హోల్ గ్రైన్ టోస్ట్ తో తింటే ఆరోగ్యకరమని పౌష్టికాహార నిపుణుల సూచన.

7 సూపర్ సేవర్ బడ్జెట్ హెల్త్ టిప్స్
పుదీనా ఆకులు - ఆయుర్వేద వైద్యుల సూచన ప్రకారం పుదీనా ఆకులలో ఉన్న ఔషద విలువలు చాలా ఎక్కువ. కడుపుబ్బర మరియు అజీర్తి సమస్యలని నివారించడం తో పాటు వాపుని నివారించే శక్తి ఉండటం పుదీనా ప్రత్యేకత. నోటిని శుభ్రపరచి తాజా గా ఉంచడం లో ప్రధాన పాత్ర పోషిస్తుంది. కొన్ని పుదీనా ఆకులూ నీళ్ళలో కాగబెట్టి వాడాలి.

7 సూపర్ సేవర్ బడ్జెట్ హెల్త్ టిప్స్
తీపి లేని చూయింగ్ గమ్ - గుందేమంట తగ్గించి ఏకాగ్రత ని మెరుగు పరచుకునేందుకు ఇది ఎంతగానో ఉపయోగపడుతుంది. శాస్త్రవేత్తల అధ్యయనాల ప్రకారం ఈ చూయింగ్ గమ్ ద్వారా విడుదలయ్యే లాలాజలం లో జీర్ణ రసాలను తటస్తీకరించి అసిడిటీ ని తగ్గించే లక్షణం ఉందని తెలిసింది. డెంటల్ రీసెర్చ్ జర్నల్ లో ప్రచురించబడిన కథనం ప్రకారం అసిడిటీ ని కలిగించే మీల్స్ చేసిన కొంత మంది ని ముప్పై నిమిషాల పాటు ఈ చూయింగ్ గమ్ ని నమలమని చెప్పారు. ఎక్కువ సేపు ఏకాగ్రత తో ఉండడానికి ఈ గమ్ ఉపయోగపడుతుందని కార్డిఫ్ యూనివెర్సిటీ పరిశోధకులు బ్రిటిష్ జర్నల్ ఆఫ్ సైకాలజీ లో ప్రచురించారు.

7 సూపర్ సేవర్ బడ్జెట్ హెల్త్ టిప్స్
టెన్నిస్ బాల్ - సయాటికా ని తగ్గించడం లో టెన్నిస్ బాల్ లేదా ప్లాస్టిక్ బాల్ లేదా కనీసం పొటాటో లు ఎంతో ఉపయోగపడతాయని తెలుస్తోంది. పిరుడులపై ఈ బాల్ తో మసాజ్ చేస్తే తక్షణ ఉపశమనం కలుగుతుంది. ఈ బాల్ పై కుర్చుని లేదా గోడకి పిరుదులకి మధ్యలో ఈ బాల్ ని పెట్టుకుని మెల్లగా ఒత్తిడిని పెడితే మస్సాజ్ జరిగి కండరాలు ఉపశమనం పొందుతాయి. ఇలా రోజులో ఎక్కువ సార్లు చెయ్యడం వల్ల ఉపశమనం కలుగుతుంది.

7 సూపర్ సేవర్ బడ్జెట్ హెల్త్ టిప్స్
ఎప్సం సాల్ట్ - ఒక కప్పుడు ఎప్సం సాల్ట్ ని స్నానపు నీటిలో వేస్తె నొప్పిగా ఉన్న కండరాలు ఉపశమనం పొందుతాయి. ఎప్సం సాల్ట్ లో ఉండే మగ్నీసియం శాతం వల్ల నొప్పుల్ని తగ్గించి కండరాలను ఉత్తేజితం చేస్తాయి. ఇవి ఏంతో ప్రాముఖ్యత చెందినవి. స్నానపు నీటిలో వీటిని వాడితే వ్యర్ధ పదార్ధాలని బయటకి పంపించి పొట్టని ఫ్లాట్ గా చేస్తాయి.

7 సూపర్ సేవర్ బడ్జెట్ హెల్త్ టిప్స్
బాదం పప్పులు - మోనోసాట్యురేటెడ్ ఫాట్స్ కి అలాగే ప్రోటీన్స్ కలిగిన బాదం పప్పుల లో ఫైబర్, మగ్నీసియం, ప్రోటీన్, పొటాసియం, కాపర్ అలాగే విటమిన్ ఇ కలిగి ఉంటుంది.



Click it and Unblock the Notifications
