For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

కాలిన గాయలకు వెంటనే ఇంట్లో చేసే చికిత్సా పద్దతు

By Super
|

సాధారణంగా స్కిన్ బర్న్ అనేది కఠినమైన సూర్యకిరణాల వల్ల, వేడి మరియు మంటల వల్ల స్కిన్ బర్న్ అవుతుంది. ఈ స్కిన్ బర్న్ చాలా పెద్దివి కావావచ్చు మరియు చిన్నవి కావచ్చు. కాలిన చర్మం వాపు మరియు చర్మం ఎర్రగా మారడం, చర్మ కణజాలాలను నాశనం చేయడం జరుగుతుంది . స్కిన్ బర్న్ అయితే, అందుకు సరైన జాగ్రత్తలు తీసుకోవడం చాలా అవసరం. సరైన సమయంలో సరైన జాగ్రత్తలు తీసుకోకపోతే స్కిన్ క్యాన్సర్ వచ్చే ప్రమాధం ఉంది.

స్కిన్ బర్న్ లో ప్రధానంగా మూడు రకాలున్నాయి. వాటిలో మొదటిది కాలిన గాయలు, ఇవి చాలా చిన్నగాయాలు. దీనివల్ల చర్మం బాహ్య చర్మపు పొర వాపు కలిగి ఉంటాయి. ఈ స్కిన్ బర్న్ ను కొన్ని హోం మేడ్ రెమడీస్ తో నివారించుకోవచ్చు. మరియు అంత ప్రమాధకరమైనవి కావు. ఇక ఇతర రెండూ సెకండ్ డిగ్రీ బర్న్ మరియు థర్డ్ డిగ్రీ బర్స్ . ఈ రెండూ కూడా తీవ్రమైన కణజాల నష్టం కలిగిస్తుంది మరియు వీటికి శిక్షణ పొందిన వైద్యుడు పర్యవేక్షణలో చికిత్స చేయాలి .

ఈ వ్యాసం లో మేము మొదటి డిగ్రీ కాలిన కొన్ని నివారణలు చర్చించడం జరిగింది. ఈ కొన్ని గృహ పద్ధతులను ఉపయోగించి చికిత్స చేయవచ్చు . ఉత్తమ నివారణలు చిట్కాలేంటో ఒక సారి చూడండి -

1 . తేనె -

1 . తేనె -

ఇది కాలిన గాయాలకు చాలా సాధారణంగా ఉపయోగించే ఒక సహజ రెమడీ, కాలిన గాయాల మీద తేనెను రాయడం వల్ల స్కార్స్ చాలా తక్కువగా ఏర్పడుతాయి. తాజాగా తీసిన తేనెల యాంటిసెప్టిక్ మరియు మంటను తగ్గించే గుణాలు పుష్కలంగా ఉన్నందున తాజా తేనెను ఉపయోగించండి.

2 . వినెగార్ -

2 . వినెగార్ -

కాలిన గాయలకు ద్రవంలా ఉండే ఈ పదార్థము ను అప్లై చేయడం వల్ల గాయాలకు మంచి ఉపశమనానికి మరియు చల్లని అనుభూతి ఇవ్వడానికి ఉపయోగకరంగా ఉంటుంది . వెగినగార్ ను ఉపయోగించే ముందు నీటిలో కొద్దిగా వేసి మిక్స్ చేసి అప్లై చేయాలి. మద్యమద్యలో లేదా తరచూ వెనిగార్ ను కాలిన గాయాల మీద అప్లై చేస్తుండటం వల్ల బర్నింగ్ నొప్పిని మరియు వాపును తగ్గిస్తుంది.

3 .అలొవెరా -

3 .అలొవెరా -

కలబందలో ఉండే acemannen కంటెంట్ చర్మం మంట నయం చేసే శక్తి ని కలిగి ఉంటుంది. ఇది స్కిన్ బర్న్ ను చాలా త్వరగా ఉపశమనం కలిగిస్తుంది. కాలిన గాయాల మీద అలొవెరా జెల్ ను డైరెక్ట్ గా ఉపయోగించవచ్చు. అలోవెరా జెల్ లో ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు మరియు కాలిన గాయాలాను చాలా త్వరగా మాన్పుతుంది. చల్లదనాన్ని కలిగిస్తుంది. బాగా కాలిన గాయాల మీద అలోవెరా జెల్ ను ఉపయోగించడం వల్ల ఎటువంటి స్కార్స్ ఏర్పడవు.

4 . సజల లావెండర్ ఆయిల్ -

4 . సజల లావెండర్ ఆయిల్ -

పలచగా ఉండే ల్యావెండర్ ఆయిల్ కూడా కాలిన గాయాలను నయం చేయడంతో పాటు నొప్పిని నివారిస్తుంది. అలోవెరా జెల్, విటమిన్ సి, లావెండ్ ఆయిల్ మరియు విటమిన్ ఇ యొక్క కాంబినేషన్ లో ఒక ఉత్తమ పరిష్కారంగా పనిచేస్తుంది. ఈ మిశ్రమాన్ని కాలిన గాయాలకు రోజంతా అప్పుడప్పుడు రాస్తుండాలి. ఇది స్కిన్ బర్న్ మరియు వాపును, మరియు నొప్పిని తగ్గిస్తుంది మరియు చర్మం మంటను కూడా త్తగిస్తుంది.

5 . అరటి తొక్క:

5 . అరటి తొక్క:

ఇది కాలిన చర్మ గాయాలను నయం చేడంలో, మంట మరియు వాపు వంటివాటిని ఉపశమనం కలిగించడంలో అద్భుతంగా పనిచేస్తుందని నిరూపించబడింది. ఇది చర్మానికి rejuvenates చేస్తుంది మరియు మంట నొప్పి తగ్గిస్తుంది . అరటి తొక్కను కాలిన గాయాలకు మీద పూర్తిగా అప్లై చేయవచ్చు. అరటి తొక్క మరియు పెరుగు రెండింటి కాంబినేషన్ లో అప్లై చేయడం వల్ల స్కిన్ బర్న్ కు మంచి ఉపయోగకరంగా ఉంటుంది.

6 . చల్లని నీరు -

6 . చల్లని నీరు -

చర్మం మీద కాలిన గాయాల మీద వెంటనే చల్లని నీరు పోయడం లేదా ఐస్ క్యూబ్ లను పెట్టడం కానీ చేయాలి. ఇలా చేయడం వల్ల స్కిన్ బర్న్ అయిన చోట నొప్పి తగ్గించడంలో చాలా ఉపయోగకరంగా పనిచేస్తుంది. ఈ చిట్కా తాత్కాలిక పరిష్కారం మాత్రమే. మరియు స్కిన్ బర్న్ అయిన వెంటనే మొదటి చేయాల్సిన చిట్కా ఇది.

7 . అనారోగ్యాలు మరియు మాయిశ్చరైజర్స్:

7 . అనారోగ్యాలు మరియు మాయిశ్చరైజర్స్:

కాలిన గాయలు ఎక్కువగా మండుతున్నట్లైతే మాయిశ్చరైజ్ అప్లై చేయడం వల్ల మంటను తగ్గిస్తుంది. కాలిన చర్మం మీద మాయిశ్చరైజ్ లేదా స్కిన్ ఎలిమెంట్స్ ను వెంటనే ఉపయోగించాలి. ఇది చర్మం మంటను తగ్గిస్తుంది మరియు చర్మానికి చల్లదనాన్ని కలిగిస్తుంది. ఇవి చాలా సులభంగా మెడికల్ స్టోర్స్ లో లభ్యం అవుతున్నాయి.

8. డాక్టర్:

8. డాక్టర్:

పైన నివారణలు ఏ సరిగా పనిచేయకపోతే మరియు నొప్పి అలాగే ఉంటే మీరు వెంటనే ఒక వైద్యుడుని తప్పకుండా సంప్రదించాలి. కాలిన వెంటన తగిన చికిత్సా పద్దతు పాటించకపోతే చర్మం మీద స్కార్స్ ఏర్పడం లేదా డ్యామేజ్ అవ్వడం జరుగుతుంది. స్కిన్ బర్న్ కు చాలా జాగ్రత్తగా చికిత్సనందించడం చాలా అవసరం.

English summary

Remedies to treat skin burn

Skin burns are caused by sun radiations, heat and fire. They can be either minor or major burns. These burns cause swelling and reddenin ok skin damaging the skin tissues. Hence skin burns should be taken proper care as they might cause seriohs skin concerns.
Story first published: Saturday, November 23, 2013, 18:35 [IST]
Desktop Bottom Promotion