For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

రెగ్యులర్ కాఫీ & బ్లాక్ కాఫీ - మీ ఆరోగ్యానికి ఏది మంచిది?

By Lakshmi Perumalla
|

ప్రపంచంలో చాలామంది,అలాగే మీకు కాఫీ కప్పు మీద అమితమైన ప్రేమ ఉన్నది. ఇది మీ మనుగడలో ఎక్కువ భాగం ఆక్రమించింది. మీరు ఉదయం లేదా భోజనం అయిన గంట తర్వాత కాఫీ లేకుండా ఉండలేరు. ఒక అధ్యయనం ప్రకారం ప్రజలు ఉదయం తప్పనిసరిగా కాఫీ కావాలని కోరుకుంటున్నారు. ఆ సమయంలో ఫేస్ బుక్,మద్యం,సెక్స్ కూడా వద్దని అంటున్నారు.

అయితే,కాఫీ ఆరోగ్యకరమైనదా? అవును,ఇది కాలేయం క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గించడం మరియు మీ మెమరీ అభివృద్ధి వంటి అనేక ఆరోగ్య ప్రయోజనాలను కలిగిస్తుంది. మీకు నచ్చిన విధంగా కాఫీని త్రాగవచ్చు. అయితే కాఫీ చేయటానికి అనేక మార్గాలు ఉన్నాయి. వాటిలో న్యూట్రిషన్ తేడా తెలియకుండా మంచి ఎంపిక చేసుకోవాలి. ఈ పోస్ట్ లో,మేము పాలు మరియు చక్కెర తో తయారుచేసిన రెగ్యులర్ కాఫీ మరియు బ్లాక్ కాఫీ మధ్య తేడాలను చర్చిస్తున్నాము.

Black coffee VS Regular Coffee – which is better for your health?

1. బరువు నష్టం కోసం బ్లాక్ కాఫీ

మీరు బరువు కోల్పోయే ప్రయత్నంలో ఉన్నప్పుడు పాలు మరియు చక్కెర తో తయారుచేసిన రెగ్యులర్ కాఫీకి బదులుగా తక్కువ కేలరీలు కలిగిన బ్లాక్ కాఫీ ఉండాలి. పాలు మరియు చక్కెర తో తయారుచేసిన ఒక కప్పు కాఫీలో 56.6 కేలరీలు ఉంటాయి. ఒక కప్పు బ్లాక్ కాఫీలో కేవలం 4.7 కేలరీలు ఉన్నాయి.

కాఫీ అప్పుడప్పుడూ తాగితే లాభం..అదే పనిగా త్రాగితే రోగం...!

2. సాయంత్రం తర్వాత పాలు మరియు చక్కెరతో కాఫీ

బ్లాక్ కాఫీ మిమ్మల్ని ఉత్తేజపరుస్తుంది. అలాగే ఎక్కువ మానసిక స్పష్టతను ఇస్తుంది. పాలు లేదా క్రీమ్ కలిగిన సాధారణ కాఫీ ప్రభావాలు నెమ్మదిగా ఉంటాయి. కాబట్టి సాయంత్రం తర్వాత త్రాగటం వలన మీ రోజువారీ దినచర్యకు అంతరాయం కలుగుతుంది. అంతేకాక రాత్రి సమయంలో ఎక్కువసేపు మెలుకువగా ఉండేలా చేస్తుంది. దానికి బదులుగా అదనంగా 50 కేలరీలు తీసుకోవడం ఆరోగ్యకరముగా ఉంటుంది. మీరు ఇప్పటికే నిద్ర సమస్యలు ఉంటే,అప్పుడు సాయంత్రం తర్వాత కాఫీ త్రాగకకూడదు. ఇక్కడ ఒక శిశువు మంచి నిద్రకు కొన్ని చిట్కాలు ఉన్నాయి. మీకు ఏదైనా ముఖ్యమైన పని ఉన్నప్పుడు నిద్ర వస్తే,దానికి ప్రత్యామ్నాయంగా బ్లాక్ కాఫీ త్రాగాలి.

ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన వివిధ రకాల కాఫీలు:క్లిక్ చేయండి

3. పాలు మరియు చక్కెరతో చేసిన కాఫీలో ఆమ్లత

మీకు ఎసిడిటి ఉంటే కనుక మీరు అత్యధిక pH కలిగిన కాఫీకి(ముఖ్యంగా బ్లాకు కాఫీ)దూరంగా ఉండాలి. అలాగే,కేంద్రీకృతమైన కాఫీ మీ మూత్రంలో ఆమ్లం యొక్క ఘాడతను పెంచుతుంది.మీరు దాని ప్రభావం తటస్తం అవటానికి తగినంత నీరు లేదా దోసకాయ వంటి ఆహారాలను తీసుకోవాలి.

Desktop Bottom Promotion