యోగాసనాలు వేయ్యండి..సంతానోత్పత్తి పెంచుకోండి..!

మానసిక ప్రశాంతతకు మరియు శరీరక ప్రశాంతతకు యోగా చాలా మంచిది. ఇది పురాతన వ్యాయామంలో ఒకటి. మీ మనస్సును మరియు శరీరానికి విశ్రాంతిని కలిగించి, శరీరం దృఢంగా ఉంచడానికి బాగా సహాయపడుతుంది. ప్రస్తుత కాలంలో ప్రపంచంలోని చాలా మంది ప్రజలు యోగ చేయడానికి ఇష్టపడుతున్నారు. అందుచేతే ఇది ఆరోగ్యకరమైన మరియు సహజ పద్దతిగా భావిస్తారు. అందువలన, యోగా ప్రపంచవాప్తంగా అత్యంత ప్రాచుర్యం పొందింది. ఊబకాయం, గుండె సంబంధిత సమస్యలు, నరాల బలహీనత, సైనస్, కీళ్ళవాతం మొదలైనవి అధిగమించడానికి పురాతన కాలం నుండి యోగాసనాలు బాగా సహాయపడ్డాయి.

అంతే కాకుండా యోగాసనాలు వంధ్యత్వం(పిల్లలు కలుగకపోవడం)పురుషుల్లో అంగస్తంభన సమస్యలు వంటి అనేక పునరుత్పత్తి సమస్యలను పరిష్కరించేందుకు ఈ యోగాసనాలు చాలా బాగా సహాయపడ్డాయి. అయితే ప్రస్తుతకాలంలో మార్కెట్లో అందుకు అనేక రకాల ట్రీట్మెంట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ట్రీట్మెంట్ లో ఉపయోగించి మందుల, మాత్రలు రసాయనికంగా తయారు చేయబడినవి కాబట్టి ఇవి చాలా వరకు సైడ్ ఎఫెక్ట్ ప్రభావాలను కలిగి ఉంటాయి. కాబట్టి, ఇక్కడ మహిళలకు మరియు పురుషులకు సహజపద్దతులో సంతానోత్పత్తి పెంచడానికి కొన్ని యోగాసనాలు ఉన్నాయి. కాబట్టి మీరు వంధ్యత్వానికి మరియు భావన సమస్యలకు గురిఅవుతుంటే..ఈ కొన్ని యోగాసనాలు క్రమం తప్పకుండా చేయడం వల్ల సంతానోత్పత్తిని పెంచుకోవచ్చు. అంతే కాదు ఒత్తిడి తగ్గించుకొని విశ్రాంతిని పొందవచ్చు. గర్భాధారణ సమయంలో ఒత్తిడి నుండి బయటపడటానికి మరియు ప్రశాంతతకు ,ఆరోగ్యకరమైన శరీరం మరియు మస్సు పొందాలంటే ఈ యోగాసనాలు చేయవచ్చు. మరి అవేంటో చూద్దాం..

సంతానోత్పత్తిని పెంచే యోగాసనాలు...!

స్టాఫ్ భంగిమ లేదా ధండనాసన: ఈ యోగా చేయడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది, రక్త ప్రసరణ తగ్గించడానికి, గర్భాదారణ పొందడానికి ఈ ఆసనం సహాయపడుతుంది.

సంతానోత్పత్తిని పెంచే యోగాసనాలు...!

రిక్లింగ్ హీరో భంగిమ: మహిళలు మరియు పురుషులు ఇద్దరూ వంధ్యత్వానికి గురిఅవుతుంటే ఈ యోగసానం చేయడం మంచిది. సంతానోత్పత్తిని పెంచుకోవడానికి ఈ యోగాసనం ప్రయత్నించవచ్చు. ఈ యోగాసనంలో పునరుత్పత్తి భాగాలు బాగా విస్తరించేట్లు చేస్తాయి. లేదా పెంచుతాయి.

సంతానోత్పత్తిని పెంచే యోగాసనాలు...!

బద్దకోణాసనం: ఈ యోగాసనం చేయడం వల్ల ప్రశాంతతో పాటు పెల్విక్ కండరాలు తెరచుకుంటాయి. అంతే కాదు బ్లడ్ సర్క్యులేషన్ పెంచుతుంది. ఇలా చేస్తే అండాశయాలు, గర్భాశయం దృఢం అవుతాయి. అండాశయాల్లో లోపాలు తగ్గి వాటికి బలం చేకూరుతుంది. తరచూ గర్భస్రావాలు అయ్యేవారికి ఈ ఆసనం ఎంతో మేలు చేస్తుంది. త్వరగా సులభంగా కన్వీన్స్ అవ్వడానికి ఇది బాగా సహాయపడుతుంది.

సంతానోత్పత్తిని పెంచే యోగాసనాలు...!

పశ్చిమోత్తా నాసన: దీన్ని ఫార్వర్డ్ బెండ్ అని కూడా పిలుస్తారు. ఈ యోగా భంగిమ ఉదరంలో పేరుకొన్న కొవ్వును తగ్గిస్తుంది. మరియు వెన్ను నొప్పిని తగ్గిస్తుంది. చక్కగా పడుకుని రెండు పాదాలు దగ్గరగా ఉంచి రెండు చేతులు తలపైకి లేపి నేలకానించి గాలి పీలుస్తూ లేచి కుర్చుని గాలి వదులుతూ ముందుకు వంగాలి. తల మోకాళ్ళ వైపు, చేతులు పాదాల వైపు పోనిచ్చి వాటిని అన్చాడానికి ప్రయత్నిచాలి. ప్రారంభంలో తల మోకాళ్ళకు తగలకపోవచ్చు, చేతులు పాదాలకు అందకపోవచ్చు, కాని రోజు సాదన వల్ల సాధ్యమవుతుంది. దీని వల్ల జీర్ణక్రియ క్రమంగా పనిచేస్తుంది, గ్యాస్ట్రిక్ సమస్యలను నివారిస్తుంది. సంతానోత్పత్తికి సహాయపడుతుంది.

సంతానోత్పత్తిని పెంచే యోగాసనాలు...!

విపరీత కర్ణి: సంతాన లేమితో బాధపడేవారు విపరీతకర్ణిని విభిన్నంగా వేయాల్సి ఉంటుంది. గోడకి ఒక దిండు లాంటి దాన్ని వేసుకొని పిరుదులని దిండుపై ఉంచి కాళ్లని నిటారుగా గోడకి తాకించాలి. నడుం, భుజాలు, తల నేలపై ఉండాలి. రెండు చేతులు తలకి ఇరువైపులా విశ్రాంత స్థితిలో ఉండాలి. కళ్లు మూసుకొని నెమ్మదిగా శ్వాస తీసుకొని వదులుతూ ఉండాలి. ఒక పెద్ద జలపాతం.. పై నుంచి కిందకి నీరు ప్రవహిస్తున్నట్టుగా వూహించుకొంటూ ఈ ఆసన స్థితిలోకి వెళ్లాలి. దీనివల్ల శరీరం మొత్తానికి రక్తప్రసరణ సజావుగా జరుగుతుంది. పిరుదుల నుంచి గుండెకు అక్కణ్నుంచి మెదడుకి రక్తం చేరుతున్నట్టుగా వూహించుకోవాలి. ఈ స్థితిలో మూడు నిమిషాల వరకు ఉండాలి. ఇలా చేయడం వల్ల నాడీ వ్యవస్థకి విశ్రాంతి స్థితి లభిస్తుంది. అధిక ఒత్తిడిదూరమవుతుంది. గ్రంథుల పనితీరు మెరుగుపడుతుంది. హార్మోన్ల లోపం ఉన్నవారికి, ఫెల్లోపియన్‌ ట్యూబుల్లో ఇబ్బందులున్న వారు ఈ ఆసనం వేయొచ్చు.

సంతానోత్పత్తిని పెంచే యోగాసనాలు...!

ముందుకు కూర్చి ఒక భంగిమ: వంధ్యత్వం సమస్యలు అధిగమించడానికి మహిళలకు ఉన్నటువంటి సమర్థవంతమైన యోగాసనం ఇది. ముందుకు కూడా కూర్చునే ఈ కోణం పెల్విక్ ప్రాంతానికి రక్తప్రసరణను అంధిస్తుంది.

సంతానోత్పత్తిని పెంచే యోగాసనాలు...!

బ్రిడ్జ్ పోజ్(సేతు బంధాసనం): వెల్లకిలా పడుకొని రెండు మోకాళ్లని మడిచి పిరుదులకు దగ్గరగా ఉంచాలి. రెండు చేతులతో కాలి మడమలని పట్టుకోవాలి. ఇప్పుడు సాధ్యమైనంత వరకు నడుమును పైకి లేపి ఉంచాలి. తలను అతిగా కదిలించకూడదు. కాస్త పైకి లేపి ఉంచాలి. ఈ స్థితిలో పది నుంచి ఇరవై సెకన్ల వరకు ఉండాలి. శ్వాస మామూలుగా తీసుకోవాలి. నెమ్మదిగా సమస్థితిలోకి రావాలి. తిరిగి మరల ఇదే విధంగా చెయ్యాలి. ఇలా ఐదారుసార్లు మూడేసి నిమిషాల పాటు చెయ్యాలి. ఈ ఆసనం చెయ్యడం వల్ల హార్మోన్ల అసమతుల్యత తొలగి.. సంతాన సాఫల్యత పెరుగుతుంది. పిరుదుల దగ్గర పేరుకొనే కొవ్వు తగ్గుతుంది.

సంతానోత్పత్తిని పెంచే యోగాసనాలు...!

హెడ్ స్టాండ్ యోగాసనం: ఇదొక విలోమ యోగాసానం. ఇది శరీరంలో అన్ని భాగాలకు రక్తప్రసరణ అందేలా చేస్తుంది. మరియు బరువు తగ్గించడానికి సహాయపడుతుంది. సంతానోత్పత్తిని పెంచుతుంది.

సంతానోత్పత్తిని పెంచే యోగాసనాలు...!

పద్మాసన ముద్ర: ముందుగా పద్మాసనంలో కూర్చోవాలి. ఎడమ పాదాన్ని కుడి తొడపై, కుడిపాదాన్ని ఎడమ తొడపై ఉంచాలి. వెన్నెముక నిటారుగా ఉంచి రెండు చేతుల చివరి వేళ్లని కలపాలి. ఇలా కలిపినప్పుడు నాలుగు వేళ్లు కిందకి బొటనవేళ్లు పైకి ఉండాలి. అన్ని వేళ్ల చివర్లు కలిపి ఉంచాలి. ఇలా చేసినప్పుడు మధ్యలో రావి ఆకులాంటి ఆకృతి కనిపించాలి. రెండు చేతులు నాభి దగ్గర ఉంచి కళ్లు మూసుకొని ప్రశాంతంగా ఉండాలి. చేతులు పొట్టకి తాకించకూడదు. ఇలా ఐదు నిమిషాలు చెయ్యాలి. దీనిని యోని ముద్ర అనీ అంటారు. పద్మాసనంలో చెయ్యలేని వారు సుఖాసనంలో చెయొచ్చు. ఈ ముద్ర గర్భాశయ, అండాశయ లోపాలని సరిచేస్తుంది. నాడులన్నీ ఉత్తేజితం అవుతాయి.

సంతానోత్పత్తిని పెంచే యోగాసనాలు...!

ఉపవిస్త కోణాసనం: మందపాటి దుప్పటిని మడతపెట్టి దాని మీద కూర్చోవాలి. రెండు కాళ్లనీ సాధ్యమైనంత దూరంగా పెట్టాలి. రెండు అరచేతులని రెండు కాళ్ల మధ్యలో పెట్టి మెల్లగా రెండు చేతులని సాధ్యమైనంత ముందుకు జరుపుతూ పెట్టాలి. ఈ స్థితిలో పది నుంచి ముప్ఫై సెకన్లపాటు ఉండాలి. మెల్లగా రెండు చేతులని వెనక్కి జరుపుతూ సమస్థితికి రావాలి. ఇలా నాలుగైదు సార్లు చెయ్యాలి. ఈ ఆసనం చేస్తున్నప్పుడు మోకాళ్లని పైకి లేపకూడదు. ఈ అభ్యాసంతో కటివలయ ఇబ్బందులు తొలగుతాయి. అండాశయాలు ఆరోగ్యంగా ఉంటాయి. నెలసరి సమస్యలు, సంతానలేమి సమస్యలు తొలగుతాయి.

Story first published: Tuesday, February 19, 2013, 16:30 [IST]
Desktop Bottom Promotion