Latest Updates
-
ఒక్కసారి చేస్తే ఏడాది పాటు నిల్వ ఉండే బంగాళదుంప పాపడాలు..ఇంట్లోనే చేసుకోండిలా.. -
ఫ్యాట్ తగ్గించి కండరాల బలాన్ని పెంచే పూర్వీకుల నాటి గంజి చారు.. పది నిమిషాల్లో అమృతం రెడీ.! -
బ్రహ్మ దేవుడికి కేవలం ఒక్క గుడి మాత్రమే ఎందుకుంది? బ్రహ్మను ఎవరూ పూజించరెందుకు? -
పాలు అస్సలు విరగకుండా.. బెల్లం పాయసం ఇలా ఈజీగా చేసేయండి..గిన్నె మొత్తం ఖాళీ అవ్వాల్సిందే! -
ఆల్కహాల్ తాగిన వెంటనే ట్యాబ్లెట్స్ వేసుకుంటున్నారా.. ఈ రోగాలు ఉన్నవారికి అలర్ట్.! -
పచ్చికారంతో అల్లం నిల్వ పచ్చడి.. హోటల్ స్టైల్లో ఇలా చేస్తే ఎన్ని రోజులైనా పాడవదు.! -
పొట్ట కొవ్వు కరగట్లేదా? మధ్యాహ్నం భోజనానికి ముందు ఈ డ్రింక్ తాగితే రిజల్ట్ పక్కా! -
పల్లెటూరి స్టైల్ ఉల్లికారం రోటి పచ్చడి.. ఒక్కసారి తింటే వదిలిపెట్టరు! -
ఇలాంటి బాస్ ఉంటే ఎన్ని కష్టాలొచ్చినా కంపెనీ వదలరు.. ఉద్యోగులకు సినిమా ట్విస్ట్‌ను మించిన సర్ప్రైజ్.! -
ఇంటి మెయిన్ డోర్ దగ్గర ఏ దేవుడి ఫొటోలు ఉంచాలి? వాస్తు శాస్త్రం ఏం చెబుతోంది?
శాకాహారులకు ముఖ్యమైన పోషక విలువలున్న ఫుడ్స్
పౌష్టికాహారమే శరీరాన్ని మనస్సును ఆరోగ్యంగా వుంచుతుంది. ఈ భోజనంలో శరీరానికి కావలసిన ఖనిజ పదార్థాలు, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లతోబాటు పోషకపదార్థాలుండాలి. ఇవన్నీ కలిసున్న భోజనమే అమృతంతో సమానం. మనం తీసుకునే భోజనం ప్రకృతి సిద్ధమైనదైవుండాలి. సమపాళ్ళలో తీసుకునే శాఖాహారం శరీరానికి అన్ని రకాల పోషకాలను అందిస్తుంది. దీంతో గుండెజబ్బులు, క్యాన్సర్, అధిక రక్తపోటు, మధుమేహం, కీళ్లనొప్పులు ఇతర జబ్బులనుండి కూడా బయట పడగలుగుతామని పరిశోధకులు తెలిపారు.
ఈ ఆధునిక యుగంలో మానవుడు తన ఆరోగ్యం కోసం పడని పాట్లంటూ లేవు. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు మన పెద్దలు. నిజమేకదా ! ఆరోగ్యంగావుంటే ఆయుషు కూడా పెరుగుతుంది. ముఖ్యంగా ఆహారంలో శాఖాహారం ఉత్తమం అంటున్నారు వైద్యులు. శాఖాహారం తీసుకుంటే అధిక రక్తపోటునుండి కూడా మనిషి తనుతాను కాపాడుకోవచ్చని పరిశోధకులు తెలిపారు. పౌష్టికాహారమే శరీరాన్ని మనస్సును ఆరోగ్యంగా వుంచుతుంది. ఈ భోజనంలో శరీరానికి కావలసిన ఖనిజ పదార్థాలు, ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు, విటమిన్లతోబాటు పోషకపదార్థాలుండాలి. ఇవన్నీ కలిసున్న భోజనమే అమృతంతో సమానం. మనం తీసుకునే భోజనం ప్రకృతి సిద్ధమైనదైవుండాలి.
మాంసాహారం అధికంగా తీసుకునేవారిలో అధిక రక్తపోటును గమనించామని అదే శాఖాహారం తీసుకున్నవారిలో అమినో ఆమ్లము అధికంగా వుందని లండన్‌లో జరిపిన పరిశోధనలో తేలినట్లు పరిశోధకులు తెలిపారు. ఈ అమినో ఆమ్లం రక్తపోటును నివారిస్తుంది. కాయగూరల్లో అమినో ఆమ్లంతోబాటు మెగ్నీషియం కూడా వుంటుందని ఇది రక్త పోటును క్రమబద్దీకరిస్తుందని పరిశోధకులు తెలిపారు. ఇంతేకాకుండా మాంసాహారుల్లో ఫైబర్ శాతం కూడా తక్కువగా వుంటుందని తేలింది. చాలా మంది మాంసాహారులు వారి ఆహారపు అలవాట్లను మార్చుకుని వేగన్ లేదా శాఖాహారానికి మారుతున్నారు.
మీరు కూడా అలాంటి మార్పు కోసం చూస్తూ ఎక్కడ ప్రారంభించాలో తెలియని స్థితిలో ఉంటే, ఈ క్రింది ఆహారాల గురించి ఖచ్చితంగా తెలుసుకోవాలి. ఈ వెజిటేరియన్ ఫుడ్స్ మీలోని హార్మోనులను, ప్రోటీనులు, ఫ్యాట్స్, మరియు కార్బోహైడ్రేట్స్ ను బ్యాలెస్ చేయడంలో అద్భుతంగా సహకరిస్తాయి. తగినన్ని పోషకాంశాలను అందిస్తాయి. కాబట్టి ఈ న్యూట్రీషియన్ ఫుడ్స్ ను మీ వెజిటేరియన్ డైట్ చేర్చుకోవాలి. మాంసాహారలలో ఉండే అవసరమైన ప్రోటీనుల, విటమినుల, పోషకాంశాలు ఉన్నటువంటి శాకాహారాలను ఒక సారి పరిశీలించండి...

జింక్ : ప్యూనట్ బట్టర్ లో మంచి కొవ్వులు కలిగిన ఒమేగా 3 కొవ్వు ఆమ్లాలు పుష్కలంగా కలిగి ఉంది. ఇవి మీ గుండె, మరియు నొప్పి నివారణకు రక్షించడానికి సహాయపడుతుంది. నెమ్మదిగా జీర్ణం అవ్వడమే కాక, దీర్ఘకాల శక్తిని అందిస్తుంది. జింక్ లో మీ శరీరానికి అవసరం అయ్యే పొటెన్షియల్ లో జింక్ లభ్యం అవుతుంది. కాబట్టి మీ వెజిటేరియన్ డైట్ లిస్ట్ లో దీన్ని చేర్చుకోండి.

విటమిన్ డి: సోయామిల్స్ విటమిన్ డి పుష్కలంగా ఉండేటువంటి శాకాహార డైరీ ప్రొడక్ట్. వెజిటేరియన్స్ వారంలో ఒకసారి ఒక గ్లాస్ సోయా మిల్క్ తాగితే చాలు. శరీరానికి అవసరమయ్యే విటమిన్ డి పుష్కలంగా అందుతుంది.

విటమిన్ బి12: వెజిటేరియన్ ఆహారం తీసుకొనే వారికి బి12 సప్లిమెంట్ రెగ్యులర్ గా అందాలి. కాబట్టి మష్రుమ్ లో బి12పుష్కలంగా ఉంది. ఇది ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమైన ఆహారం.

ప్రోటీన్స్: శాకాహారులైనటువంటి స్త్రీ మరియు పురుషులకు 55-45గ్రాములు ప్రోటీనులు అవసరం అవుతుంది. కాబట్టి వెజిటేరియన్స్ ప్రోటీనుల పుష్కలంగా ఉండే బీన్స్, పప్పులు, బఠానీలకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలి.

ఓమేగా 3ఫ్యాటీ యాసిడ్స్: శరీరంలో ఉండే కొవ్వులను శక్తివంతమైనవిగా ఉండేందుకు మరియు కొలెస్ట్రాల్ ను రెగ్యులేట్ చేయడానికి మరియు గుండె ఆరోగ్యానికి ఓమేగా 3ఫ్యాటీ యాసిడ్స్ చాలా అవసరం. కాబట్టి వెజిటేరియన్స్ కు ఓమేగా 3 ఫ్యాటీ యాసిడ్స్ ను పుష్కలంగా అంధించే ఫ్లాక్ సీడ్స్ ను రెగ్యులర్ డైట్ లిస్ట్ లో చేర్చుకోవడం చాలా అవసరం.

ఐరన్: శాకాహారగ్రస్తులు ఐరన్ పుష్కలంగా ఉండే వెరైటీ ఆకుకూరలను ఎంపిక చేసుకోవాలి. శరీరంలో ఐరన్ వల్ల హీమోగ్లోబిన్ ను అవసరం అయినంత ఉత్పత్తి అవుతుంది. వీటితో పాటు, పండ్లు, సెరల్స్, ధాన్యాలు వంటివి ఎక్కువగా తీసుకోవాలి.

ఉప్పు: శక్తిని నింపడంలో ఐయోడిన్ ప్రాధాన్యత కూడా ఉంది. కాబట్టి , ఐయోడిన్ ను సీఫుడ్ లో కనుగొనబడినది. కాబట్టి శాకాహారులకు కావల్సిన ఐయోడిన్ ను ఉప్పు ద్వారానే గ్రహించాలి.

క్యాల్షియం: క్యాల్షియం అంటానే డైరీ ప్రొడక్ట్స్ మీదకే వెళుతుంది. అయితే వెజిటేరియన్స్ కోసం బ్రొకోలీ, కేల వంటివి ఆహారాల్లో కూడా అధిక కాల్షియం ఉంటుంది.



Click it and Unblock the Notifications
