For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

మీ దైనందిన జీవిత ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవడానికి 10 మార్గాలు

|

చిన్న వయస్సు నుండి అన్ని అంశములలోను ఒక ఆరోగ్యకరమైన జీవనశైలిని అలవరుచుకుంటే వాటిని కొనసాగించటానికి సులభతరంగా ఉంటుంది.ప్రస్తుత రోజుల్లో ఈవిధంగా ఉండుట వల్ల సాధ్యమైనంత మెరుగైన భవిష్యత్ ను పొందవచ్చు.

ఆరోగ్యమే మహాభాగ్యం. దీని కోసం రకరకాల పద్దతులు పాటిస్తుంటారు. ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకోబోయే వరకూ ఎన్నో రకాల వ్యాయామాలు, మరెన్నో జాగ్రత్తలు తీసుకుంటూంటారు. అయితే మరీ అంత ఎక్కువ శ్రమ పడకుండా పండంటి ఆరోగ్యాన్ని సొంత చేసుకోవాలంటే ఈ చిట్టి పొట్టి చిట్కాలు పాటించి చూడండి..

పాలకూర:

పాలకూర:

తరచూ ఆహారంలో పాలకూర తీసుకొంటే శరీరానికి కావలసిన ఐరన్ పుష్కలంగా లభించడంతో పాటు పలు ఆరోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు.

బ్రిస్క్ వాక్:

బ్రిస్క్ వాక్:

రోజంతా ఎంత బిజీగా ఉన్నా ఓ 20నిమిషాలు పాటు బ్రిస్క్ వాక్ లేదా రన్నింగ్ చేసినట్టయితే ఒత్తిడి అన్నది అస్సలు దరిచేరదు.

హోం వర్క్:

హోం వర్క్:

పనిమనుషుల మీద ఎక్కువగా ఆధారరపడకుండా ఇంటి పని స్వయంగా చేసుకుంటే శారీరక వ్యాయామంతో పాటు క్యాలరీలు కూడా అధికంగా ఖర్చు అవుతాయి.

. నిద్ర :

. నిద్ర :

ఆరోగ్యంగా ఉండాలంటే సరైన నిద్రకూడా ఎంతో అవసరం నిద్రలేమి... జబ్బులకు నిలయంలాంటిది. అతి నిద్ర అలసత్వానికి దారితీస్తుంది. శరీరానికి ఎంత నిద్ర అవసరమో అంతే నిద్రపోవాలి. రాత్రివేళ త్వరగా పడుకుని వేకువజామునే నిద్రలేవడం మంచిది.

ఓట్స్ :

ఓట్స్ :

కొలస్ట్రాల్ ను తగ్గించుకోవడానికి రకరకాల పద్దతుల పాటిస్తుంటారు. అలాంటి వారు ఈ విధంగా చేస్తే మంచి ఫలితం కనిపిస్తుంది. రోజూ క్రమం తప్పకుండా ఓ చిన్న గిన్నెడు ఓట్స్ ను తీసుకుంటే కొలస్ట్రాల్ ను తేలికగా తగ్గించుకోవచ్చు.

నీళ్ళు:

నీళ్ళు:

నీరు తాగడం అన్నది ఆరోగ్యానికే కాదు, అందానికీ కూడా అత్యవసరం. వ్యాయామం చేయడానికి ముందు, ఆ తర్వాత కూడా తప్పనిసరిగా నీరు తాగాలని నిపుణులు సూచిస్తున్నారు.

బిపి కంట్రోల్ :

బిపి కంట్రోల్ :

లో బిపి, ఒత్తిడి, ఆందోళనతో బాధపడేవారు నిపుణుల సలహా మేరకు క్రమం తప్పకుండా రోజులో కొద్దిపేసన్నా వ్యాయామం చేయడం మంచిది. వ్యాయామం పై సమస్యలకు దివ్వౌషధంగా పని చేస్తుంది.

వ్యాయామం :

వ్యాయామం :

వ్యాయామం చేస్తున్న సమయంలో ఆయాసం, శ్వాసపరమైన సమస్యలు ఎదురైనప్పుడు, వ్యాయామం చేయడం వెంటనే ఆపివేసి, దగ్గరలో ఉన్న డాక్టరును సంప్రదించాలి. ఉదయం వ్యాయామం కొరకు సమయం కేటాయించాలి. నచ్చిన వ్యాయామం ఏదైనా చేయవచ్చు. ఉరుకులపరుగుల జీవితంలో పడిపోయి వ్యాయామాన్ని నిర్లక్ష్యం చేయడం మంచిదికాదు.

 చెడు అలవాట్లు:

చెడు అలవాట్లు:

సిగరెట్లు, పొగాకు, మద్యపానం, తదితరాలు తీసుకోవడం అలవాటువుంటే దానిని తప్పకుండా మానుకోవాలి. వయసుకు తగ్గట్టు కొన్ని దురలవాట్లు అలవడుతాయి. వ్యసనాలబారినపడితే ఆరోగ్యం పాడవడం ఖాయం.

భోజనం:

భోజనం:

మనం తినే భోజనమే మనకు అమృతం. అదే మనకు జీవితానికి శక్తిప్రదాయిని, నిర్ణీతవేళలో పుష్టికరమైన భోజనం తీసుకోవాలి. తీసుకునే ఆహారం శరీరానికి కావాల్సిన పోషకాలు అందించేదిగా వుండాలి. అమితమైన భోజనం లేదా అతి తక్కువ భోజనం శరీరానికి అంత మంచిదికాదు. ఆహారం బాగా నమిలి, ఎక్కువ సేపు తినడం వలన జీర్ణం కావడంతో పాటు మరో లాభం కూడా ఉంది. ఎక్కువ సేపు ఆహారం తీసుకోవడం వలన ఎక్కువగా తిన్నామన్న ఫీలింగ్ కలుగుతుంది. దాంతో ఎక్కువ సమయంలో తక్కువ ఆహారాన్ని తీసుకుంటారు.

Story first published: Thursday, July 2, 2015, 18:36 [IST]
Desktop Bottom Promotion