Latest Updates
-
స్పైసీ మటన్ లివర్ ఫ్రై..ఈ సీక్రెట్ మసాలాతో చేస్తే ప్లేట్ ఖాళీ చేస్తారు! -
కరలాడే టమాటా మురుకులు.. ఒక్కసారి రుచి చూస్తే అస్సలు వదిలిపెట్టరు! -
రోజు తినే పెరుగన్నమే కదా అని తీసిపారేయకండి.. ఇలా స్పెషల్ గా చేస్తే గిన్నె ఖాళీ అవ్వాల్సిందే! -
హోటల్ స్టైల్ రాయల్ కొబ్బరి చట్నీ.. ఈ ఒక్క సీక్రెట్ పదార్థం కలిపితే రుచి అదుర్స్! -
బగారా రైస్, చపాతీ,రాగి సంగటిలోకి అదిరిపోయే మటన్ లెగ్ కర్రీ..రుచికి రుచి, బలానికి బలం! -
వంట మధ్యలో గ్యాస్ అయిపోతోందని టెన్షనా? మీ సిలిండర్లో ఎంత గ్యాస్ మిగిలి ఉందో చిటికెలో తెలుసుకోండిలా! -
International womens day 2026: భారతీయ మహిళల తలరాతను మార్చిన జనవరి 1,1848.న ఏం జరిగింది? -
మీ భాగస్వామికి మీరంటే నిజమైన ప్రేమేనా? ఈ 5 విషయాలు చెబుతాయి -
ఎండల్ని తట్టుకునే అమృతం లాంటి తెలంగాణ సల్ల చారు..గిన్నె ఖాళీ చేస్తారు! -
సృష్టికి మూలం, ప్రగతికి ప్రాణం.. అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు ఇలా చెప్పండి!
అవుట్ సైడ్ వ్యాయామాలు చేయడానికి 7 ముఖ్య కారణాలు
శీతాకాలంలో బహిరంగంగా వ్యాయామం చేయడం అనేక కారణాల వల్ల ఒత్తిడిని తగ్గించడానికి సహాయపడుతుంది, అయితే వీటిలో కొన్నిటిని మీరు పరిగణించి ఉండకపోవచ్చు. ఇంట్లోనైనా, బయట అయినా శీతాకాలం లో వ్యాయామం చేయడం మీ ఉల్లాసానికి, ఆరోగ్యానికి, మీ బరువుకీ కూడా మంచిది. రోజులో ఏదో ఒక సమయంలో మీరు బహిరంగ వ్యాయామం చేయడానికి అనుకూలంగా వుండే ప్రదేశంలో మీరు నివసిస్తున్నట్టయితే, మీరు తప్పక ఆ పని చేయాలని నేను మిమ్మల్ని ప్రోత్సహిస్తున్నాను. బయట చల్లగా వున్నప్పుడు లోపలే వ్యాయామం చేయడానికి లేదా పూర్తిగా మానివేయడానికి తేలిగ్గా ఉంటుందని నాకూ తెలుసు, కానీ మీరు చేయగలిగినప్పుడైనా బయట వ్యాయామం చేస్తే మీకు మీరే ఒక కొత్త వ్యక్తిలా అనిపిస్తారు. ఉష్ణోగ్రతలు దారుణమైన చల్లగా వుంటే తప్ప, మీరు సరైన దుస్తులు ధరిస్తే, చెమటలు పోసే అంత వ్యాయామం చేసినా, వెచ్చగానే వుంటుంది. ఈ అన్ని కారణాల వల్లా బహిరంగ వ్యాయామం ఒత్తిడిని దూరం చేస్తుంది, అయితే అది ప్రయత్నించి చూడడం కూడా అంత అసాధ్యం ఏమీ కాదు. ఈ కారణాలు చదవండి, మీకు తెలిసిన కారణాలు వుంటే నాతొ పంచుకోండి.
ఒత్తిడిని నివారించడానికి బహిరంగ వ్యాయామం సహాయపడే 7 కారణాలు

విటమిన్ డి కి బహిర్గతం కావడం
బహిరంగ వ్యాయామం ఒత్తిడిని దూరం చేయగల కారణాలు అన్నిటిలోకి మొట్టమొదటిది ఏమిటంటే శరీరం విటమిన్ డి కి బహిర్గతం కావడం. దాని వల్ల శరీరంలో మరింత మోతాదులో సెరొటోనిన్ ఉత్పత్తి అయ్యి, మీ మనసును ఉత్తేజ పరుస్తుంది, అలాగే మీ శరీరంలోని హార్మోన్లను వృద్ది పరచి ఒత్తిడి మొదలయ్యే చోటే నివారిస్తుంది. అది మీ రోగనిరోధక శక్తిని కూడా వృద్ది చేస్తుంది, ఎందుకంటే సూర్యుడు బయటకు రాకపోయినా, సూర్యుడి నుంచి వచ్చే విటమిన్ డి ని శరీరం దాని ఇతర వనరుల కన్నా త్వరగా పీల్చుకుంటుంది. బయట ఎండగా వున్నా, మబ్బు పట్టి వున్నా, ఆ వెలుతురు నుంచి మీకు అధిక మోతాదులో విటమిన్ డి అందుతుంది. తత్ఫలితంగా మీరు కేవలం బయట ఒక అరగంట గడిపినా ఒత్తిడిని నివారించ గలుగుతారు.

దృశ్యాల్లో మార్పు
నిజాయితీగా చెప్పాలంటే, ట్రెడ్ మిల్ మీద ఎక్కి వ్యాయామం చేయడం తేలికే గానీ, అది విసుగును తగ్గించడానికి పనికి రాదు. బహిరంగ వ్యాయామం మీ ఒత్తిడిని దూరం చేయగల కారణాల్లో ఒకటి ఏమిటంటే దృశ్యాల్లోనూ, వాతావరణం లోనూ మార్పుకి అది మిమ్మల్ని బహిర్గతం చేస్తుంది. దానివల్ల మెదడు కణాల్లో ఉత్తేజం కలిగి, మీ రోజంతటికీ కావలసిన సృజనాత్మకతను ఇచ్చేందుకు అవసరమైన ఎండార్ఫిన్ లను విడుదల అవుతాయి.

తాజా గాలి
కొన్నిసార్లు శీతాకాలంలో బయట బాగా చల్లగా వున్నా కూడా తాజా గాలి కన్నా హాయిగా వుండేది ఏదీ లేదు. మీరు రోజూ కొంచెం తాజా గాలి పీలిస్తే చాల ఆహ్లాదంగా ఉంటారని నేను అంటాను. బహిరంగ వ్యాయామం చేయడం సరిగ్గా అందుకే మంచి మార్గం. అంటే కనీసం మీ కార్డియో వ్యాయామం బయట చేసి, అప్పుడు లోపలికి వచ్చి బరువులు ఎత్తడం, టోనింగ్, యోగా లాంటి చేసినా - బయట అస్సలు వ్యాయామం చేయని దాని కన్నా చాలా నయం అన్నమాట! అలాగని బయట చాలా చల్లగా వుంది కాబట్టి, మీరు పూర్తిగా బహిరంగ వ్యాయామం మాని వెయ వచ్చని కాదు. కానీ, బయట వాతావరణం భరించ గలిగేది గా వున్నప్పుడు మీరు దాని నుంచి ప్రయోజనం మాత్రం పొందాలి.

రోగనిరోధక శక్తి పెరుగుదల
నమ్మండి, నమకపొండి, బహిరంగ వ్యాయామం నిజానికి మీ రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది. మీ రోగ నిరోధక శక్తి తగ్గిపోతే, అది మీరు ఒత్తిడికి గురయ్యే అవకాశాల్ని పెంచుతుంది. అందువల్ల, మీ రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలంటే, రోజూ కొద్ది నిమిషాల సేపు ఆరుబయట జాగింగ్ చేసినా, నడచినా చాలు.

కండరాల నిర్మాణం
సాధారణంగా మనం ట్రెడ్ మిల్ మీద పని చేస్తూ విస్మరించే కండరాల నిర్మాణం బహిరంగ వ్యాయామం చేసేటప్పుడు జరుగుతుంది, బహిరంగ వ్యయం ఒత్తిడిని దూరం చేయగల మరో కారణం ఇది. బయట నడిచేటప్పుడు రోడ్ల మీద అసమతలాల మీద నడవాల్సి రావడం వల్ల మీ కాలిలోని చాలా కండరాల్ని వాడవలసి వస్తుంది. గడ్డిలో నడిచినా మీ కాలి కండరాలు కష్టపడతాయి, దాంతో శక్తి పెరిగి మీ శరీరంలో ఎండార్ఫిన్ లు విడుదల అవుతాయి. మీ కండరాలు కష్టపడే కొద్దీ మీ శరీరంలో జీవ క్రియ పెరిగి, మీకు మరింత శక్తి వస్తుంది. ఇది మీకు తెలియకుండానే సహజంగా ఒత్తిడిని దూరం చేస్తుంది. ఎప్పుడైనా బాగా వ్యాయామం చేస్తే ఆ రోజంతా నాకు చాలా హాయిగా ఉంటుందని నాకు తెలుస్తుంది. బయట ఎత్తుపల్లాల్లో తిరగడం ఇంట్లో వుండి ట్రెడ్ మిల్ మీద పని చేయడం కన్నా చాలా మంచిది, ట్రెడ్ మిల్ మీద ఆధార పడితే మీ కాలరీలు మరింత వేగంగా ఖర్చు అవుతాయి.

ఋతువుల్లో మార్పు
బహిరంగ వ్యాయామం మీ ఒత్తిడిని నివారించే ముఖ్యమైన మార్గాల్లో ఇంకోటి ఏమిటంటే మీరు ఋతువుల్లో మార్పులు చూడగలిగేలా చేయడం. నేను ఎప్పుడూ దీని కోసమే ఎదురు చూస్తాను, చెప్తుంటే వింతగా వుంటుంది కానీ, శిశిరం శీతాకాలంగాను, శీతాకాలం ఎండాకాలంగానూ మారుతుంటే చూడడం చాలా ఉత్తేజ కరంగా వుంటుంది. అది మిమ్మల్ని ఋతువులను ఆస్వాదించేలా చేసి, గాలిలో మార్పును ప్రేమించ గలిగేలా చేస్తుంది. మానసిక ఉల్లాసానికి కలిగే అతి పెద్ద ప్రయోజనంగా నేను దీన్ని భావిస్తాను, ముఖ్యంగా శిసిరంలో రాలిన ఆకులన్నీ మళ్ళీ వసంతంలో చిగురు తొడగడం చూస్తుంటే చాలా ఉల్లాసంగా ఉంటు౦ది. ఒత్తిడి నివారించే సాధనాల్లో ప్రకృతి అన్నిటి కన్నా తక్కువగా వాడబడింది, వీలైనంత వరకు దాన్ని ఆస్వాదించండి.

విష కారకాలకు తక్కువగా గురి కావడం
చాలా ఎక్కువ సేపు లోపలే వుండడం మీ ఆరోగ్యానికి హానికరమని మీకు తెలుసా ? క్లీనర్లు, సీసం వుండే పెయింట్లు, హీటింగ్, గాలి, చివరికి ప్లాస్టిక్ ఉత్పత్తుల వల్ల కూడా చాలా ఇళ్ళలోకి సహజంగానే విష పదార్ధాలు చేరతాయి. మీ ఇంటిని ఈ విష కారకాలనుంచి దూరంగా ఉంచలేకపోయినా, మీరు రోజూ కొద్ది సేపు బయట తిరగడం వల్ల వాటిని కొంత వరకు తగ్గించుకోవచ్చు. చాలా మంది పట్టించుకోని ఇంట్లోని బరువైన, విషకారకాలుండే గాలి నుంచి ఇలా చేయడం వల్ల కొంత వరకు నివారించవచ్చు.
మీరు శీతాకాలంలో నాలాగే ఆరుబయట వ్యాయామం చేస్తే, మొదట్లో సరదాగా వుండదు, కానీ మొదలు పెట్టి చేస్తూ అలవాటు పడితే లోపలి గాలి బారి నుంచి బయట పడినందుకు మీరు సంతోషిస్తారు. నేను బయటకు వెళ్ళినప్పుడల్లా ఆనందంగా వుంటాను, మరి మీరు ?



Click it and Unblock the Notifications











