Latest Updates
-
గ్యాస్ కష్టాలకు చెక్: పొయ్యి వెలిగించకుండానే వేడి వేడి ఇడ్లీ, టేస్టీ చట్నీ..ఎలా చేసుకోవాలంటే.. -
ఓరల్ శృంగారం చేస్తున్నారా? యువత కచ్చితంగా తెలుసుకోవాల్సిన నిజాలు! -
బరువు తగ్గాలనుకునే వారికి బెస్ట్..కర్ణాటక స్పెషల్ అక్కి రోటీ..రుచి చూస్తే మళ్లీ మళ్లీ కావాలంటారు! -
కప్పు రవ్వతో కమ్మటి స్వీట్ బోండా.. నోట్లో వేస్తే కరిగిపోవాల్సిందే..ఎలా చేసుకోవాలంటే.. -
గ్యాస్ స్టవ్ తో పనే లేదు..కేవలం 10 నిమిషాల్లో కమ్మని పచ్చి పులి రసం..వేసవిలో అమృతమే! -
రెస్టారెంట్ స్టైల్ రోజ్ ఫలూదా..గుటకలో స్వర్గం చూపే చల్లచల్లని డెజర్ట్ డ్రింక్! -
రెస్టారెంట్ స్టైల్ పల్లీ-కొబ్బరి చట్నీ..బోండా,ఇడ్లీ,దోసెల్లోకి అదిరిపోయే కాంబినేషన్..ఎలా చేసుకోవాలంటే.. -
మజ్జిగ vs కొబ్బరి నీళ్లు..ఎండాకాలంలో ఏది తాగితే ఎక్కువ లాభం? -
మండుతున్న ఎండలకు చెక్..సమ్మర్ లో మిమ్మల్ని చల్లగా ఉంచే అద్భుతమైన బూందీ రైతా..ఎలా చేసుకోవాలంటే.. -
ఇడ్లీ, దోసల్లోకి అదిరిపోయే కాంబినేషన్..పుల్లపుల్లని, కారంకారమైన జామకాయ చట్నీ..ఎలా చేసుకోవాలంటే..
వేసవితాపానికి బెస్ట్ మెడిసన్ ఫ్రెష్ పుదీనా జ్యూస్
మన పెరటి మొక్కల్లో ఎంతో విలువైన మొక్కల్లో పుదీనా ఒకటి. పుదీనా ఆకు ప్రపంచ వ్యాప్తంగా ప్రాచీన కాలంనుండి ఎంతోమంది ప్రజలు ఒక ఔషధంగా వాడుతున్నారు. పుదీనాలో అనేక రకాలున్నాయి. ప్రతి రకం పుదీనాకి ఒకో రకమైన మంచి రుచి, వాసనలున్నాయి. మన ఇండ్లలో చేసుకునే అనేక వంటకాలకు రుచి, వాసన, దాని ఔషధ ప్రయోజనాలకు గాను పుదీనాను చేరుస్తాము. చిరుతిండ్లు, పండ్ల రసాల, సలాడ్లు, ఏవైనా సరే పుదీనా ఆకు పడాల్సిందే.
పుదీనా ఆకులను వంటకాలలో ప్రధాన సుగంధంగా భారతీయులు, మధ్య ప్రాచ్చ దేశాలవారు అధికంగా వాడతారు. రుచికరమైన పెరుగుకు పుదీనా జోడించి తింటారు లేదా వీరు తాగే టీని పుదీనా ఆకులు వేసి తయారు చేసి తాగుతారు. పుదీనా చాయ్ మనదేశంలోని కొన్ని ప్రాంతాలలో బాగా పేరుపడింది. ధాయ్ వంటకాలలో దీనిని సూప్ లలోను ఇతర కూరలలోను వాడతారు. యూరప్ దేశాలలోని పుదీనా మొక్క కంటే ఆసియా దేశపు పుదీనా మొక్క మంచి వాసన, రుచి కలిగి వుంటాయి.
పుదీనా ప్రత్యేకమైన సువాసన... మెదడుని సానుకూలంగా ప్రభావితం చేసే శక్తి పుదీనా ఆకులకు సొంతం. గ్రీన్ చట్ని తయారీలో, బిర్యానిలో తప్ప దీనికి మరేం ప్రయోజనాలుంటాయి అనుకోవచ్చు. దీనిలో ఔషధ గుణాలతో పాటు, జీవక్రియని సమర్దంగా నడిపించే పోషకాలూ పుష్కలమే! చాలా రకాల వ్యాధులకి తయారు చేసే ఔషధాల్లో పుదీనా (మింట్) ఎక్కువ శాతం వాడకంలో ఉండటం వల్ల ప్రపంచవ్యాప్తంగా దీనికి ఎంతో డిమాండ్ ఉంది. పుదీనా ఫ్లేవర్‌తో తయారైన ఏ ప్రొడక్టకైనా ప్రపంచవ్యాప్తంగా వినియోగం అధిక సంఖ్యలో ఉందనడం అతిశయోక్తికాదు.
పుదీన రసాన్ని సమ్మర్ కూల్ డ్రింక్ గా కూడా తీసుకుంటారు. ఇది వేసవిలో బాడీ హీట్ ను తగ్గిస్తుంది. అంతే కాదు, పుదీనా ఆకుల వల్ల జీర్ణక్రియను పెంచడంలో అద్భుతంగా సహాయపడుతుంది. వేసవిలో జీర్ణక్రియ సమస్యలతో బాధపడేవారు, ఒక గ్లాసు పుదీనా జ్యూస్ ను త్రాగడం వల్ల తక్షణం పొట్టను చల్లగా మార్చుతుంది. పొట్ట కండరాలను వదులు చేస్తుంది. అలాగే జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అంతే కాదు, పుదీనా జ్యూస్ వల్ల మరికొన్ని హెల్త్ బెనిఫిట్స్ క్రింది విధంగా ఉన్నాయి:

బాడీ హీట్ తగ్గిస్తుంది
ఈ హెల్తీ సమ్మర్ డ్రింక్ త్రాగడానికి ఇది ఒక ముఖ్య కారణం . పుదీనా జ్యూస్ శరీరాన్ని కూలింగ్ ఎఫెక్ట్ ను అందించి, బాడీ హీట్ ను తగ్గిస్తుంది. పుదీనా జ్యూస్ రెగ్యులర్ గా త్రాగడం వల్ల వడదెబ్బ నుండి మిమ్మల్ని రక్షిస్తుంది.

జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది
పుదీనాలో ఉండే యాంటీఆక్సిడెంట్స్ మరియు ఫైటో న్యూట్రియంట్స్ పొట్ట కండరాలను రిలీఫ్ చేస్తుంది. రెండు స్పూనుల పుదీనాకు రసంలో కొద్దిగా తేనె కలిపి ప్రతిరోజూ మూడుసార్లు తీసుకుంటే కడుపునొప్పి, పొట్ట ఉబ్బరం తగ్గుతాయి. జీర్ణ వ్యవస్ధను మెరుగుపరుస్తుంది.

మీ శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచుతుంది
ఒక గ్లాసు మజ్జిగలో పుదీనా ఆకుని కలిపి తాగటం వలన వేసవిలో వడదెబ్బ నుండి రక్షణ కలుగుతుంది. మీ శరీరాన్ని హైడ్రేషన్ లో ఉంచుతుంది. వేసవిలో డీహైడ్రేషన్ మరియు హీట్ స్ట్రోక్ ను తగ్గించడానికి పుదీనా రసం బాగా సహాయపడుతుంది.

ఓరల్ హెల్త్
పుదీనా ఆకులు మౌత్ ఫ్రెషనర్ గా ఉపయోగిస్తారు . అలాగే అనేక నోటి సంబంధిత సమస్యలు నోటి దుర్వాసన, దంతక్షయం, ఎల్లో టీత్ మరికొన్ని ఇతర సమస్యలను నుండి తక్షణ ఉపశమనం కలిగిస్తుంది. పుదీనాలో ఉండే అనేక యాంటీ బ్యాక్టీరియల్ యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఓరల్ ఇన్ఫెక్షన్ నుండి ఉపశమనం కలిగిస్తుంది. ప్రతిరోజు పుదీనా ఆకుల్ని నమిలి తినడం వలన నోటి దుర్వాసన తగ్గిపోవడంతో పాటు, పిప్పిపళ్ళు, చిగుళ్ళ నుండి చీము కారడం తగ్గుతాయి.

పొడి దగ్గు, జలుబు నుండి ఉపశమనం కలిగిస్తుంది
గొంతులో గరగర వంటి ఇబ్బందులకు లోనయినప్ఫుడు కప్ఫు పుదీనా చాయ్ తాగండి. నిమిషాల్లో సాంత్వన పొందొచ్చు.

ఒత్తిడితో పోరాడుతుంది
పుదీనాలోని స్ట్రాంగ్ ఆరోమా, ఫ్లేవర్ మరియు యాంటీ ఆక్సిడెంట్స్ ఒక హెల్తీ డ్రింక్ గా మారి మనల్ని స్ట్రెస్ నుండి ఉపశమనం కలిగిస్తుంది మరియు రిలాక్స్ చేస్తుంది.

మార్నింగ్ సిక్ నెస్
ఒక గ్లాసు చల్లని పుదీన జ్యూస్ త్రాగడం వల్ల మార్నింగ్ సిక్ నెస్ ఉండదు. గర్భిణీ స్త్రీలు ఒక చెంచాడు పుదీనా రసంలో చెంచాడు నిమ్మరసం, చెంచాడు తెనే కలిపి, ఆరారగా చేతిలో వేసుకుని సేవిస్తూ వుంటే, వాంతులు, ఎసిడిటీ, వంటి వికారాలు తగ్గుతాయి.

వ్యాధినిరోధకత పెంచుతుంది
తాజాగా ఉండే పుదీనా ఆకులు విటమిన్ సి, డి, ఇ, క్యాల్షియం, ఫాస్పరస్ మరియు కొద్దిగా విటమిన్ బి కాంప్లెక్స్ కలిగి ఉండటం వల్ల వ్యాధినిరోధకతను పెంచుతుంది మరియు ఇన్ఫ్లమేషన్ ను దూరంగా ఉంచుతుంది.

నిద్రలేమి
అలాగే నిద్రలేమికి, మానసిక వత్తిడికి, నోటి వ్యాధులకి కొన్ని పుదీనా ఆకులు గ్లాసుడు వేడి నీటిలో వేసి, మూతపెట్టి అర్ధగంట తరువాత తాగితే చాలా ఉపశమనం కలగజేస్తుంది. మంచి నిద్ర పడుతుంది.

రుతుసమస్యలు
పుదీనాకును ఎండబెట్టి, పొడిచేసి రెండుస్పూనుల పొడిని, రెండు గ్లాసుల నీళ్ళలో వేసి అరగ్లాసు అయ్యేవరకు మరిగించి, చల్లార్చి ఆ నీటిని వడగట్టి తాగితే బహిష్టు నొప్పితో బాధపడేవారికి ఆ నొప్పి రాకుండా ఉంటుంది.

తలనొప్పి తగ్గిస్తుంది
పుదీనా ఆకులు అరచేతిలో బాగా నలిపి ఆరసాన్ని కణతలకి, నుదుటికి రాసుకుంటే, తలనొప్పి తగ్గిపోయి, చల్లదనా న్నిస్తుంది.

ఇన్ఫ్లమేషన్
ఇక శరీరం మీద ఏర్పడే దురద, దద్దుర్లకి కొన్ని పుదీనా ఆకు ల్ని గ్లాసుడు నీటిలో మరగబెట్టి, తగినంత పటిక బెల్లం పొడిని కలిపి తీసుకుంటే ఈ సమస్యనుంచి త్వరగా బయటపడవచ్చు.



Click it and Unblock the Notifications











