Latest Updates
-
సండే స్పెషల్ గా తమిళనాడు ఫేమస్ ముట్టా ఇడ్లీ..10 నిమిషాల్లో ఈ హై ప్రొటీన్ బ్రేక్ ఫాస్ట్ ఎలా చేయాలంటే.. -
Women Alert: ఫంక్షన్ ఉందని పీరియడ్స్ ట్యాబ్లెట్ వేసుకున్న మహిళ మృతి..నిపుణులు ఏమంటున్నారంటే? -
ఆరోగ్యానికి సంజీవని,రుచిలో అమోఘం..మునగాకు మామిడికాయ పప్పు ఎలా చేసుకోవాలంటే.. -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ డిన్నర్..చియా రైతా చేయండిలా..కడుపుకు హాయిగా, క్యాలరీలు తక్కువగా.. -
Best Snacks For Fatty Liver: ఆకలి తీరాలి, లివర్ సేఫ్ గా ఉండాలా?..అయితే ఈ స్నాక్స్ తినండి! -
శంషాబాద్ ఎయిర్పోర్ట్లో మళ్లీ బాంబు బెదిరింపుల కలకలం… ప్రయాణికులు ఈ విషయం తెలుసుకోకపోతే ఇబ్బందులు తప్పవు! -
మండు వేసవిలో కడుపును చల్లగా ఉంచే కమ్మని దహీ ఆలూ కర్రీ..ఇంట్లోనే చాలా ఈజీగా చేసేయండిలా.. -
జీవితంలో 3 సార్లే స్నానం..అయినా ఈ మహిళల చర్మం అంత కాంతివంతంగా ఎలా ఉంటుందంటే? -
పెట్రోల్, డీజిల్ ధరల మోత.. సామాన్యుల జేబుకు చిల్లు, ఈ చిట్కాలతో ఖర్చు తగ్గించుకోండి! -
డయాబెటిస్, బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్ బ్రేక్ ఫాస్ట్..మృదువైన జొన్న ఢోక్లా ఎలా చేసుకోవాలంటే..
బ్రిస్క్ వాక్ తో 10 గొప్ప ఆరోగ్య ప్రయోజనాలు
నడకతో అద్భుతమైన ప్రయోజనాలున్నాయన్నా విషయం మీకు తెలుసా? నడక నిధానంగా లేదా స్పీడ్ గా నడవడం వల్ల శరీరానికి ఒక అద్భుతమైన వ్యాయామం. వ్యాయామాల్లో అత్యంత సులభమైనది మరియు తేలికైనది నడక మాత్రమే. నడకతో ప్రధానంగా తొడలు మరియు పిరుదల వద్ద చేరిన కొవ్వును కరిగించుకోవడానికి సహాయపడుతుంది.
శరీర ఆరోగ్యం మొత్తాన్ని మెయింటైన్ చేయడానికి బ్రిస్క్ వాస్ ఒక ఎక్సలెంట్ వ్యాయామం. బ్రిస్క్ వాక్(స్పీడ్ గా నడవడం)వల్ల శరీరానికి అనేక ప్రయోజనాలను పొందవచ్చు. బ్రిస్క్ వాక్ వల్ల త్వరగా బరువు తగ్గుతారని కొన్ని పరిశోధనల ద్వారా కూడా నిరూపించబడింది, బాడీ ఫ్యాట్ కరిగించి, ఎముకలకు తగినంత బలాన్ని చేకూర్చుతుంది మరియు శరీరాన్ని సమతుల్యం చేయడంలో మరియు కోఆర్డినేట్ చేయడం వల్ల మరియు హైకొలెస్ట్రాల్ లెవల్స్ తగ్గించడంలో మరియు శరీర ఛాయను కాంతివంతంగా మార్చడంలో బ్రిస్క్ వాక్ అద్భుతంగా సహాయపడుతుంది.
ప్రతి రోజూ రెగ్యులర్ గా 20నుండి 25నిముషాలు బ్రిస్క్ వాక్ చేయడం ద్వారా హార్ట్ డిసీజ్, డయాబెటిస్ మరియు డిప్రెషన్ వంటివి చాలా వరకూ తగ్గించుకోవచ్చు. బ్రిస్క్ వాక్ తో బోలెడ్ ప్రయోజనాలున్నాయి. ప్రస్తుత ఒత్తిడితో కూడిన జీవనశైలికి జిమ్ ఒక్కటే సరిపోదు. జిమ్ తో పాటు ఖచ్చితంగా బ్రిస్క్ వాక్ చేయడం వల్ల చాలా ప్రయోజనాలను పొందవచ్చు.
బ్రిస్క్ వాక్ సాధారణ వస్తువులు అవసరం అవుతాయి. మరియు బ్రిస్క్ వాక్ ను రోజులో ఏ సమయంలోనైనా చేయవచ్చు. ఇటువంటి ఏరోబిక్ కార్యక్రమం వల్ల మన మైండ్ ఫ్రెష్ అప్ అవుతుంది. మీ జీవన శైలి యొక్క క్వాలిటీని పెంచతుంది అంతే కాదు మిమ్మల్ని ఫిజికల్ గా కూడా ఫిట్ గా ఉండేలా సహాయపడుతుంది. అందుకు మీకు సహాయపడే కొన్నిబ్రిస్క్ వాకింగ్ బెనిఫిట్స్ ఈ క్రింది విధంగా ఉన్నాయి...

కొలెస్ట్రాల్ లెవల్స్ ను తగ్గిస్తుంది:
రెగ్యులర్ గా ప్రతి రోజూ అరగంట బ్రిస్క్ వాక్ చేయడం ద్వారా మీ శరీరంలో కొలెస్ట్రాల్ లెవల్స్ మరియు బాడ్ కొలెస్ట్రాల్ తగ్గుతుంది. దాంతో బ్రిస్క్ వాక్ వల్ల ఒక గొప్ప ప్రయోజనం గుండె సంబంధిత సమస్యలు రాకుండా నివారించుకోవచ్చు. కొలెస్ట్రాల్ లెవల్స్ ను కంట్రోల్లో ఉంచుకోవడానికి బ్రిస్క్ వాక్ చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. బ్రిస్క్ వాక్ హార్ట్ కు మరియు సర్కులేషన్ సిస్టమ్ కు చాలా గొప్పగా సహాయపడుతుంది.

హార్ట్ హెల్త్ కు గొప్పది:
బ్రిస్క్ వాక్ వల్ల బరువు కంట్రోల్లో ఉంచుకోవడానికి సహాయపడుతుంది అలాగే 90నిముషాలు ఫాస్ట్ వాకింగ్ బరువు తగ్గడానికి సహాయపడుతుంది మరియు హార్ట్ హెల్త్ ను మెరుగుపరుస్తుంది . మీరు ఎటువంటి వ్యాయామాన్ని మొదలుపెట్టాలన్నా మీ డాక్టర్ ను ఒక సారి సంప్రదించడం మంచిది.

హైపర్ టెన్షన్ మరియు డయాబెటిస్ ను తగ్గిస్తుంది:
రెగ్యులర్ బ్రిస్క్ వాక్ వల్ల బియంఐ(బాడీ మాస్ ఇండెక్స్) మరియు డయాబెటిస్ తో బాధపడే వారిలో బ్లడ్ ప్రెజర్ లెవల్స్ ను కంట్రోల్ చేయడంలో గొప్పగా సహాయపడుతుందని సైంటిఫిక్ గా నిరూపించబడింది.

గ్లైసిమిక్ కంట్రోల్ ను మెరుగుపరుస్తుంది:
భోజనం చేసిన తర్వాత బ్రిస్క్ వాక్ చేయడం ద్వారా బ్లడ్ గ్లూకోజ్ లెవల్స్ పెద్దవారిలో కంట్రోల్ అవుతుంది.

క్యాన్సర్ మరియు క్యాన్సర్ ప్రభావాలను తగ్గిస్తుంది:
బ్రిస్క్ వాక్ వల్ల బ్రెస్ట్ క్యాన్సర్ మరియు కోలన్ క్యాన్సర్ వంటివి తగ్గిస్తుంది. బ్రిస్క్ వాక్ వల్ల 50ఏళ్ళు పైబడ్డ మహిళల్లో ఎటువంటి వ్యాధులు పెరగకుండా సహాయపడుతుంది. క్యాన్సర్ కారక హార్మోనులు ఈస్ట్రోజన్ మరియు ఇన్సులిన్ ను ఉత్పత్తిని శరీరంలో తగ్గిస్తుంది.

మిస్ క్యారేజ్ కాకుండా రక్షణ కల్పిస్తుంది:
ఈ విషయం కొంత మందిలో చిన్న పాటు సందేహం కలగవచ్చు మరియు అయితే, గర్భధారణ సమయంలో నడకవల్ల అలసట మరియు గర్భధారణ మధుమేహంను తగ్గిస్తుంది. బ్రిస్క్ వాకింగ్ ప్రయోజనాల్లో మరోకటి హర్మోన్లలో హెచ్చుతగ్గులు సమతుల్యం చేస్తుంది. దాంతో గర్భస్రావం అవ్వకుండా వ్యతిరేకంగా రక్షణ కల్పించడానికి సాధ్యం అవుతుంది.

ఎముకల ఆరోగ్యానికి మంచిది:
హిప్ ఫ్ర్యాక్చర్ రిస్క్ ను తగ్గించడానికి బిస్క్ వాక్ 40శాతం వరకూ చాలా గొప్పదని చెబుతారు . శరీరంలోపల ఎముకలు బలంగా పెరగడానికి, బలంగా ఉండటానికి చాలా గొప్పగా సహాయపడుతుంది

బ్రెయిన్ యాక్టివ్ గా ఉంటుంది:
మీ అంతట మీరు చురుకుగా ఉత్సాహంగా, మానసిక స్థితి చురుకుగా ఉండేందుకు అరగంట బ్రిస్క్ వాక్ చాలా గ్రేట్ గా సహాయపడుతుంది. వయస్సు పైబడే క్రొద్ది వచ్చే అల్జైమర్స్ వంటి సమస్యలను ఎదుర్కోవడానికి బ్రిస్క్ వాక్ బాగా సహాయపడుతుంది.

మనస్సును ప్రశాతం పరుస్తుంది:
బ్రిస్క్ వాక్ క్యాలరీలను కరిగించడం మాత్రమే కాదు, శరీరాన్ని తేలికగా మార్చి, తిరిగి శక్తిని పుంజుకోవడానికి సహాయపడుతుంది. వాకింగ్ వల్ల మీరు మరింత బెటర్ గా ఫీల్ అవుతారు .

సెక్స్ లైఫ్ ను మెరుగుపరుస్తుంది:
బ్రిస్క్ వాల్ సెక్స్ లైఫ్ ను మెరుగుపరుస్తుంది. శరీరంలో రక్త ప్రవాహం మరియు సర్కులేషన్ మెరుగుపడి, సెక్స్ లైవ్ ను మెరుగుపరుస్తుంది.



Click it and Unblock the Notifications