For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

బాడీపెయిన్స్ ను తగ్గించే మంచి ఆహారాలు...

By Super
|

ప్రస్తుత కాలంలో బాడీ పెయిన్స్ అనేవి ఆధునిక జీవన విధానాల దుష్ప్రభావాలు. చాలా మంది ఉద్యోగస్తులు, వ్యాపా రస్తులు, డెస్క్‌ జాబ్‌ చేసుకునేవారు ఎల్లప్పుడూ ఏదో ఒక శారీరక నొప్పితో బాధపడుతూనే వుంటారు. ప్రత్యేకించి వీరికి 30ఏళ్ళు వచ్చాయంటే ఇక అవి క్రమం తప్పకుండా వస్తూనే వుంటాయి. దీనికి కారణం దీర్ఘకాల సమయం వారు ఒకే చోట కూర్చొని వుండటం కూడాను. ఎక్కువ బరువులు ఎత్తడం లేదా అధిక వ్యాయామం చేసే వారిలో బాడీపెయిన్స్ సాధారణంగా ఉంటాయి. కానీ కొన్ని సార్లు, ఒంట్లో నొప్పి ఒక తీవ్రమైన వ్యాధి యొక్క లక్షణాలకు కారణం కావచ్చు.

బాడీపెయిన్స్ కు వయస్సుతో సంబంధం లేదు. ఈ బాడీపెయిన్ అనేవి 18ఏళ్ళ వయస్సు నుండి 80 వయస్సు వారి వరకూ ఎవరికైనా ప్రభావితం చేయవచ్చు. బాడిపెయిన్స్ లో కూడా ప్రత్యేకమైన రకాలు ఉంటాయి. నొప్పులు వివిధ రకాలుగా ఉంటాయి బ్యాక్ పెయిన్, కీళ్ళ నొప్పులు, మరియు కండరాల నొప్పులు. వీటికి సరైన వ్యాయామం లేకపోవడం, చెడు జీవనశైలే ప్రధాన కారణం. కాబట్టి ఒక క్రమం తప్పకుండా వ్యాయామం, అనారోగ్య భంగిమలు మరియు ఆరోగ్యకరమైన ఆహారం తినాలి.
పోషకాహారం తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక నొప్పులను తగ్గించడంతో పాటు, అలాగే ఇప్పటికే మీరు ఎదుర్కొటున్న నొప్పులను కూడా తగ్గిస్తుంది. బాడీపెయిన్స్ ను తగ్గించడానికి అనేక ఆహారాలు అద్బుతంగా సహాయపడినట్లు నిరూపించబడ్డాయి. ఈ ఆహారాలను రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల ఒత్తిడి మరియు ఒంటినొప్పులను నివారించుకోవచ్చు. మరియు బాడీ పెయిన్స్ నివారించే టాప్ 10 ఫుడ్స్ ఏంటో ఒక సారి చూద్దాం...

ఒళ్ళు నొప్పులను నివారించే బెస్ట్ ఫుడ్స్

ఒళ్ళు నొప్పులను నివారించే బెస్ట్ ఫుడ్స్

చెర్రీలు - ఎర్రగా మరీ చిన్నగా ఉండే ఈ చెర్రీ పండ్లలో యాంటీఆక్సిడెంట్స్ మరియు యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆర్థరైటిస్ నొప్పులను నివారించడంలో అద్భుతంగా సహాయపడుతాయి. వీటిని రోజు 45 తీసుకుంటే నొప్పులను నివారించుకోవచ్చు.

ఒళ్ళు నొప్పులను నివారించే బెస్ట్ ఫుడ్స్

ఒళ్ళు నొప్పులను నివారించే బెస్ట్ ఫుడ్స్

అల్లం - అల్లం ఒక ఆస్ప్రిన్ మాత్ర వలే ఒక అద్భుతమైన ఎంపిక. ఇది తల నొప్పులు మరియు ఒక యాస్పిరిన్ వలె పార్శ్వపు నొప్పి తగ్గించేందుకు సహాయం చేస్తుంది . దీన్ని సులభంగా మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవచ్చు. ప్రతి రోజూ మీరు తీసుకొనే చిన్న భోజనంలో చిన్న అల్లం ముక్క చేర్చుకోవడం ఉత్తమం. అల్లంను ప్రతి రోజూ మీ డైట్ లో చేర్చుకోవడం వల్ల ఇది కండరాలను స్టిఫ్ గా ఉంచడంతో పాటు కీళ్ళ వాపులను తగ్గిస్తుంది. ఇది పచ్చి అల్లంలో ఉండే జింజరోల్స్ వల్ల ఇలా నొప్పినివారిస్తుంది. కాబట్టి మీ రెగ్యులర్ డైట్ లో అల్లంను తప్పనిసరిగా ఉండేవిధంగా చూసుకోవాలి.

ఒళ్ళు నొప్పులను నివారించే బెస్ట్ ఫుడ్స్

ఒళ్ళు నొప్పులను నివారించే బెస్ట్ ఫుడ్స్

సముద్ర ఫుడ్స్ - సీ ఫుడ్స్ ముఖ్యంగా చేపలు, వీటిలో ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ నిప్పినివారిణి మరియు యాంటీఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి. ఒమేగా 3, శరీరంలో నొప్పి నివారించడానికి ఉపయోగపడే రక్తప్రవాహాన్ని పెంచుతుంది. మరియు చేపనూనె కార్డియో వ్యాస్కులర్ వ్యాధులకు మంచిదిగా భావిస్తారు. దీర్ఘకాలిక నొప్పులను నివారించడానికి మీ ఆహారంలో చేపలు లేదా చేప నూనె మాత్రలు తీసుకోవడం వల్ల దీర్ఘకాలిక నొప్పులు ఏ రకంవైనా తగ్గించడానికి ఉపయోగపడతాయి .

ఒళ్ళు నొప్పులను నివారించే బెస్ట్ ఫుడ్స్

ఒళ్ళు నొప్పులను నివారించే బెస్ట్ ఫుడ్స్

పసుపు - పసుపు కణజాలం నాశనం మరియు మంట నుండి శరీరంను రక్షించేందుకు, మరియు నరాల ఇన్ఫ్లమేషన్ తగ్గించేందుకు, నారాలను ఎటువంటి నొప్పులకు గురికాకుండా సంరక్షించబడుతుంది . ఒక కండరము బాధ లేదా ఏదైనా గాయం ఉన్నప్పుడు, వెంటనే పసుపు రాయడం వల్ల నొప్పి మరియు వాపు తగ్గించే ఒక ఉత్తమ నివారిణి. కీళ్ళ నొప్పులు ఆర్థరైటిస్ కు కారణం అవుతుంది. కాబట్టి మీ రెగ్యులర్ డైట్ లో పసుపును ఉపయోగించడం వల్ల ఆరోగ్యానికి మాత్రమే కాదు కీళ్ళ నొప్పులకు కూడా ఉపశమనం కలిగిస్తుంది.

ఒళ్ళు నొప్పులను నివారించే బెస్ట్ ఫుడ్స్

ఒళ్ళు నొప్పులను నివారించే బెస్ట్ ఫుడ్స్

. కాఫీ - కాఫీలో యాంటీయాక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి, చెర్రీలలో కంటే ఒక కప్పు కాఫీలోనే ఎక్కువగా కలిగి ఉన్నాయి. అందువల్ల , అవి ఒక మంచి నొప్పిని హరించేవిగా ఉన్నాయి. ఒక దీర్ఘకాలిక తల నొప్పి లేదా మైగ్రేన్ సమస్యలు ఉన్నప్పుడు కాఫీ ఎక్కువగా ఉపయోగిస్తారు . హ్యాంగోవర్ లేదా ఒక పార్శ్వపు నొప్పి కోసం ఒక కప్పు కాఫీ ఒక పరిపూర్ణ మెడిసిన్ .

ఒళ్ళు నొప్పులను నివారించే బెస్ట్ ఫుడ్స్

ఒళ్ళు నొప్పులను నివారించే బెస్ట్ ఫుడ్స్

పెరుగు - అజీర్ణం లేదా ఆమ్లత సమయంలో కడుపు సంబంధిత నొప్పి విషయంలో , పెరుగు ఒక మంచి నొప్పి నివారిణిగా భావిస్తారు . దీన్ని నేరుగా మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవచ్చు లేదా మీ అనుకూలం బట్టి రోజులో ఎప్పుడైన తీసుకోవచ్చు.

ఒళ్ళు నొప్పులను నివారించే బెస్ట్ ఫుడ్స్

ఒళ్ళు నొప్పులను నివారించే బెస్ట్ ఫుడ్స్

మింట్ - చూయింగ్ పిప్పరమెంటు బిళ్ళ మాత్రమే మీరు మీ శ్వాస తాజా ఉంచేందుకు సహాయం పడటమే కాదు, ఇంకా ఇది కూడా కండరము దుస్సంకోచాలు మరియు ప్రకోప ప్రేగు సిండ్రోమ్ తగ్గించడంలో సహాయపడుతుంది . మింట్ ఆయిల్ హెడ్ నొప్పులు తగ్గించడంలో సహాయపడుతుంది . మింట్ కూడా ఒక మూలికా ఆస్పిరిన్ అని చేప్పవచ్చు . నరాల నొప్పులను సహజంగా ఉపశమనం కలిగిస్తుంది పెప్పర్ మింట్. గోరువెచ్చని నీటిలో కొన్ని ఆకులను లేదా పెప్పర్ మింట్ ఆయిల్ 10చుక్కలు వేసి నానబెట్టి తీసుకోవడం వల్ల బాడీ పెయిన్స్ నుండి తక్షణ ఉపశమనం పొందవచ్చు. నరాలు విశ్రాంతి పొందుతాయి.

ఒళ్ళు నొప్పులను నివారించే బెస్ట్ ఫుడ్స్

ఒళ్ళు నొప్పులను నివారించే బెస్ట్ ఫుడ్స్

హాట్ మిరియాలు - ఇవి మీ కళ్ళువెంట నీరుగార్చడమే కాదు, నొప్పులతో పోరాడే గొప్ప ఔషధగుణాలు ఇందులో పుష్కలంగా ఉన్నాయి. హాట్ పెప్పర్ ఆర్థరైటిస్ నొప్పిని నివారించడంలో చాలా బాగా ఉపయోగపడుతాయి. మీ రెగ్యులర్ డైట్ లో చేర్చుకోవడం వల్ల మంచి ఉపయోగం ఉంటుంది.

ఒళ్ళు నొప్పులను నివారించే బెస్ట్ ఫుడ్స్

ఒళ్ళు నొప్పులను నివారించే బెస్ట్ ఫుడ్స్

గ్రీన్ టీ - గ్రీన్ టీ సాధారణంగా బరువు తగ్గించడం కోసం ఉపయోగిస్తారు, కానీ అది కూడా వాపులను తగ్గించడంలో సహాయపడే శోథ నిరోధక గుణాలను కలిగి ఉంది . గ్రీన్ టీ రోజువారీ ఒక కప్పు తీసుకోవడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు పొందవచ్చు.

ఒళ్ళు నొప్పులను నివారించే బెస్ట్ ఫుడ్స్

ఒళ్ళు నొప్పులను నివారించే బెస్ట్ ఫుడ్స్

ఆలివ్ ఆయిల్ - ఆలివ్ ఆయిల్ చాలా ఉపయోగకరం. ఇది నొప్పులను మరియు వాపులను నివారించడంలో అద్భుతంగా సహాయపడుతుంది. వంటకు ఆలివ్ ఆయిల్ ను ఉపయోగించడం చాలా ఉపయోగకరం మరియు ఆరోగ్యకరం కూడా..

English summary

Foods To Reduce Body Pain

Chronic Pain is now observed in 2 out of every 5 individuals. Either they suffer with back pain, joint pain or muscle sprains. This is due to lack of proper exercise and a bad lifestyle. One must regularly exercise, avoid unhealthy postures and eat healthy.
Desktop Bottom Promotion