For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

డెంగ్యు జ్వరంతో బాధపడుతున్నారా?ఐతే ఇవి తినండి!

డెంగీ అనేది ఒక వైరస్. ‘ఈడిస్ ఈజిప్టై' అనే ఒక రకం ఆడదోమ కుట్టడం ద్వారా ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంటుంది. ఈ వైరస్ జీవితచక్రమం దోమల నుంచి మనుషులకు, మనుషుల నుంచి దోమలకు ఇది ఒక విష వలయంలా ఉంటుం

|

డెంగీ అనేది ఒక వైరస్. 'ఈడిస్ ఈజిప్టై' అనే ఒక రకం ఆడదోమ కుట్టడం ద్వారా ఈ వైరస్ ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుంటుంది. ఈ వైరస్ జీవితచక్రమం దోమల నుంచి మనుషులకు, మనుషుల నుంచి దోమలకు ఇది ఒక విష వలయంలా ఉంటుందన్నమాట. దోమ, దోమ కుట్టిన 5 నుంచి 6 రోజులకు జ్వరం ప్రారంభమవుతుంది. పగలు కుట్టే దోమల వల్ల ఈ విషజ్వరం వ్యాపిస్తుంటుంది.

దోమలకు ఆవాసం: నిలువ నీళ్లల్లో ఈడిస్ ఈజిప్టై దోమ గుడ్లు పెడుతుంది. ఓవర్‌హెడ్ ట్యాంకులు, అండర్‌గ్రౌండ్ ట్యాంకులు, కూలర్లు, ఇంట్లోని పాత్రలు, ఫ్లవర్‌వాజులు, నీటి కుండీలు, పాతటైర్లు, పనికిరాని పడేసిన బాటిళ్లు, పాత్రలు, డబ్బాలు... ఇలా ఎక్కడ నీళ్లు నిలువ ఉండటానికి అవకాశం ఉంటే అక్కడ ఈ దోమ గుడ్లు పెడుతుంది. ఈ నీళ్ల నుండి వారం, పదిరోజుల్లో లక్షలాది దోమలు తయారవుతాయి. ఇవి చల్లగా ఉండే, నీడగా ఉండే ప్రదేశాల్లో విశ్రాంతి తీసుకుంటాయి. అంటే మన ఇళ్లల్లో కర్టెన్ల వెనకా, తలుపుల వెనకా, గోడల మాటన విశ్రమించి మధ్యాహ్నం, సాయం సమయాలలో కుట్టడం ప్రారంభిస్తాయి. సాధారణంగా ఈ దోమలు అరమైలు కంటే ఎక్కువ దూరానికి తిరగలేవు. అయితే బస్సుల్లో, రైళ్లల్లో, విమానాల్లో ఇతర వాహనాల్లో చేరి ఎంతదూరమైనా వెళ్తాయి. డెంగీ జ్వరమని ఆనుమానించినప్పుడు ఆందోళన చెందకుండా వైద్యుని సలహా తీసుకోవడం తప్పనిసరి. అవసరాన్ని బట్టి వైద్యులు రక్తపరీక్షలు చేయించి, చికిత్స ఇస్తారు.

Foods

డెంగీ లక్షణాలు: 2 నుంచి 7 రోజుల వరకూ జ్వరం తగ్గకపోవడం ఒళ్లంతా తీవ్రమైన నొప్పులుగా ఉండటం (కండరాలలో, కీళ్లలో, తలలో విపరీతమైన నొప్పి వస్తుంటుంది) చర్మంపై ఎర్రటిమచ్చలు ర్యాష్‌లాగా కనిపించడం తెల్ల రక్తకణాలు బాగా పడిపోవడం (ఇది రక్తపరీక్షలో తెలుస్తుంది) హిమోగ్లోబిన్ 16 శాతం కంటే ఎక్కువ ఉండటం బ్లడ్ షుగర్ లెవల్స్ తగ్గిపోవడం (రక్తపరీక్షలో తెలుస్తుంది) ప్లేట్‌లెట్స్ సంఖ్య కూడా బాగా తగ్గిపోతుంది. వీటి సంఖ్య సాధారణంగా 1.5 లక్షల నుంచి 4.5 లక్షలు ఉండాలి. కానీ... డెంగీ వ్యాధిలో ప్లేట్‌లెట్స్ సంఖ్య బాగా తగ్గిపోతుంది. ప్లేట్‌లెట్స్ అనేవి రక్తస్రావం జరగకుండా ఆపే కణాలు. అవి తగ్గడం వల్ల శరీరం లోపలి భాగాల్లో రక్తస్రావం జరిగి, అది ప్రమాదకరమైన పరిస్థితికి దారితీయవచ్చు. జ్వరం వచ్చిన మూడో రోజు నుంచి రెండో వారాంతం వరకు ఎప్పు డైనా ఇలా జరగవచ్చు. (అయితే మొదటివారం లోనే ఇది కనిపించే అవకాశాలు ఎక్కువ). ఇది ప్రమాదకరమైన దశ. ఈ సమయంలో రోగిని పర్య వేక్షిస్తూ అప్రమత్తంగా ఉండాలి.

చికిత్స: లక్షణాలను బట్టి చికిత్స చేయాల్సి ఉంటుంది. రోగికి బాగా విశ్రాంతినివ్వాలి ఈ జ్వరానికి యాంటీబయాటిక్స్ పనిచేయవు. (కానీ సెకండరీ ఇన్ఫెక్షన్స్ వచ్చినప్పుడు దాన్ని నియంత్రించడానికి తగిన యాంటిబయాటిక్స్ వాడాల్సి ఉంటుంది). ఐవీ ఫ్లుయిడ్స్ ఇచ్చి బీపీని పడిపోకుండా చూసుకోవడం అవసరం. పారాసిటమాల్ మాత్రలు డాక్టర్ల సూచన మేరకు ఇవ్వాలి పథ్యం అవసరం లేదు. అయితే తాజాగా, వేడిగా ఉన్న ఆహారాన్ని ఇవ్వాలి. జ్వరం రెండు నుంచి ఏడు రోజుల్లో పూర్తిగా తగ్గిపోతుంది. జ్వరం తగ్గినా... తీవ్రమైన కడుపునొప్పి, మలం నల్లగా రావడం, చర్మంలో ఎర్రటి మచ్చలు, ముక్కు నుంచి రక్తం కారడం, ఒళ్లు చల్లబడటం, విపరీతంగా చెమటపట్టడం... ఈ లక్షణాలు ఉంటే నిర్లక్ష్యం చేయకూడదు. వీటిని ప్రమాద సూచికలుగా గుర్తించాలి. వెంటనే ఆసుపత్రిలో చేర్పించి వైద్యులతో చికిత్స ఇప్పించాలి.

చికత్సతో పాటు డెంగీ పేషంట్స్ ఫుడ్ డైట్ లో ఫాలో అవ్వాలి. ఈ లక్షణాలున్నప్పుడు సరైన ఆహార నియాలమాలు పాటించగలిగితే శరీరంలో మరే ఇతర భాగాలకు హాని కలగకుండా పూర్తి శరీర ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మీరు ఈ డెంగీ ఫీవర్ నుండి త్వరగా కోలుకోవడానికి ఈ ఆహారాలు బాగా సహాయపడుతాయి. డేంగీ లక్షణాలున్నవారు వీటిని ఖచ్చితంగా తినాలనే నియమం లేదు. కానీ వీటిని తీసుకోవడం వల్ల డెంగీ పేషంట్స్ కు కోలుకోవడానికి గొప్పగా సహాయపడుతాయి. మరి అటువంటి ఆహారాలేంటో ఒకసారి చూద్దాం...

ఆరెంజ్:

ఆరెంజ్:

డెంగీ రోగికి ఒక మంచి ఆహారం సిట్రస్ పండ్లు, ఆరెంజ్ జ్యూస్ మరియు పండ్లలో పుష్కలమైన విటిమిన్ సి మరియు శక్తి నిండి ఉంటుంది. ఆరెంజ్ జ్యూస్ ను తీసుకోవడం వల్ల, ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. యూరినరీ అవుట్ పుట్ ను మెరుగుపరిచి యాంటీబాడీస్ ప్రోత్సహించి రోగి త్వరగా కోలుకొనేందుకు సహాయపడుతుంది.

బొప్పాయి:

బొప్పాయి:

డెంగ్యు పేషంట్స్ కు బొబ్బాయి ఆకులు చాలా మంచిదని డాక్టర్స్ మరియు నిపుణులు సూచిస్తుంటారు. అందుకు 2తాజా బొప్పాయి ఆకులను తీసుకొని, వాటిని మెత్తగా పేస్ట్ చేసి, వాటి నుండి జ్యూసును తీసి, ప్రతి రోజూ ఉదయం మరియు రాత్రి రెండు చెంచాల జ్యూస్ ను డెంగ్యూ రోగికి ఇచ్చినట్లైతే రోగి త్వరగా కోలుకోవడానికి అవకాశం ఉంది. డెంగీ ఫీవర్ కు ఇది ఒక బెస్ట్ హోం రెమడీ.

గంజి:

గంజి:

ఈ ప్రాణాంతక వైరస్ తో పోరాడాలంటే డెంగీ రోగికి ఒక బెస్ట్ ఫుడ్ గంజి. గంజి తాగడం వల్ల పేషంట్ లో కొంత శక్తిని, బలాన్ని నింపడానికి సహాయపడుతుంది. గంజి తాగడానికి, మింగడానికి చాలా తేలికగా ఉంటుంది. ఇందులో అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి.

హెర్బల్ టీ:

హెర్బల్ టీ:

డెంగీ ఫీవర్ తో బాధపడుతున్న వారు, ఈ ఫీవర్ ను తగ్గించుకోవడానికి ఒక మంచి మార్గం నేచురల్ హెర్బల్ టీ తాగడమే. ఈ హేర్బల్ టీ అల్లం మరియు యాలకులతో తయారు చేయబడి ఉంటుంది. ఇది చాలా అద్భుతంగా ఉపయోగపడుతుంది. ఇది డెంగ్యు పేషంట్స్ కు ఒక మంచి ఆహారం.

కొబ్బరి బోండాం:

కొబ్బరి బోండాం:

డెంగీ ఫీవర్ తో పోరాడుతున్నప్పుడు, పేషంట్ ఎంత ఎక్కువగా కొబ్బరి బోండాం తాగితే అంత మంచిది. కొబ్బరి నీళ్ళు శరీరం ద్వారా కోల్పోయిన ఎలెక్ట్రోలైట్స్ మరియు ఇతర ట్రేస్ మినిరల్స్ ను నింపి శరీరంను డీహైడ్రేషన్ నుండి కాపాడుతుంది.

వెజిటేబుల్ జ్యూస్:

వెజిటేబుల్ జ్యూస్:

డెంగ్యు ఫీవర్ తో బాధపడుతున్న పేషంట్స్ కు ఒక మంచి ఆహారం తాజాగా ఉండే క్యారెట్, కీరదోస జ్యూస్ లు మరియు గ్రీన్ లీఫీ వెజిటేబుల్. నిపుణుల ప్రకారం మనుషులకు కావల్సిన పుష్కలమైన న్యూట్రీషియన్ వీటి ద్వారా అందుతుందని, దాంతో పేషంట్స్ త్వరగా కోలుకుంటారని సూచిస్తుంటారు.

పండ్ల రసాలు:

పండ్ల రసాలు:

డెంగ్యు పేషంట్స్ కు చాలా ఆరోగ్యకరమైన ఆహారం విటమిన్ సి ఫుడ్స్. రోగి యొక్క రోగనిరోధక శక్తిని పెంపొంధించుకోవడానికి విటమిన్ సి బాగా సహాయపడుతుంది మరియు అడ్రినల్ హార్మోన్స్ నిర్మాణం కోసం ఇది చాలా ముఖ్యమైనవి.స్ట్రాబెర్రీ, జామకాయ,కివి మరియు బొప్పాయి వంటి సి విటమిన్ ఆహారాలు లైఫో సైట్స్ ఉత్పత్తిలో సహాయపడుతాయి . ఇది కూడా బాక్టీరియా మరియు వైరస్ మీద ప్రత్యక్షప్రభావం కలిగి ఉంటుంది.

ప్రోటీన్ రిచ్ ఫుడ్:

ప్రోటీన్ రిచ్ ఫుడ్:

డెంగ్యు ఫీవర్ తో బాధపడే వారికి ప్రోటీన్ రిచ్ ఫుడ్స్ చాలా అవసరం. పాలు, డైరీప్రొడక్ట్స్, గుడ్లు వంటివి చాలా ముఖ్యం. ఈ వైరస్ తో పోరాడాలంటే డెంగ్యు పేషంట్ చేపలు మరియు చికెన్ కూడా తినడం వల్ల సహాయపడుతుంది.

సూప్స్:

సూప్స్:

డెంగ్యు ఫీవర్ తో బాధపడే వారికి కావల్సిన శక్తిని, బలాన్ని అందివ్వడానికి సూప్స్ చాలా బాగా ఉపయోగపడుతాయి. జాయింట్ పెయింట్స్, కండరాల నొప్పుల నివారించడానికి, పేషంట్స్ లో ఆకలిని మరియు రుచిని కలిగించడానికి ఇవి బాగా సహాయపడుతాయి.

నిమ్మరసం:

నిమ్మరసం:

డెంగ్య ఫీవర్ తో బాధపడేవారిలో శరీరంలోని హానికర వైరస్ మరియు టాక్సిన్స్ ను తొలగించడానికి నిమ్మరసం బాగా సహాయపడుతుంది. ఈ జ్యూస్ తాగడం వల్ల శరీరంలో ఉండే వైరస్ మూత్రం ద్వారా బయటకు విసర్జింపబడుతుంది. మరియు శరీరంలోకి వైరస్ చేరికను తగ్గిస్తుంది.

English summary

Foods For Dengue Fever

The common dengue fever is a flu kind of illness spread by the bite of a mosquito. Dengue and dengue hemorrhagic fever is caused by any of the dengue family viruses. This fever is also widely known as 'break bone fever' due to the severe joint pain caused during the dengue attack.
Desktop Bottom Promotion